Thursday 1 March 2012

జన్మరహస్యం

కొత్తగా తెలిసిన జన్మరహస్యం
అక్కరలేని బిడ్డను,దొప్పలొ పెట్టి నీళ్ళళో వదిలేయడం?
***
కన్నప్రేమని అనుభవించని రహస్యం
ఆనందమో కోపమో ఎటూతేల్చుకోలేని మనసు
ఆవేదనతో ముఖాన్ని గుర్తుపట్టాలనుకుంటే
వెలుతురు అంటని చీకట్లో
నీళ్ళలొ ముఖబింబం కనిపించదు
వ్యాపించే వెలుతురుతోపాటు నిజం మెలిపెడుతోంది.

ఇ నాళ్ళకి కనిపించిన తల్లి నిజం
నిజాన్ని నీడలామోయ్యాలి
పెంచి పెద్దచేసిన "అమ్మ అబధం"
అనుకోవడానికి ఈ జన్మచాలదు

"సూర్యదేవుడి అనుగ్రహం
తెల్లటి కాంతితో,కుమ్మరివాడు మట్టితో బొమ్మని చెసినట్లుగా
కిరణాల పడవ మీద వచ్చావు-"
              అమ్మ చెబుతుంటే ఎంత గర్వం.

ఆ గర్వం తునాతునకలు అవకుండా
నిల్చోగలనా?
ప్రేమపాశం తెలియని  నిర్ధయురాలైన
తల్లిగర్భమే తనపుట్టుక-నాకే ఒక విస్మయం.!!!

విలువిద్యలో కీర్తి సంపాదించి
దుర్యోధన మహారాజు కుడిభుజంగా,
కీరీటంలో ప్రకాశించే మణిననిపించుకున్నాక
ఒక సంతృప్తి -

కుంతి పుత్రుడనని తేలిన నిజం
లోకాన్నంతా చీకటిమయం చేసేసాయి
నిజం నిర్దయగా ఆలస్యంగా  ప్రవేసించి
ఏం సాధిస్తుంది?
నిజాన్ని తన కడుపులొనే దాచేసి
తన ఒళ్ళోనే చనిపోయిన అమ్మ

రూపులేని నల్లటినదిలో ఈత
తనది అచ్చం కుంతిరూపమట!
***
వెలుతురు సోకని చీకట్లో
నీళ్ళలొ నా ముఖబింబం నాకేమాత్రమూ కనిపించదు.


(ఎస్.ఎల్ భైరప్ప ’ పర్వ’ చదివాక.....)

1 comment: