Friday 29 August 2014

మంజ-పై (పసుపు పచ్చని సంచి )సినిమా పేరు /

మా చెల్లెలు చెప్పిన తమిళ సినిమా కధ చాలా నచ్చింది క్లుప్తంగా కధ సారంశం 
మంజ-పై (పసుపు పచ్చని సంచి )సినిమా పేరు / 
ఒక పల్లెటూరిలో ముసలి తాత తనకొడుకు కోడలు ప్రమాదంలో చనిపోతే మనవడిని పెంచి 
బాగా చదివి స్తాడు ,ఆమనవడు సాప్ట్ వేర్ ఇంజనీయర్ గా పట్నంలో మంచి పొజిషన్ లో స్థిర పడతాడు
మనవడి కోరిక ప్రకారం పట్నానికి వెళ్తాడు ,అక్కడ అతని అమాయకత్వం, పల్లే టూరితనం నగర నారికతలో ఇమడలేక పోవడం ,తాత మీద ఎంత అభిమానం కాని అనాగరికచేస్టలు,అమాయకత్వం తలనొప్పిగా మారిపోతుంది ,తనదగ్గరకి రోజు జీళ్ల కోసం వచ్చే చిన్నపాపకి విషం ఇచ్చి చంపాడు అన్న అపవాదు ,ఆ అపార్ట మెంటులో అతని వల్ల మనవడికి గలిగిన ఇబ్బందులు ఇలా కధ
చివరికి అతను పిచ్చివాడుగా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళేలా చేస్తుంది ...
పేరు వున్నా తారలు ఎవరు అందులో లేరుట కాని కధ అమాయకత్వానికి నమ్మకానికి
అనుబంధాలకి మధ్య నలిగిపోయే ముసలి తాత ,పెంచి పెద్ద చేసిన తాతని సరిగ్గా చూడలేక పోయిన
మనవడి ఘర్షణ కనిపిస్తుంది అన్నిటికన్నా రోజు తన దగ్గరికి వచ్చె పసిపాప ఆరోజు ఆ తాత
జీళ్ళుఇవ్వకపోతే జీడి అనుకుని rat bite తినడం అతను చింత పండు పులుసు విరుగుడుగా
పట్టడం కాని ఆపాప బతికిందని తెలిసే లోగా పాపని అతనే చంపేసాడేమో అన్న బెంగతో తాత
పిచ్చివాడు అయిపోవడం తో కధ ముగిసిన పాత్ర లో ఇమిడిపోయిన కధ చూసిన చలా రోజుల
దాక మరచిపోవలేక పోవడమే మంచి సినిమాకి అర్హత /భా ష ఏదైనా కదిలించే కధ ...

No comments:

Post a Comment