Monday, 24 July 2023

 



    మామకో లేఖ

   మామ  నీకు మాతో ఉన్న  చుట్టరికం  తెలుసా
   నీ కాంతి అద్దంలో
   మా భూమి మెరిసేది
   మా విరహంలో
   మా దిగులుల్లో
   మా పాపాయి  కళ్ళల్లో
   నీ రూపం  నిండు జాబిల్లి అయ్యేది

   తల ఎత్తి నిన్ను చూస్తున్నప్పుడు
   అనందం  మా కళ్లకే తెలుసు
    నువ్వు మాగదిల్లో
    కిటికీ చువ్వలతో ఆడుకున్నప్పుడు
    మావూరి  బావిలో  తేలినప్పుడు
    మా  నదుల మీద  పడవలా  తేలినప్పుడు
    కాగితల మీద   అక్షరాలుగా
    మాచెయ్యి పట్టుకునే వాడివి
  
    రాత్రి  రోడ్డు మీద  పడుకునే  వాళ్ళ కి
   చల్లని  దుప్పటి అయ్యేవాడివి తెలుసా
    మంచి నీళ్లు మురికి కాలువలు
    కావేవి  వెన్నెలకి అడ్డం  అనే వాడివి
    ఇంత  బంధంతో
    ఇంత  స్నేహంతో
    నీ కోసం  నిర్మిచుకున్న వెన్నెల సామ్రాజ్యమిది

    మామ  ఇప్పుడు నీ ఇంటికి
    మేము రావాలనుకుంటే
    ప్రయాణించాలి
    నిదగ్గరకి  రాక ముందే
    నీతో ముడి పడ్డ  పేజిలని
    ఇక్కడే పాతిపెట్టుకోవాలి

    మై డియర్  చందమామ
    మీ ఇంటికి వచ్చే  రోజుకోసం
    ఎదురు చూస్తున్నా
                    మీ చుట్టాలు...

   
   
  
  

 



   ఈ దుఃఖం  చాల్లారేదెలా ?

" ఎక్కడ స్త్రీ పూజింప బడుతుందో "
     వల్లేవేసిన చోట
  ద్రౌపతీ  నగ్నంగా నిలబడింది
    భక్తి ముదిరిన చోట
  దేవాలయాల మీద  నగ్న దేవత  అయ్యింది
      కామం  తలకేక్కిన  చోట
   నడిచే బస్సులో   నగ్నమై  చనిపోయింది
       ఒంటరి అయినప్పుడు
    ఒంటరితనమే తప్పు అయిన్నట్లు
    దిశ   నగ్నంగా  కాలి బూడిద అయ్యింది
   కులం  మతం   వెర్రి తలలతో నాట్యం చేస్తే
    కూకి  ఆడతనం  నగ్నమైయింది

    ఎన్ని సార్లు మరె న్ని  సార్లు
   నడివిధిలో   నగ్నంగా నిలబెడతారు
    మా బతుకులె ప్పుడు  గాయపడిన
         నెత్తురోడిన   అంగాలేనా
    దాచుకోవడానికి  ఏమీ  లేనంతగా
   మమల్ని మీరు ఎన్ని సార్లు అవమానిస్తారు

    ఎప్పుడైనా ఉప్పెనలా ఉద్యమించి
     మీ చేతులని చీల్చి 
     చూపులని పేల్చేసీ 
     మదం ఎక్కిన గుండెల్లో మందుపాతరలు
     పెట్టాలన్నంత ఆవేశం చేల్లారేదలా ?
    
     
    

  

Thursday, 26 January 2023

 నేను ఎక్కువ పుస్తకాలు వేయకపోయినా నేను రాసిన రెండు దీర్ఘ కావ్యాలలో "పృథ "నాకు చాలా ఇష్టమైన పుస్తకం సాయి పద్మా మంచి స్నేహితురాలు అంతకంటే సాహిత్య అభిమాని నేను వైజగ్ వెళ్ళినపుడు పృథ పుస్తకం ఇవ్వాలి అనుకుని ఇవ్వలేకపోయాను పిడిఎఫ్ పంపాను

పృథ గురించి ఇద్దరం మాట్లాడుకున్న తరువాత రివ్యూ రాయకూడదా అడిగాను అడిగిన వెంటనే రాసింందుకు, సారంగలో ప్రచురించిన ఆఫ్సర్ గారికి పద్మకిదన్యవాదాలు...
కొత్త వ్యాఖ్యతో కుంతి కథ! – సారంగ
MAGAZINE.SAARANGABOOKS.COM
కొత్త వ్యాఖ్యతో కుంతి కథ! – సారంగ
2023 సంచికలుచదువు కబుర్లుసంచిక: 1 జనవరి 2023 కొత్త వ్యాఖ్యతో కుంతి కథ! సాయి పద్మ రేణుక అయోలా గారి పృథ ఇప్పుడే చదివాను. అ...


 పాతదే..

మళ్ళీ జ్ఞాపకంచేసుకుంటూ...
కొన్ని సార్లు కలలు
జ్జాపకం ఉండి ఉండనట్లు
తెలివి వచ్చినా
వెంటాడే అస్పష్ట జ్ఞాపకం
కలల పిట్టలు
రెప్పల తీగ మీద
వరుసగా కూర్చుని
రెక్కలు సరిచేసుకుంటూ
ఊహల్ని పోగుచేసి
కూత పెడితాయి
కూతల సందడిలో
లోయలోకి జారిపోతూ
పట్టు తప్పి
కొత్తదారులు వెంట నడుస్తూ
తడబడుతుంటే
ఎవరిదో చేయి!
పట్టుకుంటుంది
చేయి వొడిలో
దుఃఖతో చిట్లిన నొసలు
నొసలుని తీర్చి దిద్దే వేళ్ళు
వేళ్ళ కొసలు కొత్తవి
చేతి సుగంధం కొత్తది
కొత్తదనం చినుకులలో
తడిసిన ముఖం
మసక వెన్నెలలో
ఊయల ఊగీఊగీ
తెగిన గొలుసు శబ్దానికి
మెలకువ తలుపు తెరుచుకోగానే రెప్పలతీగనుంచి జారిపడ్డ పిట్టలు ఎగిరిపోయాయి.....


 

ఒక పాటతో ప్రయాణం
"ఏజోహల్కా హల్కా సురుర్ హై"
ఎప్పుడైనా ఒంటరిగా నర్తించావా
పాదాలతో మట్టిని తాకుతూ
లోపలి గానానికి బీజాలు వేస్తూ
ఆకాశం వైపు చేతులు చాస్తూ
పాటని ప్రకృతికి వొప్ప చెప్పీ చూసావా
పాట నునులేత చిగురులా మొలకెత్తి
లోపలి ప్రేమని
ప్రియుడి స్పర్శల్ని
జంట సర్పల్లా పెనవేసుకుంటుంది
శ్వాస జీవితం నిద్ర ఉలికిపడతాయి
సన్నిని సవ్వడితో
మొదలైన గానం
గుమ్మడి తీగలా అల్లుకుని
పచ్చనిపూలు
తాటాకు కప్పుమీద
నగ్నంగా నిల్చునట్టుగా
నిన్ను నాట్యంలోయలోకి తోసేస్తుంది
నాట్యం నువ్వు కట్టుకున్న
ఇసుక గుడిలోకి
అలల తెప్పమీదకి
పాదాలని ఉంచమని బతిమాలుతుంది
మట్టిని నీరుని ఆకాశాన్ని తడమంటుంది
గొంతు దాటి రాని
పాట నాట్యం కలుస్తున్నప్పుడే
వేడి ఊపిరి మెత్తటి కౌగిలి
పరిచయం ఒకపిలుపు
ఒక కోరిక ఒక వాగ్దానం
నిశ్శబ్ధ తాకిడికిలో
పాదం వెనక పాదం
పాటని నింపుకున్న వేణువతుంది


 


అమ్మ #సామాన్య శాస్త్రం
కందుకూరి రమేష్ గారి అమ్మ గెలరీ బొమ్మలు చూస్తూ ఉంటాను అమ్మ శాస్త్రం కదిలిస్తుంది అ బొమ్మల్లో మనం అందరం కనిపిస్తాము ధన్యవాదాలు రమేష్ గారూ మాకోసం మేము రాసుకున్న కొన్ని జ్ఞాపకాలకి.....
అమ్మది సామాన్య శాస్త్రమే
ఆవును!అమ్మ ఒక సామాన్య మనిషి
అమ్మకి ఎప్పుడైనా చెప్పులు తోడిగారా
ఆ పాదాలు పగిలి ఉంటాయి
తడబడుతూ ఉంటాయి
నిన్ను నడిపించిన దూరాలు చెప్తూ ఉంటాయి
చేతులు పట్టుకుని అడిగారా
నీ కోరిక ఏమిటని
మోరటుగా వున్నా నాజూకుగా వున్నా
నీ ప్రయాణానికి
గీతలు గీసిన కుంచెలు
నీ పెంకితనాన్ని
నీ కోపాన్ని నీప్రేమని
చిత్రించి
నిన్ను సమాజం ముందు నిల్చొ పెట్టీ ఉంటాయి
ఈ సామాన్య అమ్మని ఎక్కడ ఎప్పుడు కలిసారో
గుర్తుకి తెచ్చుకోండి
రాళ్లు మొస్తూ
బట్టలు కూడుతూ
అంట్లు కడుగుతూ
ఆన్ లైన్ ఉద్యోగం చేస్తూ కనిపిస్తుంది
అమ్మ చీర కొంగుకి
మరకలు అంటించకండి
వీలుంటే అమ్మ కళ్లద్దాలు తీసి కళ్ళకి తగిలించుకుని చూడండి
ఎంత దూర్మర్గంగా ఆలోచనలు కనిపించాయో చూపిస్తుంది అమ్మని చూడాలనంటే
ఈ జన్మ సరిపోదు
ఆ స్థానం ముందు
నువ్వు తల దించుకోవలసిందే
అమ్మని చదవలనంటే "కవి శ్రీకాంత్ ని చదవండి"
అమ్మని చూడాలంటే సామాన్య శాత్రాన్ని అర్ధం చూసుకొండి....
All reactions:
Kavita Kundurti, Kandukuri Ramesh Babu and 3 others

 ఒక అప్పుడు బ్లాగ్ లో రాయడం అలవాటుగా ఉండేది

ఫేస్బుక్ వచ్చిన తరువాత బ్లాగ్ లో రాయడంతగ్గింది fb లో వున్నవి బ్లాగ్ లోఉంటే ఒక book లో పెట్టుకున్నట్లు అనిపించేది.. బ్లాగ్ ని తిరగేస్తూ నేను అప్పట్లో రాసినవి కొన్నిఇక్కడమళ్ళీ షేర్ చేస్తున్నాను ....
నది...
నేను కళ్ళు తెరవగానే
గడ్డిరెమ్మలు గులకరాళ్లు
చుట్టూతిరిగేతూనిగలు
నులివెచ్చనివెలుగు
ఎగిరే కప్పపిల్లలతో ఆడుకుంటూ పెరుగుతూ
సన్నని దారులు వెడల్పు అవడం గమనించాను
తోటలు,కొండలు,చెరువులు కనిపించాయి
నాకు ఎవరో నామకరణంచేశారు నది పుట్టిందిఅన్నారు
నేనునదిగా ఊళ్లుతిరిగాను,వాళ్ళతోనే
ఉన్నాను నువ్వు మా దానివి అన్నారు
నన్ను పోలలోకితీసుకు వెళ్లారు పంటలు పడించమని పూజలు చేశారు.అక్కడే ఉండిపొమ్మని బతిమాలారు...
సముద్రాన్ని ప్రేమించాక
వెళ్ళీ కలవాలనే ఆత్రం
నిలువ నివ్వలేదు మనసంతాసముద్రమే దేహమంతా ఇసుక కలలే
హోరుని వినాలనే తపన
నిరంతరం నీలిరంగు కలయిక తెల్లటి అంచుల దుప్పటిలో ఒదిగి పోవాలనే కోరిక
తనతోపాటునీటిపక్షులతోఆడుకోవాలనే ఆశ
పరుగులుతీసాను
పర్వతా లని దాటాను, నగరాలని గమనించలేదు
రైలుబ్రిడ్జ క్రింద నుంచి పరుగు
ఎవరెవరో నాతో కలుస్తున్నారు
ఎవరినిపట్టించుకోలేదు సముద్రం కోసం ప్రేమ కోసం
పరుగులు తీసాను ఊపిరి విడవకుండా నిలువలేని ప్రేమతో వెళ్ళీ వేళ్ళీ సముద్రం దగ్గర ఆగాను ఊపిరి తీసుకుంటూ.. వెనక నుంచి ఎవరో తోసినట్లు వాలులోకి జారిపోయాను సముద్రంనన్ను గమనించలేదు ఒక చూపు కూడా చూడలేదు హోరులో అలల జోరులో కట్టుకు పోయాను నేను ఒంటరిగా మిగిలిపోయాను
రోజు ఎన్నో నదుల నీళ్లు కలుస్తున్నాయి ఎవరి దోవ వారిదే సముద్రం నా ప్రేమని చూడలేదు
నేను స్పర్శలని అనుభవిస్తూ ఉండిపోయాను....
All reactions:
Geeta Vellanki, Kavita Kundurti and 4 others
1 comment
Like
Comment
Share

1 comment