Monday, 10 August 2020

యాత్ర ______-

 యాత్ర ______-


 

కవిత్వం చలికో వేడికో బాధ పడదు

స్పష్టత లేక  దుఃఖపడుతుందంతే

తరచుగా  తగిలిలే రాళ్ళతో  గాయపడుతూ

అపుడప్పుడు 

రంగు రంగు ఈకలున్న పక్షిలా 

తారసపడుతుంది  


మట్టి కాళ్ళతో నాట్యం చేస్తుంది 

తొలకరినీటి జల్లులతో 

నేలనంతా ఊరినంతా  

ఆవరించుకుంటుంది 

ఇది కదా కవిత్వం  అంటే పొంగిపోతుంది


మొన్నటికీ మొన్న  దేవుళ్ళని బుట్టలో పెట్టుకుని  వచ్చింది   

అక్కడ దేవతని  

ఇక్కడి ప్రభువు కొలువులో  పెట్టింది    

ప్రభువుముందు  ఆరాధ్యదేవుడిని  రైలుబండి చేసింది 

రాళ్ళురువ్విన నెత్తుటి  చొక్కా తోడుకుంది

గాయం మానకముందే  

కనిపించింది

పక్కికి తప్పుకుంటే 

మంకెన పువ్వులా ఎర్రబడింది

అలక తీర్చి దగ్గరకి  తీసుకుంటే

వొడిలో వాలీ తురాయి పువ్వులా నవ్వింది 


ఇవాళ మిన్నగులా బుసకొట్టింది

మీ నోళ్ళలో నానే బూతు మాట మా దేహలకి అంటవు అంది

బతుకు కధని చెప్పి శత్రువైయింది

దుఃఖం ,విసుగు ,అసహాయతల మధ్య నలిగిపోయింది

నాలుగు అక్షరాలవి నువ్వు 

ఇరవై పదాలని నువ్వు 

నీకు ఇంత పొగరా  నొక్కిపెట్టిన వేళ్ళని తప్పించుకుని

యాత్ర మొదలు పెట్టీ 

కవిత్వం బండికి  బొగ్గుల సంచి అందించింది

 ఆరని నిప్పు

 కవిత్వాన్ని మందిస్తోంది ... 


No comments:

Post a Comment