Saturday 13 September 2014

జీవితంలో సమస్యలు రాకుండా వుండవు వాటికోసం జీవితాన్ని బలితీసుకోవడం తెలివితక్కువ తనమని అందరికీ తెలుసు ,కాని కొన్ని క్షణాలు బలిహీనంగా మారిన మనసు జీవితం వృధా అనుకుంటుంది బేలగా జీవితం ముందు ఓడిపోయి కన్నిళ్ళు పెడుతుంది. వాటితో పాటూ నడుస్తూ ,వాటినే ధూళీలో కలిపేస్తూ నడిచి చూడు ఆసమస్య కి విలువవే వుండదు అనిపిస్తుంది ఈ పాట వింటే ... నాకు చాల నచ్చిన ఈ పాట మీకోసం ...



  Maein Zindagi Ka Saath Nibhata Chala Gaya  from Hum Dono (1961)


 Maein zindagi ka saath nibhata chala gaya
 Har fikar ko dhuen mein udata chala gaya

 Barbadiyon ka shok manana fizul tha
 Barbadiyon ka jashan manata chala gaya
 Har fikar ko dhuen mein uda…

 Jo mil gaya usi ko muqaddar samajh liya
 Jo kho gaya maein usko bhulata chala gaya
 Har fikar ko dhuen mein uda…

 Gham aur khushi mein farq na mehsoos ho jahan
 Maein dil ko us muqaam pe laata chala gaya
 Har fikar ko dhuen mein uda…


 జీవితాన్ని తోడుతీసుకుని  నడుస్తూ వెళ్ళిపోతున్నాను
 ఆవేదన అంతా  పొగలో కలిసి పోయేలా వెళ్ళిపోతున్నాను

 శిధిలాలు పట్టుకుని ఏడవడం వృధా అనుకుని
 శిధిలాలో అనందం వెతుకుంటూ వెళ్ళిపోతున్నాను

  ఎదురైనది ఏదైన  అదే నసీబ్ అనుకుని వెళ్ళిపోతున్నాను
  పోగొట్టుకున్న దాన్ని మరచిపోతూ  వెళ్ళిపోతున్నాను

  సుఖదుఃఖాలకి తేడా తెలియని  ప్రపంచంలోకి
  ఈ హృదయాన్ని ఆ గమ్యానికి చేరుస్తూ
  ఆవేదన అంతా  పొగలో కలిసి పోయేలా వెళ్ళిపోతున్నాను .....

No comments:

Post a Comment