మేము మధ్య ప్రదేశ్ జబల్ పూర్
లో వున్నప్పుడు బేడాఘాట్ వాటర్ falls కి పౌర్ణిమ రోజే వెళ్ళాలి అన్నారు జబల్ పూర్
నుంచి బేడాఘాట్ కి బుల్లెట్ బండిమీద ప్రయాణం (అప్పుడు బుల్లెట్ బండి పాట లేదు ..
హింది పాటలే....
అప్పుడు రాసుకున్న కవిత ( పాతదే)
#గోరింట రంగు #
నది మీద నడుస్తూ
ప్రయాణిస్తూ
పడిపోయి తేలుతున్న
పున్నమి చంద్రుడిని
వెంటాడుతూ
నది వీపు మీద
ఉప్పు మూటలా
గాలికి ఊగుతున్నాను
ఆ రాత్రి నా వొడిలో కొత్త జంట
పెళ్ళి కూతురి ఎర్రటి దుపట్టాలో దూరిన చలి
వెచ్చదనానికి అతడి బుజంలో ఒదిగిన ఆమె
వాళ్ళ నుంచి జారిన చలి
నదిలోకి దూకి అలలు అలలుగా
నా నడకని నెమ్మది చేసింది
ఆమె ఊపిరి వేడికి
కళ్ళరెప్పల మీద
చెంపల మీద వాలిన
పున్నమి వెలుగులని
కళ్ళతో తుడిచే ప్రియుడి కొంటేతనానికి
ఎర్రబడిన బుగ్గల రంగుని
దుప్పట్టాతో తుడుచుకుంటున్న పెళ్లికూతురు
కబుర్లలో జారిన కోంగు
దాని చివర్న కట్టిన సిగ్గుల రంగుల పొట్లాం
పర్వతాల ముఖాలతో హోలీ ఆడుకుంది
వెన్నెల నీటిలోమునిగి నన్ను హత్తుకుంది
నర్మద కోంగుమీద తేలుతూన్న నా ఒంటిని
మెహందీ దిద్దిన గోరింట పూల చేతులు పట్టుకున్నాయి
పాలరాతి గోడలకి ప్రేమజ్వరం అంటుకుందేమో
ముదురు గోధుమ రంగులో కలిసిన గులాబీ వర్ణం
వెన్నెల్లో సాన పెట్టుకుంటూ
చలి వేడిలో తడి తడిగా మెరిసాయి
నేను ఊగి తూగి తడి తడిగా తడబడ్డాను
వాళ్ళ వేడిలో చలి
పోగులు చిమ్మింది
మమసకబారిన నది
వెన్నెల అద్దంలో అందాన్ని మత్తుగా చూసుకుంది
ప్రేమ ప్రవాహంలో కోట్టుకుపోకుండా
నది వీపుమీద తేలుతూ
మత్తుగా నే
తెరచాప తో
కొండల మధ్యలో దారీ కనుకుంటూ
ఒడ్డుకి చేరుకున్నాను...
No comments:
Post a Comment