మరణం ముఖాన్ని సమాజం
వైపుకి తిప్పేసీ వెళ్ళపోయింది
ధనిష్ఠా పంచకాలు వారాలు నెలలు మధ్య ముఖం
ఎరుపు నలుపు స్టిక్కర్లతో ఘర్షణ పడుతూనే ఉంది
మరణం ముఖాన్ని అద్దంలో పడేసింది
మునుపటి వెలుగు వెతుకులాటలో
ఆనవాళ్ళని పోగోట్టుకుంది
గుర్తింపులేని ముఖం చేతుల్ని కప్పుకుంది
చేతులు మధ్యలో నమ్మకాలు
అగ్నిలో కాలిన వేళ్ళని ఊదుకుంటూ
నిత్యం పనితో బతకడం నేర్చుకుంది
బతుకుని లాగేసుకున్న మరణం
వండి వడ్డించడానికి పిల్లల్ని పెంచడానికి వదిలేసింది
శకునాలకి పనికిరాని దేహం దృఢంగా వుంచుకోవాలిట !
ఆల్బం తిరగేస్తే మరణం నవ్వుతోంది
గతాన్ని తుడిచేసీ మరణాన్ని మర్చిపోయే సమయం
ముఖం తోందరగా తయ్యారు అయ్యింది
కాలు బయట పెట్టడానికి .
క్యాలెండర్ అరవైవ పుట్టిన రోజు చూపించింది...
.....
No comments:
Post a Comment