Sunday 25 December 2011

మూడు లాంతర్లు






ఎప్పటి లాగే రైలు అలస్యంగా ఆ ఊరికి చేరుకుంది.ఎప్పటిలాగే స్టేషనులో చెట్లకింద వున్న సిమెంటు బెంచీల మీద ముసుగుదన్ని పడుకున్నరు కొందరు.
ఇంచుమించు అర్ధరాత్రి  కావోస్తోంది .ఎప్పటీలాగే నేనుకూడ రైలు దిగి స్టేషను బయటికి వచ్చాను
వేగంగా మారి పోతున్న కాలంలొ చాలా పల్లేటూళ్ళు పట్నలుగా మారిపోతున్నాయి కాని ఈ పల్లేటూరే
అలాగే వుండి పోయింది..ఇప్పటికి ఉళ్ళోకి వెళ్ళడానికి గుర్రబండే శరణ్యం.
తాతలనాటి ఆస్తులు ఈ ఊళ్ళోవున్న పోలాలు ఎప్పటి కప్పుడు అమ్ముదామనుకుంటూనే కోనేవాళ్ళులేక, కొనడానికి వచ్చినప్పుడు అమ్మడం ఇస్టంలేక అలా అలా వాయిదాలు వేస్తూ మెల్లగా
ఈఊరితో  అనుబంధం పెంచుకుని ఏళ్ళతరబడి వస్తూనే వున్నాను ,
కాల గర్భంలో అమ్మ నాన్న కలసిపోయక అమ్మలేక స్వంతంగా వ్యవసాయం చేయలేక  కౌలుకి ఇచ్చాను.
ఇన్నేళ్ళు అయినా ఈ ఊరికి రైలు అర్ధరాత్రే వస్తుంది అలవాటుగా ఎన్నిసార్లు ప్రాయాణం చేసినా
వెన్నెల్లో అయినా అమావాస్య రాత్రులైనా నాకు భయం మాత్రంపోలేదు భయపడుతూనే ప్రయాణం
చేస్తాను ఊర్లొ అందరికి తెలుసు బండివాడికి కూడా ..

ఒక రోజు ముందే వాళ్ళకి ఫోను చేస్తాను కాబట్టి వాడు బండి తీసుకుని వచ్చేస్తాడు
నాకు దయ్యాలంటే చచ్చేంత భయం,విన్నవాళ్ళు ఏమిటి ఈకాలంలో కూడానా అని ఆశ్చర్యపొయినా సరే.. .చిన్నప్పుడు  మాఆఖరి బాబాయి మమ్మల్ని అందర్న పోగేసి రకరకాల దయ్యం కధలు చెప్పి
భయపెట్టేవాడు.
అందరు తేలిగ్గా తీసుకొని మరచి పోయినా నామెదడులొ ఎక్కడో భయం పేరుకుపొయింది.

       స్టేషను మెట్లు దిగితుండగానే దూరంనూంచే నన్ను చూసి పరిగెట్టుకుని వచ్చాడు” జట్కబండి
రాముడు”  చేతిలొ వున్న సూట్కేస్ అందుకుంటూ.."అయ్య బాగున్నారా" ఈసారి ఫొన్ కూడ చేయ్యకుండా వచ్చారేంటండీ సందేహంగా అడుగుతూ బండిదగ్గరకి వెళ్ళి సూట్కేస్ పెట్టేసి నాకోసం
ఎదురుచూస్తూ నిల్చున్నాడు.

చేసానురా నువ్వు లేవు ఏదో ఊరు వేళ్ళావుటకదా అన్నాను బండికి దగ్గరగా నిలబడి.
" అవునయ్యా మాచిన్నమ్మాయి పురిటికని వేళ్ళి  అక్కడే మూడు నెలలు వుండిపోయామండి
నేను మాయావిడ, మోగపిల్లవాడండి వాడ్ని అమ్మాయిని తీసుకుని మోన్ననే ఊర్లోకి వచ్చానండి
బండి ఎక్కండయ్యగారు ఇప్పటికే సానా అలస్యం అయ్యింది..అమవాస్య రోజులుకూడాను అంటూ
బండి దగ్గరగా చిన్నస్టూలు వేసాడు.

బండి ఎక్కి కూర్చుని చుట్టూ చూసాను నిజంగానే చుట్టూతా కటిక చీకటి,పైగా అమావాస్యరాత్రికూడా
బండి కదిలింది స్టేషను దాటి నిదానంగా నడుస్తోంది ఈఊరికి రైలు అర్ధరాత్రో, అర్ధరాత్రీ దాటుతుంటేనో
వస్తుంది తెల్లవారేదాక ఇక్కడే గడిపేసి  వెళ్ళిపోవచ్చు కాని ఏళ్ళతరబడి తేలిసిన జట్కవాడు,తెలిసిన
ఊరు ఇంక స్టేషనులొ ఉండబుద్ది కాదు    ఎన్ని సార్లు ప్రయాణం చేసినా ఎందుకో భయం.దయ్యాలు
ఈతోవ వెంట తిరుగుతాయన్న నమ్మకం.
బండి డొంక దారి పట్టింది కనుచుపుమేర చీకటి కాటుకలా అలుముకుంది.చీకటి రాత్రులు కాకపొతే
వెన్నెలవెలుగులో పచ్చటి పొలాలు,మామిడితోటలు డొంక దాటుతూనే ఊరి మోదట్లో దిగుడుబావి
కనిపిస్తాయి.
ఆ దిగుడు బావి అంటేనే నాకు భయం అక్కడ ఎంతమంది అత్మహత్యలు చెసుకున్నారోలెక్కేలేదు
అరవై ఏళ్ళు దగ్గరకివస్తున్నా ఇంకా దయ్యాలంటే భయం ఈవిషయం ఊర్లో అందరికి తెలుసు.
అందుకే నన్ను జాగ్రత్తగా తీసుకువెళతాడు "రాముడు
వీడికి భయం అంటే ఎమిటొ తెలియదుట.. అతిశయోక్తి కాదు వీడ్ని బయపెట్టాలని ఎందరొ ప్రయత్నించి  ఓడిపోయారు...నేను భయపెట్టనా?
బండి చాలా నెమ్మదిగా నడుస్తోంది అసలే భయంతో గుండే వేగంగా కొట్టుకుంటోంది.అమావాస్యనాటి
రాత్రి దయ్యాలకి పండగలాంటిదట...దూరంగా తెల్లటి పొగలాంటి ఆకారం బండికి దగ్గరగా వస్తున్నట్లు
అనిపించింది .శరీంఅంతాచెమట్లు పట్టి చల్లగా మంచుగడ్డలా మారిపోయింది ఒక్కక్షణంలో.....
మళ్ళీ తేరిపారా చూస్తే అక్కడ ఏమిలేదు కటికచీకటి తప్ప....

ఈ రొజేందుకో మరీ భయంగా వుంది వీడితొ కాస్త బాతాఖాని కొడితే ఈ గభరా తగ్గుతుంది...
"ఎరా రాముడు "ఈ రోజుల్లో కూడా దెయ్యాలు వున్నాయంటావా?
వున్నాయండి మీ పట్నంవాళ్ళు నమ్మరుగాని ఖచ్చితంగా వున్నాయి కాని అయ్యగారు మీకు తెలుసుగా నాకు భయమనేదే తెలియదని.
అవును తెలుసు అందుకేగా నీకోసమే ఆగింది అనుకున్నాను మనసులో కాని ఇవాళ ఎన్నడు కలగనంత భయంకలుగుతోంది,పైగా వాడి మాటలుకూడా తోడయ్యాయి.
దాన్నికప్పిపుచ్చుకోడానికి రాముడు బండీని కాస్తవేగంగా పోనియ్యి మరీ పెళ్ళివారి బండీలా వేళుతోంది అన్నాను.
వేగంగానే వెళుతోందండి అమవాస్య చీకటి కదండి దారి కాస్తతికమకగా వుంటుందండి
వేగం అంటున్నాడుగాని నాకు మెల్లగా చీమనడకలా అనిపిస్తోంది
కాస్సేపటికి వాడు వెనక్కి తిరిగి అయ్యగారు బండిలొ టార్చలైట్ వుండాలి చూడండీ అన్నాడు
అంతా వెతికాను దొరకలేదు  ఆమాటే వాడితో అన్నాను..
వుండాలండి మరి నాదగ్గర పెట్టుకున్నానేమో అంటూ వాడు కూర్చున్న దగ్గరే వెతికి ఇదిగోనండి
అంటూ ఇచ్చాడు చేతికి
అప్పుడు చూసాను వాడి చేతివేళ్ళు  చెట్టు వేర్లలా సన్నగా పొడవుగా పొడూచుకోచ్చినట్లు,కెవ్వున
కేకపెట్టాను నీచేతి వేళ్ళు అలావున్నాయి ఎమిటీరా అంటూ ఒణికిపోతూ,,,
నాచేతి వేళ్ళా? బాగనే వున్నాయిగా! అయ్యారికి మరీ భయంఎక్కువైయింది అనుకుంటూ..
టార్చి ఇస్తూ చూసాడు రాముడు అయ్యగారి కళ్ళు వింతగా అనిపించాయి నిర్జీవంగా.

టార్చిని వెలిగించడానికి ప్రయత్నించాను అది మోరాయించింది వెలగటంలేదురా అన్నాను భయంగా
ఏమోనండి బ్యటరీలు అయిపొయాయేమో?
ఇంకొంచం దూరంవెళ్ళగానే దూరంనుంచి కనిపించాయి మూడు దీపాలు కదులుతూ,అవి కచ్చితంగా
కొరివిదెయ్యాలే  శ్మశానంలోంచి బయటికి వచ్చాయి..
అయ్యగారు ఆలైట్లు చూస్తున్నారా అడిగాడు రాముడు,వాడు అలా అడగ్గానే మరింతగ ముడుచుకుపోయి బండిలో ఓమూలకి జరిగాను’
నేను మాట్లడకపోయేసరికి" అయ్యగారు" అయ్యగారు "అంటూ పిలిచాడు రాముడుఆత్రంగా..
వూ.. అన్నాను కొద్దిగా ధైర్యం తెచ్చుకుని
ఈలోగా ఆవెలుగు మరీంత దగ్గరగా వచ్చింది అవి లాంతర్లు నెత్తినపెట్టుకొని ముగ్గురు నడుస్తూ బండికి దగ్గరగా వచ్చారు..
ఆశ్చర్యపొతూ రంగడు ఈ రాత్రికాడ లాంతర్లట్టుకొని ఎక్కడిరా ప్రయాణం అసలు ఏవూర్రామీది?
అడిగాడు రాముడు.
పక్కఊరే నాయుడుగారింట్లో పెళ్ళి అన్నాడోకడు
పెళ్ళా నాకుతేలికుండా అనుకుంటుండగానే లాంతర్లు పట్టుకున్న వాళ్ళచేతులు చూసాను చెట్టువేర్లలా     
సన్నగా పొడుచుకొచ్చినట్లు వుండి వేల్లాడిపోతున్నాయి..
అమ్మో అయ్యాగారు చూసారంటే ఇంకేవైనా వుందా! అసలే మహా పిరికి మనిషి ..పొండేహే
లాంతర్లు ఆరిపొగలవు అంటూ వాళ్ళని తరిమినట్లు మాట్లాడాడు రాముడు.

బండిలో నా  స్థితి పగవాడికి కూడా రాకూడదు భయంతో నోరు పిడచకట్టుకుపొయింది
రాముడూ  మంచి నీళ్ళురా అన్నాను గోంతు పెగల్చుకొని..
అక్కడే పెట్టానండి చూడండి అంటు వెనక్కి తిరిగాను ,అయ్యగారు అన్నాను గభరాగా,మళ్ళీ
"అవే నిర్జీవమైన కళ్ళు"
బాటిల్ దొరికింది కొన్నినీళ్ళతో గొంతు తడుపుకోన్నాను. నీళ్ళు కొద్దిగా వున్నాయిరా రాముడు
తోందరగా పోనీరా బతిమాలుతూ అన్నాను.
వేగంగానే వెల్తున్నానండి అంటూ ఆలోచనలో పడ్డాడు ఇవాళ అంతా చాలా విచిత్రంగా జరుగుతోంది
లాంతర్లు పట్టుకున్న వాళ్ళ చేతులు ,అయ్యగారి చూపులు...
టయిము ఎంత అయివుంటుందంటావు? అడిగాను వాడిని  మనంస్షేషను వదిలేసి అరగంట అయివుంటుంది అయ్యగారు అన్నాడు వాడు..
రాముడు నువ్వు సరిఅయిన దారిలో వెళ్తున్నావా?అడిగాను సందేహంగా
ఎంటండీ అయ్యగారు మీకు తెలియదా? ఈఊరికి ఈడొంకదారి తప్పిస్తే మరోదారి వుందాండి?

తెలుసులే అయినా బండి ఇంతనిదానంగా నడుస్తూంటే అసలు తోచటంలేదురా పైగా అమావాస్య
రాత్రికదా?

చల్లటి ఐసులాంటి గాలి ఒక్కసారిగా బండిని చుట్టుకుంది గజగజా ఒణికి పోయాను ఎక్కడో పుస్తకంలో
చదివాను దయ్యాలు వచ్చేటప్పుడు ఇలా గాలివీస్తుందిట
రాముడు ఏమిటిరా ఈచలి గాలి ఇకాలంలో దయ్యం చేస్షలు కావుకదా? పెద్దరికం మరిచి భయంతో
అడిగాను
చల్లగాలా లేదండి మీరు మరీ భయపడి పోతున్నారు కొంచం ధర్యంగావుండండి అయ్యగారు ఇంకొ
పదినిమిషాల్లో ఉర్లొవుంటాము అన్నాడు
బండి  బయలు దేరి సానా టయిము అవుతోంది ఇంకా ఊరు చేరటంలేదు ఈరోజు చాలావింతగా
వుంది అయ్యగారు ఏళ్ళ తరబడి భయపడినట్లు నిజంగా దయ్యాలు వున్నాయా?
అయ్యగారి భయం తెలిసి పరాచికాలు ఆడాను దెయ్యాలు వుంటాయండి అంటు.అసలు దెయ్యాలు భూతాలు నమ్మనినేను ఇలా అవుతున్నానేంటి?
భయమా?నాకా?
అయ్యగారి భయంచుస్తూంటే ఈ వయసులో బతకగలరా అనిపిస్తోంది .
అయ్యగారు అంటు పిలిచాడు రాముడు.
పలకలేదు,” అయ్యా” అంటూ మరోసారి పిలిచాడు
వున్నానురా అన్నారు బలహినమైన గొంతుతో..
ఒరేయి ఓపాట పాడురా అన్నాను
నేనా అండీ అన్నాడు అనుమానంగా వింతగా
పోని నేను పాడనా అంటూనే పాట మోదలు పెట్టారు
పది గోంతుకలు కలిపి పాడుతున్నట్లు బొంగురుగా ఇనుప గమేనాలో రాయిపెట్టి గికినట్లుగా వినిపించింది రాముడికి.
ఏమిటిది అయ్యగారు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారు భయంతో గొంతుకూడాబిగుసుకుపొయిట్లుంది
పాటకాదు వేదనలా వుంది.

విచిత్రమైన స్ఠితిలో మోత్తానికి ఊరు మోదట్లోకి వచ్చి చేరింది బండి.
అలావాటైన ఇల్లు కాబట్టి అయ్యగారి డాబాఇంటి ముందు నిదానంగా ఆగింది
అప్పుడు చూసుకున్నాను వీధి లైటు వెలుగులో  టైము  ..మూడున్నర గంటలు చూపించింది
ఆశ్చర్యపోయాను స్షేషనునూంచి ఊళ్ళోకి రావడానికి అరగంట చాలు  రెండు గంటలు పట్టిందా?
అనుకుంటూ ఆలొచనలో పడ్డాడు రాముడు.

 అయ్యగారి ఇంటి అరుగుమీద పడుక్కున్న విరయ్య బండిచప్పుడికి లేచి  "ఎవర్రా" అది అన్నాడు
ఏంట్రా రాముడు బండిని ఇలాతీసుకోచ్చావు ? బండిలో ఎవరూ? అడిగాడు.
ఎవరంటావేంటీ మన కామేశం అయ్యగారు .స్షేషనుంచి తీసుకోస్తున్నాను ఈరొజు అయ్యాగారు మరీ
భయపడిపోయి నన్నుకూడా భయపేట్టేసారురా అన్నాడు బండి మీదనుంచి దిగితూ...
వాడి వేపు ఆశ్చర్యంగాచూస్తూ నువ్వు భయపడ్డావా? ఏరా నువ్వు మూడు నెలలుగా ఊళ్ళోలేవుగా
అన్నాడు వీరయ్య.
అవును అన్నాడు రాముడు
బండిలోకి  తొంగి చూస్తూ వీరయ్య
అయ్యగారు చనిపోయి మూడు నెలలు అవుతోంది అన్నాడు ..
దబ్బున చప్పుడయ్యింది..
కంగారుగా వెనక్కి తిరిగిన వీరయ్యకి తనవెనకాలే నిల్చుని బండిలోకి తోంగిచూసిన రాముడు              
నేలమిద పడిపోయి కనిపించాడు
కింద పడ్డరాముడిని కుదుపుతూ కంగారుగా చుట్టు పక్కలవాళ్ళని పిలిచాడు సహాయంకోసం.
                  ***        ***            ***        ***

































Saturday 24 December 2011

ఆ రోజు నుంచి ఈరోజుదాక


THE DAY I BURN'' ఆరోజు పదే పదే వెంటాడుతోంది
 
కట్టుకున్న వాడే ముఖం మీద "యాసిడ్"జల్లాడని తెలిసి
మళ్ళీ మరో కధ మొదలయిందని నిట్టూర్పుల వెనక
నేను నిల్చున్నాను ఒంటరిగా
చుట్టూ అందరు వున్నా
ఎవరులేనితనం అనుభవిస్తూ
.                        
అనుభవించిన నరకం,అర్తనాదం,అన్నీ
శరీరంలోకి  ఇంకిపోయాక,
దగ్ధమైన ముఖంతో లోకంముందు నిల్చున్నప్పుడు
శూన్యంలోకి అడుగు వేస్తున్నట్లు అనిపించింది
తినడానికి అవకాశం  ఇవ్వని నోరు
పగలు, రాత్రీ , మూతపడని కనురెప్పలు

విస్తరాకు కుట్టినట్లు కుట్లతో ముఖం.
ఆత్మవిశ్వాసం అదృశ్యమవ్వటం మొదలయ్యింది
అభద్రతా భావం సుడిగాలిలా చుట్టుకుంది
కన్నీటి బొట్టు  అతుకుల బొంతలోకి జారుకుంది.

ఎక్కడో ఒక ఆశ ” ప్లాస్టిక్ సర్జరీతో” సినిమాల్లొ లాగ
ఒక కొత్త ముఖంకోసం-
అశలో కొత్తసూత్రం తెలిసింది-జీవితం సినిమాకాదని
మనసు ఏడారి సముద్రం అవగానే
దుఖం ఒక్కటే  బుజానికి ఆసరాగానిలిచింది

వాడిని క్షమించాలని అనుకున్నాను
క్షమించగానే స్వేచ్చాగాలి మేల్లగా వీచ సాగింది
గుండేలో ్పేరుకుపోయిన  అనాటి దృశ్యాలు             
క్షామాగుణంలోకి ప్రవేశించి వణీకించాయి
నిద్రపట్టని రాత్రుళ్ళు కోపంతో రగిలిపోయాయి

 అనాకారి తనంలోంచి బయటికి తోంగిచూస్తే
వెలివేసిన ప్రంపంచం సిధ్దంగా ఉంది

కాలేజిలో చేరుతానంటే అముఖంతోనా?-
ఏన్నో యుధ్దాలకి మోదటి ప్రశ్న అది
ప్రశ్నలా మిగిలిపోయిన నేను
సమాధానం కోసం అన్వేషించాను

ఒంటరిగా మట్టిపెళ్ళలా కూలిపోతానా
మనుషులమధ్య కొట్టుకు పోతానో తెలియదు
జీవితం  సముద్రంలా  ఇల్లంతా ఒళ్ళంతా
కనుచూపుమేర విస్తరించివుంది.
అక్కడ మోదలైన సంఘర్షణ  జీవనదిలా సాగిపోయింది

అప్పుడే నావెంట నాలాంటి వాళ్ళస్వరాలు
వినిపించాయి
నాబుజం అసరా చేసుకో వాలని నాచేయి పట్టుకున్నాయి
ఏదో శక్తి నన్నావరించింది
పూలతీగల అల్లిక నాచుట్టూ అల్లుకుంది
ప్రాయాణం మోదలైంది  -

మనుషులందరూ  ఎతైన పర్వతాలుగా  మారిపోయారు
శిఖరాగ్రానికి చేరుకోవాలంటే  తాళ్ళతో ఇనుప కోక్కేలతో సిధ్దమవ్వాలి
మనిషి వెంట మనిషి  దుఃఖాన్ని తాడులాపేనుకుని
రాతి మనుషుల గుండెలలో తడికోసం ఎక్కుతూనే ఉన్నాము

 స్వశక్తిలొ ఆనందం
ఎవరికీ చెందని లోకంలో బ్రతుకు పొరాటం

పాత అందమైన ఫొటోలు చూసుకుంటే
చనిపోవాలన్న బలీయమైన కోరిక
గతం గాయమై కారు మబ్బులా కమ్ముకుంది
అక్కడనూంచే ఒక నీటీ చెమ్మ  గాయాన్ని తడిపి ఊరటనిచ్చింది..

ఇంత జరిగాక లోకం ప్రశ్నించింది ఏం మిగిలిందని?
మఖంమీద గాయాలని ప్రేమించడమే- నేర్చుకున్న విజయం
 ఇంత కన్నా ఏం కావాలి?

[ may 1998  లొ"సిరీన్ జువాలే" మీద యాసిడ్ దాడి జరిగింది. augst femina లొ చదవగానే మనసు చలించింది అది అక్షరూపం దాల్చడానికి ఇంతసమయం  కావలసి వచ్చింది అయినా ఇంకా ఎక్కడో ఆమే దుఖాన్ని అందుకోలేక పోయాననిపిస్తోంది]






Thursday 15 December 2011

ఎవరో నేర్పే పాఠం




  

 మన మీద మనకే జాలి వేస్తుంది
మన గోడలు మనల్నేచూసి నవ్వినట్లు అనిపిస్తుంది
సిమెంటు పంజరాల్లొ మనం

అనుక్షణం మనల్ని కాపాడడానికే కంకణం కట్టుకున్న టి.వి
కళ్ళు తేరిస్తే చాలు "గుడ్ మార్నింగ్"అంటూ
కాఫీబ్రేక్ తో పలకరిస్తుంది.

ఆ రోజు జాతాకాలు
జాతచక్రాల్లో మన భవిష్యత్తు భయభయంగా

ఆత్మహత్యలు రోడ్డు ప్రమాదాలు
నెత్తుటి మరకలు లతో ముగించిన వార్తలు

మనసు వికలమై చలించి ఆలోచనలో ములిగి పోతే
ఆరోగ్య సలహాలు-
ఆయుర్వేదం ,నేచురోపతి ,హోమ్యోపతి
ఎంతమంది పతులు మన కోసం?

నడవాలంటారు ,నడవొద్దంటారు
సైకులు తొక్కండంటారు ,సైకిలెందుకు
మందుకు మాకు చాలంటారు
ఒంట్లొ జబ్బులన్నీ నయమంటారు

ఆకులు తినమంటారు నవ్వమంటారు
గడ్డిలో నడవమంటారు ,ఊపిరిబిగపట్టి శ్వాసని వదలమంటారు

మనకున్నరోగమేంటో మనకే తెలియని స్ఠితిలో చిన్నకునుకు-

వంటలు రడీగావుంటాయి

నిమిషాల్లో అందానికి మెరుగులు
క్షణాల్లో  షాపింగులు
సమస్యలు సలహాలు.

మన కోసం ఇంతమంది శ్రమిస్తున్నారా?

అనందమో,సందేహమో
మెదడుని మోద్దుబారుస్తుంది
విన్నదే వినీ ,వినీ వినీ
పక్షవాతం వచ్చినవాళ్ళలా
సోఫాలకి అతుక్కుపోయాక-

ఆ కరంటు వాడికే మనమీద దయకలుగుతుంది

ఆగిపోయిన టి.వి ముందునుంచి లేచిన మనం
 చెరనుంచి  విడిపించుకున్న ఖైదీలం.....




Saturday 3 December 2011

అడవికి నిద్ర పట్టని జ్ఞాపకం












కాటుక లాంటి అడవి
నన్నేవరూ చూడ రనుకుంది
కారు మబ్బులు కమ్ముకొని
గాలి అందించిన చినుకు వరదలో
అడవి సేద తీరుతోంది


వెలుగులు చిమ్మీ
నిప్పులు కురిసి
నేలకు జారిన శకలాలు
ఒణికించిన ఒంటరితనం

అడవిని కదలించిన మరణం
అడవిని కుదిపేసిన దుఃఖం
అడవే విస్మయ పడిన ఒక్కక్షణం
ఉలిక్కి పడిన జనం

అడవిని ముంచెత్తిన అశ్రు కణాలు
వెల్లువై కొమ్మని గుట్ట గుట్టనీ  గాలించాయి
ప్రియతముని జాడకోసం  పరితపించాయి
నిద్రాహారాలు మాని రోదించాయి

అడవిని కమ్ముకున్న జనం
గుండెల్లో దాచుకున్న నాయకుడి కోసం
వరదైన జనం

దుఃఖపు తడిలో అడవి కాలిపోవడం ఇదే!!

అడవి బిడ్దల కోసం హస్త మందించిన  సూర్యుడు
అడవిలో అస్తమిస్తే-

ఆ అడవికి ఎప్పటికీ నిద్ర పట్టని జ్ఞాపకం
.
మరణం మిగల్చిన విషాదం
పచ్చి నిజం..
గతమై గాయంలా సలుపుతోంది
శిలగా మారిన కాలాన్ని కదపాలి

విధి చేసిన విషాదాన్ని దిగమింగాలి

హస్తానికి హస్తం కలుపుతూ పోతూ
మళ్లీ మనమందరం నవతరానికి
హస్తమందివ్వాలి!


[రాజ శేఖర కవితాస్మృతి  ద్రావిడ విశ్వ విద్యాలయం వారు ముద్రిం చిన కవితా సంకలనంలోని కవిత ఇది ]


 










 















o