Saturday, 13 October 2012

ఈ మనసుని ఏం చెయ్యాలి?




    గబగబా పేజీలు తిరగవేస్తోంది పొందికగా గుండ్రంగా వున్న అక్షరాల వెంటఆత్రంగా ఆశ్చర్యంగా
పరుగులు తీస్తూన్నకళ్ళకిఏదో రహస్యం పొరలువిప్పుకుంటూ సిగ్గుపడేలా చేస్తోంది.
ఒక స్త్రీచుట్టు అల్లుకున్నఊహలు,చదువుతున్నకోద్ది  వేడి నెత్తురు చెంపలమీద జరజరా పాకుతోంది....
  ఖరీదైన కారు  రోడ్డుమీద గుంతల్ని తప్పించుకోలేనట్లే  ”ఇండ్రస్టలిస్ట్” భార్యగా , ఒక డైర్కెక్టర గా వుండి కూడా కిరణ్  పర్సనల్  డైరీని చదువుతూ చలించి పోయింది.
విసురుగా  మూసేసి  పక్కన పడేసినా, అక్షరాలు వెంటాడు తున్నాయి, "నయనతార" పేరు పదేపదే గుర్తుకొస్తోంది.ఎవరీ "నయన తార"?
 పర్సనల్  డైరీని  ఇంత నిర్లక్ష్యంగా  ఏలా మరచి పోయాడు?  అనట్లు ఇది కిరణ్ కారుకదూ.
తన కారు  రిపేరులో వుంటే కిరణ్ కారులోవెళుతోంది.కిరణ్  ఢిల్లి  వెళ్లాడు  ఈ రాత్రికి వస్తాడు, అడగాలా వద్దా? ఏమని అడగాలి?

వేగంగా దూసుకుపోతున్న కారు అద్దంలొ ఎన్నడు లేంది  తనని తాను చూసుకుంది "అనిత”నీట్ గా ట్రిమ్ చేసిన  అందమైన  క్రాఫ్ చెవులకి  కనీకనిపించని చిన్న డైమన్డ ఇయర్ రింగ్స్,జీన్స్ కుర్తా
మోడ్ర్న కంఫ్ ర్ట్ డ్రస్.ఈ లుక్స్ కిరణ్కి నచ్చలేదా?
ఆలోచిస్తూనే ఆఫీస్ ఛాంబర్లోకిఅడుగుపెట్టింది్.
అసలు కిరణ్కి జీవితంలోటుఅంటూ ఉందా?
ఆలోచనలు వదలక పోవడంతో ఎన్నో ప్రశ్నలు.

         జీవితం అంటే అన్నీ అమర్చిన విస్తరిలాఉండాలనే కోరుకుంటారు అందరు
  కొందరినే అది వరిస్తుంది, .”కిరణ్కిఅలాంటిజీవితం వరించింది,వరించిన జీవితం సాఫీగా సాగిపోతొంది.
మహా నగరంలో  ”ఇంటర్ నేషనల్ స్కూలు చదువు దగ్గరనూంచి  తండ్రిఇచ్చిన  ”ఇండస్ట్రీ,  మోడ్రన్ లుక్స్ గల భార్య అనిత దాక.
 ధనవంతులేఅనిపించుకోదగ్గ  జీవితం ." అందరూ ఈర్ష్య పడేంత.మరి ఇప్పుడు ఇంకా ఎంకావాలి?అలా అని నేనుఅనుకుంటున్నానా? తన మనసులో ఏదో వెలితి   వుందా అది నేనేనా?
అన్నీ ప్రశ్నలే సమాధానం దొరకటంలేదు.పని మీద ఏకాగ్రతకుదరడంలేదు
మీటింగ్స అన్నీ యధాలాపంగా ముగించీ,తనని డిస్ట్రబ్ చెయ్యదని చెప్పి
ఒంటరిగా కూర్చున్నా ఆలోచనలు వాటంతటవే పరుగులు పెడుతున్నాయి
        మళ్ళీ కళ్లముందుకి కిరణ్ డైరీలో అక్షరాలువచ్చీ వెంటాడుతున్నాయి

నన్ను అందరు చాలా అందమైయింది, తెలివైందిఅంటారు
 ఇల్లు,పిల్లలు భర్త ... అందర్నిచుట్టూతిప్పుకునే  ఓ అందమైన స్కూలు టీచర్ నువ్వు.
కిరణ్ఎన్నిసార్లు అన్నా నవ్వేసి ఊరుకునేది,ఇదంతా నాఒక్కదాని గురించి కాదుగా అంటూ..
కిరణ్ మాటల్ని పట్టించుకోలేదు.లేచిందగ్గరనుంచి మార్నింగవాక్స,లేదా త్రెడ్మిమీల్ మీద నడకలు శరీరంలోఇంచీఎవరూ పెరగ కూడదు,ఇంట్లో ఎక్కడా అనవసరమైన  తినుబండారాలు వుండవు.
అందుకే ఎక్కడికి వెళ్ళినా ప్రశంసలవర్షం.తల్లీకూతుళ్ళని అక్కా చెల్లెళ్ళాఅని,
తండ్రీ కొడుకులని అన్నదమ్ములా అని.!వీటన్నింటివెనక ఎంత శ్రమ.
కిరణ్ సహజంగా చాలా అందమైన వాడు,దానికి తోడు ఫిట్నెస్, మీసాలకి రంగు వేసుకోడు సహజంగా వుండాలనుకుంటాడు.అయినా అందరూ మెచ్చుకుంటారు.
బి.టెక్ ఆఖరి సంవత్సరంలో వున్న అబ్బాయి,మెడికల్ లో మాస్టర్స్ చేస్తున్న అమ్మాయి,ఇండస్ట్రీలో చేదోడువాదోడుగా వున్న భార్య,ఇవ్వన్నీ
కాకుండా బొద్దుగా జాకెట్టు అంచుదాక వున్న జడ జడలో మల్లెపూలుపెట్టుకున్న ఆవిడ "నయనతార" కిరణ్ మనసులో తిస్టవేసుకుని
పర్సనల్ డైరీలొ రోజు ఒక భాగం అయిపోయాక..మనసంతా మోద్దుబారిపోయింది.ఆ అక్షరాలు వెంటాడి వెధిస్తూన్నాయి.కిరణ్ డైరీలో అక్షరాలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి

  " హాయిగా సాగిపోయే జీవితం అన్ని వి్షయాల్లొతోడుగా వుండే అనిత
ఇన్నీంటి మధ్య చిన్నప్పటి జ్నాపకం. ఎదురింటి  మాస్టారి గారి అమ్మాయి  పట్టుపరికిణి,పొడుగు జడ ,బంగారు జడకుప్పెలు.మనసులో ముద్రించుకుపోయాయి.
బాపు హీరోయిన్  జడ అంత జడ కాకపోయినా  జాకట్టు  అంచులదాక వున్న జడ ఆ జడలో   మండు వేసవిలొ  జాజి మాల. ఆ రూపం చాలాఇస్టం
అనితని అలాగే చూడాలని అనిపించేది చిన్నకోరిక  ఎవరైన వింటే నవ్వుతారేమో భార్యని అడగడానికి మోహమాటమేమిటి? మొహమాటం కాదు ఎవరి స్వేచ్ఛ వారిది వేసుకునే డ్రస్ నికూడా నియత్రించడంఇస్టంలేక
అనిత ,కూతురు లాస్య ,కొడుకు భరత్  అందరు  నీట్ గా టీమ్ వర్కకర్స్లా   కోంచంకూడా పెరగనివ్వని  శరీరం కొలతలతో అందరూ మొగవాళ్ళల్లాతిరుగుతూంటే,ఎవరికి తీరిక చిన్న జాజిపూలదండ జడలొపెట్టుకోవడానికి?.మొగాళ్ళలాగ అని నేను అనుకుంటే సరిపోతుందావాళ్ళూ అనుకోవాలిగా.
వాళ్ళకి ఆ ఫిట్నస్ అరోగ్యాని సంబందించింది .కాని నేనే వాళ్ళలొ ఇమడలేక సతమవుతున్నానుఅనుకుంటూ నిట్టూర్చిన రోజులు ఎన్నో.

పూల బోకేలు షాపు దగ్గర డ్రయివ ర్   నిలబడి బోకే  కొంటున్నాడు సరిగ్గా అప్పుడేచూసాను ఆమెని   కారులొ కూర్చున్న నాకు ఆమె స్ప స్టంగా కనిపిస్తొంది
కొంచంబొద్దుగా ఒత్తుగా వున్న జుత్తు  చక్కటి కాట్ న శారి ప్రత్యేకమైన అందంకాకపొయినా  మన్సులొ ఆమె రూపం ముద్ర పడి పొయింది..కారు పక్కనేవున్న”స్కూటి తీసుకుని” వెళ్ళి పోయింది
 అది చాలా మాములు విషయం ,ఇస్టమైన విషయాలు ఎదురు పడగానే మనసులొ అవి  బలంగా  ముద్రించుకు పొతాయి, నావిషయంలో  అదేజరిగింది.
మనసులో    కోరిక బలంగా వుంటే   అది అయి తీరుతుంది అంటారు.  ఆదే జరిగింది  మళ్ళీ    . అనుకోకుండా అమే కనిపించింది.పింక కలర్ కాటన్ శారీలో   జడలో  జాజిమాలతో   అలా చూస్తూ వుండిపోయాను.         . .
కోంచం  పక్కకి  జరుగుతారా   అడిగింది  నావైపు చూసి   సభ్యతమరచి పోయి  అమేనే చూస్తూ నిలబడీ పోయినప్పుడు,
చెవులకి ముత్యాల జుంకాలు ,మేరూన్ కలర్ కుంకుమ బొట్టు ..గ్రీన్ కలర్  బెంగాల్ కాటన్ శారి.....
అచ్చం”సాగర సంగమమం ” సినిమాలొ జయప్రదలాగ.
  అంద మైన కాటన్ చీరలు....జడలో జాజులు  కాకపోయినా   గూలాబి పువ్వైనా వుండాలి  .... కళ్ళకి సన్నని కాటుక,స్ర్తీకి తేచ్చే అదనపు అందాలు,నామన్సుకి నచ్చినట్లుగా కనిపించింది ఆమె
 అందుకే  ”నయన తారా” అనుకునేవాడ్నిఆ పేరుతోనే రాసుకునేవాడిని
 నాడైరీలొ  రోజు ఒక ముఖ్యమైన పేజిలాగ మారిపోయింది.అమెకనబడాలని అనుకోవడం
కనబడితే మురిసిపోవడం లాంటి చిన్నచిన్న ఆనందాలు.ఆమె ఎవరో తెలియదు.కాని రోజుకనబడాలని కోరుకునేవాడిని.ఒక రోజు హఠాత్తుగా మార్నింగ్ వాకలోకనిపించింది.
,నాఆనందం అంతా ఇంతాకాదు నలుగురు ఫ్రెండ్స మధ్యలో
నన్ను గుర్తుపట్టినట్లుగా పల్చని చిరునవ్వు.
 ఠక్కున పేజీ మూసేనా ..
     
                 వద్దు అనుకుంటూనే ,సభ్యతకాదు అనుకుంటూనే డైరీలో  విషయాలు తలచుకుంటే   ఎక్కడొ  ఓడీ పోయిన  ఫీలింగ్ అనితని నిలవనివ్వలేదు ...సక్సస్ కి చిరునామా తనజీవితం  అన్నివిషాయాల్లొ.   గెలుపుపొందడం ఒక మత్తులాంటిది ,అమత్తుని ”కిరణ్”  బద్దలు కొట్టాడా? కిరిణ్ మీద అనుమానమా? అలాంటి మాటలు వాడడానికి కూడ మనసు   ఇస్టపడం లేదు.
  కిరణ్ డైరీ నిండా  అమె గురించిన అభిప్ర్రాయాలు. ఏంతటీ ఆత్మీయులైనా, భార్య భర్తలైనా  ,ఎన్నివిషయాలు తెలుసుకున్నా  ఒక స్పెస్  వుంటుంది...అ స్పేస్ మంచిదా చెడ్దదా?
అది అలోచించే  వ్వక్తుల మీద ఆధార  పడి వుంటుంది.
 కిరణ్  స్పేస్  అదా? దాన్ని అంగీక రీంచాలా,మనసులో మాట అడిగేయాలా? అవును అంటే   ...అది భయంకర మైన ఓటమి.....
 డైరీలొ  అక్షరాలు  వెంటాడూతున్నాయి కిరణ్  మనసు   అద్దంలొ  ప్రతిబింబంలా కనబడుతోంది,కల్మషంలేని,స్వఛ్చమైన   అభిప్రాయాలు..
ఇంటికి రాగానే కూతురు లాస్యని అడగడానికి మొహామాట పడి.చాలా క్యాజువల్గా అడిగినట్లు అడిగింది.
                   ,నాకు నిజం అనిపించటంలేదు ..బహుస  అతను ఊహీంచుకున్న జీవితమేమో? అలొచించు  నాన్న అలా ఇంకరితో వుంటూ మనదగ్గరదాచాల్సినంత అగత్యరం లేదు   మన ఇంట్లో అందరం ఫ్రీ గా వుంటాము ,ఆయినా ఒకసారి   అలొచించి   అమె ఎవరో కనుక్కొ  అంది.
 అంటె అమనిషిమీద  నిఘా వుంచడమా?  నన్ను నేను అవమానించు కునట్లే.......తెగని ఆలోచనలతో   తనకి తేలియ కుండానే  ”కిరణ్”ని  గమనించడం మోదలు పెట్టింది అనిత.          

          అనితలో  అంతర్ యుధం మొదలు అయ్యింది   అనుకోకుండానే  కొన్ని సార్లు  కాఫి కేఫేలని వెతికేది,మళ్ళి  తనలొ తానే  సిగ్గుపడేది ఇది కాదు నా వ్యక్తిత్వం
వెంటాడి నిజం తెలుసుకుని  సాధించేది ఏముంది  ? మరి నోరు మూసుకోవాలా? ఏమిటి ఈ నోరుమూసుకోవడాలు సాధింపులు?   సాధారణ స్ర్తీగా ఎన్నడు అనుకూలేదు..అంటే
మనసు ప్రశ్నించింది...ప్రతీవిషయంలొ  స్వేచ్చ కావాలనుకూంటూనే  కిరణ్  స్వేచ్చని  అంగీకరించటంలేదా?  పర్సనల్ ...అన్నీ  లాప టప్ దగ్గరనూంచి  సెల్  ఫొనె దాక అన్నీ పర్సనల్ గా
వుండాలని    సమస్య వస్తే  అందరు ఓపన్  గా చర్చీంచుకోవాలన్న ధీమా కబుర్లు  చెదిరిపోయాయని దిగులా?  దేనినీ అంగీకరించని  అనిత  మనసు  ఆలోచనల వరదలొ కొట్టుకుపోయింది....  
         
    ఊహించని విధంగా  అనితకి  ఎక్సిడెంట్ జరిగి   పాదం ఫెక్చర్  అవడంతో   అరునెలలు ఇంచుమించుగా  ఇంట్లో  వుండిపొవల్సి వచ్చింది...అతరువాత  అనుకకోకుండా  లాస్యకి పెళ్ళి సంబంధంరావడం  అందరు కలసి   మగపెళ్లివారు  రమ్మని మరీ మరీ బలవంతంపెడితే  లండన్  వెళ్ళివచ్చిన హడావిడీ , ఆతరువాత పెళ్ళి పనులు.....
లాస్య  పెళ్ళి అయ్యాక లండన్ వెళ్ళి పొయింది  ...హాడావిడి తగ్గి  ఫ్యా క్టరీ  వెళ్ళడం మొదలు పెట్టాక ..బ్యుటిషీయన్  ”మేడమ్  " ఈమంత్ అయినా వస్తరా ..అని ఫొన్  చెసినప్పుడు తీరిగ్గా
అద్దంలో  చూసుకుంది   అనిత,  పొడుగ్గా పెరిగిన జుత్తుని,  పెరుగుతోందని  తెలుస్తున్నా  ..కాలు కింద పేట్టలేని పరి స్థితులు..అమ్మయి పెళ్ళి..మెల్లగా సంవత్శరంపాటూ  ఒదిలేసి జుత్తు
 బుజాలు దాటీ పెరిగింది....
నెక్సట్ వీక్ వస్తానని   బ్యుటీషయనికి చెప్పీ . స్నానం చేసి  గదిలోకి  రాగానే   ..మంచంమీద లైట్ కలర్  పింక కలర్   చీర  చాలా పాతది  ఎప్పుడు కట్టు కోలేదు కాబట్టి కొత్తగానే వుంది
దాని మీద జాజి పూల దండ .అలా చూస్తూవుండిపోయింది  ,ఈరోజు కొత్తకాదు ఒక ఆరు నెలలుగా సాగుతోంది  సీజనల్ జాజులు కాక పోయినా ,వాస న లేని  జజిమాల అయినా మంచంమీద
వుంటోంది....కిరణ్   రే్పటితో  ఇంకవీటి  అవసరంవుండదు అంది చీరకట్టుకుంటూ..ఏ జాజిపూలతో  బోరు కొట్టిందా  గదిలొ  లైటు తీసేస్తూ అడిగాడు  కిరణ్...
 రేపు బ్యుటిషియన్కి  టయిమ్ ఇచ్చాను...అంటే  హైర్ కట్ కూడనా?  అవును నాహైర్  స్టయిల్  అదేగా..ఇలాగే బాగుంది  వుంచేయకూడదూ ఆచిన్న జడనే సవరిస్తూ.
మనసులో ఎప్పటిదో కసి ...అప్రయత్నంగా బయటికి వచ్చింది  అనిత మాటల్లొ  ..ఏ మీ నయన తార” మిమ్మల్ని వదిలేసిందా?  పడక గదీలొ ఇంత మోనం  ఎప్పుడూ అనుభవించలేదు.
అ తరువాత కిరణ్ బయటికి వెళ్ళి పోయాడు..... ఛా  ఎందుకు  ఇంత తోందర పడ్డాను  అడిగి   తేలిక అయిపోయాను.ఎలా వున్న జీవితం  అలాగేవుంది  అదేప్రేమ  అదే మనిషి.....
ఏక్కడ  చిన్న మార్పు లేదు ..ఓడి పోయాను పూర్తిగా  ఇప్పుడు నా మీద ”నయన తార”గెలిచింది....
మోట్ట మోదటి సారిగా ఇన్నేళ్ళ సంసార జీవితంలొ  జరిగిన వింత..కిరణ్  అలా వెళ్ళి పోవడం..అనిత కళ్ళల్లో నీరు”.ఏడవడం అంటే  ఓడి పొవడమే ” ఓటమిని  అసహ్యించుకునే అనిత
కళ్ళలో తడి...........
 
        బ్యూటి పార్లల్  అద్దంలొ   చూసుకుంటూన్న  అనితలొ  ఏదో అశాంతి.  మళ్ళి  పాత హైర్ కట్  మోన్న పెళ్ళి కోసం  కొనుకున్న  డాయిమండ డ్రాప్స వున్న ముత్యాల ఇయర్ రింగ్స
చాలా బాగున్నరు  మేడమ్ మీరు  బ్యుటిషీయన్ పొగడ్త   ....హయి  యూ అర్   వండ్రఫుల్   ఫ్ర్ండ్స  పొగడ్తల పూల గోడుగు.....ఇన్నింటి మధ్య  ఒంటరిగా అనిపించింది....
కిరణ్  గెలిచాడన్న  కోపం. మళ్ళీ ” నయన తార ” కిరణ్ కి దగ్గర అవుతుందా? అసలు  ఎక్కడుంది  ఈవిడ? మళ్ళీ అన్వేషణ  మొదలా?
కిరణ్  ఫోన్  హలొ  అంది  ఎక్కడ వున్నవు  అడిగాడు.. పార్లల్లొ పని అయిపొయింది   ఇంటికి వచ్చేస్తున్నా....
అనిత  హైర్ కట్ చేయించు కున్నవా ?  అవును అంది అనిత  ....ఫొన్ కట్ చేసాడు కిరణ్....
         
     మళ్ళీ అనిత కూడా చెయ్యలేదు..కారులొ కూర్చుంటుంటే   ఒక   మేసేజ్  వచ్చిందికిరణ్ దగ్గర నుంచి  ”నయన తార” నన్ను ఒదిలి ఎప్పటి వెళ్లదు   అనితా నువ్వు వెళ్ళిపోయావు...
ఆ మేసెజ్ చూడగానే  దుఃఖం  వచ్చింది  .... ఓడి పోయింది  పూర్తిగా ఓడిపోయింది..........
     *          *           *        *          *        *
   (ఈ నెల vihanga.com) లొ ప్రచురించిన కధ.....

Sunday, 9 September 2012






రేణుక అయోల గారి కవితసంపుటి "లోపలిస్వరం" ఆవిష్కరణ సభ 8th sep 2012

అధ్యక్షత : ఓల్గా గారు 
ఆవిష్కర్త : శ్రీ కె. శివారెడ్డి గారు 
విశిష్ట అతిథులు: శ్రీ శిఖామణి గారు మరియు శ్రీ ఎం. నారాయణ శర్మ గారు

Tuesday, 14 August 2012


ఆమెకో అక్షర నివాళి

Posted By  on August 9, 2008
రేణుక అయోల
సాహిత్య లోకంలో
ఆమె పరిచయం
 కొద్ది నెలలు కావచ్చు…..

స్నేహ హృదయాన్ని
 అందిపుచ్చుకొన్నాను
ఎప్పుడు ఎదురొచ్చినా
నిండుగా నవ్వుల పువ్వులు వెదజల్లే
ఆ ఆత్మీతయను పదిలపరచుకొన్నాను
అందరితోపాటూ కలసీ
తలకోన అడవుల్లోనైనా
భూమిక ఆఫీసులోనైనా
మనతో పాటూ ఎన్నోసార్లు
 కలసి నడచిన
  ఆమె…
మన మధ్య లేదనుకుంటే
 సన్నని కోత
ఆమె మనకు కనిపించకపోయినా
మనతో ఇమిడిన గతం
పదే పదే తలచుకొనేలా చేస్తుంది
స్నేహం విలువ చాలా గొప్పది
అది ఎప్పుడూ గతించదు
 మన పరిచయాలు అక్షరాలే
మనమెంత తొందరగా
కలసిపోయి విడిపోయినా
 దూరాలు పెంచుకొన్నా
మిగిలిపోయిన జ్ఞాపకాలు
పుస్తకాల మధ్య
 పేజీల కొమ్మల చివర్న
  సజీవంగా గుర్తుండిపోయే
 ఆమెకో అక్షర నివాళి
  (భార్గవీరావుగారి స్మృతిలో)
Share
  1. భార్గవీ రావు గారి సాహిత్య కృషి, వన్నెకెక్కినది.కన్నడ సాహిత్యాన్ని, తెలుగువారికి,
    పరిచయము చేసారు. అటువంటి సాహితీ దీక్షా పరులుకు, నివాళి!!!

Wednesday, 23 May 2012

అవిటి నగరంలోకి ఒక ఋతువు









 ఏమాత్రపు చిన్న అలికిడైనా చేయకుండానే
బతుకుని కేలండర్  అంకెలుగా మార్చుకొని
తెల్లవారడం ,చీకటి పడడం-
వీటి మధ్యే ఇరుక్కుపోయి,అందులోనే
అటూ ఇటూ దొర్లుతూ
సూర్యాస్తమాల చిరునవ్వులైనా స్వీకరించకుండానే
సాగిపోతున్నప్పుడు,ఒక నిశ్శబ్ద సౌదర్యం
ఋతువుల ఆగమనాన్ని చూపించింది

శితగాలికి దుప్పటి కప్పుకోన్నట్లేవుంది-
వసంతం అడుగులు కనిపించకుండానే
చిరుచెమటలు మెడకిందకి జారాయి

అప్పుడే ఋతు సంగీతం ఒక పక్షిలా నదిలా
నగరంలోకి ప్రవేసించింది
దూరంగా సైకిలు వాడి గంపలో ఆకుదూయని
మల్లేలు గుబాళించాయి
వేపపూత తెల్లగా చెట్టునుంచి వంగీ వునికిని చాటుకుంది

పొగొట్టుకున్న వస్తువు దొరికినట్లుగా
మురిపించిన గతం
రెక్కలు తొడుక్కుని ఆ ఊరికి చేరుకుంది

మండువా లోగిళ్ళూ
నట్టింట్లో ఊయ్యాల బల్ల
వెండిపళ్ళేంలొ మల్లెమొగ్గలు దారంవుండ
మెడదాక దిగని జుత్తుకి మల్లేపూల జడ.

తోటలో కోకిల కూతలకి స్వరంకలిపి
విసిగించి నవ్వుకోన్న రోజులు
విరగ కాసిన వెన్నెల గుబాళించే మల్లేలు
రాత్రి తెల్లగా మెరుస్తూంటే
స్వేచ్ఛా మలయవాయువులు
ఎన్ని మొసుకు రాగలము?

ప్రతీ ఏడాది  వసంతం వస్తూనే ఉంది
అప్పుడప్పుడు గతంలా గుర్తుకి తెచ్చుకోవడానికే
అనుకుంటే-
నిరామయమైన జీవితంతో అవిటి వాళ్ళతోనిండిన
నగరంలో మనం ఒకరం....
         
 


















Friday, 13 April 2012

నాలోనే



నన్ను నేను దాచుకుందామనుకుంటూ
ఎప్పుడూ నీకు దొరికిపోతాను
నిన్ను వెతకాలనుకుంటూ
నన్నునేను వెదుకుంటాను
కాలం కరిగిపోతున్నప్పుడు

హఠాత్తుగా గాలివీచి
కిటికీ తెరుచుకొని
మనసుశబ్ధాలు వింటుంటే
భయమేస్తుంది మిత్రమా!
కాలం ఆగిపోవాలనుకోడం
నీకోసం కాలాన్ని దగ్గరగా జరపలనుకోడం
వెర్రితనమా
మరుపు కాలనికి కోలమానం అయితే
నిన్ను మరచి పోవాలని అది శాసిస్తే
నీకొసం పరుగులు తీసే మనసుకి సంకేళ్లు వెయ్యి
నీమనసు గదిలో బంధీ చెయ్యి
ఉరిశిక్ష వేసి మరణాన్ని ప్రసాదించు
నన్ను నామనసుని సమాధి చెయ్యి

అప్పుడు మరచి పోతాను నిన్ను.                          

నాలో నిన్ను దాచుకుని
వెదకడం మానేస్తాను........

Thursday, 29 March 2012

అచ్చం గాంధీగారిలా



నగరం దేహంలోకి పరకాయ ప్రవేశంచేసాక        
మాట్లాడుకోవడానికి ఏం మిగులుతుంది?
 ట్రాఫిక్ లో ఎర్ర లైటు పడి  ఆగగానే
కనిపించే దృశ్యాలు శరీరానికి అంటరానివి

పదమూడేళ్ళ కుర్రవాడు.
పరిగెత్తుకుని వస్తాడు
ఒంటి నిండా గ్రీజు పూసుకొని
అద్దాలు లేని కళ్ళద్దాలు,చేతికర్ర, పంచ
అచ్చం” గాంధీగారి" వేషంలో
చిరునవ్వులు చిందిస్తూ శిలలా నిలబడి పోతాడు.
ఎండ కాస్తూవుంటుంది
వాహనల పొగలు కమ్ముకుంటుంటాయి
అయినా నిశ్శబ్ధంగా నిలబడే వుంటాడు.
నిశ్శబ్ధంలోంచీ గతం గాలిపటంలా ఎగిరి
కళ్ళముందు వాలిపోతుంది.

నూలు వడికిన రాట్నాలు
ఉప్పుసత్యాగ్రహాలు,జలియన్ వాలాబగ్ నెత్తుటి మరకలు
"హే రామ్" అంటూ నేలకొరిగిన  జాతిపితా_
అర్ధ రాత్రీ స్వాతంత్రం,చిన్నప్పట్టి పాఠాలు గుర్తుకొస్తాయి.

స్వేఛ కరిగించిన మూసలో రంగుపూసలై               
కరిగిపోతున్న సంస్కృతిలో మేరుస్తూ
తెగిన గాలిపటంలా ఏచెట్టుకు వేలాడబడతామో?
కళ్లకి కనిపించేవి మేదడులో ఇంకకముందే
మనకోసం కూడా మనం ఆగని దశ

ఆకుపచ్చని లైటు పడుతుంది
చీమలు చెదిరినట్లు చెదిరిన మనుషులు వాహనాలు
క్షాణాల్లో మాయమైపోయాక-

వాడు ఎప్పటిలాగే చెదిరిన ట్రాఫిక్ తొపాటూ
వెనక్కి వెళ్ళిపోయీ,మళ్ళి పడే ఎర్రలైటు కోసం
చిరునవ్వులు సిద్దం చేసుకుంటాడు
ఎడాది పోడవునా ఎక్కడో అక్కడ
అచ్చం "గాంధీ్గారిలా" నిల్చోవడానికి.

ఏడాది ఒక్కసారే  గుర్తుకి తెచ్చుకోనే
కోట్లజనాభాకి వాడి చిరునవ్వుల "సలాం”
ఆ రోజంతా గుచ్చుకునే  విషంలో ముంచిన ముల్లు.


-






Sunday, 11 March 2012

అలారం


                    

పక్షుల కిలకిలారావాలుమొదలయ్యాయి,కిచకిచమంటు ఒకటే గోల.
”అబ్బా ” అప్పుడే తెల్లవారిందా  అనుకుంటూ బద్ధకంగా పక్కమీద దొర్లాను ఎంత విసుకున్నాలేవక తప్పదు
ఇప్పుడు లేచి పని మొదలుపెట్టక పోతే అన్నీ ఒకదానికి ఒకటి లింకులా అలస్యం అయిపోతాయి.
పక్కకి తిరిగి చూసాను పిల్లలు శ్రీవారు హాయిగా ఆదమరచి నిద్ర పోతున్నారు అదృస్టవంతులు మళ్ళీ జన్మంటూ వుంటే
అసలు ఆడపిల్లగా పుట్టకూడదు.
పొద్దున్నే లేవాలన్న ఉక్రోషంతో రోజు అనుకుంటాను,అయినా లేవక తప్పదు.
మంచం  మీదనుంచి దిగి బ్రష్ మీద పేస్ట్  వేసుకొ్ని తలుపు తీసి వరండాలోకివచ్చాను ఎదురుగా పచ్చని చెట్టు గుబురుగా పచ్చని ఆకులతోచల్లటి గాలి స్పర్స .అంతె  అప్పటి దాక వున్న విసుగు చిరాకు అన్నీ మంత్రం వేసినట్లు మాయం అయిపోయాయి.
తూరుపు రేఖలు మెల్లగా అకాశంలొ పరుచుకుంటు లోకాన్ని నిద్ర లేపు తున్నాయి. ఈ దృశ్యం ఎప్పుడూ అధ్బుతంగా వుంటుంది
రైలు బండి ఆగితే స్టేషనులో జరిగే హడావి్డిలా  చెట్టు మీద వున్న పక్షులన్నీ గోలగోలగా అరుస్తాయి.అటుఇటు ఎగురుతాయి
రివ్వున ఎగిరి వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చి వాలుతాయి.వాటి భాషలో ఎన్ని కబుర్లో !
బ్రష చేసుకుంటూ వాటీని గమనించడం  అలవాటుగా మారింది.
        వెలుతురు పూర్తిగా రాగానే అన్ని ఒక్క సారిగా ఎగిరి పోతాయి.మళ్ళీ  రైలు వెళ్ళాకా నిశ్శబ్దంగా అయిపోయిన ప్లాట్ ఫారంలావుంటుందా చెట్టు.
రోజు చుస్తూన్నాసరె  వాటి దిన చర్య తమాషాగా అనిపిస్తుంది
నిశ్శబ్దంగా అయిపోయిన చెట్టు మొదట్లోంచి సన్నని ’గజ్జెల  చప్పుడుల” పక్షిపిల్లలు  కిచకిచమంటుంటాయి

     వీటి  హడావిడే నాకు అలారం,అవి చేసే గోలకి విసుక్కోవడం అప్పుడే తెల్లవారిందా అనుకోవడం అలవాటుగా మారింది
పక్షి తల్లులు తిండీ గింజలకోసం బయటికి వెళితే  నేను ఇంటి పనికోసం వంటింట్లొకి..
పిల్లలిద్దరు లేచి పాల గ్లాసులతో వరండాలొకి వస్తారు ఆచెట్టుమీద ఎన్నో గూళ్ళు వున్నా ఒక కొమ్మ మీదగూడు మావరండాకిదగ్గరగా వుంటుంది.
అదే వాళ్ళిద్దరికి పెద్ద ఆకర్షణ  అందులోవున్న చిట్టిచిట్టి పక్షిపిల్లలు అమ్మ రాకకోసం నోరు తెరుస్తూ కిచకిచమంటూ ముందుకిజరుగుతూ భయపడుతూ వెనక్కి వెనక్కి జరుగుతున్న  వాటిచూడడం వీళ్లకిసరదా,వాటిని చూస్తూన్నంతసేపు ఎన్నో సందేహాలు
"అమ్మా" అవి కింద పడిపోవా పడిపోతే వాళ్ళ అమ్మకి ఏలా తేలుస్తుంది? గూడు దేనితో కడుతుంది? మెత్తగా వుంటుందా?
అన్నం ఎప్పుడు తెస్తుంది?ఇలాంటి ప్రశ్నలు రోజు వస్తూ వుంటాయి. వాళ్ళకి సమాధానాలు ఇస్తూనే వాళ్ళని తయారు చేస్తాను
ఆ సందేహల మధ్యలోనే టిఫిన్ తినడం అయిపోతుంది పేచీ పెట్టకుండా. అచెట్టు వల్ల నాకు ఎంతో లాభం.
ఆలా ఆ చెట్టు మా దినచర్యలో ఒక భాగం అయిపొయింది.
మేము వుంటున్న ఎపార్టమెంట్ నగరం నడి  బొడ్డులో్వుంది.చుట్టూతా కనుచూపు మేరలో ఖాళీ జగాలేకుండా  పేకమేడల్లా
ఎపార్టమెంట్లు. ఈలాంటీ రెండు ఎపార్టమెంట్ల మధ్య ఈ చెట్టుగల ఇల్లు వుంది ఇల్లు పూర్తీగా శిధిలమైనా  ఆ ఇంటి గోడనానుకొని వున్న చెట్టు దానిచుట్టూవున్న సిమెంటు అరుగు ఆ ఇంటివాళ్ళ జ్ఞాపాకాల సాక్షి నిస్వార్ధంగా మమ్మల్ని తన పచ్చదనంతో పలకరిస్తూవుంటుంది.
పిల్లలు స్కూలునుంచి రాగానే ఆడుకోవడానికి చెమ్చాఅంత స్థలం కూడా లేదు.రోడ్డు మీదవిపరీతమైన ట్రాఫిక్.మళ్ళీ పిల్లలందరికీ
ఆ ఇల్లే అడుకొనే స్థలంగామారింది ఆ చెట్టునీడలో సిమెంటు అరుగుమీద ఆడుకుంటూవుంటారు. ఎంత వద్దన్నా అక్కడికే వేళ్ళేవాళ్ళు.
చెత్త పిచ్చిమెక్కలు వున్నాయి ఎదైన పురుగు కుడుతుందని చెప్పినా వి్నేవాళ్ళుకాదు ఇంక లాభంలేదు వీళ్ళుమన మాటవినరు 
అనుకొని అందరం కలసి ఆస్థలం శుభ్రంచేయించాము.వాళ్ళతోపాటూ మాకు కబుర్లు చెప్పుకోవడానికి ఆ ఇల్లు అలవాటు అయ్యింది.
     ఆ చెట్టుని చూసి నప్పుడల్లా అనిపిస్తుంది ”నాటీంది చిన్నమొక్క”ఈ రోజు ఇంతమందికి నీడ,పచ్చదనం చల్లటిగాలితో పాటుఆ ఇంటి జ్ఞాపకాలు.
అన్నదమ్ముల గొడవల మధ్య ఆ ఇంటి అమ్మకం ఆగిపోయిందంటే బాధ,దాని కోసమే అనుబంధాలు తెంపుకున్నారని చెప్పుకుంటుంటేమనసు వికలం అయిపోతుంది.
ఆన్ని బంధాలకి మూలం ఈ డబ్బేనా?ఎంత కాదు కూడదు అనుకొన్నా ఇది అక్షర సత్యం. ఒక పేగు పంచుకు పుట్టీ ఒకే ఇంట్లో ఆడుకొని పెరిగామాని గుర్తుకి రానివ్వని ఈ డబ్బు ఎంతచెడ్డదికదా?
అందరు వెళ్ళిపోయాక  వరండాలోకి రాగానే చల్లటి గాలితో మళ్ళీపలకరించే  ఈ చెట్టుతో అనుబంధం రోజురోజుకి పెరిగి పోతోంది
ఎపార్టమేంటు కొనేటప్పుడు ఎన్నో  ఊహలు,ఎన్నో ప్లాన్లు వరండా అంతా చిన్నగార్డన్ లా వుంచుకోవాలని అందులో కుర్చివేసుకుని,కూర్చుని కబుర్లుచెప్పుకోవాలని తీరావచ్చాక ఎన్నో సమస్యలు కిందవాళ్ళ వరండాలోకి నీటీ చుక్క కూడా రాలకూడదు,
ఎప్పుడైనా ఊరికివెళితే-.ఊరినుంచి రాగానే వాడిపోయి చచ్చిపోయిన మొక్కలని  చూస్తే ప్రాణం ఉసూరుమనేది.
ఎంతో ఆప్యాయంగా శ్రద్ధగా పెంచుకొని  అవి అలా కళ్ళముందు  నిర్జీవంగా వుంటే చూడలేక.
వారండాలని ఖాళీగా వుంచుకొని ఇంటినిండా ప్లాస్టిక్ మొక్కలతో జీవంలేని వాటితోటే అనందం పంచుకోవడం అలవాటైపోయింది.
           ఖాళి సమయాల్లో ఇలాంటి ఆలొచనలు సాగిపోతునేవుంటాయి  గుమ్మందగరకి వస్తే చాలు  చల్లటిగాలులతోపలకరిస్తుంది.
  కాంక్రీటు నగరంలో మనం ఒక సిమెంటు పలకలా మారిపోతున్నాము..అభిమానాలు ఆత్మీయతలు
పలకరింపులు లేని ఇరుకైన జీవితాలు పచ్చదనాన్నే కోల్పొయాయి .
ఇన్ని అపార్టమెంటులు పుట్టగోడుగుల్లామొలుస్తున్నా కట్టే ప్రతీ అపార్టమెంటుకి ఒక పార్క ,పిల్లలకి ఆటస్ఠలం వుడలన్ననిబంధన వుంటేఎంత బాగుంటుంది. అందమైన బ్రోచర్లకే అంకితమైన  పిల్లల ఆటస్ఠలాలు .తీరాకట్టక వాటి నామరూపలు వుండవు ,నామమాత్రంగా
చిన్నగోడకట్టి  రెండు జారుడు బండలు వేసి బాధ్యత తీరిందని మళ్ళీ అడుగుదామన్నా పత్తాలేని బిల్డర్లు.
అడిగేందు నిలదిసేందుకు ఎవరికి ఓపిక? లోను కట్ అయిపోతుందన్న భయం అనుకొన్న సమయానికే అందచేసాడన్న అనందంతప్పించి ఎమీ మిగలదు.

 పిల్లలు ఇళ్ళలో చదువులు,కంప్యుటర్ గేముల మధ్య బంధీ అయిపొతున్నారు.పెద్దస్కూళ్ళలో తప్పించి స్ఠలందొరకడమే అబ్బురమైనస్కూళ్లల్లో ఆడుకునే స్ఠలాలేక్కడ?
పెద్దవాళ్ళు వాళ్ళచిన్నతనం కబుర్లు,ఆటలు చెబుతుంటే ఆశ్చర్యంగా వింటూ మీరు కొబ్బరిచెట్టు ఎక్కారా? అంతపెద్ద నదిలో ఈతలు కోట్టారా నాన్నా?అని అడగడం సర్వసాధారణమైపోయింది. అందుకే ఈసారి శెలవులకి  నానమ్మగారి ఊరు తీసుకు వెళ్ళాలని పెద్ద ఎత్తునప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఊరు వెళ్ళడానికి ఇంతప్రయత్నమా? ఆశ్చర్యమేమరి ! రైలు టికెట్లు ఆఫీస్ లో శెలవులు వెరసి అన్నీ కుదిరాయి కాబట్టి ప్రయాణం ఖాయం అయ్యింది.
ఎమిటొ ఈచెట్టుని చూస్తుంటే అలోచనలు ఎక్కడనుండి ఎక్కడికో పరుగెడతాయి.
పిల్లలస్కూల్ బస్సు హారన్ వినిపించి తుళ్ళి పడ్డాను ఈ రోజునుంచే శెలవులుమొదలు,అందులొనూ ఇవాళే ప్రయాణం కూడా
గల గలా  మంటూ లోపలివచ్చారు ఇద్దరు  నన్ను వెతుకుంటూ అమ్మా బ్యాగు సద్దావా అంటూ వాళ్లగదిలోకి పరుగులు పెట్టారు
స్కూలు డ్రస్సువిప్పకుండానే.హాడావిడి మొదలు అయ్యింది అనుకుంటూ వాళ్ళ వెనకాలే గదిలోకివెళ్ళాను

       కిటీకి లోంచివెలుతురు పడుతుంటే ఉలికిపడి లేచాను ప్రయాణం బడలిక అనుకుంటాను తెలివిరాలేదు అయినా పక్షుల సందడి  వినిపించనంత మొద్దు నిద్ర పట్టేసిందా? వాచీ వేపు చూస్తే ఏడు గంటలు చూపిస్తోంది.
ఈ వారంరోజుల్లొ వాటిసంగతే మరిచిపోయానా?,ఇంకానయం ఇవాళ ఆదివారం కాబట్టి సరిపో్యింది లేకపోతే ఉరుకుపరుగులు
స్కూలుకి వెళ్లమని పేచీలు ,ఏడుపులు గోలఘోష అనుకుంటూ ఆలోచిస్తూనే బ్రష్ మీదపేస్టు వేసుకుని వరండా తలుపుతెరిచాను ఎదురుగా నేలకూలిన పచ్చని చెట్టు రాలిపోయిన కొమ్మలు ,నాలుగు అడుగులు ఎత్తు లేచిన ఇటుకగోడలు.ఆ స్ఠలంలో ఎపార్టమెంటువచ్చేలావుంది ఆవ్యవహారం చూస్తుంటే .ఎందుకో కళ్ళలో నీళ్ళుతిరిగాయి.ఆత్మీయులని పోగొట్టుకున్న భావన
రేపటినుంచీ సిమెంటు, ధూళి,ఇనుపచువ్వల చప్పుడు,మరో పేకమేడ మొదలు...
     ఇంతలో పిల్లలు కూడాలేచారు ”అమ్మా చెట్టుకొట్టేసారు"ఆత్రంగా అరిచారు..ఇంకా బాల్కనీలోనే నిలబడి చూస్తూన్న చిన్నదాని
మనసునిండాఎన్నో సందేహాలు ” అమ్మా” ఆచెట్టుమీద పక్షులన్నీ ఎమయ్యాయి?  చిన్నచిన్నపిట్టలు ఏవీ ?వాటికి ఎగరడం రాదుగా
 వాళ్ళ అమ్మవచ్చి తీసుకు వెళ్ళిందా చెప్పమ్మా” అంటూ వేధించడంమొదలు పెట్టింది. దానికి ఏం సమాధానం చెప్పాలి?
అవును వాళ్ళ అమ్మవచ్చీ పట్టుకు వెళ్ళింది అన్నాను...

  ఇంతలో మాపెద్ద అమ్మాయి చిన్నదానికి చెబుతోంది మనుషుల్లా వాటికి వాళ్ళ పిల్లలని తీసువెళ్లడంరాదు ,అమ్మ నువ్వు బాధపడతావని అలాచెప్పింది .అంది పెద్ద ఆరిందలా  
     
   ఇన్నాళ్ళకి ఇల్లు అమ్మకంకుదిరింది కాబోలు ఎన్నో ఊహలతో కట్టుకున్న ఇల్లు ముక్కలైపోయింది,అందరికీ వాటాలు వచ్చినా
అందమైన పొదరిల్లు చెదిరిపోయింది ఆచెట్టులాగే  అది కూలిపోగానే పిట్టలన్నీ ఎగిరిపోతాయి...
ఇంకా ఎగరడంరానివి చనిపోయాయా?లేకవచ్చిరాని రెక్కలతో జీవన పోరాటానికి బయలుదేరాయా?
  మనసంతా ఎదో తెలియని చికాకుతో నిండి పోయింది.మూలపడేసిన గడియారం తీసాను అలారం కోసం....


   




.




   
     


          
   





Saturday, 3 March 2012

కోన్ -బనేగా.........


  
కిస్సాకుర్సీకా"  మంటలురేపే సింహాసనం
పర్వతాలాంటి మనుషులు ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతూ
ప్రపంచంముందు కుర్చుంటారు

గంభీర స్వరం స్వాగతంపలుకుతుంది
ఎదురుగా  కంప్యుటర్  నుదిటి రాతను సరిచేయగల బ్రహ్మదేవుడు.
ఆనేక  ప్రశ్నలు చిన్నతాళం
ఇన్నింటీనీ తట్టుకుని నిలబడ్డానికి చాలా కస్టబడాలి
గతంముందు మోకరిల్లాలి
లోకంలో మన స్థానాన్ని అప్పచెప్పుకోవాలి

”పంచకోటీ మహామణీ”  జాబవంతుడీ మెడలొ శమంతకమణీ
కోరి ఎంచుకున్న మెట్టు ఎక్కగానే
ఆశల సీతాకోకచిలుకలు చుట్టూ ఎగురుతూ
బవిష్యత్తు రంగులన్నీ లొలోపలికి ఒంపుతాయి

పలకరింపుల జడీవానలో తడిసిముద్దయ్యాక
ముక్కలుగా విరిగి పోకుండానిలబడ్డం చాలా కస్టం
చెక్కులు నిదానంగా అడుగులు వేస్తుంటాయి
సింహాసనంలొ కూర్చుని బేలగా మారిపోతూ
కన్నీళ్ళు పెట్టుకుంటూ మనసు మంటలని
ఆర్పుకోవడం అంటే-

పరిస్థితులమీదనుంచి,కష్టాలమీదనుంచి
ఆగాధాల మైదానాలమీద నుంచి దాటుకుని
నెత్తిమీద కీర్తి కీరిటాన్నిధరించి
అలఓకగా నేల మీదకాళ్ళు అనించి నడవడం.

అందరికి అదృష్టంగా అనిపిస్తుంది
అరికాళ్ళకింద  ధనాన్ని పేర్చుకుంటూ
ధీమగా నడూస్తుంటే అందరి ఆశలు మోస్తున్నట్లే
నడుస్తున్న వాళ్ళ వెనకాల
మోన్నటికన్నా నిన్నటికన్నా ఎన్నో తుఫానులు
ఎన్నో ఇంధ్రధనస్సులు రోజు వస్తూనేవుంటాయి...... 













Thursday, 1 March 2012

జన్మరహస్యం

కొత్తగా తెలిసిన జన్మరహస్యం
అక్కరలేని బిడ్డను,దొప్పలొ పెట్టి నీళ్ళళో వదిలేయడం?
***
కన్నప్రేమని అనుభవించని రహస్యం
ఆనందమో కోపమో ఎటూతేల్చుకోలేని మనసు
ఆవేదనతో ముఖాన్ని గుర్తుపట్టాలనుకుంటే
వెలుతురు అంటని చీకట్లో
నీళ్ళలొ ముఖబింబం కనిపించదు
వ్యాపించే వెలుతురుతోపాటు నిజం మెలిపెడుతోంది.

ఇ నాళ్ళకి కనిపించిన తల్లి నిజం
నిజాన్ని నీడలామోయ్యాలి
పెంచి పెద్దచేసిన "అమ్మ అబధం"
అనుకోవడానికి ఈ జన్మచాలదు

"సూర్యదేవుడి అనుగ్రహం
తెల్లటి కాంతితో,కుమ్మరివాడు మట్టితో బొమ్మని చెసినట్లుగా
కిరణాల పడవ మీద వచ్చావు-"
              అమ్మ చెబుతుంటే ఎంత గర్వం.

ఆ గర్వం తునాతునకలు అవకుండా
నిల్చోగలనా?
ప్రేమపాశం తెలియని  నిర్ధయురాలైన
తల్లిగర్భమే తనపుట్టుక-నాకే ఒక విస్మయం.!!!

విలువిద్యలో కీర్తి సంపాదించి
దుర్యోధన మహారాజు కుడిభుజంగా,
కీరీటంలో ప్రకాశించే మణిననిపించుకున్నాక
ఒక సంతృప్తి -

కుంతి పుత్రుడనని తేలిన నిజం
లోకాన్నంతా చీకటిమయం చేసేసాయి
నిజం నిర్దయగా ఆలస్యంగా  ప్రవేసించి
ఏం సాధిస్తుంది?
నిజాన్ని తన కడుపులొనే దాచేసి
తన ఒళ్ళోనే చనిపోయిన అమ్మ

రూపులేని నల్లటినదిలో ఈత
తనది అచ్చం కుంతిరూపమట!
***
వెలుతురు సోకని చీకట్లో
నీళ్ళలొ నా ముఖబింబం నాకేమాత్రమూ కనిపించదు.


(ఎస్.ఎల్ భైరప్ప ’ పర్వ’ చదివాక.....)

Tuesday, 21 February 2012

కొత్త ఉదయం పుట్టుక





ఉదయం కిటికి తెరవడానికి రాత్రిని అనుభవించి
ఒంటరి నడకలకి పెట్టుకున్న పేరు
మార్నింగ్ వాక్ .

రోజు చూసే చెట్లు, మెత్తటి గడ్డి
పొగమంచు తెరలో చిక్కుకున్న వెలుతురు

 సిద్దంగా వుండే్ పచ్చగన్నేరు పూలమడి
అలవాటుగా చిరునవ్వులు సంతరించుకున్న పలకరింపుల ముఖాలు
*     *  *

ప్రతీ ఉదయం అక్కడ కొన్ని పూలు కొత్తగాపూస్తాయి
అందానికి అర్ధాలు చూపిస్తాయి
పచ్చికలో  పసుపురంగు పూల మొక్క
తన్మయత్వంలోకి జారి-

ఒక్కసారి చేతుల్లోకి తీసుకుంటే
లేత రెక్కల అనుభవం
ప్రకృతి అరచేతిలో ఒదిగి
పరిమళాలు నింపిన కొత్తదనం

అప్పుడొక పాట మనసులో సుడి తిరిగి
బయటికి రావడానికి మొహమాటపడి
ఆ నిశ్శబ్దరాగం గొంతులోనే పాటపాడుకుంటుంది

నన్నో అతిధిలా కాకుండా తోటమాలి అనుకుంటాయి
ప్రతీ ఉదయం  ఎన్నో దృశ్యాలు
గడచిన రాత్రిని  మరుగునపడేస్తాయి.

రోజు వచ్చీ  వెళుతున్నాసరే
కొత్తగా చెప్పవలసింది ఇంకా మిగిలిపోతుంది
వినడానికి  మళ్ళీమళ్ళీ రావాలి
ప్రతీఉదయం కొన్ని సంగతులు
రాలిన ఆకుదొన్నెలోనో
పచ్చగన్నేరు పూలలోనో
వేప గాలిలోనో మిగిలిపోతాయి

కొత్త ఉదయం కిటికి తెరవడానికి
రాత్రికోసం నిరీక్షీంచాలి.



Wednesday, 15 February 2012

అమ్మ నది

 
నిశ్ఛలమైన  నీటిని కదల్చితే వలయాలు
కదులుతూ కనుమరుగైపోతూ
నీటిఅద్దంలో ముఖం

నదిఒడిలో వెదుక్కునే బాల్యం
అలసిన మనసు ,శరీరం సేదదీరేదిక్కడే
నదితో ముడిపడ్డ సంస్కృతి-
నదివెంట పల్లెజనం , నదిఒడిలో గ్రామం

నది ఒడ్డున నిల్చుని ఒంటరిగా
నదిలోతులని పాదాలతో కొలవలేక
ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు
          నది అమ్మలా పలుకరిస్తుంది.
        2
నదిని కార్తీకదీపాలతో అలంకరిస్తే
పున్నమి అద్దంలో  దీపాల పట్టుచీరతో
అమ్మలా, దేవతలా గుండెలో నిండిపోతుంది

నది నాఆత్మ ,నది నా బాల్యం
ఇసుక తనువులో చిన్నతనం
అమ్మమీద అలిగి నదిగట్టుమీద కూర్చుంటే
అలలరెక్కల మీద నీటిపిట్టలని పేర్చీ నవ్వించేది
తోటలోని పిల్లగాలిని పిలిపించి
        ముంగురులను సవరించి మురిసిపోయేది.

నదిలోకి చేపపిల్లలా జారుతే
వెచ్చగా కౌగలించుకునేది
అలల సంగీతంలో మునిగిపోయి
గొంతులో్కి పాట వుబికి నదినంతా నింపేస్తే
            నది నవ్వేది అమ్మలా-

రుతువుల చీరకోంగులో పల్లెని దాచుకున్న నది
పగలు రాత్రీ  వెంట వెంట నడిచీ
 మంచుదుప్పటి పక్కకిపెట్టీ ఏడారి ఆత్మలానిల్చుంది.
ఇసుక మేటలు వేడిగాలులు-

పల్లెమీద అలిగి దూరంగా జరిగి
తనకుతానుగా నిశ్చలంగా పాయలా పారుతుంటే్
వర్షపు గొడుగులేక మండుటెండలొ నిల్చునట్లుంది!
ఇసుక గొంతులో నీటిచెలమల తడి
                            పల్లె  దాహంతీరుస్తూ.

ఆ ఊరి పడవ ఈ ఒడ్డుకి చేరలేక  ఊగుతోంది
చిన్ని అలలకి చిరుమువ్వలా శబ్ధంచేస్తూ-

ఆకులు రాల్చిన తోట  ధ్యానంలొంకి వెళ్ళిపోయింది
నదితొ పాటుగా నేను  ఎప్పటికప్పుడు కొత్తదాన్ని-
పరీక్షీస్తూ నదిలొకి  ప్రవే్శిస్తూ వుంటాను.

ఒక కొత్త వేకువలో
కోకిల గొంతువిడి తోటతలుపులు తట్టీ
నదిలోపలికి  పాటల చిరుజల్లు కురిపించగానే
వేకువ దిగంతాలను చుట్టీ లోకం చెవులలొ ఒదిగి
నిశ్శబ్ధాన్ని చేధించి నిద్రలేపింది.

ఉగాది  కొత్త, జీవితం పాతది అనుకుంటూనే      -
ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ  ప్రేమతో పలుకరిస్తూ
ఇంటిగుమ్మంలో ఎదురు చూసే నాన్న, అమ్మ
మామిడి చెట్టునీడలా అనిపిస్తారు

ఇప్పటికీ  ఆ పొదరింట్లో వాళ్ళనీడలో
మనసునిండా అ జ్నాపకాలు నింపుకుని
నీకోసం వచ్చాను  ఏకాంతం కోరుకుంటూ
నీతీరంలో వినిపించే నీ ఆప్యాయత, కొత్త ఉత్సాహం

మళ్లీ నగర ప్రపంచంలోకి పయనమవ్వాలి
ఈ వేకువలు,సాయంకాలాలు,వెన్నెలరాత్రులు
కొంగులో మూటకట్టుకుని-
ఇసుకపొరల్లొ నన్ను నేను దాచుకొని వెళుతున్నాను

నిన్నువిడిచి వెళ్ళలేని తనంలో,
ఇప్పుడిప్పుడే నేర్చుకొన్న చిత్రకారుడి చిత్రలేఖనంలా
నీ తనువుని చిత్రించడానికి ప్రయత్నిస్తూ-
మిగిలిపోయాను ఒక కొండ, ఒక కోన చిత్రిస్తూ
మళ్ళీ గుర్తుకొచ్చింది నిన్ను చిత్రంగా మలచుకుంటే
నీ ఒడిలో్కి రాలేనని
అందుకే ఒదిలి వెళ్ళిపోతున్నాను

నన్ను నా గుర్తులని
నాభావాల  స్పర్సలు  అనుభవించినందుకేమో
                                    నదికన్నులో నీటితడి....!





























Sunday, 12 February 2012

రైలు కలువలు

     
              
 రైల్లో  పొద్దున్నే కళ్ళు తెరవగానే
 రెండు చేతులనిండా కలువపూలతో నలబడింది ఆమె
 బుట్టలోపలి కలువలు
 నల్లచరువులో నిండు వెన్నెల ప్రతిబింబాల్లా
 తెల్లటి మెత్తటి కలువలు ఆకుపచ్చని కాడలు
 బోగినంతా అల్లుకున్న పరిమళం.

 నిద్ర లేనికళ్ళు అలోచనలతో నలిగిన మనసు
 కలువల పలకరింపుతో
 పెదవి అంచులమీద చిరునవ్వు విచ్చుకుంది.
 
”’కొనడమ్మా అడుగుతోంది”’ఆమె
ఆమె ఒడిలో  ఆడుకుంటున్న పసి పాపల్లా
అందరివైపు అమాయకంగా చూస్తున్నాయి

కొనాలనే వుంది కొంటే వాడిపోతాయని
తనివితీరా చూస్తున్నాను.
ఆ పసి కలువలు
రోజు పొద్దున్నే అందర్ని నిద్రలేపీ
కళ్ళల్లో వెలుగులు నింపే ఆ కలువలు
ప్రపంచానికి  వున్న ఒకే ఒక రంగు తెలుపే-
అన్నట్లు స్వఛ్చంగా నవ్వాయి...
కొన్నాను కొన్ని కలువలు
పసిపిల్లవాడిని ఎత్తుకున్నట్లు
జాగ్రత్తగా తీసుకుని పొదువుకున్నాను...













 

Wednesday, 8 February 2012

ఇప్పుడు ఆ ముఖం కోసం

ఎక్కడ అద్దం కనిపించినా
చూపు ముఖాన్ని చూసుకుంటుంది              
తనని తాను గుర్తు పట్టడం కోసం
మనసు పొరలు తోలగించుకొని                      
నచ్చినా నచ్చకపోయినా
ప్రతిబింబం పలుకరిస్తుంది

ముఖాన్ని ముఖంతో చూసుకోవడం
ముఖం వెనకాల భావాలతో మాట్లడుకోవడం
అన్నీ అద్దంతోనే-
అది జరిగి పోగానే ముఖానికో తోడుగు
లొలోపటి వాటితొ సంబంధం  లేని పయనం

లొలో్పల కొన్ని ప్రయాణాలు
చూపు అందినంతవరకు-
 ఘోషలా వినిపించే మాటలు
అవమానాలు ప్రశ్నలు ,సిగ్గు కోపం..
దహించివేసే కొన్ని రూపాలు
జీవితంతో పాటు నడిచిన కొన్ని సంఘటనలు
గజిబిజిగా నిలదీస్తూ ముందుకోచ్చే చిత్రాలు

ఎగురుతున్న గాలిపటంలా ఎక్కడెక్కడో తిరిగి
చీకటిలోయలో పడిపోతూ పట్టుకున్న కోమ్మ బాల్యం
పసితనం పలుకరిస్తుంది
యవ్వనం ఓదారుస్తుంది

ఓజీవితాన్ని మోసి
ఓజీవితాన్ని తిరస్కరించిన మఖం
బాల్యం జ్ఞాపకానికి చిగురిస్తుంది
ఇప్పుడు ముఖం..
ఆ ముఖం  కోసం ఎక్కడ అద్దం కనిపించినా చూసుకుంటూ వుంటుంది..


Wednesday, 25 January 2012

మరణమే చరిత్ర




ఒక ఒంటరి దేహం
సంకల్పంతో మరణించి
తనకు తానే కొత్తగా స్ఫూర్తిగా నిలబడింది

మంచి చెడు పాపం పుణ్యం
ఏవి పట్టనట్లు ఒంటరితనంతో
కన్నపేగు గర్వించే సమూహమైంది

ఒక మరణం తెచ్చిన తుఫానులోంచి
ఒక మరణం తెచ్చిన సంక్షోభంలోంచి
నగరం తన ప్రతిబింబాన్ని కొత్తగా చూసుకుంది

నలిగిన ముఖం ముక్కలైన భాష
భాష ముందు మూగగా
తనను తానే అశ్చర్యంగా చూసుకుంది
          ౨
గుంపులు  గుంపులుగా మాట్లాడే భాష
ఎలుగెత్తి నినాదంగా మారే రూపం ఉద్యమం!

నినాదాలు నిట్టూర్పులు ఆవేదనలు
             అంతా ఒక బాషలోనే
ప్రవాహంలో సుడులు తిరుగుతున్న భాష
ఒకరి నుంచి ఒకరు అందుకునే ఇసుక గమేళలా -
మాట మారి నినాదమై కొత్త కట్టడంలా మారింది
ఇప్పుడు మనల్ని మనం కోత్తగా చూసుకుంటున్నాం
కన్న తల్లిని రెండు ముక్కలుగా పంచుకునే తతంగాన్ని
 విచిత్రంగా గమనిస్తున్నాం
అంగుళం కదలకుండా
జడంగా మారి మనల్ని మనమే  కొత్తగాచూసుకుంటున్నాం

మరణం ఊరేగింపుగా మారడం
మరణం రక్తసిక్త రణంగా మారడం చూస్తూన్నాం
ఈ చూపు ఎంత పాతబడిపోయిందంటే
చూపు తప్పించి ఇంకేమి మిగలనంత
మనకు మనమే వింత ,మనభాషే మనకు కొత్త
                ౩

పొట్ట చేత పట్టుకుని ఊళ్ళు వదిలి్నవాళ్ళం
అపరిచితులుగా ఇక్కడ  చౌరస్తాలో నిలబడి పోయాం
ఇప్పుడు దారులకు గమ్యంతెలియదు
చెట్ల కింద నేర్చుకున్న విద్య ఒంట పట్టించుకున్న చదువు
గుండెలో నింపుకున్న అక్షరాలు
పరాయిగా మారి అ ఆ లు వేర్వేరు గుంపులై పోతున్నాయి
పచ్చటి ఆకులు నేలకు రాలుతే
వాటిని అంటుకున్న నెత్తురు మంచుబిందువులతో కలసి
భూమ్మీద ఒరుగుతూ
త్యాగాల నినాదాలని లిఖిస్తోంది

మరణం తరువాత నిశ్శబ్ధం
గంభీరంగా అలుముకున్న ప్రశాంతత
ఆ నిశ్సబ్ధ ప్రశాంత మరణమే ఊరేగిపుగా మారి
నినాదమై పయనించడం ,చరిత్రగా రూపోందడమే
మార్పు ఏ రూపంలో వచ్చినా
ఈ మరణం మాత్రం చరిత్ర పుటల్లో ఆరంభ వాక్యం.




Friday, 6 January 2012

మళ్లీ మొదలు .....

 సంసారం  గొడుగు కింద
 చాలీచాలని స్థలం
 ఇరుకు ఇరుకుగా
 అయిన సర్దుకుంటూ

విడివిడిగా ఇద్దరు ...
కలవని మనసులు
జవాబు లేని ప్రశ్నలు
ఒకొక్కసారి విడి పోవాలన్నా తపన

దూర దూరంగా వుండలన్న   తాపత్రయం
నడుస్తున్నా వెంటబడే నీడలా
ఎక్కడో ఒక్క చోట లిప్త పాటు కలుసుకున్నా ...

అసహనం ఆవేదన
ముఖ ముఖాలు చూసుకో కూడదన్ననిర్ణయాలు
పొడిపొడి ఆలోచనలు-
మనసు తెరల మీద కదలాడే గత చిత్రాలు
ఒద్డనుకుంటున్న కొద్దీ ప్రత్యక్ష్య మయ్యే రూపాలు
హృదయం  జ్ఞాపాకాలఅగ్నిలో కాలుతుంది
అన్నిటిని కాగితంలా చుట్టి విసిరి పారేయాలనిపిస్తుంది
ఏమి చేయలేని నిస్సహాయత

ఆనవాళ్ళే లేకుండా
చేరిపేయాలునుకున్నా విషయాలు
హోరెత్తే సాగరంలా పోటేత్తుతూ
నిద్రని దూరం చేస్తాయి ..

తెల్ల వారితే అన్ని మొదలు
పెదవిమీద రంగులా
రాసుకునే చిరునవ్వులు
తెచ్చి పెట్టుకున్న సహనం
సర్దుకు పోవాలనుకుంటూ
మళ్లీ మొదలు ..... 











 




 




















Tuesday, 3 January 2012

వాడితో నా ప్రయాణం

 
బుజంమీద ముడితో జోలెలా అనిపించే
మెత్తటి చీరముక్క ఊయలని-
ఆమె జోలె అంటుంది
నేను వాడిని మోస్తూ నాలోకి ఒదగనిస్తూ
వాడి అనుభావాలకి మూగ  పల్లకీనవుతాను

పొద్దునే నాలోకి జారుకుంటాడు లేతభానుడిలా
                 ,అక్కడనూంచి మాఇద్దరి ప్రయాణం.

నిద్రవీడని లేతకళ్ళు వాహనాల రోదకి ఉలికిపడతాయి
వాలిపోతున్న మెడకి ఆసరాగా చేతులు కానిచేతులు
నాచీర అంచులతొ అడ్డుకుంటాను..

అకొసనూంచీ ఈ కొసకి పరుగులు  పెట్టే తల్లినిచూస్తూ నవ్వుతాడు
వాడి లేతచిరునవ్వు నాకే వినిపిస్తుంది
వాడి ఊసులని వింటాను, ఏడుపుకి భయపడతాను.

అమ్మ ముఖంకోసం తలఎత్తీ చూడలనుకుంటాడు
ఎండ చుర్రుమని రెప్పలని వాల్చేస్తుంది.
ఎవరెవరో కనిపిస్తారు,వాళ్ళనే చూసి నవ్వుతాడు

వెలుతురు కొమ్మమీద వాలిన చీకటి 
వాడిని అమ్మఒడిలోకి చేర్చింది-
నన్ను దులిపి పక్కగాచేసి వాడిని పడుక్కోపెట్టగానే
మెత్తటి తివాచినవనందుకు నన్ను నేను తిట్టుకుంటాను
కనీసం మెత్తటి దుప్పటి నవుదామని నన్నునేను కుదించుకుని
వాడిని హత్తుకుంటాను.

బోర్లాపడతాడు నన్ను దగ్గరగాతీసుకుని
చేతి వేళ్ళతో లాగుతూ గుర్తుపట్టడాని ప్రయత్నిస్తాడు
ఆటలన్నీ కొద్ది క్షాణాలే..
మళ్ళీ అమ్మకోసం ఏడుస్తాడు

వస్తుంది విసుగుతో కసురుకుంటూ
”క్రిష్ణుడ్ని చెట్టుకి కట్టేసినట్లే ''మమ్మల్ని కొమ్మకి
తగిలించేసి వెళ్ళిపోతుంది.

ఊయలగా నేను జోరుగా ఊగి-
వాడి దుఖాఃన్ని చెరిపే కొమ్మమీద పిట్టకోసం ఎదురు చూస్తాను
వాడి కావలసింది అమ్మ.
అమ్మకి కావాలి ఆకలితీర్చే ఆదాయం.
జీవితం   ట్ర్రాఫిక్ సిగ్న్ ల్ దగ్గర ఆగి పోయింది

వాడి కలలరెప్పలమీద నవ్వు అంచుల్లో నేను తోడుగా మిగిలిపోయాను
అనుక్షణం అమ్మకి దగ్గరగావుంటూ
అమ్మని తీరిగ్గాచూడలేనంతదూరంగా వున్న వాడి
అనుభావాన్ని వింటూండగానే  తూరుపు రేఖలు విచ్చుకున్నాయి....