వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున ముసిరెనే
ఇది ప్రణయమా ప్రళయమా
ఇది ఒక పాటలోని పల్లవి(యువ కవి శ్రీ మణి) రాసింది
ఈ రోజెందుకో గాని ఎన్నో రోజులుగా ఒక సంఘటన నాలోనే నిద్రపోతున్నట్లు నటిస్తూ
ఈపాటతో నిద్రలేచి జ్జాపకాన్ని తవ్విపోసింది.
ఒక సారి రైల్లో కలిసిన అమె ఎవరో తెలియదు, గంట పరిచయం మాత్రమే.
అయినా తన మనసులో మాటలని గబగబా చేప్పేసుకుంది
చిన్నప్పుడే భర్తని పోగోట్టుకుని పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుని వాళ్ల ఆనందంలో తనని వెతుకున్న ఆమెకి వంటిమీద వచ్చిన చిన్న ఎలర్జీకి/ ఎవరితో తిరిగితే వచ్చాయో అలాంటీ ఎలర్జీలు/కోడలు అన్న మాటలకి
శ్రావణ శుక్రవారం పేరంటాలకి రమ్మని బలవంతం చేసి నలుగురిలో పసుపు కుంకుమ ఇస్తే్,వాటికే పెద్ద అనర్ధం జరిగిపోతుందన్నట్లుగా భావించే స్త్రీలముందు,సంప్రదాయలముందు.
ఓడిపోతు తనని తాను నిలబెట్టుకుంటూ జీవన ప్రయాణంలో ఏం మిగిలిందని ప్రశ్నించుకుంటు ఒంటరిగా గంభీరంగా నిలబడుతూ ధైర్యంగానే ఉంది.
కాని ఎక్కడో గాయం వర్షానికి ముందుండే మబ్బులా, నా పరిచయం పిల్ల గాలిలా తాకింది
అంతే కన్నీటి జలపాతాలు చీరకోంగులో దాక్కుని తడితడి గా మిగిలిపోయాయి.
ఎన్నాళిలా ఒంటరిపోరాటం? ఎవరికోసం దేనికోసం నన్ను నేను హింసించుకుంటున్నాను.
అమె ప్రశ్నించింది సమాధనం అడగలేదు/మనసులో మాట చెప్పేసింది/తను దిగవలసి స్టేషను రాగనే దిగి వెళ్లి పోయింది
సమాధానం కోసం నేను వెతుకున్నాను.
అప్పుడు
"గంటి భానుమతి"గారు రాసిన కధ గుర్తుకొచ్చింది.
భానుమతి గారు రాసిన కధలో
దేవుడు ఎన్నో వారాలు ఇచ్చి అమెని ప్రత్యేకంగా తయారు చేస్తాడు.
వెనక వచ్చేప్రమాదాలని కూడా చూడడాని వెన్నక్కి కూడ కళ్లు పెట్టీ,ఎన్నో చేతులు పెట్టీ ఎన్నిపనులైనా సునాయాసంగా చేయడానికి ,యాసిడ్ పోసిన కాలని చర్మంతో ఇంక ఆ స్త్రీకి
దేనివల్ల ఆపదలు రాకుండా చేస్తాడు.అయినాచెంపల దగ్గర తడి.
పొరాపాటేక్కడని మధన పడతాడు/గుండె దగరవున్న చెరువుందని మరచిపోతాడు దానిని గనక గడ్డకట్టించి వుంటే? స్త్రీల దగ్గర ప్రశ్నలు ఉండవనిపించింది.
ఎంత కొత్తగా పుట్టించి ఏమిటి లాభం? నీటి చెమ్మా మిగిలుందిగా రాళ్ళను కరిగించడానికి.....
.
ఒంటరిగా ధైర్యపు గాలిపటాలెగరేస్తూ సమూహలలో తన నిర్మాణాల పునాదులను గట్టి పరచుకున్నాసరే తిరస్కారాల తుఫానులో చిక్కుకుంటూనేవుంటుంది /అప్పుడే వర్షముందర మబ్బులా గాలికి కదిలి జలపాతమై కురుస్తుంది/ఎక్కడో చిన్న విత్తు కోత్తగా మొలిచి ఇలా అనుకుంటుంది...
No comments:
Post a Comment