Sunday, 22 June 2014


  జగ్జీత్ సింగ్ మరో గజల్ ...

Baat niklegi tu phir dooor talak జాఎగి

  ఈ గజల్ విన్నప్పుడల్లా  మన అనుకునే  ఆత్మీయుడు  లోకం గురించి ,మనుషుల గురించి   చెప్తూ ఓ దారుస్తూనట్లు  వుంటుంది.ఈ గజల్ విన్నప్పుడల్లా  దు:ఖం వస్తుంది

Baat niklegi tu phir dooor talak jaayegi
Log bewajha udaasi ka sabab poochenge
Yeh bhi poochenge ke tum itni pareshaan kyo ho
Ungleyaan uthenge sookhay huwe baaloon ki taraf
Ek nazar dekhenge guzray huwe saaloon ki taraf
Chooreyoon per bhi kaee tanz kiye jaayenge
Kaanptay haathoon pe bhi fikray kassay jaayenge
Log zaalim hain her ek baat ka taana denge
Baatoon baatoo mein mera zikr bhi le aayenge
Un ki baatoon ka zara sa bhi assar mat laina
Werna chehray ke ta'assur se samajh jaayenge
Chahay kuch bhi ho sawalaat na karna un se
Mera baray mein koi baat na karna un se

Baat niklegi tu phir dooor talak jaayegi


    మాట పెదవి దాటితే  చాల దూరం వెళ్లి పోతుంది
   మనుషులు కారణం లేకుండానే నీ ఉదాసీనతకి  అర్ధాలు అడుగుతారు
   ఎందుకంత అసహనంగా ఉన్నవని అడుగుతారు
   చెదిరిన ముంగురులవైపు కూడ వేలెత్తి చూపిస్తారు

    గతించిపోయిన కాలం వైపు కూడా ఓ చూపు వెళ్ళిపోతుంది
    చేతికి వేసుకున్న గాజులు కూడా చర్చలోకి వస్తాయి
    ఒణుకుతున్న  చేతులనికూడా వెక్కిరిస్తారు
    లోకం చాలా కృరమైనది ప్రతీ మాటకి వంకలు పెడుతుంది
     మాటల్లో మాటగా నా పేరు  తీసుకువస్తారు

   అలాంటి మాటలని నువ్వు కొంచం కూడా లెక్క చెయ్యకు
   లేకపోతే నీ ముఖం లో కవళీకలని  పసిగట్టేస్తారు
   ఏమైనా  అయిపోని  వాళ్లని ప్రశ్నలు అడగకు
   నాగురించి వాళ్లతో  ఎలాంటి మాట మాట్లాడకు
   మాట పెదవి దాటితే చాలా దూరం వెళ్ళిపోతుంది....... 

No comments:

Post a Comment