Thursday 29 September 2011

ఆ మలినం మనదే

    

         మనమెప్పుడూ పట్టించు కోని దృశ్యాలు
         అప్పుడప్పుడు   నగరంలో ప్రత్యక్ష్యం అవుతాయి


        మలినాలను శుభ్రం చేస్తూ ఎదురవుతారు                         
        
        జనాలలో వుంటూ  జనాలకి దూరంగా  వాళ్ళు-
       మలినాల బరువుని మోస్తరు .

       
       మరణానికి  దగ్గరగా ''మ్యాన్ హోల్సలో  
       కొబ్బరి  తాళ్ళ సహాయంతో
       భుజాలను కుదించుకొన్న మనిషి
       చీకటిలోకి  దూరిపోతాడు.

       
      పాదాలని ఒరుసుకుంటూ
      నగరంలోని  కుళ్ళు పరుగులు తీస్తుంటే

       శ్వాస ఆడని  చీకటి  ఇరుకులో
       పోటమరిస్తున్న  చెమట
      మట్టి సందుల్లో  కదిలే  జీవరాసులు


      ఊపిరాడని దుర్గంధం కడుపులో పేగుల్ని
      మెలిపెడతాయి .

      చీకటిని తరిమే సాధనాలు కళ్ళే
      టార్చ్ లైట్లలా విప్పార్చుకొని
      చీకటి దుర్గందాలతో  సంఘర్షణ


     అప్పుడప్పుడు చని పోతారుట-
     
     ఎంతటి  విషాదం?
    
     కూటి కోసం పోరాడే మలినం  విలువ
     ఒక పచ్చ నోటు.

    మలినమని పది సార్లు సబ్బుతో  కడుకుంటాం

     ఒక నోటు  ఇవ్వ డానికి  పది సార్లు  ఆలోచిస్తాం

    ఆ మనిషికే మలినం అంట గట్టి
   సమాజంలో దూరంగా  నిలబెడతాము

    వాడు మో స్తున్నమలిన దుర్గందం
    మనదే.
   ఈ సత్యాన్ని అంగీకరిస్తే

    అగ్నిని  మోసి నట్లే కదూ ......
   






    
        
     
   

       

       

Thursday 22 September 2011

నాతో మాట్లాడని నా కవిత్వం

         
                       

                  నా కవిత్వం -
           అమాయకపుది, పల్లెటూరిది
           కొత్తదనం , డాబు,దర్పం తెలియనిది             

            
        అధునికత అంటగడదామని-
        ముతక పంచ  ముల్లు కర్రపడేయేంచి
        క్రాఫుదువ్వి  ప్యాంటు చొక్కా తొడిగాను
           
         
          అయినా పెదవి విరిచారు
          కొత్తదనం  లేదని -
         కవితే కాదని వాదించారు

           అప్పుడే-
        
         ఆస్పష్ట  అనుభూతి  కలిగిస్తూ
         పాత మాటల్నికొత్తగా చెబుదామని
         నా గుండె గుడికి దారం కట్టి
         నీ కనుల గేటుకి వేలాడదిశానన్నాను,
         ప్రేమకోసం  నీ పెదవులు  కత్తిరించి
         నా వీపుకి అతికించు కొన్నాను  అన్నాను
     
        నీ కోసం నా  శరీరం ఫ్లాస్కులో పోసిన  వేడి నీళ్ళలా
        కుత కుత మంటోంది  అన్నాను.


        ఇలా ఇన్ని మార్పులు జరిగాక
       
         నా కవిత్వం ఆధునిక మైయింది
         పొగడ్తల సముద్రంలో  ఈదులాడతూ
         నాతో మాట్లాడం మానేసింది


       
    { తొలి హాస్య  కవితా సంకలనం. ౨౦౮  ఫిప్ర వరి లోనిది }


       



       
      




            

Friday 16 September 2011

వాలుకుర్చీ

    













    


    

     నిద్ర నటిస్తూ
    నిద్ర పోతున్న నిద్రలో
    కనుల నుండి రాలిన అగ్ని కణం
    దిండులో  ఇంకి పోయింది


గతాలు నెమరు వేసుకుంటున్న 
    కలత  నిద్రలో 
    గతాలు ఎండు గడ్డిలా
    రుచిలేని పదార్దంలా
    చప్పగా వున్నాయి.

    చేసినవన్నీ తప్పులే అన్నట్లు
    బతుకు చిత్రాలన్నీ 
    దొంతరలు పడ్డాయి  
    కాలం వాలు కుర్చీకి  నెట్టేసింది

    ముడతలు పడ్డ చేయ్యి చూపు తగ్గిన కళ్ళు 
    పట్టుకోసం వెతికాయి
    మెత్తటి కన్నవారి చేతులు కాక
    చేతికర్ర పలుకరించింది.

    వార్ధక్యం వరమాల వేస్తే 
    పెళ్లి కొడుకులా బోసి నవ్వులు నవ్వాను
    చూపు ఆనక చేయి అడ్డం పెట్టి
    గోడ వైపు చూస్తే  అర్ధాంగి ఫోటో కనిపించింది 

   వయస్సు కాలం గుమ్మంలోంచి వెనక్కి నెట్టేస్తే 
   మృత్యువు ముందరి కాళ్ళకి భంధం వేసి
   వాలు కుర్చీలో కుదేసింది 
    పనిలేని శరీరం విశ్ర మిస్తోంది 
    విరామంలో కూడా నిద్ర రాదు 
    నిద్ర నటిస్తూ నిద్ర పోతున్నాను.


i

























   
  




Wednesday 7 September 2011

మనసు గాయం

      

    గాయం మాని పోతూ పొరలు కట్టుకుంటూ
     ఆనవాళ్ళను మిగులుస్తుంది.
     ఏ గాలి జ్ఞాపకానికో మళ్ళి  చెలరేగుతుంది 
    నిప్పురవ్వ వచ్చి పడ్డట్లు  గాయం  మండుతుంది
    నిద్ర  జడలువిప్పు కొని  నాట్యం చేస్తుంది 

    పాత జ్ఞాపకాలు  తోడవుతాయి
     ఎప్పటివో వచ్చి చేరుతాయి

    కొత్తవి పాతవి కలసి కలకలం  రేపుతాయి 
     గాయం   మాననీయకుండా   
    ఎక్కడెక్కడివో గుర్తు కొచ్చి
    దోర్లిపోయినవి ,ఉహకందనివి 
    వచ్చి చేరి  ఏడిపిస్తాయి
.
    నెత్తురు చిమ్మని గాయం
   కన్నీటి  వరదలకి  కాలువ కడుతుంది-

   మరచి  పోయామనుకున్నవి
   మనం  ఉహించనంత అందగా
   బహుమతి  రూపంలో  అందిస్తుంది

.
    గిఫ్ట్ రేపర్  విప్పినట్లు,
    గాయాలని విప్పి చూపిస్తుంది.


    ఇంక ఆలోచనలు కళ్ళెం లేని  గుర్రాలు.
    వేగంగా పరుగులు  తీస్తూ గాయాన్ని
    అగ్ని గుండంగా మారుస్తాయి
.
    గాయం లావాలా వుడుకుతూ 
    మనసుని కాల్చేస్తుంది మాడి మసి అయిపోయాక

    గాయం మెల్ల మెల్ల మానిపోతూ
    మనసు లేని శరీరం మీద
    మిగిలి  పోతుంది  మాయనిమచ్చలా -
   
*#*#*










    
 




   


  

   
















     

       

Friday 2 September 2011

అందరికి మధ్య దూరం

 
 దూరం దూరం
 అందరి మధ్య దూరం
 అంతరాల మధ్య దూరం
 పెద్ద చిన్నల మధ్య దూరం  
 పేద గొప్పల మధ్య దూరం

 దూరాలు లేవంటూ
 దూరాన్ని ఇంకా దూరం చేస్తూ
 దూరమే లేదంటూ
 దగ్గర తనంలో కూడా 
 దూరాన్నిపెంచుతూ 

 సంసారాన్ని ఈదుతూ
 దూరభారాలన్నీ దేవుడి మీద వేసి 
 దూరం నుంచి ఓ దండం పడేసి

 నీకు నాకు మధ్య దూరమేమిటంటూ 
 దూరంగా జరిగే  మనుష్యులకి
 దేవుళ్ళకి మధ్య  ఉన్నది-
 అంతు చిక్కని ఆ దూరం ఒక్కటే

  అందు వలనే  దేవుడు
  అందరికి దూరంగా  ఉంటున్నాడు

Staying Away

    
  Distance,detachment
  chilly chinks in class,
  devastating generation gaps
 despicable distances among people

  in the name of demolition of discrepancies
  distancing further....
  condemning coldness,
  strangeness stretches sharply!
 
  
 Mired in miseries of family
 clinging to Him for susteance
 flinging a salute from afar..
 As man moves away from him
 Claiming invisible closeness
 Irresolute inference intervenes.

 Hence,He chose
 staying away from all!

             * * * * **
  telugu orgin ,,,,,,,,,andariki madhya duram

[ translated from telugu by DR T.S.chandra mouli &B.B.sarojini ]