మనమెప్పుడూ పట్టించు కోని దృశ్యాలు
అప్పుడప్పుడు నగరంలో ప్రత్యక్ష్యం అవుతాయి
మలినాలను శుభ్రం చేస్తూ ఎదురవుతారు
జనాలలో వుంటూ జనాలకి దూరంగా వాళ్ళు-
మలినాల బరువుని మోస్తరు .
మరణానికి దగ్గరగా ''మ్యాన్ హోల్సలో
కొబ్బరి తాళ్ళ సహాయంతో
భుజాలను కుదించుకొన్న మనిషి
చీకటిలోకి దూరిపోతాడు.
పాదాలని ఒరుసుకుంటూ
నగరంలోని కుళ్ళు పరుగులు తీస్తుంటే
శ్వాస ఆడని చీకటి ఇరుకులో
పోటమరిస్తున్న చెమట
మట్టి సందుల్లో కదిలే జీవరాసులు
ఊపిరాడని దుర్గంధం కడుపులో పేగుల్ని
మెలిపెడతాయి .
చీకటిని తరిమే సాధనాలు కళ్ళే
టార్చ్ లైట్లలా విప్పార్చుకొని
చీకటి దుర్గందాలతో సంఘర్షణ
అప్పుడప్పుడు చని పోతారుట-
ఎంతటి విషాదం?
కూటి కోసం పోరాడే మలినం విలువ
ఒక పచ్చ నోటు.
మలినమని పది సార్లు సబ్బుతో కడుకుంటాం
ఒక నోటు ఇవ్వ డానికి పది సార్లు ఆలోచిస్తాం
ఆ మనిషికే మలినం అంట గట్టి
సమాజంలో దూరంగా నిలబెడతాము
వాడు మో స్తున్నమలిన దుర్గందం
మనదే.
ఈ సత్యాన్ని అంగీకరిస్తే
అగ్నిని మోసి నట్లే కదూ ......
భుజాలను కుదించుకొన్న మనిషి
చీకటిలోకి దూరిపోతాడు.
పాదాలని ఒరుసుకుంటూ
నగరంలోని కుళ్ళు పరుగులు తీస్తుంటే
శ్వాస ఆడని చీకటి ఇరుకులో
పోటమరిస్తున్న చెమట
మట్టి సందుల్లో కదిలే జీవరాసులు
ఊపిరాడని దుర్గంధం కడుపులో పేగుల్ని
మెలిపెడతాయి .
చీకటిని తరిమే సాధనాలు కళ్ళే
టార్చ్ లైట్లలా విప్పార్చుకొని
చీకటి దుర్గందాలతో సంఘర్షణ
అప్పుడప్పుడు చని పోతారుట-
ఎంతటి విషాదం?
కూటి కోసం పోరాడే మలినం విలువ
ఒక పచ్చ నోటు.
మలినమని పది సార్లు సబ్బుతో కడుకుంటాం
ఒక నోటు ఇవ్వ డానికి పది సార్లు ఆలోచిస్తాం
ఆ మనిషికే మలినం అంట గట్టి
సమాజంలో దూరంగా నిలబెడతాము
వాడు మో స్తున్నమలిన దుర్గందం
మనదే.
ఈ సత్యాన్ని అంగీకరిస్తే
అగ్నిని మోసి నట్లే కదూ ......