Wednesday 7 September 2011

మనసు గాయం

      

    గాయం మాని పోతూ పొరలు కట్టుకుంటూ
     ఆనవాళ్ళను మిగులుస్తుంది.
     ఏ గాలి జ్ఞాపకానికో మళ్ళి  చెలరేగుతుంది 
    నిప్పురవ్వ వచ్చి పడ్డట్లు  గాయం  మండుతుంది
    నిద్ర  జడలువిప్పు కొని  నాట్యం చేస్తుంది 

    పాత జ్ఞాపకాలు  తోడవుతాయి
     ఎప్పటివో వచ్చి చేరుతాయి

    కొత్తవి పాతవి కలసి కలకలం  రేపుతాయి 
     గాయం   మాననీయకుండా   
    ఎక్కడెక్కడివో గుర్తు కొచ్చి
    దోర్లిపోయినవి ,ఉహకందనివి 
    వచ్చి చేరి  ఏడిపిస్తాయి
.
    నెత్తురు చిమ్మని గాయం
   కన్నీటి  వరదలకి  కాలువ కడుతుంది-

   మరచి  పోయామనుకున్నవి
   మనం  ఉహించనంత అందగా
   బహుమతి  రూపంలో  అందిస్తుంది

.
    గిఫ్ట్ రేపర్  విప్పినట్లు,
    గాయాలని విప్పి చూపిస్తుంది.


    ఇంక ఆలోచనలు కళ్ళెం లేని  గుర్రాలు.
    వేగంగా పరుగులు  తీస్తూ గాయాన్ని
    అగ్ని గుండంగా మారుస్తాయి
.
    గాయం లావాలా వుడుకుతూ 
    మనసుని కాల్చేస్తుంది మాడి మసి అయిపోయాక

    గాయం మెల్ల మెల్ల మానిపోతూ
    మనసు లేని శరీరం మీద
    మిగిలి  పోతుంది  మాయనిమచ్చలా -
   
*#*#*










    
 




   


  

   
















     

       

2 comments:

  1. manasu gaayam
    manasu badhaga undhi..,
    gaayam andamga undhi.
    abhinandhanalu.
    http://mounamamatladave.blogspot.com/2011_08_13_archive.html

    ReplyDelete