టీ కప్ # డైరీ__
ఉదయం 6 గంటలు
రాత్రి ఆరోగ్య సూత్రం మందలించింది
నలుపు తెలుపు సున్నాలున్న మగ్లో
గ్రీన్ టీ యోగా క్లాస్ గుర్తుచేసింది.
ఉదయం 11 గంటలు
నిన్నటి కలతతో రుచిగా లేదు
రంగు వాసన అలాగే ఉంది
తెల్లటి కప్పులో వేడి పొగలతో
మసాలా టీ
నిర్లిప్తంగా ఉంది..
మధ్యాహ్నం 3 గంటలు
వాన తుంపర్లలో తడుస్తూ
హృదయాన్ని తాకిన వాట్సాప్ మేసేజ్ అనందంలో
అల్లం వాసనతో చిక్కటి టీ
పింగాణీ కప్పులో ఉత్కాహంగా వేడిగా
గొంతులోకి దిగింది...
సాయంకాలం 6 గంటలు
స్నేహితుడి చేతిలో
గూలాబి పూసిన తెల్లటి కప్పు సాసర్లో
ఇలాయిచి టీ
రుచి ఎలా ఉంది ?
నీ అంత అందంగా సమాధానంలో
గులాబీల గుల్దాస్తా అందుకుంది
రాత్రి 12 గంటలు .
నిద్ర రాని కళ్ళ మీద
రెప్పల విసనకర్రలకి వినిపించని గడియారం
మూసిన తలుపు వెనుక
గడ్డకట్టిన సంతోష సమయం
అల్లం మిరియాల పుదినా టీ
ఆలోచనలో గోంతు దాటి ఎప్పుడు వెళ్ళిందో
నీలం రంగు మగ్ ని చేతులు
టీపాయి మీద ఎప్పుడు పెట్టాయో!
పాల పేకెట్ వాడి బెల్ చిలకలా పలికింది ....
No comments:
Post a Comment