Sunday, 22 June 2014

జగ్జీత్ సింగ్ మరో గజల్ .... నాకు చాలా ఇస్టమైన వాటిల్లో మరొకటి ... దు:ఖం గా వున్నప్పుడు మనల్ని అబిమానించే వాళ్ళు గమనించకూడదని,కనిపెట్ట కూడదని సర్వవిధాల ప్రయత్నిస్తాము ,చిరునవ్వుని బలవంతంగా పెదవులమీదకి తెచ్చుకుని నవ్వుతూ వుంటాము కాని కన్నీటి పొర దాగదుగా



Tum Itna Jo Muskura Rahe Ho 
Kya Gham Hai Jisko Chhupa Rahe Ho 
Aankhon Mein Nami, Hansi Labon Par 
Kya Haal Hai Kya Dikha Rahe Ho 
Ban Jayenge Zehar Peete Peete
Yeh Ashq Jo Piye Ja Rahe Ho
Jin Zakhmon Ko Waqt Bhar Chala Hai
Tum Kyon Unhe Chhedhe Ja Rahe Ho
Rekhaon Ka Khel Hai Muqaddar
Rekhaon Se Maat Kha Rahe Ho
Tum Itna Jo...

ఎందుకు ఇవాళ ఇంతగా నవ్వుతున్నావు ?
ఏ గాయాని దాచాలని ఇంతగా ప్రయ త్నిస్తున్నావు ,కన్నీటి తడిలో చిరునవ్వు
నిన్ను నిస్సహాయంగా నిలబెట్టింది ,కన్నీళ్ళు దాచుకుంటున్నాని అనుకుంటున్నావు
విషం అయిపోతున్నాయి అవి తాగి తాగి , ,ఏ గాయాన్ని కాలం దాచి పెడుతోందో దానన్నే ఎందుకు
గుర్తు తెచ్చు కుంటున్నవు,అరచేతిలో గీతలే జీవితం అయినప్పుడు వాటితో పోరాటం ఎందుకు ?

ప్రేమించే వాళ్ళ దగ్గరనుంచి ఈ మాత్రపు ఓదార్పు చాలు కదూ అనిపిస్తుంది ఈ గజల్
ఎన్ని సార్లు విన్నా .....
మనసు ,పాట,ప్రకృతి,ఏవి విడి విడి గా వుండవు పాటని ప్రేమించిన వాళ్లకి 
ప్యాసా పాత హిందీ సినిమాలో పాటలు విని ఇష్టపడని వాళ్లు అరుదు 
అందులో ఈ పాట నాకు చాల ఇష్టం ,జీవిత సత్యాన్ని కొంత ,విరక్తిని కొంత 
పోగొట్టుకున్న ప్రేమ కనిపిస్తుంది ఇందులో 

Jane Woh Kaise Log The Lyrics from Pyaasa (Old)

Jane woh kaise log the jinke pyaar ko pyaar mila
Hamne toh jab kaliyan mangi katon kaa har mila

Bichhad gaya har saathi dekar pal do pal kaa saath
Kisko phursat hai jo thame divane kaa hath
Hamko apna saya tak aksar bejar mila
Hamne to jab

Isko hee jina kehte hain toh yun hee jee lenge
Uf naa karenge lab see lenge aansu pee lenge
Gham se abb ghabrana kaisa gham sau bar mila
Hamne to jab

కొందరికి జీవితంలో ఎందుకో ప్రేమకి బదులు ప్రేమే దొరుకుతుంది
కొందరికి పూలుకాదు మొగ్గలు కోరుకున్నా ముళ్ళు దొరుకుతాయి
కొన్ని స్నేహాలు అప్పటికప్పుడు దగ్గర అయ్యి విడిపోతాయి

అప్పుడని పిస్తుంది ఎవరికీ పట్టింది మనలాంటి పిచ్చి వాళ్లకి చేయందించడానికి
ఆఖరికి నీడ కూడా విసుగ్గా అనిపిస్తుంది
ఇదే నిజమైన జీవితం అయితే అలాగే బతికేద్దాం
నిట్టూర్చ కుండా మాటలని కుట్టేసుకుని కన్నీళ్ళు దిగమింగి బతికేద్దాము
ఇంక గాయాలకి దుఃఖాలకి భయమెందుకు అవి వందసార్లు మనవే అయినప్పుడు

అనుకున్నవి జరగనప్పుడు ఒక్కసారైనా ఇలా అనిపించక మానదు,
కనీసం ఈ పాట విన్నప్పుడైన ఈ భావం రాక మానదు అనిపిస్తుంది నాకు.....

జగ్జీత్ సింగ్ మరో గజల్ .... Chithhi na koyi sandesh... Ho... Chithhi na koi sandesh



మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోయిన మన అనుకున్న వాళ్ళు తిరిగి రారని తెలిసినా 
ఏదో వెర్రి ఆశ,దుఖంలో మనుసుతో అనుకునే మాటలు వాటి తాలూకు స్పర్శలు ఇక్కడ 
ఇలా అక్షరాలతో నా భావాలు .....

Chithhi na koyi sandesh... 
Ho... Chithhi na koi sandesh 
Jaane woh kaun sa desh jaha tum chale gaye
Chithhi na koyi sandesh
Jaane woh kaun sa desh jaha tum chale gaye
Chithhi na koyi sandesh
Jaane woh kaun sa desh jaha tum chale gaye
Jaha tum chale gaye
Is dil pe laga ke thhes jaane woh kaun sa desh
Jaha tum chale gaye...

Ek aah bhari hogi hamne na suni hogi
Jaate jaate tumne awaaz to di hogi
Har waqt yehi hai gham, us waqt kaha the hum
Kaha tum chale gaye
Chithhi na koi sandesh jaane woh kaun sa desh
Jaha tum chale gaye jaha tum chale gaye
Is dil pe laga ke thhes jaane woh kaun sa desh
Jaha tum chale gaye...

Har cheez pe ashkon se likha hai tumhaara naam
Ye raste ghar galiyaan tumhe kar na sake salaam
Hai dil mein reh gayi baat, jaldi se chhuda kar haath
Kaha tum chale gaye
Chithhi na koi sandesh jaane woh kaun sa desh
Jaha tum chale gaye jaha tum chale gaye
Is dil pe laga ke thhes jaane woh kaun sa desh
Jahan tum chale gaye...

Ab yaadon ke kaante is dil mein chubhte hain
Na dard thhaherta hai na aanson rukte hain
Tumhe dhhundhh raha hai pyaar, hum kaise karein iqraar
Kaha tum chale gaye
Chithhi na koi sandesh jaane woh kaun sa desh
Jaha tum chale gaye jaha tum chale gaye
Is dil pe laga ke thhes jaane woh kaun sa desh
Jahan tum chale gaye...
Ho kahan tum chale gaye... (3)

నువ్వు వెళ్ళిపోయావు సరే ఓ చిన్న వుత్తరం ఓ చిన్న సందేశం పంపలేకపోయావా
ఏదేశం వెళ్ళిపోయావు ?ఎక్కడికి వెళ్లి పోయావో ఎవరికీ తెలుసు ?
గుండెని గాయం చేసి మరీ వెళ్లి పోయావు ,వెళ్ళేటప్పుడు నీ హృదయం విలపించిందా
నేను వినలేక పోయానా ?

వెళ్తూ వెళ్తూ పిలిచే వుంటావేమో దుఖంలో ఇప్పుడని పిస్తోంది ఆ నిమిషంలో
నేను ఎక్కడ వున్నాని ..

ప్రతీ వస్తువులో నీ జ్జాపకం వెన్నాడుతోంది,కన్నీళ్ళతో నీ పేరు రాస్తున్నాను

ఈ దార్లు ,ఈ సందులు నీకు వీడ్కోలు చెప్పలేక పోతున్నాయి .
తొందరగా చెయ్యి వదిలేసావేమో చెప్పల్సింది ఈ గుండెలో ఇంకా మిగిలిపోయింది

ఇప్పుడు జ్జాపకాల ముళ్ళే మిగిలున్నాయి ఇప్పటికీ గుచ్చు కుంటున్నాయి
ఈ ప్రేమ ఇంకా నిన్ను వెతుకుతోంది ఎలా నిరాకరించను ?

నువ్వు వెళ్ళిపోయావు సరే ఓ చిన్న వుత్తరం ఓ చిన్న సందేశం పంలేకపోయావా
ఏదేశం వెళ్ళిపోయావు ?ఎక్కడికి వెళ్లి పోయావో ఎవరికీ తెలుసు ?

  జగ్జీత్ సింగ్ మరో గజల్ ...

Baat niklegi tu phir dooor talak జాఎగి

  ఈ గజల్ విన్నప్పుడల్లా  మన అనుకునే  ఆత్మీయుడు  లోకం గురించి ,మనుషుల గురించి   చెప్తూ ఓ దారుస్తూనట్లు  వుంటుంది.ఈ గజల్ విన్నప్పుడల్లా  దు:ఖం వస్తుంది

Baat niklegi tu phir dooor talak jaayegi
Log bewajha udaasi ka sabab poochenge
Yeh bhi poochenge ke tum itni pareshaan kyo ho
Ungleyaan uthenge sookhay huwe baaloon ki taraf
Ek nazar dekhenge guzray huwe saaloon ki taraf
Chooreyoon per bhi kaee tanz kiye jaayenge
Kaanptay haathoon pe bhi fikray kassay jaayenge
Log zaalim hain her ek baat ka taana denge
Baatoon baatoo mein mera zikr bhi le aayenge
Un ki baatoon ka zara sa bhi assar mat laina
Werna chehray ke ta'assur se samajh jaayenge
Chahay kuch bhi ho sawalaat na karna un se
Mera baray mein koi baat na karna un se

Baat niklegi tu phir dooor talak jaayegi


    మాట పెదవి దాటితే  చాల దూరం వెళ్లి పోతుంది
   మనుషులు కారణం లేకుండానే నీ ఉదాసీనతకి  అర్ధాలు అడుగుతారు
   ఎందుకంత అసహనంగా ఉన్నవని అడుగుతారు
   చెదిరిన ముంగురులవైపు కూడ వేలెత్తి చూపిస్తారు

    గతించిపోయిన కాలం వైపు కూడా ఓ చూపు వెళ్ళిపోతుంది
    చేతికి వేసుకున్న గాజులు కూడా చర్చలోకి వస్తాయి
    ఒణుకుతున్న  చేతులనికూడా వెక్కిరిస్తారు
    లోకం చాలా కృరమైనది ప్రతీ మాటకి వంకలు పెడుతుంది
     మాటల్లో మాటగా నా పేరు  తీసుకువస్తారు

   అలాంటి మాటలని నువ్వు కొంచం కూడా లెక్క చెయ్యకు
   లేకపోతే నీ ముఖం లో కవళీకలని  పసిగట్టేస్తారు
   ఏమైనా  అయిపోని  వాళ్లని ప్రశ్నలు అడగకు
   నాగురించి వాళ్లతో  ఎలాంటి మాట మాట్లాడకు
   మాట పెదవి దాటితే చాలా దూరం వెళ్ళిపోతుంది....... 

Wednesday, 28 May 2014

వాడ్రేవు చిన వీరభద్రుడు గారి కవిత A poem for today:


కన్యలు కలల దారాలతో కుడుతున్న అల్లికలాగా 
కిటికీపక్క గాజులదుకాణం తెరిచింది తురాయిచెట్టు.

ఈకవితలో ఈ రెండు లైన్లు చదివిన దగ్గరనుంచి ,ఎందుకో చాలా జ్జాపకాలు నన్ను చుట్టుముట్టాయి 
మేము మలకపేట్ కాలనీ లో ఉన్నప్పుడు సరిగ్గా మా ఇంటికి ఎదురుగా ఈ తురాయి చెట్టు వుండేది చెట్టుకింద ఎర్రటి పూలు రోడ్డంతా పరుచుకునేవి   ఇప్పటికీ జ్జాపకం మండుటెండలోచెట్టుకింద మేకలు వాటిని కాపుకాసే తాత ,ఓ  బుజ్జి మేకపిల్ల మెళ్ళో కట్టిన గంట చప్పుడు .
.వీటిని అగ్ని పూలు అని కూడా అనేవాళ్ళు, స్కూలునుంచి వస్తూ వస్తూ ఏరుకున్న పూలు మెత్తటి దళసరి రెక్కలపూలు .జడలోతురుముకున్న పూలు ఎర్రటి తురాయి పూలు.
జడలో పెట్టుకోకూడదు అనేవారు అయినా వింటేగా.ఒద్దు అన్న పని చేయడంలో వున్నా అప్పటి ఆనందం ఇప్పుడు రమ్మన్నా రాదు కదా ....

Sunday, 11 May 2014

వానకలిసిన సముద్రం...


వెలియనివాన ఎండని కమ్మేసి చలిచలిగా నగరంలోకి
అడుగుపెట్టడం బాగుంది
జల్లులుగా నేలని అల్లుకుని ఆగని వాన చినుకులంటే అంటే ఇంకా ఇస్టం.

ముసురు మబ్బులు కాఫీ కప్పుని చేతులోవుంచేసి ఆలోచనలకి ఆవిరినందిస్తాయి
చినుకులు నదుల వరదలు తలవంచుకుని "కాదల్"కడలిలో కలిసిపోతే
తూఫాన్ ఇసుకగుడులని మింగేస్తుంది గవ్వలేరుకునే మనుషుల బాల్యం
జాడలేని "ఇష్క"కి కహానిలా అయిపోతుంది

”సాగర్కి లహెరే” సవరించలేని ఉంగరాల ముంగురులు అణిగిపోయాయి
నీళ్ళని చిమ్మేసి రహదారులని ఉప్పుటేరులని చేస్తుందని భయం
కనీళ్ళతో పోటిపడే కాటు ఉప్పుని రుచి చూపిస్తుందని వెఱపు

సముద్రతీరంలో ఇసుకమేటలలో కూరుకుపోతూ ”ఆజా తు పాస్..పాస్ గుజారిశ్..పాటపాడితే
”గుంజుకున్నా నిన్నే యదలోకి"బదులిచ్చే అంత్యాక్షారీలు
ఇసుక మడులలో లంగరేసుకున్న పడవలు ఫోటోలకి ఫొజులిచ్చే ఇళ్లని
నిమిషంలో మింగేసి తీరాన్ని ముక్కలు చేసి వెనక్కి వెళ్ళిపోదుకదా..

ఈవాన వెలియక పోతే సంద్రంలో చంద్రుడు మునిగిపోయి
వెన్నెల చిన్నచిన్న వెండిరేకుల్లా అలల మీద తేలవుకదా
నేలని అల్లుకునే వాన చినుకులు ఇస్టం
వానవెలిసేదాక ఆలోచనలన్నీ అక్కడే జాలరి వలలో చేపలు.....

అడవిలోతడి వెన్నెల



ఓ వర్షపు మేఘం అడవిలో తప్పిపోయింది
నీటిచినుకులు నదిని కనుకున్నాయి
ప్రవహించేనది వృక్షాలని కౌగలించుకొని
చీర చెంగులా చుట్టుకుని 
ఆకుల కీరీటాలని మోసుకుంటూ వెళ్తుంటే

నదిపైన వంతెన చెట్టుకి గట్టుకిదారివేస్తూ
నదిని రెండుభాగాలు చేసింది
ఒకటైన నది రె్ండు వైపులా కనిపిస్తోంది
వర్షం ఆకాశంలో ఆగిపోయింది
పోగమంచు దుప్పటిలో దూరిన అడవి

ఆ చీకటిని నేనే అనుకుంది
చీకటి అడవిని కనుకున్నాను అంది
చంద్రుడు దారి తప్పి అడవిలోకి రాగానే
ఇద్దరు సిగ్గుపడి
వెన్నేలని ఎవరు పంపారో కదా
చలిని ,వేడీని, తీసుకువచ్చింది అనుకున్నాయి

నది మాత్రం
నేను అక్కడనుంచితీసుకోచ్చి
ఇక్కడ పడేసాను అనుకుంది
వెన్నెల అమాయకంగా
నదిని,ఆకులని ,చెట్లని పలకరించి
చీకటి దూరిన ఆడవికి
తెల్లని పరదాలు కట్టీ
వర్షం వెలిసిన తడి దారుల వెంట ప్రయాణిస్తూనే వుంది..