Friday 29 August 2014

మంజ-పై (పసుపు పచ్చని సంచి )సినిమా పేరు /

మా చెల్లెలు చెప్పిన తమిళ సినిమా కధ చాలా నచ్చింది క్లుప్తంగా కధ సారంశం 
మంజ-పై (పసుపు పచ్చని సంచి )సినిమా పేరు / 
ఒక పల్లెటూరిలో ముసలి తాత తనకొడుకు కోడలు ప్రమాదంలో చనిపోతే మనవడిని పెంచి 
బాగా చదివి స్తాడు ,ఆమనవడు సాప్ట్ వేర్ ఇంజనీయర్ గా పట్నంలో మంచి పొజిషన్ లో స్థిర పడతాడు
మనవడి కోరిక ప్రకారం పట్నానికి వెళ్తాడు ,అక్కడ అతని అమాయకత్వం, పల్లే టూరితనం నగర నారికతలో ఇమడలేక పోవడం ,తాత మీద ఎంత అభిమానం కాని అనాగరికచేస్టలు,అమాయకత్వం తలనొప్పిగా మారిపోతుంది ,తనదగ్గరకి రోజు జీళ్ల కోసం వచ్చే చిన్నపాపకి విషం ఇచ్చి చంపాడు అన్న అపవాదు ,ఆ అపార్ట మెంటులో అతని వల్ల మనవడికి గలిగిన ఇబ్బందులు ఇలా కధ
చివరికి అతను పిచ్చివాడుగా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళేలా చేస్తుంది ...
పేరు వున్నా తారలు ఎవరు అందులో లేరుట కాని కధ అమాయకత్వానికి నమ్మకానికి
అనుబంధాలకి మధ్య నలిగిపోయే ముసలి తాత ,పెంచి పెద్ద చేసిన తాతని సరిగ్గా చూడలేక పోయిన
మనవడి ఘర్షణ కనిపిస్తుంది అన్నిటికన్నా రోజు తన దగ్గరికి వచ్చె పసిపాప ఆరోజు ఆ తాత
జీళ్ళుఇవ్వకపోతే జీడి అనుకుని rat bite తినడం అతను చింత పండు పులుసు విరుగుడుగా
పట్టడం కాని ఆపాప బతికిందని తెలిసే లోగా పాపని అతనే చంపేసాడేమో అన్న బెంగతో తాత
పిచ్చివాడు అయిపోవడం తో కధ ముగిసిన పాత్ర లో ఇమిడిపోయిన కధ చూసిన చలా రోజుల
దాక మరచిపోవలేక పోవడమే మంచి సినిమాకి అర్హత /భా ష ఏదైనా కదిలించే కధ ...

Friday 1 August 2014

పంకజ్ ఉదాస్ ఈ గజల్ నా భావాలతో మీకోసం Mohe Aayi Naa Jag Se Laj Lyrics from Anokha (Album)

తన్మయత్వం లోకి జారిపోవలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి ,
 కాశమంతా పరుచుకున్న వెన్నెలలో పచ్చటి మైదానంలో తలకింద రెండు చేతులు తలగడలా పెట్టుకుని
 ఆకాశంలోకి చూడగలిగితే  గుండేలోంచి ఓ పాట శరీరానంతా తన వశం చేసుకుని  గొంతెత్తి పాడేలా  చేస్తుంది ఆ పరవశంలో నాట్యం చేయాలనిపిస్తుంది   .
ఎందుకో  ఈ గజల్  విన్న ప్రతిసారి మనసు  ఆకాశమై పోతుంది


 (Mohe aayi naa jag se laj
 Mai itna jor se nachi aaj, kee ghungru tut gaye) - (2)
 Kee ghungru tut gaye - (3)

 Kuch mujhpe naya joban bhi tha, kuch pyar kaa pagalpan bhi tha
 Ek palak meri tir bani, ek julf meri zanjir bani
 Liya dil sajan kaa jit -2, woh chede paayaliya ne git
 Kee ghungru tut gaye - (4)

 Mai basi thi jiske sapno me
 Woh ginega aub mujhe apno me
 Kehti hai meri har ungdayi
 Mai piya kee need chura layi
 Mai ban ke gayi thi chor
 Mai ban ke gayi thi chor
 Kee meri paayal thi kamzor
 Kee ghungru tut gaye - (4)

 Dharti pe naa mere pair lage, bin piya mujhe sub gair lage
 Mujhe ang mile armano ke, mujhe pankh mile parvano ke
 Jub mila piya kaa gau -2, toh aisa latchka mera pau
 Kee ghungru tut gaye - (4)
 Mohe aayi naa jug se laj, mai itna jor se nachi aaj
 Kee ghungru tut gaye - (5)

  ఈవాళ ఈ ప్రపంచం ముందు సిగ్గు మొహమాటం వదిలేసి
 ఎంతగా నర్తించానంటే నాపాదంలో వున్నగజ్జలలో మువ్వ తెగి పడేదాక

  ఇప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టినట్లు ప్రేమ పిచ్చిలో పడిపోయినట్లు
  కనురెప్పలలో భావాలు చురుకైన భాణాలు అయ్యాయి
  ముఖం మీద వాలుతున్న కురులు సంకెళ్ళు అయ్యాయి
  మనసునిండా వున్న ప్రియుని ప్రేమ జయించింది
  ఆ భావం  మళ్లి రేకెత్తింది మువ్వ తెగేదాక నాట్యం సాగింది

   నేను ఎవరి హృదయంలో  స్వపంలో  వున్ననో
   ఆ హృదయం నన్ను ఇప్పుడు తన దాన్నే అనుకుంటుంది
   నా అణువు  అణువు  చెప్తోంది నా ప్రియుని  స్వప్నంలో నేనే వున్నానని
   రహస్యంగా అతని కోసం వెళ్ళాలనుకుంటాను
   మువ్వల సవ్వడితో దొరికి పోయాను

  ఈ పాదం నేలమీద ఆనటంలేదు ఆతను లేని చోటు కొత్తగా వుంది
  అతని జాడలు కనిపించగానే కొత్త ఊహలు కొత్తరేక్కలు వికసించాయి
  మళ్ళి కొత్తగా  ఈ పాదం నర్తించడం  మొదలు పెట్టింది
  పాదంలో వున్నగజ్జలలో మువ్వ తెగి పడేదాక.....