ఓ వర్షపు మేఘం అడవిలో తప్పిపోయింది
నీటిచినుకులు నదిని కనుకున్నాయి
ప్రవహించేనది వృక్షాలని కౌగలించుకొని
చీర చెంగులా చుట్టుకుని
ఆకుల కీరీటాలని మోసుకుంటూ వెళ్తుంటే
నదిపైన వంతెన చెట్టుకి గట్టుకిదారివేస్తూ
నదిని రెండుభాగాలు చేసింది
ఒకటైన నది రె్ండు వైపులా కనిపిస్తోంది
వర్షం ఆకాశంలో ఆగిపోయింది
పోగమంచు దుప్పటిలో దూరిన అడవి
ఆ చీకటిని నేనే అనుకుంది
చీకటి అడవిని కనుకున్నాను అంది
చంద్రుడు దారి తప్పి అడవిలోకి రాగానే
ఇద్దరు సిగ్గుపడి
వెన్నేలని ఎవరు పంపారో కదా
చలిని ,వేడీని, తీసుకువచ్చింది అనుకున్నాయి
నది మాత్రం
నేను అక్కడనుంచితీసుకోచ్చి
ఇక్కడ పడేసాను అనుకుంది
వెన్నెల అమాయకంగా
నదిని,ఆకులని ,చెట్లని పలకరించి
చీకటి దూరిన ఆడవికి
తెల్లని పరదాలు కట్టీ
వర్షం వెలిసిన తడి దారుల వెంట ప్రయాణిస్తూనే వుంది..
No comments:
Post a Comment