Monday, 11 November 2013

Photo
స్మాయిల్ పురస్కార గ్రహీత Renuka Ayola గారికి అభినందనలతో,
"లోపలి స్వరం" కినిగె.కాం ద్వారా పొందవచ్చని తెలియజేసుకుంటూ.. Kinige అలాగే మరో పురస్కార గ్రహీత రెంటాల వెంకటేశ్వరరావు గారి "లొపలికి" కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

'లోపలి స్వరం...See More
 — feeling excited with Vadrevu Ch Veerabhadruduand 3 others.
Photo

Wednesday, 23 October 2013

డాబాకధలు -2



మేడ మీద పుచ్చపువ్వులాంటి వెన్నెల వేసవి కాలం పోద్దంతా వేడి గాడ్పులు ఉక్కపోత భరించాక
నూలపఫ్పు అప్పడాలు కుంపటిలో కాల్చినవి,వేడి ఇంగువ చారు అన్నాలు తిన్నాక మేడ మీద పడుక్కోవడానికి బోంతలు పట్టుకుని బల్దేరాం అందరం

మామేనత్త కూతురు సరళ ఇంకా రాలేదు తిన్న కంచాలు ఎత్తిఎంగిళ్ళు పెట్టి రావద్దూ మరి ..

ఈలోగ మేమంతా కంబారి సిమ్మడు మేడమీదజల్లిన నీళ్ళకి ఆవిరవుతున్న నేలమీదే బోంతలు వేసేసుకుని నిన్న సరళ చెప్పిన బండి వాడి కధ గురించి కొద్దిగా భయంగా కొద్దిగా ధైర్యంగా మాట్లాడుకుంటుంటే వచ్చిందిమేడమీదకి    సరళ ఈ రోజు ఏంకధ చెప్తావూ అడిగాం అందరం

నిన్న ఎవరైనా భయపడ్డారా అడిగింది ఓణి సర్దుకుంటూ లేదు అని అందరం గట్టిగానే జవాబు చెప్పాము

నేను నమ్మను అంది జడముందుకి వేసుకుని  సన్నజాజుల దండని సవరించుకుంటూ

జాజిపూల పరిమళం మెత్తగా డాబా అంతా పరుచుకుంటోంది

ఈ రోజుకూడా నేను దయ్యం కధే చెప్తాను చెప్పనా వద్దా అడిగింది చెప్పు చెప్పూ అన్నాం అందరం ఓదగ్గరగా ఒకళ్ళని ఒకళ్ళు ఆనుకుని కూర్చుని
  మొదలు పెట్టింది ...

ఇంతలో కెవ్వుమని కేకపెట్టాడు భరత్ అదిగో ఆకొబ్బరి చెట్టు మీద చూడు ఏదో తెల్లాగా వుంది
అక్కా అది దెయ్యమేమో? అన్నాడు అందరం భయంతో ఆ చెట్టు వేపు చూసాము.కావొచ్చు అంది సరళ
దెయ్యాలకి కొబ్బరి చెట్లు అంటే ఇస్టంట అవి అక్కడనూంచి దూకి నూతిలో చేదవేసి నీళ్ళు తోడుకుని
నీళ్ళు తాగుతాయి అంది.

మరి చింతచెట్లు మీద వుంటాయిట కదా అన్నాడు భరత్ కోంచం ధైర్యం చేసి.అస్తమానం అక్కడే వుంటాయా ఇక్కడికి కూడా వస్తాయి అంది సరళ ..

నిజంగానే చెట్టు ఆకులమీద తెల్లని పల్చని పోగాలాంటిది ఊగింది అంతే
అందరం మామయ్యా ..కొబ్బరి చెట్టుమీద దెయ్యం అని అరుచుకుంటూ గబగబా మేడ మెట్లు దిగిపోయాము

     మా అరుపులకి ఇంట్లో వాళ్లంతా గభారా పడుతూ వచ్చారు ఏమయ్యింది అంటూ...
దెయ్యం గురించి చెప్పాము దెయ్యమా పాడా, అసలు వాళ్లకి దెయ్యాల కధలు చెప్పోదని ఎన్నిసార్లు చెప్పాలి అంటూమావయ్య సరళని కోపడ్డాడు

నేను ఏం చెప్పలేదు వాళ్ళే చెప్పమని బతిమాలితే చెప్పాను అంతే అంది వయ్యారంగా జడని ముందుకివేసుకుని

ఇంతలో కంబారి సిమ్మడువచ్చీ ఏదండీ దెయ్యం అన్నాడు

అదిగో అంటూ కోబ్బరి చెట్టు చూపించాము  వాడితో పాటూ మేము భయభయంగా అటే చూస్తూ .
అక్కడ ఏమి లేదు కొబ్బారాకులమీద విరగ కాస్తున్న వెన్నెల తప్పా..

చూసారా ఏమి లేదు పోయి పడుకోండీ అన్నాడు అయినా సరే ఆరాత్రీకి డాబామీద పడుక్కోం అని చేప్పేసి నట్టింట్లో ఫేనుకింద  పట్టేమంచాలమీద సర్దేసుకున్నాము..

   


Tuesday, 27 August 2013

THE WINDOW





Renuka Ayola



Translated by D. Ranga Rao                                                                                                                                   

I had invitation for my friends marriage in Kukatpalli. He rang me up asking me to be present. It was Sunday. No need to apply leave. The bike gave me trouble as I started it. I left it with the mechanic and took the bus. The bus was not crowded. I occupied the seat by the window. I boarded a city bus after a long break. The journey would take an hour and a half. I sat relaxed.
 The woman conductor asked for the fare as the bus moved. Women complain that the fair sex has been left behind that the men are crushing them down. But what is this! They are happily working as conductors. Not only this. The other day I saw a women driving a seven-seater. The women are enjoying equal rights with men. Are they not?
 The window. There is great importance to the window in life. Whether on the train or at home if we sit at the window comfortably, many thoughts flash across our mind. If it is at home, a cigarette can be puffed off before wife returns and throw it out of the window. 
The bus was moving forward along with a member of vehicles as if fighting its way. At the opposite bus stop a married woman was standing. She appeared very attractive at the first glance. It is so with some women. Even if they are in the company of many others. They are so attractive that they compel the looks of people towards them the colour of sari she work merged with her personality perfectly. 
My thoughts turned towards women’s freedom again. Radha Rani, who works in our office, feels that men are the very devils who always torture women no end. Whenever she gets a chance she acts as if she is the spokes women for suffer because of men and looks at us with satisfaction and relief that she had exposed all the atrocities and injustices of men over women. 
No one bothers about hen-pecked husbands. Men cannot reveal their difficulties to other men. Does man suffer from difficulties people ask. He himself is the very personification of difficulties. That is what the world think. It is very disgusting to think of it. One feels as though  life has been spent away in an insipid manner. I studied like an ideal student and secured a job, when young. I did not think of girls and married according to the wishes of my parents. I dreamed as if to prove the saying that Rama is good boy, before marriage. But my dreams got shattered. Life with Latha is intolerable now. 
The red light at the junction. The bus stopped with a sudden jerk. A couple were conversing happily on a motor-bike of late girls also are sitting on the pillow like boys, astride. The girl was also sitting astride. She was learning on him and talking. Are they married? Perhaps not. That is the reason why they have so much to talk. If married the wives sit away from the man with a brown on their faces. 
In the early days of our marriage, did I and Latha ride the bike like this? There was no bike then. I brought it later. Latha looked down with contempt on me that I did not possess even a bike during the early days of our marriage. She used to talk as though she stood for ideals and married me. When I went to her mother’s place. I called her to the terrace with the idea of talking to her to spend time in a pleasant gossip, sipping coffee. She brought coffee and looked at me askance, “Let us spend some time chit-chating”, I said. 
“By the by, how much do you draw as salary?” asked suddenly. 
“Why?” I asked her. 
“What do you mean by asking? ‘why?’ I want to know how much amount would be cut in the salary if we take a car loan. We have to adjust our budget. That is why” she replied. 
“Why should we worry about the car now?” 
“All my people have cars. We too should have one. If we do not possess a car I feel very little before them. My cousin bought a car a few days ago and she has been showing it off. What do we lack? You are an engineer. Let us buy a car. What do you say?” 
“Let us see, “I replied, not knowing what to say. 
She went down stairs saying she had much work to do after a drank coffee. Latha is fond of leading a luxurious life. She compares me with her people for every thing and treats me as an incompetent person. She jeers and mocks, derides and jokes. She is cross and neglects me. While things were in this order, a son was born. His name is Naveen. All of the sudden  she complaints that I have no love for her. She wonders whether I did anything for her at all. She throws a challenge at me saying that if I have love for her I should buy a car. Her relatives behave and feel as though Latha who has no car faces all problems, as if I am responsible for all her difficulties. 
The bus stopped at the Erragadda stage. A beautiful girl boarded the bus. She looked very pretty in the Punjabi dress she wore. I should have loved such a girl and married her. Her hair-do was also very attractive. She got off the bus at the next stop. I felt agonized as if the girl whom I loved left me without looking at me. A number of people got it. One of them was a stout woman. She had great difficulty in boarding the bus. I wondered why she did not make attempts to reduce her bulk. I remembered Latha again. 
By a slip of the tongue I said to Latha one day why she should not slim down a little. Latha is a little plump. That day was a day of punishment for me. “I know you have no love for me now. That is why you say I am stout thought I a m not stout. I have a child now. Any women would put on after a baby is born. No body stays slim like a girl after a child. Once I was thinking like a tendril. Perhaps I have put on a little…” she did not leave it at that. Keeping my suggestion in her mind, whenever an opportunity arises, she drawls to her friends. “I am not attractive enough for my husband as I am a little fat” goes to the extent of cursing the gentleman who arranged her marriage with me. She cries saying that she never dreamt that her life would be so horrible. 
On such occasions I do not know what I should do I curse myself every minute why I uttered such an expression. War clouds gathered everyday for nearly a week. Whatever I said or did not say was considered a terrible crime. “What sort of a man he is … like a stone statue, neither word or action…” she grumbles. 
The bus was in motion. In a shop at a distance T.V. sets. All the sets were switched on simultaneously. A hindi serial was being screened.
Before marriage a number of ideals and aims. Children should be brought forth. They should be educated and made into ideal citizens. They should grow into great persons. Some yearning of that kind in the mind of parents. 
The very thought of shaping our children as the future citizens of India has become meaningless in these days. The other day we went to a birthday party to a friends house. The girl was pretty. An elderly lady asked the girl that what she wanted to become when she grew up. “Miss India” the girl replied. We were all surprised at her answer. Glamour, not education was important. 
In olden days young boys and girls wanted to serve the country or protect the nation as soldiers. Now it is a run to America or to become a cinema stars.
Ambition and selfishness are behind these days. ‘I’ and ‘mine’ are foremost in the minds of narrow minded youth today. 
The guests asked our boy too. He is hardly six years old. “I want to become Bin Laden” said my son. We were shocked. “Why?” an elderly person asked him. “Because he creates havoc in such a rich and powerful country”. 
Should we wonder at his knowledge or feel proud that our country has progressed? Everyone laughed at his reply. But I saw in my minds eye forests turning into ashes without fire. 
We feel that education makes our children knowledgeable. We goad them to read more and more being ourselves in a delusion. Bonds, love, relationships, do not exist. Everyone has the enestions.  “What will you give me? What will you do for me?” 
The bus stopped. The lady conductor said to me “please get off. This is Kukatpally stop. Last stage” 

 

Saturday, 17 August 2013

నా ఆలోచనలు -3


వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే
ఇది ప్రణయమా ప్రళయమా
ఇది ఒక పాటలోని పల్లవి(యువ కవి శ్రీ మణి)  రాసింది

ఈ రోజెందుకో గాని ఎన్నో రోజులుగా ఒక సంఘటన నాలోనే నిద్రపోతున్నట్లు నటిస్తూ
ఈపాటతో నిద్రలేచి జ్జాపకాన్ని తవ్విపోసింది.

ఒక సారి రైల్లో కలిసిన అమె ఎవరో తెలియదు, గంట పరిచయం మాత్రమే.
అయినా తన మనసులో మాటలని గబగబా చేప్పేసుకుంది
చిన్నప్పుడే భర్తని పోగోట్టుకుని పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుని వాళ్ల ఆనందంలో తనని వెతుకున్న ఆమెకి వంటిమీద వచ్చిన చిన్న ఎలర్జీకి/   ఎవరితో తిరిగితే వచ్చాయో అలాంటీ ఎలర్జీలు/కోడలు అన్న మాటలకి
శ్రావణ శుక్రవారం పేరంటాలకి రమ్మని బలవంతం చేసి నలుగురిలో పసుపు కుంకుమ ఇస్తే్,వాటికే పెద్ద అనర్ధం జరిగిపోతుందన్నట్లుగా భావించే స్త్రీలముందు,సంప్రదాయలముందు.

ఓడిపోతు తనని తాను నిలబెట్టుకుంటూ జీవన ప్రయాణంలో ఏం మిగిలిందని ప్రశ్నించుకుంటు ఒంటరిగా గంభీరంగా నిలబడుతూ ధైర్యంగానే ఉంది.

కాని ఎక్కడో గాయం వర్షానికి ముందుండే మబ్బులా, నా పరిచయం పిల్ల గాలిలా తాకింది
అంతే కన్నీటి జలపాతాలు చీరకోంగులో దాక్కుని తడితడి గా మిగిలిపోయాయి.

ఎన్నాళిలా ఒంటరిపోరాటం? ఎవరికోసం దేనికోసం నన్ను నేను హింసించుకుంటున్నాను.
అమె ప్రశ్నించింది సమాధనం అడగలేదు/మనసులో మాట చెప్పేసింది/తను దిగవలసి స్టేషను రాగనే దిగి వెళ్లి పోయింది
సమాధానం కోసం నేను  వెతుకున్నాను.
 అప్పుడు
"గంటి భానుమతి"గారు  రాసిన కధ గుర్తుకొచ్చింది.
భానుమతి గారు రాసిన కధలో
దేవుడు ఎన్నో వారాలు ఇచ్చి అమెని ప్రత్యేకంగా తయారు చేస్తాడు.
 వెనక వచ్చేప్రమాదాలని కూడా చూడడాని వెన్నక్కి కూడ కళ్లు పెట్టీ,ఎన్నో చేతులు పెట్టీ ఎన్నిపనులైనా సునాయాసంగా చేయడానికి ,యాసిడ్ పోసిన కాలని చర్మంతో ఇంక ఆ స్త్రీకి
దేనివల్ల ఆపదలు రాకుండా చేస్తాడు.అయినాచెంపల దగ్గర తడి.
పొరాపాటేక్కడని మధన పడతాడు/గుండె దగరవున్న చెరువుందని మరచిపోతాడు దానిని గనక గడ్డకట్టించి వుంటే? స్త్రీల దగ్గర ప్రశ్నలు ఉండవనిపించింది.
ఎంత కొత్తగా పుట్టించి ఏమిటి లాభం?  నీటి చెమ్మా మిగిలుందిగా రాళ్ళను కరిగించడానికి.....
.

ఒంటరిగా ధైర్యపు గాలిపటాలెగరేస్తూ సమూహలలో తన నిర్మాణాల పునాదులను గట్టి పరచుకున్నాసరే  తిరస్కారాల తుఫానులో చిక్కుకుంటూనేవుంటుంది /అప్పుడే వర్షముందర మబ్బులా గాలికి కదిలి జలపాతమై  కురుస్తుంది/ఎక్కడో చిన్న విత్తు కోత్తగా మొలిచి ఇలా అనుకుంటుంది...




Sunday, 21 July 2013

నిదురించే తోటలోకి.......................


                                                                                                                                                                                                   
   " ప్రేమ రెండు అక్షరా లే"  కాని జీవితాంతం   దీని కోసం అన్వేషిస్తూనే  మిగిలిపోతాం.   భర్త ప్రేమకో్సం భార్య ,భార్య  ప్రేమకో్సం భర్త,   పిల్లల ప్రేమకోసం తల్లీ......
 కొన్ని సార్లు  అన్వేషణ ఆలాగే  మిగిలి పొతుంది   ఒక్కోసారి అది మన జీవితంలో అనుకోని అతిధిలా  ప్రవేశిస్తుంది  అప్పుడు మనమే దాన్ని అందుకోవాలా ఒద్దా? సం దేహంలో పడిపోతాము ..    .కాని కాలానికి ఇవేమిపట్టవు దాని పని అది చేసుకు పొతుంది.....
                     
         
          ఆఫీస్కి  బయలు దేరాడు భాస్కర్
 కారు డ్రయివరు రాలేదు కారు డ్రయివ్ చేస్తుంటే ఒక తీయ్యటి కల గుర్తుకొచ్చింది.
 రోజూ వెళ్ళే దారిలో ,రోజు లాగే  ట్రఫిక్ మహా సముద్రంలొ  కొట్టుకు పోతూ నడుస్తోంది కారు
   "నిదురించే తోటలోకి  పాట ఒకటి వచ్చిందీ”రేడియోలో పాట శ్రావ్యంగా సాగిపోతోంది....ఈపాట ఎన్ని సార్లు విన్నాడో తనకే తెలియదు కాని విన్న ప్రతీసారీ   కొత్తగానే వుంటుంది.
మనసులో మారుమూల్లల్లో ఒదిగి పొయిన జ్నాపకం ఒకటి ” పుస్తకంలొ దాచుకున్న నెమలి ఈకలా ” సున్నితంగా  కదులుతుంది.
 ఈరోజెందుకో  మరీమరీ ఆ సంఘటన  గుర్తుకొస్తోంది అనుకున్నాడు భాస్కర్
బియస్సీ  ఫైనల్ ఇయర్  పరిక్ష లు రాసి  ఇంటికి వస్తుంటే  ఒక చిన్న  అమ్మాయి  ఆక్క మీకి ఉత్తరం ఇమ్మంది  అంటు తెల్లటి  ఇన్వలప్ కవరొకటీ    చే్తిలొపెట్టి వెళ్లిపోయింది
ఎవరి దగ్గరనుంచి అనుకుంటూ తీసుకునే హడావిడీలొ ఆ అమ్మాయి ఎక్కడనూంచి వచ్చిందో గమనించలేదు,అప్పుడే ఆ అమ్మాయిని అడేగేసి ఉంటే  ఇన్నేళ్ళ వేదన వుం డేదికాదు.
ఆఉత్తరంలొ ప్రతీ అక్షరం గుర్తుండి పొయింది ,అమాయకంగా ఆమ్మాయి రాసిన ఉత్తరం గుండే పొరల్లొ బధ్రంగా వుండిపోయింది.
ఈరొజేందుకో  పదేపదే గుర్తుకొస్తొంది
.ఒక్కప్పటీ  పాకీజ సినిమాలోలా, ఆ సినిమాలో  పాదాల వేళ్ళసందులొ పెట్టిన చిన్న ఉత్తరంతొ కధ మొదలవుతుంది. బ్రిడ్జమీదనూంచి రైలువేళ్ళినప్రతీసారీ ఆమె మనసు ,  ఆ మనిషి ఎవరో తెలియకపోయిన మనిషికోసం చూసే ఎదురుచూపులు,తరువాత కలిసి కలిసిప్రయాణం చేయలేని ఇబ్బందులు,ఈపాటవిన్న ప్రతీసారీ గుర్తుకొస్తాయి  

ఆఫీస్ ముందు కారు ఆగింది...
సెల్ మోగింది  ఏదొ కొత్తనెంబరు ,కారు డోర్ తీసి దిగుతూ " హలొ" అన్నాడు” మీరు  భాస్కర్   గారేనా? సందేహంగా  అడిగింది ఆవిడ
అవును అన్నాడు. .
నాకు ఎలా చెప్పలొ అర్ధం కావటంలేదు నా పేరు  వసుంధర, ఆమె గొంతులొ  ఆయాసం ,మీమ్మల్ని  ప్రేమించానని  చాలా ఏళ్ల క్రితం ఒక ఉత్తరం రాసాను,
ఆమాటతొ ఆగిపోయాడు,ఆఫీస్ కారిడార్లొ,
హలో అంది ఆవిడ మళ్ళీ..  వింటున్నాను   చెప్పండి అన్నడేగాని ఏదొ తెలియని   ఉద్వేగం.మాట పెగల్టంలేదు
మీదాక  ఆ ఉత్తరం  వచ్చిందొలేదొ  తేలీదు గాని ,  ఒక   పాప  చేత పంపించాను..ఆఅమ్మాయి ఇచ్చాను అంది  నేనెవరొ చెప్పమన్నాను  చెప్పాను అంది   కాని అక్కడ  నాకేవరు కనిపించలేదు   ఇంక అక్కడ నిలబడడాని భయంవేసి  వెళ్ళిపోయాను........

ఆవిడ మాట ఆగిపొయింది  వీపరీతమైన  ఆయాసం వినబడుతోంది  ..
కంగారుగా " హలొ హలొ"  అన్నడు..నేను ఇంక ఇప్పుడు  మాట్లాడ లేను . నేను హస్పట్ ల్ ల్లొ  వున్నాను .దాని పేరు చెప్పి సాయంకాలం రండి  మీతో చలా మాట్లాడాలి వస్తరుగా అంది
తప్పకుండా వస్తాను అంటూ ఇంకా ఏదో  అడగ బొతుంటే  ,మీరు ఎక్కువ మాట్లకూడదు  అని ఎవరో అనడం  ఫొన్  కట్  అవడం జరిగిపొయింది .
చాలా సేపు  వరండాలొ గోడనానుకుని  నిల బడీ  పోయాడు. ఏమిటీ ఈ ఫొన్ ?   నానెంబరు  ఎలా తెలిసింది .. కొన్నేళ్లగా  ఎదురు చూస్తున్న  సంఘటన....
ఆవేశంలో   వస్తానని చెప్పేసాడు   ...కాని నిజంగా  తను ఎదురు   చూస్తున్న  ..ఆమేనా? అలోచనలు  వాటి మానాన   అవి సాగిపొతున్నాయి.

ఆఫీస్  అడుగుపెట్టిన  దగ్గరనుంచి  ఊపిరి సలపని పని .మనసు మాత్రం గుండె  పొరల్లొ  దాచిపెట్టుకుని  పెట్టున్న  ఉత్తరాన్ని పదే పడే కళ్ళముందుంచి  ఎన్నొ ఊహలకి ఆలొచనలకి దారితీస్తోంది.
ఆరోజు  కోన్ని ఏళ్ళ నాటీ సంఘటన  ఇప్పటికి మనసులో  మెదిలే  అక్షరాలు  ... ఆఫీస్ డస్కలో పెట్టుకున్న కవరు పసుపు రంగుకి మారిపోయిన తెల్ల కవరు కనీసం కవరు కూడా మార్చలేదు అలాగే జాగ్రత్తగా తీసి చదువుతూ వుంటాడు
  ఆ కవర్ తీసుకుని  అందులొ వున్న  తెల్లకాగితం తీసాడు,  గుడ్రంగా  పొందికగా వున్నాయి అక్షరాలు

” నేను  ఇంటర్ మిడియట్  పైనల్ ఇయర్  ఎగ్జామ్స్  రాసాను.మీది కూడా  బియ్యస్సీ ఫైనల్ ఇయర్ అయిపొందికదా మీరు మళ్ళీ ఏ కాలేజిలొ జాయన్ అవుతారొ తెలియదు  
మళ్ళి మిమ్మల్ని  చూస్తానో లేదో   తేలిదు ,ఎందుకంటే మీకు నేను తెలియదు .చెప్పనుకూడా..మిమ్మల్ని నేను ప్రేమించాను కాని ఎదుట పడీ చెప్పడానికి భయం,సిగ్గు,అయినా
చెప్పకపొవడమే మంచిది లేండి.మీది మాది ఒక కులం కాదు ఇది తేలిసే ఆగిపొయాను..కాని మీరంటే చాలాఇస్టం......”

ముందు  ఆ ఉత్తరం చదవగానే  నవ్వోచ్చింది  ,దానిమీద పేరులేదు కింద సంతకంలేదు ,   నా ప్రెండ్స   నన్ను ఆటప ట్టిస్తూన్నారనుకున్నా్ను .కాని ఎక్కడో నమ్మకం అది అమ్మాయి
రాసిన ఉత్తరమేనని
అతరువాత తెలిసింది  నా  ప్రెండ్స్  పని కాదని.
ఆ  అమ్మాయి ఎవరో.  వెదకడంలొ కూడ అర్ధంలేదు పేరు తేలీదు  చూడనుకూడ చూడలేదు  వాళ్ల కాలేజి కి  మాకాలేజిపెద్ద కి గొడ ఒక్కటే అడ్డం.  
ఇద్దరివి పెద్ద కాలేజిలే .అయినా ఏదో ఆశ  నాకొసం వస్తుందని..కాలేజి గేటు ముందు రెండు రోజులు నిలబడినా ,నావైపుకి  ఏ అమ్మాయి రాలేదు
మళ్లీ అటు వైపు వెళ్ళే  అవకా శం   జీవితంలో రాలేదు........

పి.జి చెయ్యగానే  గవర్నమెంటు  వుద్యోగం.పెద్దవాళ్ళు కుదిర్చీన  లక్షణమైన అమ్మయితో పెళ్లీ ”,రమణి  చాలా అనూకూలవతి అయిన భార్య”,ఇద్దరు ఆడపిల్లలు
పెద్దమ్మాయి మాస్టర్స  చెయ్యడానికి   అమెరికా వెళ్ళిపొయింది ,చిన్న అమ్మాయి మొన్ననే బి.ఇలోచేరింది

సాఫీగా సాగిపొయే జీవితంలాకనిపించినా  ఆ ఉత్తరంలో అక్షరాలు పలకరించేవి చిన్న కదలిక మనసుని ఏదొ ఊహల్లో పడేసేది
ఏకాంతంలొ  " మీరంటే చలా ఇస్టం"  అక్షరాలు  చెవి దగ్గర  గుసగుస లాడేవి.
పేరు ఊరు లేని ఈ ప్రేమ జీవనదిలా  మనసులో నిరంతరం  సాగుతూనే వుంది,కొద్ది రొజులు  తను కబడితేబాగుండును అనుకునేవాడిని.  అర్ధంలేని  ఆలొచనలకినవ్వొచ్చేది,క్రమేపి  అది ఒక జ్జాపకంగా  అందమైన  ఊహగా మిగిలి పోయింది.

కాని ఇప్పుడు ఇలా ఇలా ఇన్నేళ్ళ తరువాత కలవాలనుకోవడం
 అది హస్పటల్లొ కలవాలి
  తనకి వొంట్లో బాగొలేని స్థితిలొ అసలు  ఏలాంటి స్థితిలో వుంది,నాఫొన్న్ంబర్  ఏలా తెలిసింది?
ఏన్నొ సందేహలకి ,ఏన్నొజ్జాపకాలకి  సమాధానాలు ఈ సాయంకాలం నా కోసం  వేచి చూస్తూన్నాయి ,అనుకుంటే సన్నని ఒణుకు.
 కార్ కీస్ జేబులొ వేసుకుంటుంటే
             
 అది   సిటిలొ బాగా పేరున్న కా ర్పొరేట  హస్పటల్   ఎక్కడుందొ  సులభంగానే  తెలిసింది  ఈ మహానగరంలొ  ట్రాఫిక్నిచేధించుకుంటూ   అరగంట ప్రాయాణాన్నాన్నిగంటన్నర పాటుచేసి  అత్రంగా హస్పటల్ చేరుకున్న  బాస్కర్ కి  పార్కింగ్ ప్లెస్ లొ  కారు పార్క్ చేసి నడుస్తూంటే   చాలా దిగులుగా అనిపించింది.
ఎన్ క్వాయరీలో   వసుంధర  పేరు చెప్పగానే  ఎటు వెళ్ళాళో  చెప్పాడు...    .అవన్నీ స్పెషల్  రూములు.
గది ముందు ఆగి  ఒణుకుతున్న చేతులతొ  చిన్నగా  తలుపు తట్టాడు. నర్స తలుపు తీసింది  "  రండీ భాస్కర్"  బలహీన మైన మాటవినిపించింది .          
వీశాలమైన గదిలొ  బెడ్ మీద పడుకుని వుంది   వసుంధర ,సిస్టర్ ఇన్జక్షన్ సెలేన్ లొకి ఎక్కించి వెళ్ళిపొయింది.
బెడ్ మీదవున్న  "వసుంధరని " చూస్తూనిలబడి పొయాడు కూర్చో అంది చనువుగా.మంచానికిదగ్గరగా వున్నకుర్చీలొ కూర్చున్నడు మనిషంతా చిక్కిపొయింది ,కళ్లుఒక్కటే     వీశాలంగా  ముఖంలొ కొటొచ్చినట్లు కనబడుతున్నయి

ఏమిటి ఆలా చూస్తూన్నవు,ఇంత అందమైన అమ్మాయితో ఎలా మాట్లాడాలా అనా?  అడీగింది    "నవ్వొంచింది" నవ్వేసాడు.....
ఏమిటి చనువు అని ఆలో చిస్తున్నారా ?అంది
ఏం మాట్లడాలొ అర్ధంకావటంలేదు నిన్ను ఇలా చూస్తానని.అసలు నిన్ను కలుస్తానని అనుకోలేదు,అతి కష్టంమీద ఉద్వేగాన్ని అదుపులొ పెట్టుకుంటూ అంటున్న భాస్కర్ చేయిట్టుకుంది వసుంధర.
వెచ్చని స్పర్స చర్మాన్ని కప్పుకున్న ఎముకలగూడులాంటి చేయి,  కళ్ళల్లొనీరు చిమ్మింది అప్యాయంగా మెల్లగా పట్టుకున్నాడు.
నీఉత్తరం అందింది  కనీసం పేరు కూడా లేదు  నా ఫ్రేండ్స  ఆటపట్టించడానికి  రాసారనుకున్నను  .కాని ఎక్కడోనమ్మకం అమ్మయేరాసుంటుందని అందుకే   రెండురొజులువరుసగా కాలేజి గేటు ముందు నిల్చుననాను,
ఎవరు రాలేదు  ... కాని వసుంధరా ఆ  ఉత్తరం నాకు తోడుగా వుండిపోయింది’ గుండెనంతా ప్రేమతొ నింపేసింది. గబ గబా చెప్పేసాడు
ఇన్నాళ్ళు  గుండెల్లొ  దాచుకున్నది   అర్దంలేని  విషయంగా   మధన పడ్డాడు .కాని ఎదురుగా  ఆ నిజం   కన పడేసరికి........
 
ఏడుస్తున్న  వసుంధరని  చూసి కంగారుపడ్డాడు " ఏమయింది? అంటు  మంచంమీద కూర్చుని ముఖాన్ని చేతులతొ అప్యాయంగా  పట్టుకున్నడు.
ఇన్నాళ్లూ   ఉత్తరం  అందలేదు అనుకున్నాను,ఉత్తరమే అందని మనిషి కోసం ఎదురు చూసాను,అలా ఎదు రు చూడడంకూడా తప్పు అనుకోలేదు,కానిఈ దశలొ......
"వసుంధరా   పీల్జ్ ఏడవకు"కంగారుగా  అన్నాడు భాస్కర్.
"  ఇది అనందంతో వచ్చిన దుఃఖం".నీ ఫొన్ నెంబరు ఏలా తెలిసిందో తెలుసా ?  నీఆఫీస్ కారు డ్రయివర్ రషీద్ కొడుకు  మాకు కొత్తగా వచ్చిన కార్ డ్రయివర్,ఇన్ని నెలుగా హస్పటల్కి తెస్తున్నడా ఒక్క రోజు కూడా  ఇలాంటి ప్రస్తావన రాలేదు.
కానిమొన్ననే   మాటల్లొ మాటగా  వాళ్ళనాన్న  కూడా డ్రయివరని గవర్నమెంటు  ఉద్యుగమని నీ  పేరు  చెప్పి  నీడ్రైవరని  చెప్పడు ,నీపేరు వినగానే వివరాలు అడీగాను,అది నువ్వే   అయివుంటావని కాదు.ఆత్రంతో ఒకవేళ నువ్వే నేమోనని..
 
నువ్వు ఏకాలేజిలొ, ఏస్కూల్లొచదువుకున్నవో, దగ్గరనూంచి మీఅమ్మాయిల చదువుదాక చేప్పేడు ,నిన్ను చూడలని బలీయంగా అనిపించింది  సెల్ నెంబరే  తీసుకు రమ్మన్నాను
ప్పొద్దున్నే  తీసుకొచ్చి ఇచ్చాడు ...
మాట్లాడుతున్న వసుంధర పరిస్థితి  హటాత్తుగా మారిపోయింది,విపరీతమైన ఆయాసం,ముఖం నీలంగా మారిపోయింది"సిస్టర్  "అంటూ పరిగెత్తుకు      వెళ్లా డు  భాస్కర్
అరగంటలొ అక్కడి పరిస్థితే తారుమారు అయిపోంది.
రూములొంచి  వసుంధరని  ”ఐ.సి,యు” లొకి  మార్చేసారు. మరో పదిహెను నిమిషాల్లో ,”సారి”  అమె చనిపోయారు అంటూ చెప్పేసారు.
 అయోయంగా చూస్తున్న  భస్కర్ తో” మీరు వెళ్ళి చూడండి ” అంటూ   అమే భర్త ,పిల్లలకి  కాల్ చేయ్యండి  అంటూ డాక్టర్  వెళ్ళి పోయాడు.
మీరు చుడొచ్చు అంది నర్స  మరోసారి . చుట్టూతా ఉన్న నీలం తేరల మధ్య వొంటరిగా నిద్రపోతోంది,శిలలా నిలబడ్డాను ” పెద్దపెద్ద కళ్ళలొ ప్రాణం నింపుకుని  ఇంత అందగత్తెతొ ఎలామాట్లాడలా అని  ఆలొచిస్తున్నావా ”  అన్న వసుంధర   నిర్జీవమైపొయింది...
వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో బయటికి వచ్చేసాడు ,

       కారులొకూర్చొగానే  అద్దంమీద పెద్దచినుకు  టప్పమని  పడింది  అప్పుడు గమనించాడు  ఆకాశమంతా మబ్బులతొ నిండి పోయిందని... ..గుండెని చీల్చుకుని వచ్చీంది దుఃఖం స్టిరింగ్ మిద వాలిపొయి ఏడ్చాడు ...

తలుపుతీసిన  రమణి  భాస్కరని  చూసి ఆశ్చర్యపొయింది ,రేగిపొయిన జుత్తు ఎర్రబడిన కళ్ళు  .”వొంట్లొ బాలేదా” కుర్చీలొ  కూలబడిన  భాస్కర్ నుదిటిమీదచేయి వేసి   కంగారుగా అడిగింది ..”ఏంలేదు ఇవాళ  మా ఫ్రెండ  చనిపొయాడు  హస్పటల్లొ ...చూసి వస్తున్నాను”  ఎంత పొడిగా మాములుగా  మాట్లాడుదామన్నా కన్నీటి తెరలుకంటిపాపని చుట్టుకుంటున్నాయి.
”అయ్యో అలాగా”...అంది రమణి దిగులుగా
  వేడిగా” టీ ” ఇవ్వవా   అడిగాడు భాస్కర్.. .
రమణి అత్రపు చూపులనుండి అడిగే ప్రశ్నలనుండీ  తప్పించుకుంటూ.....
"టీ” తాగి  చాలా అలసటగా వుంది,భొజనం కూడా వద్దు  నేను  కాస్సేపు పడుకుంటాను ,నిద్ర ప ట్టేస్త్ లేపొద్దు...అంటు  గదిలొకి వచ్చాడు.
                         
" మళ్ళీ ప్రశ్నలు, జ్జాపకాలు, మొదలు అయ్యాయి
స్నానంచేస్తున్నా .బట్టలు వేసుకుంటున్నా  వసుంధరే కళ్ళముందు    కనిపిస్తొంది.... ఒక తీయ్యటి కల క్షాణాలలొ ముగిసిపొయింది.
మనసుని గిలిగింతలు పెట్టే ఒక ఊహ   క్షా ణాలలొ  ఆవిరై పోయింది. ఎవరితోనూ పంచుకోలేని వ్యధ,ఏమని చెప్పుకుంటాము
ఆఫీస్కి రెండురోజులు   సెలవు ్పెట్టేసాడు .అయినా మనసు కుదుటపడలేదు,నీడలా వెంటాడే   గాయం  మనసుని కాలుస్తూనే వుంది...........
రమణి కూడా భాస్కర్ తోపాటు ఆరెండు   రోజులు నలిగిపోయింది,ఏంజరిగిందొ తెలియదు,అసలే గుంభన మైనమనిషి  మనసులొ మాట ఎవరితోను  చెప్పరు .
ఏలా అడగాలిఅంత ప్రాణస్నేహితుడా?  అతని మరణం  ఇంతటి ప్రభావాం చూపిస్తే  కోలుకోగలడా?  సందేహాల్ని అణుచుకుంటూ  గమనిస్తూ వుండి పొయింది
                                                                     * * * * *  *  *  *

ఆరోజు - ఉదయం మాములుగా  టిఫిన కోసం  డైనింగ్ టేబల్ దగ్గరకి వచ్చిన   భాస్కర్ ని చూసి  ఊపిరి పీల్చుకుంది రమణి. "ఇవాళ  ఆఫీస్కివెళదామనుకుంటున్నారా  అడిగింది"
"సారి" రమణి  అన్నాడు ....ప్లేటులో ఇడ్లి వడ్డిస్తున్న  రమణి చేయి  పట్టుకుని . కంగారుపడింది  "సారి ఎందుకు ,మీబాధ చూడాలేకపోయాను,ఏలాఓదార్చాలో అర్దంకాలేదు.
అమ్మాయి  అమెరికానుంచి  ఫొను చేస్తూనేవుంది,మీగురించి  ఆందొళనపడుతోంది...
రేపు శని వారం కదా తీరిగ్గా మాట్లాడుకొచ్చు... శంకర్ కి చెప్పావా  ఈరోజు అఫీస్కి  వస్తున్నట్లు,”  ఈ  రెండు రోజులు  వస్తూనే వున్నాడు  ......
రెండు రొజులా? రెండురోజులు  ఒంటరిగా  గడిపానా,   గాయం  తగ్గిపొయిందా,అలోచనలు అగిపోయాయా? ఏది జరగ లేదు’
"ఇవాళ వచ్చాడా?
వచ్చాడు, కిందవున్నాడు  ఇందాకే చెప్పాను మీరు వస్తూన్నారని  ....
 
 కారులొ కూర్చోగానే  "సార్  వసుంధర అమ్మగారు  మీకి కవర్ ఇమ్మన్నారుట "  కవర్ అందిస్తూ   మీరు హస్పటల్  వెళ్ళేరోజు పొద్దున్నే మాఅబ్బాయి
చేతికిఇచ్చారుట కాని హట్టత్తుగా అవిడ చనిపొయేసరికి ...వాడికితీరీక దోరక లేదు .మీరు కూడా అఫీసకిసెలవు  పెట్టేసారుగా.. సారీ సార లేట అయ్యింది "  అన్నాడు.
ఫరవాలే దులే అంటూ కవర్ అందుకున్నడు భాస్కర్.
కవర్ తెరిచి చూద్దామనుకున్నాడు ,ఏకాంతంకావాలి  మళ్ళీ ఆగాయాలని తట్టుకోవడానికి అనుకుంటూ  కారులోనే వుంచేసాడు.......
     
ఆ ఎకాంతంకోసం  సాయంకాలందాక కాలన్నీ బలవంతంగా నెట్టుకొచ్చాడు.జీవితంలొ మోట్టమోదటీసారిగా పార్కులొకి వం టరిగా వచ్చాడు ...
పిల్లలుహాయిగా ఆడుకుంటున్నారు  చూట్టూతా పచ్చనిగడ్డి .వాలిపొతున్నపొద్దు గూడు చేరుకుంటున్న పక్షులు.అందమైన సాయంకాలం.కొత్తగా వింతగా  వుంది  ఎప్పుడు అనుకోలేదు ఇలాంటీ  సమయం ఒకటి తనకి వస్తుందని ......
కవర్   పట్టుకున్నాడు  కొన్నేళ్ళ క్రితం  ఎవరు ఎందుకోసం  ఇస్తున్నారో తెలియకుండా  తీసుకున్నకవర్  ఇప్పుడు  కూడా అదే స్థితి,కాని విచిత్రమైన స్థితి  ఏ మనిషికోసం  కల నిర్మించుకునిదొరకదులే అని  బతుకుతూంటే  ఆ మనిషి  కనిపించి ”
  ఓ పాటలాగ వచ్చీ కన్నీరు నింపి వెళ్ళిపోయింది..”
అలొచనలు విదిలించుకుంటూ   చేతిలొ వున్నకవర ని విప్పాడు  ఒక ఉత్తరంతో పాటు  దానిమధ్యలొపెట్టిన  ఫొటొలు జారి పడ్డాయి. ఒళ్ళపడ్ద  ఫొటొస్ తీసాడు  .ఒకటీ కాలేజి గ్రూపు ఫొటొ
బ్లాక ఎంన్డ  వైట్  ఫొటో   ముందు వరసలొ  నిలబడ్డ అమ్మయిల్లొ ఒక అమ్మాయి చూ ట్టూ స్కెచ  పెన్సిల్ తొ  సున్నాచుట్టీ వుంది.. గుండె దడదడలాడింది ...ముందుకి వేసుకున్న రెండు జడలు
గుండ్రటి ముఖం  సన్నగా  పెద్దపెద్దకళ్ళతో  ”వసుంధర” , రెండొ ఫొటొ  కలర్  ది   ఎప్పటిదొ  తెలీదు  అదే గుండ్రటి ముఖం  వస్తున్న నవ్వుని అదిపెట్టి  విశాలమైన కళ్ళనిండా  అనందం.....
ఆ ఆనందం  అ అందం   కలలొలాగ  మాయం అయిపొయాయి,  కమ్మనైన పాటవినిపించి  మాయమైన దేవతలా  భూమిలొ   కలసిపొయింది .... గుర్తుకి వస్తే  చాలు  మనసు  గాయపడుతోంది
         
         ఉత్తరంతీసాడు  చదువుతుంటే  అక్షారాలు   మనసు పొరలలొ  ముద్రలు వేసుకుంటున్నాయి.

భాస్కర్   చాలా ధైర్యంగా పిలుస్తున్నాను......ఎందు కంటే  ఇవాళ పొద్దున్నే   నీకు  ఫొను చేసాక  రాస్తున్న ఉత్తరం. అప్పటీలాగ మోహమాటం, సిగ్గు, భయంలేవు.
నిన్ను కలుసుకుంటానన్న అనందం తప్పీంచి ...చుసావా జీవితం ఎంత చిత్రమైనదొ నిన్ను మళ్ళీ కలుస్తాననిగాని  కనీసం చూస్తానని గాని అనుకొలేదు.నువ్వు  నన్ను చూడలేదు
కాని నిన్ను మాకాలేజికి  మీచుట్టాల అమ్మయిని పిలవడానికి   మా క్లాసుకి వచ్చావు అ అమ్మయి  నాస్నేహితు రాలు...ఆ రోజు నిన్ను చూసిన క్షణంనూంచీ   నువ్వంటే ఇస్ట పడ్డాను
నిన్ను  చూడడంకొసం  మీకాలేజి వచ్చేదాన్ని నిన్ను  ప్రేమీంచాను  ..అ పదిహేడేళ్ళ  వయసులొ  నిన్ను ప్రేమించాను  ..నిన్నే పెళ్ళి చేసుకోవాలని  ఎన్నొకలలు ,అవన్ని నావే   ఏందు కంటె
నేనవరో   నీకు  తెలియదు  అయినా ఏదో  ధైర్యం......అర్ధం లేని నమ్మకం.....కాని  ఎది జరగ లేదు  మన కులాలు  వేరు  ...ఈ రోజుల్లొ అయితే ? రాస్తున్న నాకే చాలా సిల్లీగా అనిపిస్తోంది.
    నా అభిప్రాయాలు  తప్పించి  కనీసం నేనెవరో నీకు తెలియదు  ...అప్పుడు  ఆ ఉద్వేగంలొ  మన పేళ్ళి జరగదని తెలిసాకా  నాకు పెళ్ళి సంబంధాలు  చూస్తున్నారని తెలిసాక.
మీకాలేజికి వచ్చాను  ఉత్తరంరాసాను  నాపేరు  చెప్పదలచుకోలేదు   అయినా నా  ప్రేమ   నీకు తెలియాలి   అంతవరకే  అలోచించాను.... కాలేజి వాచమేన్ కూతురు ఎదురుగా కనబడీంది
నువ్వు వెళ్ళిపోతున్నావన్న కంగారు..కాలేజికి శెలవులు  అది  కాకుండా  నీ ది  నాది కూడా ఫైనల్  ఇయర్స... ఆ అమ్మాయి   చేతికి ఇచ్చి  నీ కు ఇమ్మాన్నాను  ,ఇచ్చావా అనిఅడిగితే  అదిగొ
ఆ అబ్బాయికి అని చెప్పింది  అక్కడ ఎవరు లేరు  నాకు చాలా భయంవేసింది   వేరే ఎవరికో ఇచ్చేసిందని....ఆ భయంతొ  మళ్ళీ నీకాలేజివైపుకి  రాలేదు  ..మానాన్నగారికి అఏడాదివేరే ఊరికి   ట్రాన్సఫర్ అయిపోయింది....

కాని  భాస్కర్ నిన్ను  మరచి పోలేదు  ..కాని  నావైవాహిక జీవితం  చలా అనందంగా మొదలు అయ్యింది  ,నాభర్త  రవితో  నాజీవితం హాయిగా సాగిపోయింది.నాకూ ఇద్దరుఅమ్మయిలు  ఇద్దరు కవలపిల్లలు..ఇద్దరు  బాగా దువుకుంటూన్నరు....కాని ప్రేమ బలం   అర్ధమవుతూనేవుంది  నిన్నుమరచిపోనప్పుడు...తప్పొ ఒప్పో  ద్రోహమో  లోకం ఏలా అనుకున్నా  నడుస్తున్న జివితానికి మన్సుకి సంబంధంలేకుండా   గుండెలో పదిలంగా వుండీపోయావు...
నిన్ను కలవాలనికూడా అనుకోలేదు....రెండు సంవత్సరాలక్రితం   నాకు లంగ కేన్సరని   ఎక్కువ కాలం బత కనని తెలిసాక  నిన్ను చూడలని   బలంగా అనిపించింది  ,కాని ఎక్కడ వున్నావోతేలీదు  ...ఒక వేళ తెలిసినా  వస్తావని నమ్మకంలేదు....  కాని పొద్దున్న నువ్వు వస్తాను  అనగానే  అనందం  పట్టలేకపోయాను  ...ఆ ఉత్తరం అందిందోలేదో  అడుగుదామనుకున్నాను
 కాని  అప్పటికే నాపరిస్థితి  బాగోలేదు  బహుస నువ్వువచ్చేసరికి బతికి వుంటానో తెలియదు....బతికి వుంటానని నమ్మకం.....
అందుకే  వేంటనే ఉత్తరంరాసీ ఇంటీనుంచి   ఫోటొలు తెప్పీంచి   డ్ర యివరు చేతనీకు పంపిస్తున్నాను ఈసారి  నాఉత్తరంనీకు తప్పకుండాచేరుతుంది  .నా కా నమ్మకం ఎందుకో తెలుసా
        ఇవాళ  ”ప్రేమికుల  రొజు”
ప్రేమ  ..ప్రేమకి  ఇంత బలముందా?  బాహ్యరూపం  వయసు  ఇవన్నీ లొకానికా?  మనసు మనసుమాటే వింటుంటుందేమో,కనుల వెనాకాల  స్వప్నమై  రెప్పలవెనాకాల  దాచేస్తుంది
దాచుకున్న ప్రేమ  కన్నీటీ చెమ్మతోపాటూ గుండే గూటిలోకి చేరిపోయింది...పంజరంలొ బంధించాక గాయలకి  తావెక్కడ?
ఫోటోలని  ఉత్తరన్ని జేబులొ పెట్టుకున్నాడు ,చల్లటి గాలి ఒంటిని చుట్టుకుని గిలిగింతలు పెట్టింది.
భాస్కర్ కి ఇప్పుడు ఏడుపు  రాలేదు.....మనసంతా నిశ్శబ్ధంగా  అయిపోయింది.......ఇన్నళ్ళుగా వెంటాడుతున్నా  వెలితి ,గాయం, జ్జాపకం అన్నీ ముక్కలు ముక్కలుగా తెగిపొయాయి
తన చూట్టూ  ఒక అనందం  .........
”నిదురించె తోటలోకి పాట ఒకటి వచ్చీంది  కన్నుల్లో నీరు తుడిచి  కమ్మని కల ఇచ్చిందీ”   అ పాటని  ఇన్నాళ్ళుగా తన ఊహలలో నిండి పోయిన  పాటని   పాడుకుంటూకారులొ కూర్చున్నాడు  .వెళూతున్న కారుతోపాటూ  ....జీవితంతోపాటూ .పాట వెళుతూనే వుంది.......

                                                    *                     *                             *                            *

Monday, 15 April 2013

ఎప్పుడో ఒక సారి ఈ సమస్వరత (tuning) విశ్వానికి మనకు మధ్య ఈ సంగీతం స్వరం కలిసి పోతుంది ఏవిధంగా అంటే 
అకస్మికంగా ఎవరైన బాలుడు సితార్ ను మీటడం వలన రాగం వుత్పన్నం అయి నట్లుగా కలిసిపోతుంది.ఇది ఒక రకంగా accident.
సరిగ్గా జీవనంలో ఎక్కడి నుండి ఆ అనంద కిరణం పడుతుందో ఆద్వారాన్ని పెద్దది చేయడమే ధ్యానం అంటారు
ఓషో

ఓషో పుస్తకం 

 చదవగానే ఇలా అనిపించింది

అది వెన్నెల రాత్రి
అందరు నిద్రపోయినా పోక పోయినా వెన్నెల ఆకాశంనుంచి భూమ్మీదకి జారుతూ
మూలమూల చీకటిపైన వేస్తున్న తెల్లటి చారికల రంగు నాకంట పడింది

తెల్లగా గేటు అంచులులోంచి ప్రవహించీ ముగ్గులో దిదుకున్న రేకుమీద వాలిపోయి
విరిగిన అద్దం ముక్కలా తళుక్కుమంది


నేను ముగ్గు వైపుకి జరగానే చెంపలని సవరించి ముక్కుపుడకలో దాక్కుని
చెమక్కుమని 

అక్కడే వున్నపూల కుండీమొక్కల ఆకులని తడిమి
డాబామెట్లమీద ఆగి పోయింది


వెన్నెల ఆకస్మికంగా ఎదురైన పాట కాదు
నేను చూస్తేనే నాకు కనిపించింది


నేను వున్నా లేక పోయినా అది అలాగే గేటుని ముగ్గుని పలకరించీ డాబామెట్ల మీద ఆగి పోతుంది..
ఆ ధ్యానాన్ని నేను ఈ రోజు అంగీకరించానేమో!

Tuesday, 26 March 2013

//వాడి అడుగుల చప్పుడు//



           


మూసిన తలుపువెనక వాడు వెళ్ళిపోతున్న అడుగుల సవ్వడి వినిపిస్తూనేఉంది
నేను వెళ్ళిపోయాక నువ్వు జాగ్రత్తా అంటాడు
కాని గదిలోపల వాడు ఇంకా ఉన్నాడు
పాటలు పాడుతున్నాడు  ఫియానో వాయిస్తున్నాడు
అమ్మా అకలి ఏమున్నాయి అంటూ బుజాలమీద ఊయలలూగుతున్నాడు

వాడున్నతసేపు వాడిని పెద్దవాడిని చేసేసాను
పోరాడలేని ఘర్షణలు దాపరికంలేని బిడియాలు
ప్రవహించీ ప్రవహించీ
వాడి లేతమనసు  ప్రవాహపు సుడిలో కోట్టుకుపోతున్నా
మాట్లాడుతూనే ఉన్నాను

ఈఏకాంతంలో వాడు శబ్ధమై గదంతా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాడు

చదువుల బరిలోకి దింపేసి వాడు వెళ్లకూడదనుకుంటాను
బయట ప్రపంచంలో వాడు వ్యధ శిలమీదే ఉంటాడు
ప్రేమ కోలనులో వాడు నెలవంకలా తేలుతుంటాడు
తలవంచుకుని అలోచనలని రెప్పల పరదాలలో దాచేసి
నవ్వుతాడు నాఒడిలో తలదాచుకుని


వాడు ఇంకా పరుగులు తీసే లేగదూడ లా అనిపిస్తాడు
లోపలి మాటలని బుజాన మోస్తున్నప్పుడు
స్కూలు పిల్లావాడిలా అనిపిస్తాడు
కాని వాడు మాత్రం  పోడి మేఘాలకి నీరందించే ఆవిరి నవుతానంటాడు

మూసేసిన తలుపు వెనక వాడు వెళ్ళిపోతున్న అడుగులసవ్వడి వినిపిస్తూనేఉంది.

Thursday, 21 March 2013

కొన్ని కబుర్లు కొన్నిసరదాలు



మాఅత్తగారు అమ్మాయి నువ్వీవ్వాళ  మజ్జిగ చిలికి వెన్న తీయ్యాలి అన్నారు  ఉలికి పడ్డాను నేనా ? ప్రశ్నార్ధకంగా మొహం పెట్టి
అవును నువ్వే అన్నారు చిన్నగా నవ్వుతూ పూజ గదిలోకి వెళ్లబోతూ
రాదేమో అన్నాను  నసుగుతూ ,
ఎందుకు రాదు అదేమైనా బ్రహ్మ విద్యా రాకపోవడానికీ అంటూ పూజగదిలోకి వెళ్ళిపోయారు
మీక్కూడా అనిపిస్తోందా మజ్జిక చిలకడానికి ఎందుకింత భయం మరీ చోద్యం కాకపోతేనూ.. అనుకుంటున్నారా
గబగబా మిక్సి దగ్గరకి వెళ్ళీ గిర్రున ఓ తిప్పు తిప్పేయక.....
 అసలు విషాయానికి వస్తున్నాను  నడవ వాకిట్ళో   స్థంబానికి కట్టేసిన పద్దతాడుతో కవ్వం  సిలవరు గిన్నెనిండా మజ్జిగ
మజ్జిగ తోణకకుండా చుట్టుపక్కల చిందకుండా తాడుతో కవ్వాన్ని తిప్పుతూ వెన్న తీయాలి..
తాడు రెండు చేతులతో పట్టుకుని తిప్పుతుంటే  చేతులుకున్న గాజులు గిన్నెలో కవ్వంతోపాటు చిలక పడుతున్న మజ్జిగ
ఒక చక్కటి లయతోకూడిన జుగల్ బందిలా వినిపిస్తుంది చెప్తూవుంటే బావుందికదా
ఆలోచిస్తూ నిలబడ్డాను  ఎలా తిప్పాలీ గిన్నే జరిగి పోతే మజ్జిగా చుట్టుపక్కల చిమ్మితే ?
కోత్త కోడలిగా నాకదో సవాలు
అటుగా వచ్చిన మునెమ్మ  అమ్మాయిగారు ఏంటండీ ఆలోచిస్తున్నారు ముందు ఆతాడు అందుకోండి అంది ముసిముసిగా నవ్వుతూ
దాని నవ్వు చూస్తే ఇంకా ఉక్రోషం వచ్చింది
 ఇంతలో మావారు వచ్చారు ఎలా అన్నను కళ్ళతో ?
హటాత్తుగా నారెండు చేతులు పట్టుకుని  తాడుని రెండు చేతుల్లో పెట్టీ ఇలాగా చెయ్యి అన్నారు తాడుని స్పీడుగా తిప్పుతూ
బెల్ న్స కుదరక కవ్వం గిన్నె అంచులుకి కొట్టుకుని  మజ్జిగా తుళ్ళీ నేల మీద పడిపోయింది
నేను పట్టుతప్పి వెనక్కి ఒరిగిపోయాను
కావిడితొ మంచినీళ్ళు తీసుకోచ్చిన రావుడు, మందారపూలు  అత్తగారి పూజకోసం తీసుకోచ్చిన పక్కంటి సూరమ్మగారు
కట్టువిడుపు బట్టలు ఉతకడానికి తీసుకెళ్లడానికోచ్చిన  సరివి  అందరు నవ్వగానే ఏడుపొచ్చింది
మీవల్లే ఇదంతా జరిగింది అన్నాను కళ్ళనిండా నీళ్ళతో మావారితో..
ఇంతలో మా అత్తగారు పూజ గదిలోంచి వచ్చి నీకో విషయం తెలుసా చిన్నపటినుంచి ఈ పల్లేటూర్లో నే పెరిగాడు మీఆయన
ఒక్కరోజుఈ మజ్జిగ గిన్నెవైపు ఒస్తే ఒట్టు  అరచేతి నిండా నెయ్యి ఒంపుకోవడం.వెన్న ముద్దలు తీసుకుని తనడం తప్పించి
నువ్వంటె పట్నం పిల్లవి  నీకు తెలియదు మరివాడికో  అందుకుని నీపుణ్యమా అని వాడికి మజ్జిగ చిలకడాని కో కవ్వం దానికో రెండు తాళ్ళు ఉంటాయని తెలిసింది గోప్పవిషయమేకదా
రేపటినుంచి ఇద్దరు కలిసి మజ్జిగ తిప్పివెన్నతీయండి అన్నారు
అమ్మా నన్ను ఇలా ఇరికించకు పొరపాటున వచ్చాను మీకోడలికి నేర్పుకుంటావో మానేస్తావో అదినీ ఇస్టం అంటూ తువ్వాలు తీసుకుని
ఏటి స్నానానికి పరిగెట్టారు
నవ్వుతున్న నన్ను చూసి  హమ్మయ్య నువ్వు నవ్వావు అదేచాలు/ చూడు నీకళ్ళు నవ్వు ఏడుపుని నింపుకోన్న ఇంద్రధనస్సులా వున్నాయి అంటూ ప్రాసాదం చేతిలో పెడుతూ చూసావా ఆడవాళ్ళే అన్నిపనులు చెయ్యాలి  పని అనగానే ఎలా పరిగెట్టాడో
అందుకనే మనకి రిటైర్ మెంటులేదు హవుస్ పెన్ షన్  లాంటివికూడా లేవు......
   ”దంచినమ్మకి బొక్కిందేకూలి” అన్నట్లు.. నిజమేకదా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళు బతకుంటే అన్నేళ్ళు వంటీంటీ గడపలని అలుపు సొలుపు లేకుండా దాటుతుండాలి...

Wednesday, 20 March 2013

కబుర్లు కాకరకాయలు






మా అత్తగారి దగ్గర చుట్టం ఒకాయన ఉండేవాడు
 
ఆయనకి అందరూ సలహాల కాంతరావు అనేవారు ఆనయన జేబులో ఎప్పుడూ సెనక్కాయలు ఎలా ఉంటాయో సలహాలు అంత అందుబాటులో ఉంటాయి పోగడ్తలా అగడ్తలు అనేవాడు

కోరికలు ఎందుకు కోరుక్కు తినడానికా అనేవాడు అందరిని పనికిమాలిన వాళ్ళలా మాట్లాడేవాడు
వాడా వాడికేంరాదు వీడా వీడి దుంపతెగ వీడో మహా తెలివితక్కవ వెధవ అనేవాడు ఇలా కనిపించిన అందరికి పేర్లు పెట్టేవాడు వాడి నోటికి దడిసి అందరూ ఆమడ దూరంలో ఉండేవారు

మాఅత్తగారు ఓ రోజు ఇంటికి పిలిచి చిక్కటి కాఫి పెద్దగ్లాసుడు ఇచ్చీ కాంతరావు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్పనా అన్నారు
చెప్పండీ దానికేం భాగ్యం అన్నాడు కాఫి గ్లాసు ఇంకా చేతులో ఉంది కాబట్టీ
మీమ్మల్నంతా మతిలేని మహారాజు అని చెప్పుకుంటూ జాలి పడుతున్నారండి అన్నారు మా అత్తగారు


ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాడు కాంతారావు ఎప్పుడూ అందర్ని ఏదోఒకటి అనడమే తప్పించీ తనని కూడా ఇంకోళ్ళు అంటారని తెలియక బిత్తరపోయాడు నాకా మతిలేదా? ఏమిటండీ ఈ అన్యాయం


నిక్షేపంలాంటి మనిషిని పట్టుకుని అంతమాట అంటారా? అంటూ అగ్గిమీద గుగ్గిలంలా అయిపోయాడు ఎర్రగా కందగడ్డలా మొహంపేట్టుకుని ఠక్కున కఫీ గ్లాసు కిందపెడుతూ చెప్పండీ ఎవరన్నరో కడిగేస్తాను వెధవల్ని అన్నాడు కోపంతో ఊగిపోతూ
ఎవరంటే ఏం చెప్తాము కాంతరావు నువ్వేప్పూడూ అందరిని అంటుంటావుకదా వాళల్లో ఎవరైనాకావచ్చుకదా అటుగా వచ్చిన కంబారితో గ్లాసు తోమడానికి వెయ్యారా రావుడు అన్నారు నిదానంగా


విసవిసా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయిన కాంతారావుని చూస్తుంటే
నాకు నవ్వోచ్చింది అనండం ఎంత తేలికో మాట పడడం అంతకన్నా కస్టం....


Monday, 25 February 2013

//నిద్రపోతున్న శవం// 25-2-2013



     
ప్లాస్టిక్ సంచి చెత్తతోపాటు చెత్తకుండిలో విసురుగా వచ్చిపడింది
నిద్ర పోతున్న శవంకూడా అక్కడే దోర్లుతోంది
మత్తుని నీళ్ళతోకలుపుకున్న  శవంకోసం ఎదురుచూసేవాళ్లు చూస్తూవుంటారు

వాడు కోడుకు కావచ్చు భర్తకావచ్చు తోబుట్టువు కావచ్చు
ఎవరైనా వాడు నిద్రపోతున్నశవం

గేటుకి గదిలో గడియారానికి అతుక్కుపోయిన కళ్లు
అవమానాలని అస్సహా యతని ప్రశ్నించే కళ్లకోసం
మత్తుతో మూసుకుపోయే రెప్పలని తెరవడాని ప్రయత్నిస్తూ తూలుతూ
గేటుకి వేళ్ళాడే మనిషికోసం ఎదురుచూపు

పడకగదిలో పిల్లలు నిద్రనటిస్తారు
అమ్మనాన్నా లు అరుస్తుంటే జతువుల్లా పోట్లాడుకుంటుంటే
అమ్మ దు;ఖం తలుపుల ఖాళీలని తోసుకుని వినిపిస్తుంది
ఏడుపు తీగలు వేసుకుంటున్న మొక్కలా పాకుతూ గదిని అల్లుకుని
నిద్ర అంటె భయం వేసేలాచేస్తుంది
నాన్న ఇంకా రాలేదు
గదిలో ఫేను తిరుగుతోంది మెల్లగా
నిద్రఒడిలోకి జారుకుంటున్నా భయమే
ఎక్కడ అమ్మగోంతులోంచి వూడిపడ్డ శోకం తీగలా అలుకుంటుందోనని



పక్కలు చాలని పాక
అయ్య అనబడే రాక్షసుడు రాలేదు
రాకపోయినా బాగుండేది ఆరాత్రి నిద్రని గడుపుకుంటుంది
తడికన తోసే చేతులు దెయ్యానికి ప్రతిరూపం దాలుస్తాయి
బూతులు వే్ట కత్తులా మనిషి మీద విరుచుకుపడతాయి
అమ్మ శరీరం శక్తిని కోల్పోతుంది
సారా మత్తు హరించిన మగతనం  కళ్ళుతెరచి ఆమె డొక్కలోపొడిచి
శరిరంతో ఆడుకుంటుంది
ఆరాక్షసుడి పాదముద్రలు పాకలో పిల్లల గుండెలొ తెగువని చూపిస్తాయి
చావుకోసం ఎదుచూసేలా చేస్తాయి

అమ్మ తనని దోషి చేసుకుంటుంది
బీటలు వారిన కాలన్ని మూయాలని మట్టి పూతలుపూస్తూ
తాగుడు మానేసిన కోడుకునవ్వుని కలకంటూ
గేటు దగ్గర నిలబడుతుంది
చెదిరిన జుట్టు నలిగిన ముఖాన్ని తడమడంకోసం
మానేయరా కన్నా ఈ  అలవాటుని
మళ్ళీ మళ్ళీ చెప్పడంకోసం
ఒడిలో జారుతున్న కోడుకు నిద్రపోతున్న శరీరాన్ని తడమడం కోసం
గేటుకి కళ్ళని వప్పచెప్పి  అలికిడికి కోసం ఎదురు చూస్తూనే వుంటుంది


అక్కడ శవం మాత్రం నిద్రపోతోంది
కుక్కలు చుట్టుముట్టినా
జేబులు తడిమి ఎర్ర ఏగాని లేని శవాన్ని కాళ్లతో తన్నినా
శవం నిద్రపోతూనే వుంది
ఎదురు చూసేవాళ్ళకళ్ళని తప్పించుకుని
                                               
(నడి రోడ్డుమీద చెత్తకుండి పక్కన ఒంటిమీద సృహలేకుండా తాగిపడివున్న ఎవరిని చూసినా అలోచనలు ఇలా దొలుస్తాయి)




Sunday, 24 February 2013

అమ్మని అడుగుతున్నాను//



నేను అడుగుతున్నాను నేను ఏం చేసానని
నాకొడుకుని పోద్దున్నే కాలేజికి పంపించాను
వాడు చదువుకుని నాకు ఆసరా అవుతాడని

నా నాన్న బందువు ఇంట్లో పెళ్లికని వెళ్ళాడు
ఎదురు చూస్తున్నాను వస్తే పెళ్లి కబుర్లు చెప్తాడని
మా అక్క పిల్లని చంకనేసుకుని ఇంటికి పోదామని బస్టాండులో నిలబడింది
అక్క కోసం ఎదురు చూసే మేమంతా నీ కేం అపకారం చేసాము

నాకోడుకు మాంసం ముద్దలా మార్చురీలొ వున్నాడు
అక్క కాలుకి గాయంతో పిల్లని ఓదార్చుకుంటూ ఏడుస్తోంది
మానాన్న తిరిగిరాని లోకాలకి చేరుకుంటే అమ్మని ఓదార్చగలనా

నువ్వేరో తేలీదు మతం అంటున్నారు ఉగ్రవాదం అంటున్నారు
నగరం గోడలనిండా గుర్రండేక్కల నాచులా చుట్టుకున్నావు
నా నగరం ఇప్పటికే యువరక్తాలతో మరణ చరిత్రలు రాసుకుంటోంది
గర్భ శోకాలతో పమిటచెంగు తడీ ఆరటం లేదు
కోడుకు చనిపోతే కోడుకా బలి అయినావురా అంటూ ఏడ్చాను
న్నాన్న అక్క అన్న తమ్ముడు ఇందర్ని పోగోట్టుకున్నానే
నా కంటి తడీ ఆరుతుందా?

నేను మాత్రం అమ్మని అందర్ని పోగొట్టుకున్న అనాధని
ఎవరేవరో వస్తారు ఓదారుస్తారు అయ్యా అడుగుతున్నాను
నన్ను నాకుటుంబాన్ని చంపడమెందుకు ఓ దార్చడమెందుకు
నన్నూ చంపేయండి ఇంక రక్తాలని తెగిన తలల్ని ఈ ఒడి మొయ్యలేదు
అమ్మని చంపేస్తే కుటుంబం ఎక్కడ ఆడపిల్ల మొగపిల్ల మతము భాష
ఏవి ఉండవు

ఆలోచించండీ అమ్మని చంపేయండి..

Wednesday, 23 January 2013

అక్షరాలకు ఆయువు పోసిన లోపలి స్వరం

సారస్వతం 
పుస్తక పరిచయం - 1

- సమీక్షకులు ; శైలజామిత్ర

కవిత్వానికి గుండె ఒక నివాసం . తలుపు తీసినప్పుడల్లా ఒక్కో తలపు మనల్ని పలకరిస్తూ బయటకు వెళ్ళిపోయి కవి అయితే అక్షరంగా,, కాకుంటే ఒక జ్ఞాపకంగా రూపు దాల్చుతుంది.. , కలలు కూడా మనలోని భావాలే అని తెలుసుకునేది ఒక్క కవి మాత్రమే అనే మాటకు కవిత్వమే సాక్ష్యం. కవిత్వం లో ఎప్పుడు అభూత కల్పనలు ఉండవు కేవలం అనుభూతులు తప్ప. తపస్సు చేసుకునే రుషి భావుకుడు కాలేడు. ఆ తపస్సును గమనించే వ్యక్తి మాత్రం తప్పకుండా కవిగా మిగిలిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత్వం పూజ కాదు. నైవేద్యం. కవిత్వంలో ఎన్ని అలలు ఉన్నా జడి మాత్రం ఉండదు. అంతా నిశ్శబ్దం ...

రేణుక అయోల కవిత్వానికి ఒక ముద్ర ఉంది. మానవీయ స్పర్శ ఉంది. వీటన్నిటితో పాటు ఏదో కోల్పోయాననే ఆవేదన ఉంది. గుండెలో తడి ఉంది. ఉదాహరణకు కాలం ఎపుడు కధ చెబుతుంది అనే వస్తువును తీసుకొని నా పేరు కాలం అనే కవిత రాసారు. "నువ్వు నన్ను తెలుసుకోవాలంటే /యుగాలతో సంభాషణ జరపాలి/మృదువైన పిల్ల గాలిని అడగాలి" అంటారు. ఎంత బరువైన భావం ? మొదటిది యుగాన్ని మరొకటి పిల్లగాలిని రెంటినీ సమాన స్వరంలో మనకు చూపారు. ఇక్కడ యుగం అనేది గతం. పిల్లగాలి అనేది వాస్తవం, ప్రస్తుతం. అంటే మనిషిని గురించి, కాలాన్ని గురించి విపులంగా తేలపాలంటే రెండు వాస్తవాలను అడిగి తెలుసుకోవాలి అంటారు.

కాలాన్ని అంచనా వేయడం అంత సులభం కాదంటారు.

అడవిని అంచనా వేయడం చాలా ప్రయాసతో కూడిన పని అంటాను. ఎందుకంటే అడవి విశాలం, ఏ మూలా ఏముందో తెలుసుకోవడం, ఎలా వెళితే బయటకు వస్తామో తెలుసుకోవడం అనేది చాల కష్టం. ఒక్కసారి అన్నీ కని పెట్టగలిగామంటే ఇక అదే స్వర్గం అవుతుంది. అలాంటిది అడవిలో ఒక రాత్రిని గురించి తెలిపే అరుదైన ప్రయత్నం చేసారు. ఈ వాక్యాలు గమనించండి ఆ రాత్రి/ అడవిని చుట్టుకున్న వెన్నెల దీపం/చీకటిని మింగిన చందమామ/అడవిలో నడుస్తున్న నన్ను పెనవేసుకున్నాయి// రహస్యాలను చేదించాలని ఉద్వేగం/ కొమ్మ కొమ్మను పలకరించాలనే తపన/చల్లటి స్పర్శతో ఆత్రుతగా నడిచే నడకలు/పచ్చటి చీకటి నీడల్ని చీల్చే / వెన్నెల పాయలు/ గడ్డి పొదలు/గుండెను గుబులు పట్టించే కూతలు.. అంటారు . ఎంత అద్భుతం? ఈ వాక్యాలు చదువుతుంటే మనం అక్కడే ఉన్నామేమో అనే భావన కలిగించక మానదు.

కవిత్వం అనేది ఒక చిత్రమా? లేక శిల్పమా ? అనే సంశయం వస్తే ఖచ్చితంగా చిత్రమే అంటారు రేణుక అయోల గారు. అందుకే వీరి ప్రతి కవితలో ఒక అద్బుతమయిన భావ చిత్రం కనిపిస్తుంది.. అలాగే వీరి కవిత్వం చదవరులను కట్టి పడేస్తుంది.. హృదయం అనేది ఒక సముద్రం. అందులో ఎన్నో అలజడులు, ప్రశ్నలు, సందేహాలతో పాటు సమాధానాలు కూడా ఉంటాయి. కాని మనం ఒక్క సమాధానాన్ని మాత్రం వదిలి పెట్టి మిగిలిన వాటిపైనే దృష్టిని కేంద్రీకరిస్తాము. కాని ఈ కవయిత్రి సమాధానం వైపు కూడా దృష్టిని పెట్టారు.. చూడండి చిన్న విత్తు / తనకు తానే భుమిలోకి ఒదిగి /కాలానికి నమస్కరిస్తూ లేత చిగుళ్ళతో/గున గున ఎదిగి పలకరిస్తుంది". అంటూ చివరిలో అంటారు "చెట్టు మొదలును తడుముతుంటే / గిలిగింతలు పెడుతూ/ చిన్నారి మొలక/ గుండె గుడిలో వెచ్చదనపు పండగ అంటారు. రోడ్డు వెడల్పులో కనుమరుగవుతున్న చెట్లను చూస్తూ చలించి రాసిన ఈ భావాలలో నువ్వెంతగా నరికినా నువ్వు నువ్వు పాతిన చోటే మళ్లీ మొక్కై నిలవక మానదు. చెట్టు స్వభావం మొలకెత్తడం అనే విషయాన్ని ఎంతో అందంగా తెలియజేసారు.

ఇక్కడో విషయం మనం గమనించాలి. వీరి కవిత్వం లో సునిశితత్వం దాగుంది. సున్నితంగా గుండెను స్పృశించే గుణం ఉంది. గొంతును తీయగా పలికితే పరుష వ్యాఖ్యలు కూడా పరమానందం కురిపిస్తాయి. భావనలో ఎలా ఉన్నా పరుషంగా తోటి మనుషులను ఓదార్చినా సరే పారిపోయేలా చేస్తాయి. అందుకే మాట మంత్రం అంటారు. రేణుక గారు తన మృదువైన స్వరంతో ప్రకృతిని ఎంత ఆదరించారో చూడండి చినుకుల తెరలో/ తడిసిన మనసు శరీరం/ లేడి పిల్లలా గంతులు వేసింది. తడుస్తున్న పులా కొమ్మల్లో నేను / పువ్వునై తడుస్తుంటాను// ఎండా వానా కలబోసినా సాయంత్రం/ మబ్బుల్లో తల దాచుకున్న సూర్యబింబం/చినుకు తడిలో భూమిని అల్లుకున్న సుగంధ శ్వాస /ఆవిరి అవుతున్న వేడి ఇలా సాగుతుంది వీరి ధోరణి. కవి ప్రకృతికి దాసుడు అనే వాఖ్యానికి రేణుక గారి కవిత్వం ఒక గొప్ప ఉదాహరణ.

కలమనేది కాలంతో పాటు కదులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు మనల్ని హత్తుకుని నిరంతరం జ్ఞాపకానికి వస్తుంటాయి. అలంటి కవితలే నీటి బొమ్మ, మరణమే చరిత్ర, కొత్త ఉదయం పుట్టుక, ఊరి ప్రయాణం, పల్లకీలో పెళ్ళికూతురు కవితలు. ప్రతి కవితలో ఆర్ద్రత ఉంది. మానవత్వం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పరిశీలన ఉంది. కవికి పరిశీలనా ఎంత అవసరమో అంతా రేణుక గారిలో ఉంది అనడం అతిశయోక్తి కాదు.

ఇవన్నీ ఒక ఎత్తైతే. ఈ గ్రంధం చివరిలో ఒక పది వాక్య కవితలు ఉన్నాయి. వాటిలో కొత్తదనాన్ని మనం గమనిద్దాం. ఏ కవితైనా, చిన్నదైన, పెద్దదైనా, వాక్యమైనా, వాటిలో వస్తువుతో ఒడంబడిక ఉండాలి. అంటే వాక్యానికి, వాక్యానికి మధ్య సంవిధానం తప్పనిసరి. ముఖ్యంగా వాక్య కవితలకు చాల అవసరం. ఆ విషయం ఈ కవయిత్రికి తెలుసు. తెలుసు కనుకనే ఈ ప్రయోగానికి ప్రాణం పోశారు. ఉదాహరణగా ఈ వాక్యాలు గమనించండి. ఊడ్చి వెళ్ళిన రోడ్డు మీద పరుచుకున్న బొమ్మ కుంచెలు రంగులు లేని చిత్రం నేలనంతా కళాత్మకంగా మార్చేసింది. ఈ వాక్యం లో ఎంత భావన దాగుందో అందరికి తెలుసు. కళను ఎవరు ప్రదర్శించినా అది కళే అనే మాట ఇందులో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ కవిత అనుసరణ చూడండి. మధ్యాహ్నం ఎండలో మిల మిలా మెరుస్తూ పాదాల కింద పడిపోకుండా ఆ బొమ్మ తనని తాను రక్షించుకుంటూ దేవుడి రూపంలో చిత్రకారుడి ఆకలి రంగు తెలియనీకుండా తెల్లగా మెరుస్తూ, నిశ్సబ్దంగా చిల్లర నాణాలు మోస్తూ, వాడి గుండె తడిలో ఒదిగి తనలో తాను నవ్వుకుంటూ, నేలను నమ్ముకున్న చిత్రం లోపల ఎన్ని మెలికలు తిరిగినా, ఆకలి చూపులు రాకుండా అచ్చం గుళ్ళో దేవుడిలా గంభీరంగా ఉండిపోతుంది. ఈ ప్రక్రియ ఎంతో విలక్షణంగా ఉంది.. చదువుతున్నంత సేపు టాగూర్ గీతాంజలి, తిలక్ అమృతం కురిసిన రాత్రి గ్రంధాలు గుర్తుకు వచ్చాయి.

రేణుక అయోల ఒక నిర్దిష్టమయిన భావాలు ఉన్న కవయిత్రి. పదాల పొందిక, భావాల అల్లిక లో తనకు తానే సాటి అనిపించు కున్నారు. కవిత్వం ఎలా ఉండాలో అనే ఆలోచన కలిగితే ఒక్కసారి వీరి కవితలను తరచి చూస్తే చాలునేమో అనిపించక మానదు. వీరి భావాలు మరింత సుగమమై, మరింత సోయగమై మరో గ్రంధం రావాలని అభిలషిస్తూ అభినందనలు.

ప్రతులకు :

పాలపిట్ట బుక్స్
16-1-20//1/1,
403,విజయశ్రీ రెసిడెన్సి ,
సలీం నగర్, మలక్ పెట్, హైదరాబాద్.-36

ఫోన్ : 040-2778430
వెల: 60 రూపా

Thursday, 10 January 2013

KAVILOKAM BY : RENUKA AYOLA (a famous poet in Telugu) ENGLISH TRANSLATION: JAGATHI




POET’S WORLD

Poets always seem to be
Roving in another world
Flipping the pages of history, chewing the time
They roam around and amidst the people
Weaving threads around the world
They are caught like flies in the cobwebs
Pining with the poetic thirst
They douse themselves in mounds of books
The smilingly recede with poetry
They wander in silence

The non-stop poetry inside them flowing ever
Poets fly birds of childhood
They find kids laugh in the birds
They look upon flowers like children
Picking up the dried flower seeds
They again bloom poesy
They plant poetry in their dry lands of life
They hide within with poetic moisture
They rejoice
Looking at tiny sprouts, and prim roses

The poets of any times in their walk
They induce confidence in life
Flipping the histories
Of their planted seeds

Published November 15, 2012 Write a comment
user image
SnehaSK
Well done! Nicely rendered.
user image
PrEmJi PrEmJi
that's a mad world!
user image
nimal dunuhinga
They wander in silence ...................................! thanks for this great work.
user image
jagathi
thank u soooooo much for your lovely and immediate response sandra dear ..love j
user image
Sandra Martyres
Thank you for translating this gem on the subject of Poets into English.

Tuesday, 8 January 2013

by-- కాశీరాజు





















లోపలి స్వరం *

రేణుకా అయోలా లోపలి స్వరం కవితా సంకలనం చదివిన తర్వాత నా అనుభూతిని వీలైతే ఆ రచయిత్రితో లేదా నాలాంటి పాటకులతో పంచుకోవాలనిపించింది.లోపలి స్వరం ఆమె రాసిన రెండవ కవితా సంకలనం.ఇందులో ఉన్న కవితల్లో చాలామటుకు తన రోజువారీ జీవితంలోని సంఘటణలే, వాటిని అక్షరంతో అభిషేకం చేసి మనముందు ప్రతిస్టించింది.ఒకరి మనసులోని ఆంతర్యాన్ని లేదా వారి మాటలను అతి సులువుగా కవిత్వం చేయగలదీమే .
”ఆగిపోని కవిత్వం ఏరులై ప్రవహిస్తుంటే
కవులు పసితనపు పక్షులు ఎగరేస్తారు .
చిట్టి మొలకలవైపు గడ్డి పూలవైపు చూస్తూ సంబరపడిపోతారు.
ఈ కవులు ఏ కాలంలో నడుస్తున్నా,
వారు పాతిన గింజలవంటి చరిత్రను తిరగేస్తూ జీవితం మీద నమ్మకాన్ని కలిగిస్తారు .
ఈ కవులింతే” అని తన తాతగారి మాటల్లోని భావనల్ని ఆయన గొంతై,రాతై మనకు కవితను వినిపిస్తుంది .ఒకరిమీద ప్రేమనో, స్నేహాన్నో , ఒక ప్రదేశం మీద వీడిపోని ఇష్టమో ఆమె కవితల్లో కనిపిస్తాయి.
“జ్ఞాపకాలతో నలుగుతున్న ఆ ముఖం కనపడగానే
ప్రపంచం తెలిసిపోయినంత ఆనందం
దూరం అవుతున్న కొద్దీ
వేదనో, ఆవేదనో తెలియని తనం
ముఖం ముఖంలాగా కాక జ్ఞాపకంలా మనలో మిగులుతుంది “ అని
ఒక చిన్నప్పటి జ్యాపకాన్ని కవిత్వంతో గట్టిగా కట్టి, కానుక మీకు అన్నట్టు మనముందు ఉంచింది . తన మనసులోని భావాలే కాక వేరే మనుసుల్లోకి చొరబడి వారి భావాలను అంతే చక్కగా రాస్తారు . ఇంట్లో పాత గడియారం కింద వేలాడుతున్న తాత ఫోటో చూసి ఇలా రాస్తారు.
“ఎప్పుడు ఈ ఇంట్లో కాలుపెట్టినా
ఎడ్లబండి చప్పుడు వినిపిస్తుంది “
నాగలి చేత్తోపట్టి ఎడ్లబండి తోలుతూ , దాన్యాన్ని కొట్లో నింపిన చేతులు ,పట్టె మంచం,తెల్లని బొంత కాళ్ళ దగ్గర రాగి చెంబుతో వాళ్ళ తాతయ్య వెంటాడే జ్ఞాపకం అని చెబుతుంటే మనకళ్ళముందు ఒక పిచ్చరైజేషన్ ఏర్పడి కాసేపు ఆ తాతగారిని సజీవంగా చూడగలుగుతాము .
మనమనుకుంటాం కానీ ఒంటరితనం ఎవరికీ ఉండదు.అది బహుశా సాధ్యం కాదు. ఖాళీ ఖాళీగా కనిపించి నిండి ఉండే గాలిలా ఒంటరితన కూడా ఖాళీగా ఉండదు. సుడులెత్తే ఆలోచనలతో జ్ఞాపకాలతో ఎల్లప్పుడూ సందడి సందడి గా ఉంటుందని చెబుతారు ఒంటరి తనం అనే కవితలో! . ఇద్దరిమద్యా మూఖాభినయాన్ని ఎంతబాగా వివరిస్తారంటే
“ వేళ్ళ చివర అక్షరాలను పొదిగి
అరచేత సంజ్ఞలతో ముడిపెట్టి
కబుర్లని అనువదిస్తూ స్పర్శలతో బందాలనూ ముడిపెట్టుకోవాలని
ఆ ఇద్దరూ మౌనానికి భాషను నేర్పుతారు “
భాషలేని భావాలూ, విడమరచలేని సందిగ్ద రూపాల్లా వాళ్ళు
చేతివేళ్ళ కోనల్లో మాటల్ని సృస్టిస్తారు “
మౌనాన్ని భాషగా చేసుకుని మూకాభినయం ప్రదర్శించుకునే ఒక జంట గురించి ఇంత అందంగా ఎవరు రాస్తారు ?
"అమ్మా,నాన్న గురించి సమాజం అడిగినపుడు వాడికో పుట్టుక కధ ఉందని గుర్తుకొస్తుంది పసివయసులో గుండెలనిండా గాదలే కళ్ళనిండా అనాధ దృశ్యాలే ! పసితనమొకటి అప్పుడప్పుడూ పలకరించి పోతుంటుంది .రహదారిలో ఒకరికొకరు తోడుగా నడుచుకుంటూ బీదరికాన్ని తలాకాస్తా పంచుకుంటారు” ఇలాంటి వాక్యాలతో అనాద తనం గురించి రాస్తూ అనాద మనుసులనీ, మనసులనీ ఆలోసింపజేస్తుందామె.
“ఉన్న ఊరు, కన్నతల్లి మీద ప్రేమనీ ఎంతబాగా కవిత్వీకరించి మనకు అందించిందంటే ఊరిప్రయాణం అనే కవితలో
“ రోహిణీ కార్తె మద్యానపు ఎండ నిలువునా కాస్తుంటే
దిగుడు బావిలో ఈతలూ
ఆ స్నానం ఎంతో గొప్పది
బావిచుట్టూ చిన్న చిన్న అడుగుల కుదుళ్లలో నీరు
ఆ నీటి తడిలో పిచ్చుకల స్నానాలు “
ఊరిప్రయాణం ఎప్పుడు అనుకున్నా మనిషికన్నా ముందు జ్ఞాపకాలు పరుగులు తీస్తాయి . అని ఈ పుస్తకాని మనచేతుల్లో ఉంచుకునీ మనం కూడా మన వూళ్ళకు వెళ్ళి దిగుడుబావుల్లో మునకలేసి వచ్చేంతగా చక్కగా రాసింది.
తనవూరిలోని నదిని గుర్తుచేసుకుంటూ
“పల్లెమీద అలిగీ
దూరంగా జరిగీ
తనకు తానుగా నిచ్చలంగా పాయాలా పారుతుంటే
వర్షపు గొడుగులేక మండుటెండలో నిలుచున్నట్లుంది “
ఇసుక గొంతులో నీటి చెలమల తడి
పల్లెదాహం తీరిస్తూ! అని అమ్మలాంటి నది గురించి “అమ్మనది” కవిత

“అమ్మ వెళ్ళి పోయింది
అందర్నీ వదిలి వెళ్లిపోయింది
నన్ను ఎత్తుకుని లాలించిన చేతుల నుండి గాజులూ
పడుకోబెట్టి నలుగుపెట్టి స్నానం చేయించిన కాళ్ళ నుండి
కడియాలు వాటాలు పంచుకున్నాక
అమ్మ వెళ్లిపోయింది”
ఒక జ్ఞాపకం సూదిమొనలా గుచ్చుకుంటుంది
“ కూరలో ఉప్పు ఎక్కువైతే
ముఖం మీద పల్లాలు విసిరేసినా
ఉప్పు సరిచూసుకున్నాను కాను – అనుకునే అమ్మకి
అభిమానాలు,ఆప్యాయతలు పంచివ్వడమే తెలుసు “ అమ్మ జ్ఞాపకం గా మిగిలిన ఓ సందుపెట్టెని చూసినప్పుడల్లా ఆమె తన తల్లిని పల్లకిలో పెళ్లికూతిరిలా చూసుకుంటుంది . ఆ సన్నివేశాలు ఎంతో చక్కగా కనిపిస్తాయి తన ఊరి చిత్రాన్ని చూసో, లేదా వేరే ఏదైనా ప్రదేశాన్ని చూసో ఎంత చక్కగా ఆయాప్రాంతాలను అక్షరాలుగా చేస్తుందో ప్రేమకట్టడం,చిత్రం అయిన ఊరు లాంటి కవితల్లో మనం చూడవచ్చు
“శరీరం శిధిలమై చరిత్రలో బాగమైపోతుంటుంది
ప్రేమ సజీవమై పాలరాతి గుండెలో ఒదిగిపోతుంది
అడుగడుగునా ప్రేమ శిల్పచాతుర్యాలతోనిండి
తన ఒడిలో చేరమంటూ పిలుస్తుంది “
ఒక చారిత్రక కట్టడం తాజ్ మహల్ మీద రాసిన ఈ కవిత అద్భుతం .

“బర్త్ డే గ్రీటింగ్స్ కోసం ఎదురుచూపు
ఖాళీగా పడివున్న ఉదయాన్ని దాటుకునీ
అద్దరాత్రి గ్రీటింగ్స్ , గుప్పుమన్న విస్కీ వాసన
పొగడ్తలు, శరీరం నిండా గాయాలు
సుడితిరిగే దుఖ్ఖపు అంచుల్లో పుట్టినరోజు
మసక చంద్రుడిలా వెలవెలబోయింది
కానీ
మళ్ళీ వచ్చింది
హ్యాపీ బర్త్ డే మాతృత్వపు పరిమళం తియ్యగా రాగాలు తీసింది “
అని పుట్టిన రోజు కవితా ద్వారా ఒక నిశిత పరిశీలనని , జీవితంలో ఎదుర్కున్న సంఘటనల్ని కవితగా ఎలా మార్చిందో ఇక్కడ చూడొచ్చు
కొత్త ఉదయం పుట్టుక ,ఎవరో నేర్పిన పాఠం,జన్మరహస్యం ,పాత ఇల్లు ఇలా అన్నీ తమ ప్రాముఖ్యతను ఈ పుస్తకంలో చెబుతూ కనిపిస్తాయి .
“నిద్రపోతున్న దేన్నైనా లేపొచ్చు
నిద్రపోతున్న సాహిత్యాన్ని ఇప్పుడిక పెడబొబ్బలతో లేపాలి
మనకోసం సాహిత్యం నాగలిని
భుజానికెత్తుకోవాలి
దుక్కి దున్నిన భూమ్మీద
ఆప్యాయతల గింజలు జల్లుకోవాలి
మొలకెత్తిన మొలక
మేలుకోవాల్సిన సమాజానికి ప్రతీక “ అంటూ “రాయాల్సిన వాక్యం” రాసేసి, ఈ పుస్తకానికి కవీ,లేదా కవయిత్రీ ఎప్పుడూ రాస్తూనే ఉండాలి అని వాడ్రేవు చినవీరభద్రుడు ముందుమాటగా రాసిన వాక్యాలు నిజం చేస్తుంది .ఈ పుస్తకం చదివి అభిప్రాయం రాయడంలో నేను ఎంత సఫలమయ్యానో తెలియదుగానీ నేను ఇక్కడ రాసింది ఆ కవితల్లోని ఖచ్చితమైన ఆతృత కాకపోతే నేను మిగతా పాటకులని తప్పుదోవ పట్టించినట్టే అవుతుంది . అయినా యధావిదిగా పుస్తకం చదివిన తర్వాత అది నాకు పంచిన అనుభూతిని ఇలా రాస్తున్నాను .వాస్తవికతను అక్షరబద్దం చేయడానికి మీ చేతుల్లో ఉండాల్సిన పుస్తకం ఇది .

లోపలి స్వరం
కవయిత్రి: రేణుకా అయోలా
ఈమైల్:isola.renu@yahoo.com
కవర్ డిజైన్ :మహేశ్ మలైకర్
వేల:60 రూ /
పేజీలు:119
ప్రతులకు :పాలపిట్ట బుక్స్ , kinige.com