మాఅత్తగారు అమ్మాయి నువ్వీవ్వాళ మజ్జిగ చిలికి వెన్న తీయ్యాలి అన్నారు ఉలికి పడ్డాను నేనా ? ప్రశ్నార్ధకంగా మొహం పెట్టి
అవును నువ్వే అన్నారు చిన్నగా నవ్వుతూ పూజ గదిలోకి వెళ్లబోతూ
రాదేమో అన్నాను నసుగుతూ ,
ఎందుకు రాదు అదేమైనా బ్రహ్మ విద్యా రాకపోవడానికీ అంటూ పూజగదిలోకి వెళ్ళిపోయారు
మీక్కూడా అనిపిస్తోందా మజ్జిక చిలకడానికి ఎందుకింత భయం మరీ చోద్యం కాకపోతేనూ.. అనుకుంటున్నారా
గబగబా మిక్సి దగ్గరకి వెళ్ళీ గిర్రున ఓ తిప్పు తిప్పేయక.....
అసలు విషాయానికి వస్తున్నాను నడవ వాకిట్ళో స్థంబానికి కట్టేసిన పద్దతాడుతో కవ్వం సిలవరు గిన్నెనిండా మజ్జిగ
మజ్జిగ తోణకకుండా చుట్టుపక్కల చిందకుండా తాడుతో కవ్వాన్ని తిప్పుతూ వెన్న తీయాలి..
తాడు రెండు చేతులతో పట్టుకుని తిప్పుతుంటే చేతులుకున్న గాజులు గిన్నెలో కవ్వంతోపాటు చిలక పడుతున్న మజ్జిగ
ఒక చక్కటి లయతోకూడిన జుగల్ బందిలా వినిపిస్తుంది చెప్తూవుంటే బావుందికదా
ఆలోచిస్తూ నిలబడ్డాను ఎలా తిప్పాలీ గిన్నే జరిగి పోతే మజ్జిగా చుట్టుపక్కల చిమ్మితే ?
కోత్త కోడలిగా నాకదో సవాలు
అటుగా వచ్చిన మునెమ్మ అమ్మాయిగారు ఏంటండీ ఆలోచిస్తున్నారు ముందు ఆతాడు అందుకోండి అంది ముసిముసిగా నవ్వుతూ
దాని నవ్వు చూస్తే ఇంకా ఉక్రోషం వచ్చింది
ఇంతలో మావారు వచ్చారు ఎలా అన్నను కళ్ళతో ?
హటాత్తుగా నారెండు చేతులు పట్టుకుని తాడుని రెండు చేతుల్లో పెట్టీ ఇలాగా చెయ్యి అన్నారు తాడుని స్పీడుగా తిప్పుతూ
బెల్ న్స కుదరక కవ్వం గిన్నె అంచులుకి కొట్టుకుని మజ్జిగా తుళ్ళీ నేల మీద పడిపోయింది
నేను పట్టుతప్పి వెనక్కి ఒరిగిపోయాను
కావిడితొ మంచినీళ్ళు తీసుకోచ్చిన రావుడు, మందారపూలు అత్తగారి పూజకోసం తీసుకోచ్చిన పక్కంటి సూరమ్మగారు
కట్టువిడుపు బట్టలు ఉతకడానికి తీసుకెళ్లడానికోచ్చిన సరివి అందరు నవ్వగానే ఏడుపొచ్చింది
మీవల్లే ఇదంతా జరిగింది అన్నాను కళ్ళనిండా నీళ్ళతో మావారితో..
ఇంతలో మా అత్తగారు పూజ గదిలోంచి వచ్చి నీకో విషయం తెలుసా చిన్నపటినుంచి ఈ పల్లేటూర్లో నే పెరిగాడు మీఆయన
ఒక్కరోజుఈ మజ్జిగ గిన్నెవైపు ఒస్తే ఒట్టు అరచేతి నిండా నెయ్యి ఒంపుకోవడం.వెన్న ముద్దలు తీసుకుని తనడం తప్పించి
నువ్వంటె పట్నం పిల్లవి నీకు తెలియదు మరివాడికో అందుకుని నీపుణ్యమా అని వాడికి మజ్జిగ చిలకడాని కో కవ్వం దానికో రెండు తాళ్ళు ఉంటాయని తెలిసింది గోప్పవిషయమేకదా
రేపటినుంచి ఇద్దరు కలిసి మజ్జిగ తిప్పివెన్నతీయండి అన్నారు
అమ్మా నన్ను ఇలా ఇరికించకు పొరపాటున వచ్చాను మీకోడలికి నేర్పుకుంటావో మానేస్తావో అదినీ ఇస్టం అంటూ తువ్వాలు తీసుకుని
ఏటి స్నానానికి పరిగెట్టారు
నవ్వుతున్న నన్ను చూసి హమ్మయ్య నువ్వు నవ్వావు అదేచాలు/ చూడు నీకళ్ళు నవ్వు ఏడుపుని నింపుకోన్న ఇంద్రధనస్సులా వున్నాయి అంటూ ప్రాసాదం చేతిలో పెడుతూ చూసావా ఆడవాళ్ళే అన్నిపనులు చెయ్యాలి పని అనగానే ఎలా పరిగెట్టాడో
అందుకనే మనకి రిటైర్ మెంటులేదు హవుస్ పెన్ షన్ లాంటివికూడా లేవు......
”దంచినమ్మకి బొక్కిందేకూలి” అన్నట్లు.. నిజమేకదా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళు బతకుంటే అన్నేళ్ళు వంటీంటీ గడపలని అలుపు సొలుపు లేకుండా దాటుతుండాలి...
No comments:
Post a Comment