THE DAY I BURN'' ఆరోజు పదే పదే వెంటాడుతోంది
కట్టుకున్న వాడే ముఖం మీద "యాసిడ్"జల్లాడని తెలిసి
మళ్ళీ మరో కధ మొదలయిందని నిట్టూర్పుల వెనక
నేను నిల్చున్నాను ఒంటరిగా
చుట్టూ అందరు వున్నా
ఎవరులేనితనం అనుభవిస్తూ
.
అనుభవించిన నరకం,అర్తనాదం,అన్నీ
శరీరంలోకి ఇంకిపోయాక,
దగ్ధమైన ముఖంతో లోకంముందు నిల్చున్నప్పుడు
శూన్యంలోకి అడుగు వేస్తున్నట్లు అనిపించింది
తినడానికి అవకాశం ఇవ్వని నోరు
పగలు, రాత్రీ , మూతపడని కనురెప్పలు
విస్తరాకు కుట్టినట్లు కుట్లతో ముఖం.
ఆత్మవిశ్వాసం అదృశ్యమవ్వటం మొదలయ్యింది
అభద్రతా భావం సుడిగాలిలా చుట్టుకుంది
కన్నీటి బొట్టు అతుకుల బొంతలోకి జారుకుంది.
ఎక్కడో ఒక ఆశ ” ప్లాస్టిక్ సర్జరీతో” సినిమాల్లొ లాగ
ఒక కొత్త ముఖంకోసం-
అశలో కొత్తసూత్రం తెలిసింది-జీవితం సినిమాకాదని
మనసు ఏడారి సముద్రం అవగానే
దుఖం ఒక్కటే బుజానికి ఆసరాగానిలిచింది
వాడిని క్షమించాలని అనుకున్నాను
క్షమించగానే స్వేచ్చాగాలి మేల్లగా వీచ సాగింది
గుండేలో ్పేరుకుపోయిన అనాటి దృశ్యాలు
క్షామాగుణంలోకి ప్రవేశించి వణీకించాయి
నిద్రపట్టని రాత్రుళ్ళు కోపంతో రగిలిపోయాయి
అనాకారి తనంలోంచి బయటికి తోంగిచూస్తే
వెలివేసిన ప్రంపంచం సిధ్దంగా ఉంది
కాలేజిలో చేరుతానంటే అముఖంతోనా?-
ఏన్నో యుధ్దాలకి మోదటి ప్రశ్న అది
ప్రశ్నలా మిగిలిపోయిన నేను
సమాధానం కోసం అన్వేషించాను
ఒంటరిగా మట్టిపెళ్ళలా కూలిపోతానా
మనుషులమధ్య కొట్టుకు పోతానో తెలియదు
జీవితం సముద్రంలా ఇల్లంతా ఒళ్ళంతా
కనుచూపుమేర విస్తరించివుంది.
అక్కడ మోదలైన సంఘర్షణ జీవనదిలా సాగిపోయింది
అప్పుడే నావెంట నాలాంటి వాళ్ళస్వరాలు
వినిపించాయి
నాబుజం అసరా చేసుకో వాలని నాచేయి పట్టుకున్నాయి
ఏదో శక్తి నన్నావరించింది
పూలతీగల అల్లిక నాచుట్టూ అల్లుకుంది
ప్రాయాణం మోదలైంది -
మనుషులందరూ ఎతైన పర్వతాలుగా మారిపోయారు
శిఖరాగ్రానికి చేరుకోవాలంటే తాళ్ళతో ఇనుప కోక్కేలతో సిధ్దమవ్వాలి
మనిషి వెంట మనిషి దుఃఖాన్ని తాడులాపేనుకుని
రాతి మనుషుల గుండెలలో తడికోసం ఎక్కుతూనే ఉన్నాము
స్వశక్తిలొ ఆనందం
ఎవరికీ చెందని లోకంలో బ్రతుకు పొరాటం
పాత అందమైన ఫొటోలు చూసుకుంటే
చనిపోవాలన్న బలీయమైన కోరిక
గతం గాయమై కారు మబ్బులా కమ్ముకుంది
అక్కడనూంచే ఒక నీటీ చెమ్మ గాయాన్ని తడిపి ఊరటనిచ్చింది..
ఇంత జరిగాక లోకం ప్రశ్నించింది ఏం మిగిలిందని?
మఖంమీద గాయాలని ప్రేమించడమే- నేర్చుకున్న విజయం
ఇంత కన్నా ఏం కావాలి?
[ may 1998 లొ"సిరీన్ జువాలే" మీద యాసిడ్ దాడి జరిగింది. augst femina లొ చదవగానే మనసు చలించింది అది అక్షరూపం దాల్చడానికి ఇంతసమయం కావలసి వచ్చింది అయినా ఇంకా ఎక్కడో ఆమే దుఖాన్ని అందుకోలేక పోయాననిపిస్తోంది]
No comments:
Post a Comment