Thursday, 27 February 2014

గాలిపటం



కనురెప్పల మీద నుంచి ఎగిరిపోయి 
రంగు రంగుల స్వప్నాలను కాజేసిన రాకాసి
గాలిపటంలా ఆలోచనల కోమ్మకి వేళ్ళాడుతూ ఊరిస్తుంది

ఇస్టమైన విషయాలు ఎన్ని కధలుగా చెప్పినా
బతుకు కధల రంగురంగుల తోక చూపిస్తుందేగాని
కిందికి దిగి రాదు

ఆవలింతల దుప్పటి కప్పుకుని
కనపడకుండా కొమ్మమీదనుంచి దింపుదామన్నా
ఇంకా ఇంకా చిటారు కోమ్మకి వెళ్ళిపోతుంది
రెప్పల ద్వారానికి అడ్డుగా నిల్చుంటుంది

కళ్లకి మనసుకి వంతెనవేసి
ఇసుకమేటలమీద నడిపించి ఊరించి
తెల్లవారుఝాములో చేతికి అందుతుంది..

No comments:

Post a Comment