Saturday, 13 September 2014

జీవితంలో సమస్యలు రాకుండా వుండవు వాటికోసం జీవితాన్ని బలితీసుకోవడం తెలివితక్కువ తనమని అందరికీ తెలుసు ,కాని కొన్ని క్షణాలు బలిహీనంగా మారిన మనసు జీవితం వృధా అనుకుంటుంది బేలగా జీవితం ముందు ఓడిపోయి కన్నిళ్ళు పెడుతుంది. వాటితో పాటూ నడుస్తూ ,వాటినే ధూళీలో కలిపేస్తూ నడిచి చూడు ఆసమస్య కి విలువవే వుండదు అనిపిస్తుంది ఈ పాట వింటే ... నాకు చాల నచ్చిన ఈ పాట మీకోసం ...



  Maein Zindagi Ka Saath Nibhata Chala Gaya  from Hum Dono (1961)


 Maein zindagi ka saath nibhata chala gaya
 Har fikar ko dhuen mein udata chala gaya

 Barbadiyon ka shok manana fizul tha
 Barbadiyon ka jashan manata chala gaya
 Har fikar ko dhuen mein uda…

 Jo mil gaya usi ko muqaddar samajh liya
 Jo kho gaya maein usko bhulata chala gaya
 Har fikar ko dhuen mein uda…

 Gham aur khushi mein farq na mehsoos ho jahan
 Maein dil ko us muqaam pe laata chala gaya
 Har fikar ko dhuen mein uda…


 జీవితాన్ని తోడుతీసుకుని  నడుస్తూ వెళ్ళిపోతున్నాను
 ఆవేదన అంతా  పొగలో కలిసి పోయేలా వెళ్ళిపోతున్నాను

 శిధిలాలు పట్టుకుని ఏడవడం వృధా అనుకుని
 శిధిలాలో అనందం వెతుకుంటూ వెళ్ళిపోతున్నాను

  ఎదురైనది ఏదైన  అదే నసీబ్ అనుకుని వెళ్ళిపోతున్నాను
  పోగొట్టుకున్న దాన్ని మరచిపోతూ  వెళ్ళిపోతున్నాను

  సుఖదుఃఖాలకి తేడా తెలియని  ప్రపంచంలోకి
  ఈ హృదయాన్ని ఆ గమ్యానికి చేరుస్తూ
  ఆవేదన అంతా  పొగలో కలిసి పోయేలా వెళ్ళిపోతున్నాను .....

Friday, 12 September 2014

బాల్కనీ కనిపించే సగం చంద్రుడు ,మబ్బుల్లో దాక్కునే చంద్రుడు ,విశాల ఆకాసంలో ఒంటరిగా స్వేచగా వెళ్లిపోతుంటే ఎందుకో నాకు చాలా ఇష్టమైన ఈ పాట పదే పదే గుర్తుకొచ్చి పాటలు రాని గొంతుకతో పాడుకుని నాభవాలతో అక్షరాలుగా అల్లుకున్న ఈ పాట మీకోసం



  Song : Adha Hai Chandrama
Music : Ramchandra Narhar Chitalkar (C. Ramchandra)
Lyrics : Bharat Vyas
Singers : Asha Bhosle, Mahendra Kapoor

Aadha Hai Chandrama Raat Aadhee
Aadha Hai Chandrama Raat Aadhee
Reh Naa Jaaye Teree Meree Baat Aadhee, Mulaakaat Aadhee
.
Piya Aadhee Hai Pyaar Kee Bhaasha
Aadhee Rehne Do Mann Kee Abhilaasha

Aadhe Chhalke Nayan, Aadhe Chhalke Nayan
Aadhee Palkon Me Bhee Hai Barsaat Aadhee
Aadha Hai Chandrama Raat Aadhee
Reh Naa Jaaye Teree Meree Baat Aadhee, Mulakat Aadhee

Aas Kab Tak Rahegee Adhuree
Pyaar Hogee Nahee Kya Yeh Puree

Pyaasa Payasa Pawan, Pyaasa Pyaasa Gagan
Pyaase Taaro Kee Bhee Hai Baaraat Aadhee
Aadha Hai Chandrama Raat Aadhee
Reh Naa Jaaye Teree Meree Baat Aadhee, Mulaakaat Aadhee
Aadha Hai Chandrama Raat Aadhee
Reh Naa Jaaye Teree Meree Baat Aadhee, Mulaakaat Aadhee.

Sur Aadha Hai Shyaam Ne Saadha
Raha Radha Kaa Pyaar Bhee Aadha
Sur Aadha Hai Shyaam Ne Saadha


Aadha Hai Chandrama Rat Aadhee
Reh Naa Jaye Teree Meree Baat Aadhee, Mulaakaat Aadhee
Aadha Hai Chandrama Raat Aadhee
Reh Naa Jaaye Teree Meree Baat Aadhee, Mulaakaat Aadhee.

   వెన్నెల సగం  రాత్రి సగం  ఇక్కడే మాటలు కూడా సగంలో ఆగిపోతున్నాయి
   ప్రియా సగంలో నే ఆగిపోయే  ప్రేమలో  మనసులోని కోరిక కూడ సగమే
   కళ్ళలోంచి  ఒలికే  సగం ప్రేమలో కన్నీటి   వర్షం కూడా సగమే

   సగంలో ఆగిపోయే ప్రేమకోసం ఆశ ఎందదాక వుంటుంది
    ప్రేమ అసలు పూర్తిగా దక్కుతుందా లేదా ?
    దాహంతో వున్నా ఆకాశం గాలి  ఆఖరికి నక్షత్రాలకి కూడా సగం పెళ్లి వేడుక
 
    అందుకే మన ఇద్దరి మధ్య మాటలు కూడా సగంలో ఆగిపోతున్నాయి

    వేణువులో రాగం సగం ఇస్తున్నాడు కృష్ణుడు రాధకి   ప్రేమని  కూడ సగమే ఇచ్చాడు

    కన్నులు అరవిచ్సుకున్నాయి  సగం కలుసుకున్న పెదవుల మధ్యలో
    ఆక్షణం ఆమాట  ఆప్రేమ సగంలో ఆగిపోయాయి అందుకే ప్రియా మన ప్రేమ
     మాటలు కూడా సగంలో ఆగిపోతున్నాయి ....

Friday, 29 August 2014

మంజ-పై (పసుపు పచ్చని సంచి )సినిమా పేరు /

మా చెల్లెలు చెప్పిన తమిళ సినిమా కధ చాలా నచ్చింది క్లుప్తంగా కధ సారంశం 
మంజ-పై (పసుపు పచ్చని సంచి )సినిమా పేరు / 
ఒక పల్లెటూరిలో ముసలి తాత తనకొడుకు కోడలు ప్రమాదంలో చనిపోతే మనవడిని పెంచి 
బాగా చదివి స్తాడు ,ఆమనవడు సాప్ట్ వేర్ ఇంజనీయర్ గా పట్నంలో మంచి పొజిషన్ లో స్థిర పడతాడు
మనవడి కోరిక ప్రకారం పట్నానికి వెళ్తాడు ,అక్కడ అతని అమాయకత్వం, పల్లే టూరితనం నగర నారికతలో ఇమడలేక పోవడం ,తాత మీద ఎంత అభిమానం కాని అనాగరికచేస్టలు,అమాయకత్వం తలనొప్పిగా మారిపోతుంది ,తనదగ్గరకి రోజు జీళ్ల కోసం వచ్చే చిన్నపాపకి విషం ఇచ్చి చంపాడు అన్న అపవాదు ,ఆ అపార్ట మెంటులో అతని వల్ల మనవడికి గలిగిన ఇబ్బందులు ఇలా కధ
చివరికి అతను పిచ్చివాడుగా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళేలా చేస్తుంది ...
పేరు వున్నా తారలు ఎవరు అందులో లేరుట కాని కధ అమాయకత్వానికి నమ్మకానికి
అనుబంధాలకి మధ్య నలిగిపోయే ముసలి తాత ,పెంచి పెద్ద చేసిన తాతని సరిగ్గా చూడలేక పోయిన
మనవడి ఘర్షణ కనిపిస్తుంది అన్నిటికన్నా రోజు తన దగ్గరికి వచ్చె పసిపాప ఆరోజు ఆ తాత
జీళ్ళుఇవ్వకపోతే జీడి అనుకుని rat bite తినడం అతను చింత పండు పులుసు విరుగుడుగా
పట్టడం కాని ఆపాప బతికిందని తెలిసే లోగా పాపని అతనే చంపేసాడేమో అన్న బెంగతో తాత
పిచ్చివాడు అయిపోవడం తో కధ ముగిసిన పాత్ర లో ఇమిడిపోయిన కధ చూసిన చలా రోజుల
దాక మరచిపోవలేక పోవడమే మంచి సినిమాకి అర్హత /భా ష ఏదైనా కదిలించే కధ ...

Friday, 1 August 2014

పంకజ్ ఉదాస్ ఈ గజల్ నా భావాలతో మీకోసం Mohe Aayi Naa Jag Se Laj Lyrics from Anokha (Album)

తన్మయత్వం లోకి జారిపోవలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి ,
 కాశమంతా పరుచుకున్న వెన్నెలలో పచ్చటి మైదానంలో తలకింద రెండు చేతులు తలగడలా పెట్టుకుని
 ఆకాశంలోకి చూడగలిగితే  గుండేలోంచి ఓ పాట శరీరానంతా తన వశం చేసుకుని  గొంతెత్తి పాడేలా  చేస్తుంది ఆ పరవశంలో నాట్యం చేయాలనిపిస్తుంది   .
ఎందుకో  ఈ గజల్  విన్న ప్రతిసారి మనసు  ఆకాశమై పోతుంది


 (Mohe aayi naa jag se laj
 Mai itna jor se nachi aaj, kee ghungru tut gaye) - (2)
 Kee ghungru tut gaye - (3)

 Kuch mujhpe naya joban bhi tha, kuch pyar kaa pagalpan bhi tha
 Ek palak meri tir bani, ek julf meri zanjir bani
 Liya dil sajan kaa jit -2, woh chede paayaliya ne git
 Kee ghungru tut gaye - (4)

 Mai basi thi jiske sapno me
 Woh ginega aub mujhe apno me
 Kehti hai meri har ungdayi
 Mai piya kee need chura layi
 Mai ban ke gayi thi chor
 Mai ban ke gayi thi chor
 Kee meri paayal thi kamzor
 Kee ghungru tut gaye - (4)

 Dharti pe naa mere pair lage, bin piya mujhe sub gair lage
 Mujhe ang mile armano ke, mujhe pankh mile parvano ke
 Jub mila piya kaa gau -2, toh aisa latchka mera pau
 Kee ghungru tut gaye - (4)
 Mohe aayi naa jug se laj, mai itna jor se nachi aaj
 Kee ghungru tut gaye - (5)

  ఈవాళ ఈ ప్రపంచం ముందు సిగ్గు మొహమాటం వదిలేసి
 ఎంతగా నర్తించానంటే నాపాదంలో వున్నగజ్జలలో మువ్వ తెగి పడేదాక

  ఇప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టినట్లు ప్రేమ పిచ్చిలో పడిపోయినట్లు
  కనురెప్పలలో భావాలు చురుకైన భాణాలు అయ్యాయి
  ముఖం మీద వాలుతున్న కురులు సంకెళ్ళు అయ్యాయి
  మనసునిండా వున్న ప్రియుని ప్రేమ జయించింది
  ఆ భావం  మళ్లి రేకెత్తింది మువ్వ తెగేదాక నాట్యం సాగింది

   నేను ఎవరి హృదయంలో  స్వపంలో  వున్ననో
   ఆ హృదయం నన్ను ఇప్పుడు తన దాన్నే అనుకుంటుంది
   నా అణువు  అణువు  చెప్తోంది నా ప్రియుని  స్వప్నంలో నేనే వున్నానని
   రహస్యంగా అతని కోసం వెళ్ళాలనుకుంటాను
   మువ్వల సవ్వడితో దొరికి పోయాను

  ఈ పాదం నేలమీద ఆనటంలేదు ఆతను లేని చోటు కొత్తగా వుంది
  అతని జాడలు కనిపించగానే కొత్త ఊహలు కొత్తరేక్కలు వికసించాయి
  మళ్ళి కొత్తగా  ఈ పాదం నర్తించడం  మొదలు పెట్టింది
  పాదంలో వున్నగజ్జలలో మువ్వ తెగి పడేదాక.....

Sunday, 6 July 2014

పంకజ్ ఉదాస్ ఈ గజల్ విన్నప్పుడు నా భావాలతో మీకోసం // //Divaro se milkar rona achha lagata hain .....

 కొన్ని సార్లు ఒంటరిగా  వుండాలని బలంగా అనిపిస్తుంది ,సమాజం నుంచి పారిపోవాలనిపిస్తుంది
 ఒంటరితనంలో  మనకోసం మనం బతకాలి  అనిపిస్తుంది   కాని ఒంటరితనం  మరింత
 జ్జాపకాల సమూహంలొకి  తీసుకు వెళ్లి  అంతు చిక్కని లోయలోకి తోసేసినప్పుడు
  మళ్లి లోకం గడ్డి పోచని పట్టుకుని పైకి రావల్సిందే సమాజంలో బతుకు బతకా ల్సిందే ;;;;

   .
Divaro se milkar rona achha lagata hain
Ham bhee paagal ho jaayenge aisa lagata hain) - (2)
Divaro se.......

Duniya bhar kee yaade hamse milane aatee hain - (2)
Shaam dhale iss sune ghar me mela lagata hain - (2)
Ham bhee paagal ho jaayenge aisa lagata hain
Divaro se.......

Kitne dino ke pyaase honge yaaro socho toh - (2)
Shabnam kaa katara bhee jinko daraya lagata hain - (2)
Ham bhee paagal ho jaayenge aisa lagata hain
Divaro se.......

Kisko kaisar pathhar maro kaun paraaya hain - (2)
Shish mehal me ik ik chehara apana lagata hain - (2)
Ham bhee paagal ho jaayenge aisa lagata hain
Divaro se milkar rona achha lagata hain
Ham bhee paagal ho jaayenge aisa lagata hain
Divaro se.......

  కావాలనుకున్న కోరుకున్న  ఒంటరితనం రానే వచ్చింది
  ఈ ఒంటరి గదిలో  గోడలు పట్టుకుని తనివి తీరా ఏడవడం  హాయిగా వుంది
  పిచ్చి వాడ్ని అయిపోతా నేమో  అనిపించింది  ఏడుస్తుంటే

  ఎక్కడ లేని జ్జాపకాలు లోకంలో ఉన్నవన్నీ నన్ను కలవడానికే  వచ్చేసాయి
  సాయంకాలం ఈ గదిలో     ఏకాంతంలో  సంత జరుగుతునట్లే వుంది

  ఆలోచిస్తే  ఎంత దాహం లోపల వుందో కదా చిన్న మంచు బిందువు తో
  ఒడ్డుకి చేరిపోగలనని అనిపిస్తోంది ...

  ఏ అలో చన  పరాయి ది అనుకుని  వాళ్ల  రాజ్యాల మీద రాయి విసరాలి?
  రాయి తగిలి ముక్కలైన  ప్రతీ గాజు ముక్కలో  నా ముఖమే  కనిపిస్తుంటే 

Monday, 30 June 2014

Main Khayal Hoon Kisi Aur Ka ......


 ఈ గజల్ ని  జగ్జీత్ సింగ్ తో సహా ఎంతో మంది మహామహులు పాడారు ,కాని నాకు  ప్రత్యేకంగా    హరిహరన్ పాడింది  చాలా ఇష్టం
  ఎవరికోసమో పరుగులు పెడతాం  ఏది మనదికాదు అని తెలిసినా వెతుకుతూనే వుంటాం
  అలసిపోతూ వుంటాం ,ఈ గజాల్  విన్న ప్రతీసారీ  ప్రతీ పదంలో కొత్త అర్దం కనిపిస్తుంది
  ఎన్నో సార్లు విన్నా ఈ సారి వినగానే నా భావాలని మీతో పంచుకోవాలని పించింది ...

Main Khayal Hoon Kisi Aur Ka
Mein Khayal Hoon Kisi Aur Ka
Mujhe Sochta Koi Aur Hai
Sar-E-Aeenah Mera Aks Hai
Pas-E-Aeenah Koi Aur Hai

Mein Kisi Keh Dast-E-Talab Mein Hoon
To Kisi Keh Harf-E-Dua Mein Hoon
Mein Naseeb Hoon Kisi Aur Ka
Mejhe Maangta Koi Aur Hai

Ajab Aitabar-O-Bey Aitabaree
Keh Darmayan Hai Zindagi
Mein Qareeb Hoon Kisi Aur Keh
Mujhe Jaanta Koi Aur Hai

Mujhe Doston Ka Pata Nahin
Mujhey Dushmanon Ki Khabar Nahin
Meri Daastan Koi Aur Thi
Mera Waaqaya Koi Aur Hai

Jo Milen Kabhi Unhen Poochna
Dekhna Unhen Ghaur Sey
Jinhen Raastey Mein Khabar Hui
Keh Yeh Raasta Koi Aur Hai

Jo Meri Reyazat-E-Neem Shab
Ko Saleem Subh Na Mil Saki
To Is Key Mani To Yeh Hue
Keh Yahan Khuda Koi Aur హాయ్

  నేను ఒక జ్జాపకాన్ని ఎవరికో ,కాని నాగురించి  ఆలోచించే వాళ్ళు ఇంకెవరో
  కోరికతో అద్దం ముందు వున్నది నా ప్రతి బింబమే కానీ నావెనక వున్నది  ఇంకెవరో
 నేను ఎవరికోసమో ఆకలితో  చేతులు దాస్తాను కానీ ఎవరి ప్రార్ధనో నామీద వుంది
 నేను ఎవరికోసమో వుందా మను కుంటాను కానీ నన్ను కోరుకునే వాళ్ళు ఇంకెవరో

  కొత్త నమ్మకాలు  అపనమ్మకాల మధ్య జీవితం
  నేను దగ్గరగా వున్నది ఎవరికో   కానీ  నన్ను తెలుసుకున్న వాళ్ళు ఇంకెవరో  
  శత్రువులు ఎవరో తెలిసుకో లేకపోయాను స్నేహితులు అర్ధం కాలేదు
  నా జీవితం ఇంకొకరిది అనుకుంటే  అక్కడ నిజాలు ఇంకొకరివి
  దారిలో ఎవరు వచ్చిన అడిగేకన్నా పరీక్షగా  చూస్తే దారిలోనే తెలిసి పోయింది
  ఆ దారి ఇంకెవరిదో అని .
  నా ప్రార్ధన ప్రార్ధించడంలో  అర్ధ రాత్రి గడిచి పోయింది
  కాని తెలిసింది ఏమిటి అంటే  "సలీమ్ "ని కలవలేక పోయినా
  నేను ప్రా ర్దించిన దేవుడు  కూడా  ఆఖరికి వేరని .....

Tuesday, 24 June 2014

జగ్జీత్ సింగ్ మరో గజల్ /ఈ గజల్ ఇష్టపడని వాళ్ళు అరుదు అని అనుకుంటాను నాకు చాల ఇష్టం కనుక ..

జగ్జీత్ సింగ్  మరో గజల్ /ఈ గజల్  ఇష్టపడని  వాళ్ళు అరుదు అని అనుకుంటాను
నాకు చాల ఇష్టం కనుక ..
  ( Hoton Se Chhulo Tum ( Prem Geet - 1981 )

  ఇది ప్రేమ గీతంలా అనిపిస్తుంది కాని  మనిషికి మనిషి ఇచ్చే ఆత్మవిశ్వాసం ,అనుబంధం కనిపిస్తుంది
  అక్షరాలూ కవితగా మారుతాయి ,కవిత పాట అవుతుంది ,పాట మనసుకి హాయిని ,ఓదార్పుని తోడుని
   ఇస్తుంది ఆ పాట పెదవుల మీద ఊయల లూగితే  అది అమర గీతమే  అవుతుంది


Honthon Se Chulo Tum
Meraa Git Amar Kar Do
Ban Jaao Mit Mere
Meri Prit Amar Kar Do
Na Umar Ki Simaa Ho
Na Janam Kaa Ho Bandhan
Jab Pyaar Kare Koi
To Dekhe Keval Man

Na_Ii Rit Chalaakar Tum
Ye Rit Amar Kara Do
Honthon Se Chulo Tum
Jag Ne Chhinaa Mujhase
Mujhe Jo Bhi Lagaa Pyaaraa

Sab Jitaa Kiye Mujhase
Main Har Dam Hi Haaraa
Tum Haar Ke Dil Apanaa
Meri Jit Amar Kar Do

Honthon Se Chulo Tum
Aakaash Kaa Suunaapan
Mere Tanahaa Man Men
Paayal Chhanraanivvuakaati తుం

Aajaao Jivan Men
Saansen Dekar Apani
Sangit Amar Kar Do
Honthon Se Chulo Tum

  నా పాటని నీ పెదవుల మీదకి  రానివ్వు
  అది అమర గీతం అవుతుంది
  నా జీవితంలోకి  ప్రేమికురాలిగా వచ్చి చూడు
  నాప్రేమ అమర మవుతుంది

  వయసుకి  సరిహద్దులు లేవు
  జన్మలకి బంధనాలు లేవు
  ఎవరు ప్రేమించినా  మనసుని చూడాల్సిందే
  కోత్త పధ్ధతి నువ్వే మొదలుపెట్టి దానిని చిరస్థాయిగా  చెయ్యి

 ఆకాశమంత  శూన్యం వుంది నా ఒంటరి మనసులో
 కాలి మువ్వల సవ్వడిలా  నాజీవితంలోకి  ప్రవేశించు
 నా సంగీతానికి నీ  ఊపిరినిచ్చి గానాన్ని  అమరం చెయ్యి
 
 ఈ ప్రపంచం నా నుంచి నా  ఇష్టలన్ని  తీసేసుకుంది
 అందరూ గెలుస్తూనే వున్నారు నేనే ప్రతీసారి  ఓడిపోతున్నాను
 నీ హృదయం ముందు నువ్వు  ఓడిపోయి  నా  గెలుపుని అమరం చెయ్యి ......