మేడ మీద పుచ్చపువ్వులాంటి వెన్నెల వేసవి కాలం పోద్దంతా వేడి గాడ్పులు ఉక్కపోత భరించాక
నూలపఫ్పు అప్పడాలు కుంపటిలో కాల్చినవి,వేడి ఇంగువ చారు అన్నాలు తిన్నాక మేడ మీద పడుక్కోవడానికి బోంతలు పట్టుకుని బల్దేరాం అందరం
మామేనత్త కూతురు సరళ ఇంకా రాలేదు తిన్న కంచాలు ఎత్తిఎంగిళ్ళు పెట్టి రావద్దూ మరి ..
ఈలోగ మేమంతా కంబారి సిమ్మడు మేడమీదజల్లిన నీళ్ళకి ఆవిరవుతున్న నేలమీదే బోంతలు వేసేసుకుని నిన్న సరళ చెప్పిన బండి వాడి కధ గురించి కొద్దిగా భయంగా కొద్దిగా ధైర్యంగా మాట్లాడుకుంటుంటే వచ్చిందిమేడమీదకి సరళ ఈ రోజు ఏంకధ చెప్తావూ అడిగాం అందరం
నిన్న ఎవరైనా భయపడ్డారా అడిగింది ఓణి సర్దుకుంటూ లేదు అని అందరం గట్టిగానే జవాబు చెప్పాము
నేను నమ్మను అంది జడముందుకి వేసుకుని సన్నజాజుల దండని సవరించుకుంటూ
జాజిపూల పరిమళం మెత్తగా డాబా అంతా పరుచుకుంటోంది
ఈ రోజుకూడా నేను దయ్యం కధే చెప్తాను చెప్పనా వద్దా అడిగింది చెప్పు చెప్పూ అన్నాం అందరం ఓదగ్గరగా ఒకళ్ళని ఒకళ్ళు ఆనుకుని కూర్చుని
మొదలు పెట్టింది ...
ఇంతలో కెవ్వుమని కేకపెట్టాడు భరత్ అదిగో ఆకొబ్బరి చెట్టు మీద చూడు ఏదో తెల్లాగా వుంది
అక్కా అది దెయ్యమేమో? అన్నాడు అందరం భయంతో ఆ చెట్టు వేపు చూసాము.కావొచ్చు అంది సరళ
దెయ్యాలకి కొబ్బరి చెట్లు అంటే ఇస్టంట అవి అక్కడనూంచి దూకి నూతిలో చేదవేసి నీళ్ళు తోడుకుని
నీళ్ళు తాగుతాయి అంది.
మరి చింతచెట్లు మీద వుంటాయిట కదా అన్నాడు భరత్ కోంచం ధైర్యం చేసి.అస్తమానం అక్కడే వుంటాయా ఇక్కడికి కూడా వస్తాయి అంది సరళ ..
నిజంగానే చెట్టు ఆకులమీద తెల్లని పల్చని పోగాలాంటిది ఊగింది అంతే
అందరం మామయ్యా ..కొబ్బరి చెట్టుమీద దెయ్యం అని అరుచుకుంటూ గబగబా మేడ మెట్లు దిగిపోయాము
మా అరుపులకి ఇంట్లో వాళ్లంతా గభారా పడుతూ వచ్చారు ఏమయ్యింది అంటూ...
దెయ్యం గురించి చెప్పాము దెయ్యమా పాడా, అసలు వాళ్లకి దెయ్యాల కధలు చెప్పోదని ఎన్నిసార్లు చెప్పాలి అంటూమావయ్య సరళని కోపడ్డాడు
నేను ఏం చెప్పలేదు వాళ్ళే చెప్పమని బతిమాలితే చెప్పాను అంతే అంది వయ్యారంగా జడని ముందుకివేసుకుని
ఇంతలో కంబారి సిమ్మడువచ్చీ ఏదండీ దెయ్యం అన్నాడు
అదిగో అంటూ కోబ్బరి చెట్టు చూపించాము వాడితో పాటూ మేము భయభయంగా అటే చూస్తూ .
అక్కడ ఏమి లేదు కొబ్బారాకులమీద విరగ కాస్తున్న వెన్నెల తప్పా..
చూసారా ఏమి లేదు పోయి పడుకోండీ అన్నాడు అయినా సరే ఆరాత్రీకి డాబామీద పడుక్కోం అని చేప్పేసి నట్టింట్లో ఫేనుకింద పట్టేమంచాలమీద సర్దేసుకున్నాము..
No comments:
Post a Comment