Monday, 10 August 2020
యాత్ర ______-
యాత్ర ______-
కవిత్వం చలికో వేడికో బాధ పడదు
స్పష్టత లేక దుఃఖపడుతుందంతే
తరచుగా తగిలిలే రాళ్ళతో గాయపడుతూ
అపుడప్పుడు
రంగు రంగు ఈకలున్న పక్షిలా
తారసపడుతుంది
మట్టి కాళ్ళతో నాట్యం చేస్తుంది
తొలకరినీటి జల్లులతో
నేలనంతా ఊరినంతా
ఆవరించుకుంటుంది
ఇది కదా కవిత్వం అంటే పొంగిపోతుంది
మొన్నటికీ మొన్న దేవుళ్ళని బుట్టలో పెట్టుకుని వచ్చింది
అక్కడ దేవతని
ఇక్కడి ప్రభువు కొలువులో పెట్టింది
ప్రభువుముందు ఆరాధ్యదేవుడిని రైలుబండి చేసింది
రాళ్ళురువ్విన నెత్తుటి చొక్కా తోడుకుంది
గాయం మానకముందే
కనిపించింది
పక్కికి తప్పుకుంటే
మంకెన పువ్వులా ఎర్రబడింది
అలక తీర్చి దగ్గరకి తీసుకుంటే
వొడిలో వాలీ తురాయి పువ్వులా నవ్వింది
ఇవాళ మిన్నగులా బుసకొట్టింది
మీ నోళ్ళలో నానే బూతు మాట మా దేహలకి అంటవు అంది
బతుకు కధని చెప్పి శత్రువైయింది
దుఃఖం ,విసుగు ,అసహాయతల మధ్య నలిగిపోయింది
నాలుగు అక్షరాలవి నువ్వు
ఇరవై పదాలని నువ్వు
నీకు ఇంత పొగరా నొక్కిపెట్టిన వేళ్ళని తప్పించుకుని
యాత్ర మొదలు పెట్టీ
కవిత్వం బండికి బొగ్గుల సంచి అందించింది
ఆరని నిప్పు
కవిత్వాన్ని మందిస్తోంది ...
Friday, 7 August 2020
అతను ఇచ్చిన మరణం
మరణం ముఖాన్ని సమాజం
వైపుకి తిప్పేసీ వెళ్ళపోయింది
ధనిష్ఠా పంచకాలు వారాలు నెలలు మధ్య ముఖం
ఎరుపు నలుపు స్టిక్కర్లతో ఘర్షణ పడుతూనే ఉంది
మరణం ముఖాన్ని అద్దంలో పడేసింది
మునుపటి వెలుగు వెతుకులాటలో
ఆనవాళ్ళని పోగోట్టుకుంది
గుర్తింపులేని ముఖం చేతుల్ని కప్పుకుంది
చేతులు మధ్యలో నమ్మకాలు
అగ్నిలో కాలిన వేళ్ళని ఊదుకుంటూ
నిత్యం పనితో బతకడం నేర్చుకుంది
బతుకుని లాగేసుకున్న మరణం
వండి వడ్డించడానికి పిల్లల్ని పెంచడానికి వదిలేసింది
శకునాలకి పనికిరాని దేహం దృఢంగా వుంచుకోవాలిట !
ఆల్బం తిరగేస్తే మరణం నవ్వుతోంది
గతాన్ని తుడిచేసీ మరణాన్ని మర్చిపోయే సమయం
ముఖం తోందరగా తయ్యారు అయ్యింది
కాలు బయట పెట్టడానికి .
క్యాలెండర్ అరవైవ పుట్టిన రోజు చూపించింది...
.....
Monday, 3 August 2020
telugu poem : Renuka Ayola kannada translation : S D Kumar
Monday, 27 July 2020
క్రేన్ పక్షి
గాలిలో తేలుతూ
ఎప్పుడైనా ఒంటరిగా నర్తించావా
పాదాలతో మట్టిని తాకుతూ
లోపలి గానానికి బీజాలు వేస్తూ
ఆకాశం వైపు చేతులు చాస్తూ
పాటని ప్రకృతికి వొప్ప చెప్పీ చూసావా
ఆకుపచ్చని పాట నునులేత చిగురుతో
కాంతితో జంట సర్పల్లా పెనవేసుకుంటుంది
శ్వాస జీవితం నిద్ర ఉలికిపడతాయి
సన్నిని సవ్వడితో మొదలైన గానం
గుమ్మడి తీగలా అల్లుకున్న పచ్చనిపూలు
తాటాకు కప్పుమీద నగ్నంగా నిల్చునట్టుగా
మట్టిని నీరుని ఆకాశాన్ని తడుముతుంది
ఆకాశంలో గానం నాట్యం కలుస్తున్నప్పుడే
గాలితో, కొండలతో ఇసుకతో పరిచయం
పరిచయం ఒక పిలుపు కోరిక ఒక వాగ్దానం
నిశ్శబ్ద తాకిడికిలో పాదం వెనక పాదం
పాటని నింపుకున్న వేణువతుంది....
Friday, 24 July 2020
అస్పస్ట కల
కలల పిట్టలు
రెప్పల తీగ మీద వరుసగా కూర్చుని
రెక్కలు సరిచేసుకుంటూ
ఊహల్ని పోగుచేసి కూత పెడితే
కూతల సందడిలో లోయలోకి జారిపోతూ పట్టు తప్పి
కొత్త రహదారులు వెంట నడుస్తూ తప్పిపోతూ
ఎవరిదో చేయి!అందుకుని
నవ్వుకుని ,దుఃఖపడిన ముఖం మీదనీటి చినుకులు...
మసక వెన్నెలలో ఊయల ఊగీఊగీ
తెగిన గొలుసు శబ్దానికి మెలకువ తలుపు తెరుచుకోగానే రెప్పలతీగనుంచి జారిపడ్డ పిట్టలు ఎగిరిపోయాయి.......
Sunday, 19 July 2020
టీ కప్ # డైరీ_
టీ కప్ # డైరీ__
ఉదయం 6 గంటలు
రాత్రి ఆరోగ్య సూత్రం మందలించింది
నలుపు తెలుపు సున్నాలున్న మగ్లో
గ్రీన్ టీ యోగా క్లాస్ గుర్తుచేసింది.
ఉదయం 11 గంటలు
నిన్నటి కలతతో రుచిగా లేదు
రంగు వాసన అలాగే ఉంది
తెల్లటి కప్పులో వేడి పొగలతో
మసాలా టీ
నిర్లిప్తంగా ఉంది..
మధ్యాహ్నం 3 గంటలు
వాన తుంపర్లలో తడుస్తూ
హృదయాన్ని తాకిన వాట్సాప్ మేసేజ్ అనందంలో
అల్లం వాసనతో చిక్కటి టీ
పింగాణీ కప్పులో ఉత్కాహంగా వేడిగా
గొంతులోకి దిగింది...
సాయంకాలం 6 గంటలు
స్నేహితుడి చేతిలో
గూలాబి పూసిన తెల్లటి కప్పు సాసర్లో
ఇలాయిచి టీ
రుచి ఎలా ఉంది ?
నీ అంత అందంగా సమాధానంలో
గులాబీల గుల్దాస్తా అందుకుంది
రాత్రి 12 గంటలు .
నిద్ర రాని కళ్ళ మీద
రెప్పల విసనకర్రలకి వినిపించని గడియారం
మూసిన తలుపు వెనుక
గడ్డకట్టిన సంతోష సమయం
అల్లం మిరియాల పుదినా టీ
ఆలోచనలో గోంతు దాటి ఎప్పుడు వెళ్ళిందో
నీలం రంగు మగ్ ని చేతులు
టీపాయి మీద ఎప్పుడు పెట్టాయో!
పాల పేకెట్ వాడి బెల్ చిలకలా పలికింది ....
Thursday, 2 July 2020
telugu poem : Renuka Ayola kannada translation : S D Kumar ತೆಲುಗು : ರೇಣುಕಾ ಅಯೋಲಾ ಕನ್ನಡಕ್ಕೆ : ಎಸ್ ಡಿ ಕುಮಾರ್
Friday, 26 June 2020
Telugu Poets Demand VV's Release - 10
As the tenth installment in the series of Telugu poems against VV's incarceration and demanding his release, today I present a translation of 'This captivity is short-lived' by senior poet Ms Renuka Ayola.
This captivity is short-lived
Renuka Ayola
They cannot look straight into my dawn
Build walls to spread darkness
They have no brightness in their eyes
Depend on the path that slits throats
They carry the destiny of lies
Do not dare face my defiance
A light has to be lit
In these dark nights
It is not easy for them
To hack my courage
As they are in search of executioners
To behead liberty
With swords of betrayal
I persist in my country as an exile
This belligerence is a short-lived guest
Anonymous harassment and
Unknown paws cannot harm me
I continue to hear
Verses and voices of my poet friends
From the thick smog that covers
My freedom and beauty today
This incarceration lasts only a few days.
(Translated by N Venugopal)