దూరం దూరం
అందరి మధ్య దూరం
అంతరాల మధ్య దూరం
పెద్ద చిన్నల మధ్య దూరం
పేద గొప్పల మధ్య దూరం
దూరాలు లేవంటూ
దూరాన్ని ఇంకా దూరం చేస్తూ
దూరమే లేదంటూ
దగ్గర తనంలో కూడా
దూరాన్నిపెంచుతూ
సంసారాన్ని ఈదుతూ
దూరభారాలన్నీ దేవుడి మీద వేసి
దూరం నుంచి ఓ దండం పడేసి
నీకు నాకు మధ్య దూరమేమిటంటూ
దూరంగా జరిగే మనుష్యులకి
దేవుళ్ళకి మధ్య ఉన్నది-
అంతు చిక్కని ఆ దూరం ఒక్కటే
అందు వలనే దేవుడు
అందరికి దూరంగా ఉంటున్నాడు
No comments:
Post a Comment