నిద్ర నటిస్తూ
నిద్ర పోతున్న నిద్రలో
కనుల నుండి రాలిన అగ్ని కణం
దిండులో ఇంకి పోయింది
గతాలు నెమరు వేసుకుంటున్న
కలత నిద్రలో
గతాలు ఎండు గడ్డిలా
రుచిలేని పదార్దంలా
చప్పగా వున్నాయి.
చేసినవన్నీ తప్పులే అన్నట్లు
బతుకు చిత్రాలన్నీ
దొంతరలు పడ్డాయి
కాలం వాలు కుర్చీకి నెట్టేసింది
ముడతలు పడ్డ చేయ్యి చూపు తగ్గిన కళ్ళు
పట్టుకోసం వెతికాయి
మెత్తటి కన్నవారి చేతులు కాక
చేతికర్ర పలుకరించింది.
వార్ధక్యం వరమాల వేస్తే
పెళ్లి కొడుకులా బోసి నవ్వులు నవ్వాను
చూపు ఆనక చేయి అడ్డం పెట్టి
గోడ వైపు చూస్తే అర్ధాంగి ఫోటో కనిపించింది
వయస్సు కాలం గుమ్మంలోంచి వెనక్కి నెట్టేస్తే
మృత్యువు ముందరి కాళ్ళకి భంధం వేసి
i
వాలు కుర్చీలో కుదేసింది
పనిలేని శరీరం విశ్ర మిస్తోంది
విరామంలో కూడా నిద్ర రాదు
నిద్ర నటిస్తూ నిద్ర పోతున్నాను.
No comments:
Post a Comment