కిస్సాకుర్సీకా" మంటలురేపే సింహాసనం
పర్వతాలాంటి మనుషులు ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతూ
ప్రపంచంముందు కుర్చుంటారు
గంభీర స్వరం స్వాగతంపలుకుతుంది
ఎదురుగా కంప్యుటర్ నుదిటి రాతను సరిచేయగల బ్రహ్మదేవుడు.
ఆనేక ప్రశ్నలు చిన్నతాళం
ఇన్నింటీనీ తట్టుకుని నిలబడ్డానికి చాలా కస్టబడాలి
గతంముందు మోకరిల్లాలి
లోకంలో మన స్థానాన్ని అప్పచెప్పుకోవాలి
”పంచకోటీ మహామణీ” జాబవంతుడీ మెడలొ శమంతకమణీ
కోరి ఎంచుకున్న మెట్టు ఎక్కగానే
ఆశల సీతాకోకచిలుకలు చుట్టూ ఎగురుతూ
బవిష్యత్తు రంగులన్నీ లొలోపలికి ఒంపుతాయి
పలకరింపుల జడీవానలో తడిసిముద్దయ్యాక
ముక్కలుగా విరిగి పోకుండానిలబడ్డం చాలా కస్టం
చెక్కులు నిదానంగా అడుగులు వేస్తుంటాయి
సింహాసనంలొ కూర్చుని బేలగా మారిపోతూ
కన్నీళ్ళు పెట్టుకుంటూ మనసు మంటలని
ఆర్పుకోవడం అంటే-
పరిస్థితులమీదనుంచి,కష్టాలమీదనుంచి
ఆగాధాల మైదానాలమీద నుంచి దాటుకుని
నెత్తిమీద కీర్తి కీరిటాన్నిధరించి
అలఓకగా నేల మీదకాళ్ళు అనించి నడవడం.
అందరికి అదృష్టంగా అనిపిస్తుంది
అరికాళ్ళకింద ధనాన్ని పేర్చుకుంటూ
ధీమగా నడూస్తుంటే అందరి ఆశలు మోస్తున్నట్లే
నడుస్తున్న వాళ్ళ వెనకాల
మోన్నటికన్నా నిన్నటికన్నా ఎన్నో తుఫానులు
ఎన్నో ఇంధ్రధనస్సులు రోజు వస్తూనేవుంటాయి......
No comments:
Post a Comment