Sunday 22 June 2014

మనసు ,పాట,ప్రకృతి,ఏవి విడి విడి గా వుండవు పాటని ప్రేమించిన వాళ్లకి 
ప్యాసా పాత హిందీ సినిమాలో పాటలు విని ఇష్టపడని వాళ్లు అరుదు 
అందులో ఈ పాట నాకు చాల ఇష్టం ,జీవిత సత్యాన్ని కొంత ,విరక్తిని కొంత 
పోగొట్టుకున్న ప్రేమ కనిపిస్తుంది ఇందులో 

Jane Woh Kaise Log The Lyrics from Pyaasa (Old)

Jane woh kaise log the jinke pyaar ko pyaar mila
Hamne toh jab kaliyan mangi katon kaa har mila

Bichhad gaya har saathi dekar pal do pal kaa saath
Kisko phursat hai jo thame divane kaa hath
Hamko apna saya tak aksar bejar mila
Hamne to jab

Isko hee jina kehte hain toh yun hee jee lenge
Uf naa karenge lab see lenge aansu pee lenge
Gham se abb ghabrana kaisa gham sau bar mila
Hamne to jab

కొందరికి జీవితంలో ఎందుకో ప్రేమకి బదులు ప్రేమే దొరుకుతుంది
కొందరికి పూలుకాదు మొగ్గలు కోరుకున్నా ముళ్ళు దొరుకుతాయి
కొన్ని స్నేహాలు అప్పటికప్పుడు దగ్గర అయ్యి విడిపోతాయి

అప్పుడని పిస్తుంది ఎవరికీ పట్టింది మనలాంటి పిచ్చి వాళ్లకి చేయందించడానికి
ఆఖరికి నీడ కూడా విసుగ్గా అనిపిస్తుంది
ఇదే నిజమైన జీవితం అయితే అలాగే బతికేద్దాం
నిట్టూర్చ కుండా మాటలని కుట్టేసుకుని కన్నీళ్ళు దిగమింగి బతికేద్దాము
ఇంక గాయాలకి దుఃఖాలకి భయమెందుకు అవి వందసార్లు మనవే అయినప్పుడు

అనుకున్నవి జరగనప్పుడు ఒక్కసారైనా ఇలా అనిపించక మానదు,
కనీసం ఈ పాట విన్నప్పుడైన ఈ భావం రాక మానదు అనిపిస్తుంది నాకు.....

No comments:

Post a Comment