Thursday, 26 January 2023

 పాతదే..

మళ్ళీ జ్ఞాపకంచేసుకుంటూ...
కొన్ని సార్లు కలలు
జ్జాపకం ఉండి ఉండనట్లు
తెలివి వచ్చినా
వెంటాడే అస్పష్ట జ్ఞాపకం
కలల పిట్టలు
రెప్పల తీగ మీద
వరుసగా కూర్చుని
రెక్కలు సరిచేసుకుంటూ
ఊహల్ని పోగుచేసి
కూత పెడితాయి
కూతల సందడిలో
లోయలోకి జారిపోతూ
పట్టు తప్పి
కొత్తదారులు వెంట నడుస్తూ
తడబడుతుంటే
ఎవరిదో చేయి!
పట్టుకుంటుంది
చేయి వొడిలో
దుఃఖతో చిట్లిన నొసలు
నొసలుని తీర్చి దిద్దే వేళ్ళు
వేళ్ళ కొసలు కొత్తవి
చేతి సుగంధం కొత్తది
కొత్తదనం చినుకులలో
తడిసిన ముఖం
మసక వెన్నెలలో
ఊయల ఊగీఊగీ
తెగిన గొలుసు శబ్దానికి
మెలకువ తలుపు తెరుచుకోగానే రెప్పలతీగనుంచి జారిపడ్డ పిట్టలు ఎగిరిపోయాయి.....


No comments:

Post a Comment