Wednesday, 28 May 2014

వాడ్రేవు చిన వీరభద్రుడు గారి కవిత A poem for today:


కన్యలు కలల దారాలతో కుడుతున్న అల్లికలాగా 
కిటికీపక్క గాజులదుకాణం తెరిచింది తురాయిచెట్టు.

ఈకవితలో ఈ రెండు లైన్లు చదివిన దగ్గరనుంచి ,ఎందుకో చాలా జ్జాపకాలు నన్ను చుట్టుముట్టాయి 
మేము మలకపేట్ కాలనీ లో ఉన్నప్పుడు సరిగ్గా మా ఇంటికి ఎదురుగా ఈ తురాయి చెట్టు వుండేది చెట్టుకింద ఎర్రటి పూలు రోడ్డంతా పరుచుకునేవి   ఇప్పటికీ జ్జాపకం మండుటెండలోచెట్టుకింద మేకలు వాటిని కాపుకాసే తాత ,ఓ  బుజ్జి మేకపిల్ల మెళ్ళో కట్టిన గంట చప్పుడు .
.వీటిని అగ్ని పూలు అని కూడా అనేవాళ్ళు, స్కూలునుంచి వస్తూ వస్తూ ఏరుకున్న పూలు మెత్తటి దళసరి రెక్కలపూలు .జడలోతురుముకున్న పూలు ఎర్రటి తురాయి పూలు.
జడలో పెట్టుకోకూడదు అనేవారు అయినా వింటేగా.ఒద్దు అన్న పని చేయడంలో వున్నా అప్పటి ఆనందం ఇప్పుడు రమ్మన్నా రాదు కదా ....

Sunday, 11 May 2014

వానకలిసిన సముద్రం...


వెలియనివాన ఎండని కమ్మేసి చలిచలిగా నగరంలోకి
అడుగుపెట్టడం బాగుంది
జల్లులుగా నేలని అల్లుకుని ఆగని వాన చినుకులంటే అంటే ఇంకా ఇస్టం.

ముసురు మబ్బులు కాఫీ కప్పుని చేతులోవుంచేసి ఆలోచనలకి ఆవిరినందిస్తాయి
చినుకులు నదుల వరదలు తలవంచుకుని "కాదల్"కడలిలో కలిసిపోతే
తూఫాన్ ఇసుకగుడులని మింగేస్తుంది గవ్వలేరుకునే మనుషుల బాల్యం
జాడలేని "ఇష్క"కి కహానిలా అయిపోతుంది

”సాగర్కి లహెరే” సవరించలేని ఉంగరాల ముంగురులు అణిగిపోయాయి
నీళ్ళని చిమ్మేసి రహదారులని ఉప్పుటేరులని చేస్తుందని భయం
కనీళ్ళతో పోటిపడే కాటు ఉప్పుని రుచి చూపిస్తుందని వెఱపు

సముద్రతీరంలో ఇసుకమేటలలో కూరుకుపోతూ ”ఆజా తు పాస్..పాస్ గుజారిశ్..పాటపాడితే
”గుంజుకున్నా నిన్నే యదలోకి"బదులిచ్చే అంత్యాక్షారీలు
ఇసుక మడులలో లంగరేసుకున్న పడవలు ఫోటోలకి ఫొజులిచ్చే ఇళ్లని
నిమిషంలో మింగేసి తీరాన్ని ముక్కలు చేసి వెనక్కి వెళ్ళిపోదుకదా..

ఈవాన వెలియక పోతే సంద్రంలో చంద్రుడు మునిగిపోయి
వెన్నెల చిన్నచిన్న వెండిరేకుల్లా అలల మీద తేలవుకదా
నేలని అల్లుకునే వాన చినుకులు ఇస్టం
వానవెలిసేదాక ఆలోచనలన్నీ అక్కడే జాలరి వలలో చేపలు.....

అడవిలోతడి వెన్నెల



ఓ వర్షపు మేఘం అడవిలో తప్పిపోయింది
నీటిచినుకులు నదిని కనుకున్నాయి
ప్రవహించేనది వృక్షాలని కౌగలించుకొని
చీర చెంగులా చుట్టుకుని 
ఆకుల కీరీటాలని మోసుకుంటూ వెళ్తుంటే

నదిపైన వంతెన చెట్టుకి గట్టుకిదారివేస్తూ
నదిని రెండుభాగాలు చేసింది
ఒకటైన నది రె్ండు వైపులా కనిపిస్తోంది
వర్షం ఆకాశంలో ఆగిపోయింది
పోగమంచు దుప్పటిలో దూరిన అడవి

ఆ చీకటిని నేనే అనుకుంది
చీకటి అడవిని కనుకున్నాను అంది
చంద్రుడు దారి తప్పి అడవిలోకి రాగానే
ఇద్దరు సిగ్గుపడి
వెన్నేలని ఎవరు పంపారో కదా
చలిని ,వేడీని, తీసుకువచ్చింది అనుకున్నాయి

నది మాత్రం
నేను అక్కడనుంచితీసుకోచ్చి
ఇక్కడ పడేసాను అనుకుంది
వెన్నెల అమాయకంగా
నదిని,ఆకులని ,చెట్లని పలకరించి
చీకటి దూరిన ఆడవికి
తెల్లని పరదాలు కట్టీ
వర్షం వెలిసిన తడి దారుల వెంట ప్రయాణిస్తూనే వుంది..

Thursday, 27 February 2014

గాలిపటం



కనురెప్పల మీద నుంచి ఎగిరిపోయి 
రంగు రంగుల స్వప్నాలను కాజేసిన రాకాసి
గాలిపటంలా ఆలోచనల కోమ్మకి వేళ్ళాడుతూ ఊరిస్తుంది

ఇస్టమైన విషయాలు ఎన్ని కధలుగా చెప్పినా
బతుకు కధల రంగురంగుల తోక చూపిస్తుందేగాని
కిందికి దిగి రాదు

ఆవలింతల దుప్పటి కప్పుకుని
కనపడకుండా కొమ్మమీదనుంచి దింపుదామన్నా
ఇంకా ఇంకా చిటారు కోమ్మకి వెళ్ళిపోతుంది
రెప్పల ద్వారానికి అడ్డుగా నిల్చుంటుంది

కళ్లకి మనసుకి వంతెనవేసి
ఇసుకమేటలమీద నడిపించి ఊరించి
తెల్లవారుఝాములో చేతికి అందుతుంది..

Friday, 3 January 2014

ఓ సాయంకాలపు కబుర్లు


స్నేహితుడితో 
ఇస్టంగా చెప్పుకునే 
కబుర్లుఎన్నో 

పూలని దారంతో గుచ్చినట్లు
రెక్కలు తెగి రాలిపోయినవి రాలిపోగా
కోత్తగా సిగ్గుతో లేతగా ఒద్దిగ్గా అమరినవి కొన్ని
లిల్లీమొగ్గలు, గలాబీలతో ముడివేస్తున్న
కబుర్లు
దవనం నీటితడితో పెనవేసుకుంటూ
మాల కట్టుకుంటూ చెప్తున్న
కబుర్లు
అలల తాకిడిలో రాళ్ళమధ్య ఇరుక్కన్న
 మందారంలా కొట్టుకుంటాయి
ఆక్కడ అక్కడక్కడే తిరుగుతూ సుడి వేగంలో
తిరిగే తెప్పలా కబుర్లు అగిపోతాయి
మళ్ళీ మొదలైనకబుర్లు
గూలాబిరెక్కలు ,అక్కడ అక్కడక్కడ తెగిన లిల్లీ మొగ్గల మొదళ్ళతో దోసిలి నిండిపోయి
అలసిపోయి ఇంక చాలనుకుని ఆగిపోయిన
కబుర్లు
కాలి మువ్వల పట్టీల చప్పుడులా
ఇంకా వినిపిస్తూనే వుంటాయి
గదిలోపలి ఆకాశంలో చుక్కల్లా మెరుస్తూ
అక్కడున్న సామాన్లకి చెప్తూనే వుంటాయి
వాడితో చెప్పుకునే కబుర్లు.....
 

 

Monday, 11 November 2013

Photo
స్మాయిల్ పురస్కార గ్రహీత Renuka Ayola గారికి అభినందనలతో,
"లోపలి స్వరం" కినిగె.కాం ద్వారా పొందవచ్చని తెలియజేసుకుంటూ.. Kinige అలాగే మరో పురస్కార గ్రహీత రెంటాల వెంకటేశ్వరరావు గారి "లొపలికి" కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

'లోపలి స్వరం...See More
 — feeling excited with Vadrevu Ch Veerabhadruduand 3 others.
Photo

Wednesday, 23 October 2013

డాబాకధలు -2



మేడ మీద పుచ్చపువ్వులాంటి వెన్నెల వేసవి కాలం పోద్దంతా వేడి గాడ్పులు ఉక్కపోత భరించాక
నూలపఫ్పు అప్పడాలు కుంపటిలో కాల్చినవి,వేడి ఇంగువ చారు అన్నాలు తిన్నాక మేడ మీద పడుక్కోవడానికి బోంతలు పట్టుకుని బల్దేరాం అందరం

మామేనత్త కూతురు సరళ ఇంకా రాలేదు తిన్న కంచాలు ఎత్తిఎంగిళ్ళు పెట్టి రావద్దూ మరి ..

ఈలోగ మేమంతా కంబారి సిమ్మడు మేడమీదజల్లిన నీళ్ళకి ఆవిరవుతున్న నేలమీదే బోంతలు వేసేసుకుని నిన్న సరళ చెప్పిన బండి వాడి కధ గురించి కొద్దిగా భయంగా కొద్దిగా ధైర్యంగా మాట్లాడుకుంటుంటే వచ్చిందిమేడమీదకి    సరళ ఈ రోజు ఏంకధ చెప్తావూ అడిగాం అందరం

నిన్న ఎవరైనా భయపడ్డారా అడిగింది ఓణి సర్దుకుంటూ లేదు అని అందరం గట్టిగానే జవాబు చెప్పాము

నేను నమ్మను అంది జడముందుకి వేసుకుని  సన్నజాజుల దండని సవరించుకుంటూ

జాజిపూల పరిమళం మెత్తగా డాబా అంతా పరుచుకుంటోంది

ఈ రోజుకూడా నేను దయ్యం కధే చెప్తాను చెప్పనా వద్దా అడిగింది చెప్పు చెప్పూ అన్నాం అందరం ఓదగ్గరగా ఒకళ్ళని ఒకళ్ళు ఆనుకుని కూర్చుని
  మొదలు పెట్టింది ...

ఇంతలో కెవ్వుమని కేకపెట్టాడు భరత్ అదిగో ఆకొబ్బరి చెట్టు మీద చూడు ఏదో తెల్లాగా వుంది
అక్కా అది దెయ్యమేమో? అన్నాడు అందరం భయంతో ఆ చెట్టు వేపు చూసాము.కావొచ్చు అంది సరళ
దెయ్యాలకి కొబ్బరి చెట్లు అంటే ఇస్టంట అవి అక్కడనూంచి దూకి నూతిలో చేదవేసి నీళ్ళు తోడుకుని
నీళ్ళు తాగుతాయి అంది.

మరి చింతచెట్లు మీద వుంటాయిట కదా అన్నాడు భరత్ కోంచం ధైర్యం చేసి.అస్తమానం అక్కడే వుంటాయా ఇక్కడికి కూడా వస్తాయి అంది సరళ ..

నిజంగానే చెట్టు ఆకులమీద తెల్లని పల్చని పోగాలాంటిది ఊగింది అంతే
అందరం మామయ్యా ..కొబ్బరి చెట్టుమీద దెయ్యం అని అరుచుకుంటూ గబగబా మేడ మెట్లు దిగిపోయాము

     మా అరుపులకి ఇంట్లో వాళ్లంతా గభారా పడుతూ వచ్చారు ఏమయ్యింది అంటూ...
దెయ్యం గురించి చెప్పాము దెయ్యమా పాడా, అసలు వాళ్లకి దెయ్యాల కధలు చెప్పోదని ఎన్నిసార్లు చెప్పాలి అంటూమావయ్య సరళని కోపడ్డాడు

నేను ఏం చెప్పలేదు వాళ్ళే చెప్పమని బతిమాలితే చెప్పాను అంతే అంది వయ్యారంగా జడని ముందుకివేసుకుని

ఇంతలో కంబారి సిమ్మడువచ్చీ ఏదండీ దెయ్యం అన్నాడు

అదిగో అంటూ కోబ్బరి చెట్టు చూపించాము  వాడితో పాటూ మేము భయభయంగా అటే చూస్తూ .
అక్కడ ఏమి లేదు కొబ్బారాకులమీద విరగ కాస్తున్న వెన్నెల తప్పా..

చూసారా ఏమి లేదు పోయి పడుకోండీ అన్నాడు అయినా సరే ఆరాత్రీకి డాబామీద పడుక్కోం అని చేప్పేసి నట్టింట్లో ఫేనుకింద  పట్టేమంచాలమీద సర్దేసుకున్నాము..