సరదాగా వేసుకున్న ఈ ప్రేమమొక్క
నన్ను తీగలా అల్లుకుని చుట్టుకుని వేగంగా
అతివేగంగా చిగురులువేసి మొగ్గలు తొడిగి
ప్రేమపూలు పూస్తోంది
ఎప్పటికప్పుడు అల్లుకున్నతీగల్నితొలగిద్దామని
కత్తెరతో సిద్ధమవుతాను
అందంగా ముచ్చటగా పూసినపూలు
హుషారుగా పలుకరిస్తాయి
వాటిని చూడగానే కత్తెర జారిపోతుంది
ఆ మత్తులో నేను కూడా మునిగిపోతాను
కత్తిరిద్దామనుకున్న తీగలకి దారాలుకట్టి
దారిచూపించి వెనుదిరుగుతాను
ఇలా అయితే ఎలా ? అనుకుంటాను...
ఈ బంధాలకి అర్ధాలు ఏమిటి-ఆలోచిస్తాను
జవాబులురాని ప్రశ్నలతో
వేచి చూస్తుంటాను.