మన మీద మనకే జాలి వేస్తుంది
మన గోడలు మనల్నేచూసి నవ్వినట్లు అనిపిస్తుంది
సిమెంటు పంజరాల్లొ మనం
అనుక్షణం మనల్ని కాపాడడానికే కంకణం కట్టుకున్న టి.వి
కళ్ళు తేరిస్తే చాలు "గుడ్ మార్నింగ్"అంటూ
కాఫీబ్రేక్ తో పలకరిస్తుంది.
ఆ రోజు జాతాకాలు
జాతచక్రాల్లో మన భవిష్యత్తు భయభయంగా
ఆత్మహత్యలు రోడ్డు ప్రమాదాలు
నెత్తుటి మరకలు లతో ముగించిన వార్తలు
మనసు వికలమై చలించి ఆలోచనలో ములిగి పోతే
ఆరోగ్య సలహాలు-
ఆయుర్వేదం ,నేచురోపతి ,హోమ్యోపతి
ఎంతమంది పతులు మన కోసం?
నడవాలంటారు ,నడవొద్దంటారు
సైకులు తొక్కండంటారు ,సైకిలెందుకు
మందుకు మాకు చాలంటారు
ఒంట్లొ జబ్బులన్నీ నయమంటారు
ఆకులు తినమంటారు నవ్వమంటారు
గడ్డిలో నడవమంటారు ,ఊపిరిబిగపట్టి శ్వాసని వదలమంటారు
మనకున్నరోగమేంటో మనకే తెలియని స్ఠితిలో చిన్నకునుకు-
వంటలు రడీగావుంటాయి
నిమిషాల్లో అందానికి మెరుగులు
క్షణాల్లో షాపింగులు
సమస్యలు సలహాలు.
మన కోసం ఇంతమంది శ్రమిస్తున్నారా?
అనందమో,సందేహమో
మెదడుని మోద్దుబారుస్తుంది
విన్నదే వినీ ,వినీ వినీ
పక్షవాతం వచ్చినవాళ్ళలా
సోఫాలకి అతుక్కుపోయాక-
ఆ కరంటు వాడికే మనమీద దయకలుగుతుంది
ఆగిపోయిన టి.వి ముందునుంచి లేచిన మనం
చెరనుంచి విడిపించుకున్న ఖైదీలం.....
ఆగిపోయిన టి.వి ముందునుంచి లేచిన మనం
ReplyDeleteచెరనుంచి విడిపించుకున్న ఖైదీలం.....
బాగుంది, రేణుక గారూ
అవును వొక్క టీవీ చాలు వెయ్యి ఖైదుల పెట్టు!
మీ కవిత,అఫ్సర్ గారి కామెంటు రెండు బావున్నాయి
ReplyDeleteమా ఇంట్లో టాటా స్కై ఉంది. గత మూడు నెలల నుంచి దానిని రీచార్జ్ చేయించలేదు. ప్రస్తుతం టి వి కి టాటా చేప్పేసినట్లే. త్వరలో నెట్ కనేక్షన్ కూడా తీసేయాలి అనుకొంట్టున్నాను. 1970 వ దశాబ్దం లోకి వేళ్లిపోవాలను కొంట్టున్నాను.
ReplyDelete