కాటుక లాంటి అడవి
నన్నేవరూ చూడ రనుకుంది
కారు మబ్బులు కమ్ముకొని
గాలి అందించిన చినుకు వరదలో
అడవి సేద తీరుతోంది
వెలుగులు చిమ్మీ
నిప్పులు కురిసి
నేలకు జారిన శకలాలు
ఒణికించిన ఒంటరితనం
అడవిని కదలించిన మరణం
అడవిని కుదిపేసిన దుఃఖం
అడవే విస్మయ పడిన ఒక్కక్షణం
ఉలిక్కి పడిన జనం
అడవిని ముంచెత్తిన అశ్రు కణాలు
వెల్లువై కొమ్మని గుట్ట గుట్టనీ గాలించాయి
ప్రియతముని జాడకోసం పరితపించాయి
నిద్రాహారాలు మాని రోదించాయి
అడవిని కమ్ముకున్న జనం
గుండెల్లో దాచుకున్న నాయకుడి కోసం
వరదైన జనం
దుఃఖపు తడిలో అడవి కాలిపోవడం ఇదే!!
అడవి బిడ్దల కోసం హస్త మందించిన సూర్యుడు
అడవిలో అస్తమిస్తే-
ఆ అడవికి ఎప్పటికీ నిద్ర పట్టని జ్ఞాపకం
.
మరణం మిగల్చిన విషాదం
పచ్చి నిజం..
గతమై గాయంలా సలుపుతోంది
శిలగా మారిన కాలాన్ని కదపాలి
విధి చేసిన విషాదాన్ని దిగమింగాలి
హస్తానికి హస్తం కలుపుతూ పోతూ
మళ్లీ మనమందరం నవతరానికి
హస్తమందివ్వాలి!
[రాజ శేఖర కవితాస్మృతి ద్రావిడ విశ్వ విద్యాలయం వారు ముద్రిం చిన కవితా సంకలనంలోని కవిత ఇది ]
o
No comments:
Post a Comment