నగరం దేహంలోకి పరకాయ ప్రవేశంచేసాక
మాట్లాడుకోవడానికి ఏం మిగులుతుంది?
ట్రాఫిక్ లో ఎర్ర లైటు పడి ఆగగానే
కనిపించే దృశ్యాలు శరీరానికి అంటరానివి
పదమూడేళ్ళ కుర్రవాడు.
పరిగెత్తుకుని వస్తాడు
ఒంటి నిండా గ్రీజు పూసుకొని
అద్దాలు లేని కళ్ళద్దాలు,చేతికర్ర, పంచ
అచ్చం” గాంధీగారి" వేషంలో
చిరునవ్వులు చిందిస్తూ శిలలా నిలబడి పోతాడు.
ఎండ కాస్తూవుంటుంది
వాహనల పొగలు కమ్ముకుంటుంటాయి
అయినా నిశ్శబ్ధంగా నిలబడే వుంటాడు.
నిశ్శబ్ధంలోంచీ గతం గాలిపటంలా ఎగిరి
కళ్ళముందు వాలిపోతుంది.
నూలు వడికిన రాట్నాలు
ఉప్పుసత్యాగ్రహాలు,జలియన్ వాలాబగ్ నెత్తుటి మరకలు
"హే రామ్" అంటూ నేలకొరిగిన జాతిపితా_
అర్ధ రాత్రీ స్వాతంత్రం,చిన్నప్పట్టి పాఠాలు గుర్తుకొస్తాయి.
స్వేఛ కరిగించిన మూసలో రంగుపూసలై
కరిగిపోతున్న సంస్కృతిలో మేరుస్తూ
తెగిన గాలిపటంలా ఏచెట్టుకు వేలాడబడతామో?
కళ్లకి కనిపించేవి మేదడులో ఇంకకముందే
మనకోసం కూడా మనం ఆగని దశ
ఆకుపచ్చని లైటు పడుతుంది
చీమలు చెదిరినట్లు చెదిరిన మనుషులు వాహనాలు
క్షాణాల్లో మాయమైపోయాక-
వాడు ఎప్పటిలాగే చెదిరిన ట్రాఫిక్ తొపాటూ
వెనక్కి వెళ్ళిపోయీ,మళ్ళి పడే ఎర్రలైటు కోసం
చిరునవ్వులు సిద్దం చేసుకుంటాడు
ఎడాది పోడవునా ఎక్కడో అక్కడ
అచ్చం "గాంధీ్గారిలా" నిల్చోవడానికి.
ఏడాది ఒక్కసారే గుర్తుకి తెచ్చుకోనే
కోట్లజనాభాకి వాడి చిరునవ్వుల "సలాం”
ఆ రోజంతా గుచ్చుకునే విషంలో ముంచిన ముల్లు.
-
No comments:
Post a Comment