మూసిన తలుపువెనక వాడు వెళ్ళిపోతున్న అడుగుల సవ్వడి వినిపిస్తూనేఉంది
నేను వెళ్ళిపోయాక నువ్వు జాగ్రత్తా అంటాడు
కాని గదిలోపల వాడు ఇంకా ఉన్నాడు
పాటలు పాడుతున్నాడు ఫియానో వాయిస్తున్నాడు
అమ్మా అకలి ఏమున్నాయి అంటూ బుజాలమీద ఊయలలూగుతున్నాడు
వాడున్నతసేపు వాడిని పెద్దవాడిని చేసేసాను
పోరాడలేని ఘర్షణలు దాపరికంలేని బిడియాలు
ప్రవహించీ ప్రవహించీ
వాడి లేతమనసు ప్రవాహపు సుడిలో కోట్టుకుపోతున్నా
మాట్లాడుతూనే ఉన్నాను
ఈఏకాంతంలో వాడు శబ్ధమై గదంతా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాడు
చదువుల బరిలోకి దింపేసి వాడు వెళ్లకూడదనుకుంటాను
బయట ప్రపంచంలో వాడు వ్యధ శిలమీదే ఉంటాడు
ప్రేమ కోలనులో వాడు నెలవంకలా తేలుతుంటాడు
తలవంచుకుని అలోచనలని రెప్పల పరదాలలో దాచేసి
నవ్వుతాడు నాఒడిలో తలదాచుకుని
వాడు ఇంకా పరుగులు తీసే లేగదూడ లా అనిపిస్తాడు
లోపలి మాటలని బుజాన మోస్తున్నప్పుడు
స్కూలు పిల్లావాడిలా అనిపిస్తాడు
కాని వాడు మాత్రం పోడి మేఘాలకి నీరందించే ఆవిరి నవుతానంటాడు
మూసేసిన తలుపు వెనక వాడు వెళ్ళిపోతున్న అడుగులసవ్వడి వినిపిస్తూనేఉంది.
No comments:
Post a Comment