Showing posts with label చిన్నిపడవలో దీపం. Show all posts
Showing posts with label చిన్నిపడవలో దీపం. Show all posts

Friday, 16 September 2011

వాలుకుర్చీ

    













    


    

     నిద్ర నటిస్తూ
    నిద్ర పోతున్న నిద్రలో
    కనుల నుండి రాలిన అగ్ని కణం
    దిండులో  ఇంకి పోయింది


గతాలు నెమరు వేసుకుంటున్న 
    కలత  నిద్రలో 
    గతాలు ఎండు గడ్డిలా
    రుచిలేని పదార్దంలా
    చప్పగా వున్నాయి.

    చేసినవన్నీ తప్పులే అన్నట్లు
    బతుకు చిత్రాలన్నీ 
    దొంతరలు పడ్డాయి  
    కాలం వాలు కుర్చీకి  నెట్టేసింది

    ముడతలు పడ్డ చేయ్యి చూపు తగ్గిన కళ్ళు 
    పట్టుకోసం వెతికాయి
    మెత్తటి కన్నవారి చేతులు కాక
    చేతికర్ర పలుకరించింది.

    వార్ధక్యం వరమాల వేస్తే 
    పెళ్లి కొడుకులా బోసి నవ్వులు నవ్వాను
    చూపు ఆనక చేయి అడ్డం పెట్టి
    గోడ వైపు చూస్తే  అర్ధాంగి ఫోటో కనిపించింది 

   వయస్సు కాలం గుమ్మంలోంచి వెనక్కి నెట్టేస్తే 
   మృత్యువు ముందరి కాళ్ళకి భంధం వేసి
   వాలు కుర్చీలో కుదేసింది 
    పనిలేని శరీరం విశ్ర మిస్తోంది 
    విరామంలో కూడా నిద్ర రాదు 
    నిద్ర నటిస్తూ నిద్ర పోతున్నాను.


i