ప్లాస్టిక్ సంచి చెత్తతోపాటు చెత్తకుండిలో విసురుగా వచ్చిపడింది
నిద్ర పోతున్న శవంకూడా అక్కడే దోర్లుతోంది
మత్తుని నీళ్ళతోకలుపుకున్న శవంకోసం ఎదురుచూసేవాళ్లు చూస్తూవుంటారు
వాడు కోడుకు కావచ్చు భర్తకావచ్చు తోబుట్టువు కావచ్చు
ఎవరైనా వాడు నిద్రపోతున్నశవం
గేటుకి గదిలో గడియారానికి అతుక్కుపోయిన కళ్లు
అవమానాలని అస్సహా యతని ప్రశ్నించే కళ్లకోసం
మత్తుతో మూసుకుపోయే రెప్పలని తెరవడాని ప్రయత్నిస్తూ తూలుతూ
గేటుకి వేళ్ళాడే మనిషికోసం ఎదురుచూపు
పడకగదిలో పిల్లలు నిద్రనటిస్తారు
అమ్మనాన్నా లు అరుస్తుంటే జతువుల్లా పోట్లాడుకుంటుంటే
అమ్మ దు;ఖం తలుపుల ఖాళీలని తోసుకుని వినిపిస్తుంది
ఏడుపు తీగలు వేసుకుంటున్న మొక్కలా పాకుతూ గదిని అల్లుకుని
నిద్ర అంటె భయం వేసేలాచేస్తుంది
నాన్న ఇంకా రాలేదు
గదిలో ఫేను తిరుగుతోంది మెల్లగా
నిద్రఒడిలోకి జారుకుంటున్నా భయమే
ఎక్కడ అమ్మగోంతులోంచి వూడిపడ్డ శోకం తీగలా అలుకుంటుందోనని
పక్కలు చాలని పాక
అయ్య అనబడే రాక్షసుడు రాలేదు
రాకపోయినా బాగుండేది ఆరాత్రి నిద్రని గడుపుకుంటుంది
తడికన తోసే చేతులు దెయ్యానికి ప్రతిరూపం దాలుస్తాయి
బూతులు వే్ట కత్తులా మనిషి మీద విరుచుకుపడతాయి
అమ్మ శరీరం శక్తిని కోల్పోతుంది
సారా మత్తు హరించిన మగతనం కళ్ళుతెరచి ఆమె డొక్కలోపొడిచి
శరిరంతో ఆడుకుంటుంది
ఆరాక్షసుడి పాదముద్రలు పాకలో పిల్లల గుండెలొ తెగువని చూపిస్తాయి
చావుకోసం ఎదుచూసేలా చేస్తాయి
౨
అమ్మ తనని దోషి చేసుకుంటుంది
బీటలు వారిన కాలన్ని మూయాలని మట్టి పూతలుపూస్తూ
తాగుడు మానేసిన కోడుకునవ్వుని కలకంటూ
గేటు దగ్గర నిలబడుతుంది
చెదిరిన జుట్టు నలిగిన ముఖాన్ని తడమడంకోసం
మానేయరా కన్నా ఈ అలవాటుని
మళ్ళీ మళ్ళీ చెప్పడంకోసం
ఒడిలో జారుతున్న కోడుకు నిద్రపోతున్న శరీరాన్ని తడమడం కోసం
గేటుకి కళ్ళని వప్పచెప్పి అలికిడికి కోసం ఎదురు చూస్తూనే వుంటుంది
౩
అక్కడ శవం మాత్రం నిద్రపోతోంది
కుక్కలు చుట్టుముట్టినా
జేబులు తడిమి ఎర్ర ఏగాని లేని శవాన్ని కాళ్లతో తన్నినా
శవం నిద్రపోతూనే వుంది
ఎదురు చూసేవాళ్ళకళ్ళని తప్పించుకుని
(నడి రోడ్డుమీద చెత్తకుండి పక్కన ఒంటిమీద సృహలేకుండా తాగిపడివున్న ఎవరిని చూసినా అలోచనలు ఇలా దొలుస్తాయి)
No comments:
Post a Comment