Thursday, 22 September 2011

నాతో మాట్లాడని నా కవిత్వం

         
                       

                  నా కవిత్వం -
           అమాయకపుది, పల్లెటూరిది
           కొత్తదనం , డాబు,దర్పం తెలియనిది             

            
        అధునికత అంటగడదామని-
        ముతక పంచ  ముల్లు కర్రపడేయేంచి
        క్రాఫుదువ్వి  ప్యాంటు చొక్కా తొడిగాను
           
         
          అయినా పెదవి విరిచారు
          కొత్తదనం  లేదని -
         కవితే కాదని వాదించారు

           అప్పుడే-
        
         ఆస్పష్ట  అనుభూతి  కలిగిస్తూ
         పాత మాటల్నికొత్తగా చెబుదామని
         నా గుండె గుడికి దారం కట్టి
         నీ కనుల గేటుకి వేలాడదిశానన్నాను,
         ప్రేమకోసం  నీ పెదవులు  కత్తిరించి
         నా వీపుకి అతికించు కొన్నాను  అన్నాను
     
        నీ కోసం నా  శరీరం ఫ్లాస్కులో పోసిన  వేడి నీళ్ళలా
        కుత కుత మంటోంది  అన్నాను.


        ఇలా ఇన్ని మార్పులు జరిగాక
       
         నా కవిత్వం ఆధునిక మైయింది
         పొగడ్తల సముద్రంలో  ఈదులాడతూ
         నాతో మాట్లాడం మానేసింది


       
    { తొలి హాస్య  కవితా సంకలనం. ౨౦౮  ఫిప్ర వరి లోనిది }


       



       
      




            

1 comment:

  1. నా కవిత్వం ఆధునిక మైయింది
    పొగడ్తల సముద్రంలో ఈదులాడతూ
    నాతో మాట్లాడం మానేసింది
    చాల బాగా చెప్పారు.

    ReplyDelete