Monday, 30 June 2014

Main Khayal Hoon Kisi Aur Ka ......


 ఈ గజల్ ని  జగ్జీత్ సింగ్ తో సహా ఎంతో మంది మహామహులు పాడారు ,కాని నాకు  ప్రత్యేకంగా    హరిహరన్ పాడింది  చాలా ఇష్టం
  ఎవరికోసమో పరుగులు పెడతాం  ఏది మనదికాదు అని తెలిసినా వెతుకుతూనే వుంటాం
  అలసిపోతూ వుంటాం ,ఈ గజాల్  విన్న ప్రతీసారీ  ప్రతీ పదంలో కొత్త అర్దం కనిపిస్తుంది
  ఎన్నో సార్లు విన్నా ఈ సారి వినగానే నా భావాలని మీతో పంచుకోవాలని పించింది ...

Main Khayal Hoon Kisi Aur Ka
Mein Khayal Hoon Kisi Aur Ka
Mujhe Sochta Koi Aur Hai
Sar-E-Aeenah Mera Aks Hai
Pas-E-Aeenah Koi Aur Hai

Mein Kisi Keh Dast-E-Talab Mein Hoon
To Kisi Keh Harf-E-Dua Mein Hoon
Mein Naseeb Hoon Kisi Aur Ka
Mejhe Maangta Koi Aur Hai

Ajab Aitabar-O-Bey Aitabaree
Keh Darmayan Hai Zindagi
Mein Qareeb Hoon Kisi Aur Keh
Mujhe Jaanta Koi Aur Hai

Mujhe Doston Ka Pata Nahin
Mujhey Dushmanon Ki Khabar Nahin
Meri Daastan Koi Aur Thi
Mera Waaqaya Koi Aur Hai

Jo Milen Kabhi Unhen Poochna
Dekhna Unhen Ghaur Sey
Jinhen Raastey Mein Khabar Hui
Keh Yeh Raasta Koi Aur Hai

Jo Meri Reyazat-E-Neem Shab
Ko Saleem Subh Na Mil Saki
To Is Key Mani To Yeh Hue
Keh Yahan Khuda Koi Aur హాయ్

  నేను ఒక జ్జాపకాన్ని ఎవరికో ,కాని నాగురించి  ఆలోచించే వాళ్ళు ఇంకెవరో
  కోరికతో అద్దం ముందు వున్నది నా ప్రతి బింబమే కానీ నావెనక వున్నది  ఇంకెవరో
 నేను ఎవరికోసమో ఆకలితో  చేతులు దాస్తాను కానీ ఎవరి ప్రార్ధనో నామీద వుంది
 నేను ఎవరికోసమో వుందా మను కుంటాను కానీ నన్ను కోరుకునే వాళ్ళు ఇంకెవరో

  కొత్త నమ్మకాలు  అపనమ్మకాల మధ్య జీవితం
  నేను దగ్గరగా వున్నది ఎవరికో   కానీ  నన్ను తెలుసుకున్న వాళ్ళు ఇంకెవరో  
  శత్రువులు ఎవరో తెలిసుకో లేకపోయాను స్నేహితులు అర్ధం కాలేదు
  నా జీవితం ఇంకొకరిది అనుకుంటే  అక్కడ నిజాలు ఇంకొకరివి
  దారిలో ఎవరు వచ్చిన అడిగేకన్నా పరీక్షగా  చూస్తే దారిలోనే తెలిసి పోయింది
  ఆ దారి ఇంకెవరిదో అని .
  నా ప్రార్ధన ప్రార్ధించడంలో  అర్ధ రాత్రి గడిచి పోయింది
  కాని తెలిసింది ఏమిటి అంటే  "సలీమ్ "ని కలవలేక పోయినా
  నేను ప్రా ర్దించిన దేవుడు  కూడా  ఆఖరికి వేరని .....

Tuesday, 24 June 2014

జగ్జీత్ సింగ్ మరో గజల్ /ఈ గజల్ ఇష్టపడని వాళ్ళు అరుదు అని అనుకుంటాను నాకు చాల ఇష్టం కనుక ..

జగ్జీత్ సింగ్  మరో గజల్ /ఈ గజల్  ఇష్టపడని  వాళ్ళు అరుదు అని అనుకుంటాను
నాకు చాల ఇష్టం కనుక ..
  ( Hoton Se Chhulo Tum ( Prem Geet - 1981 )

  ఇది ప్రేమ గీతంలా అనిపిస్తుంది కాని  మనిషికి మనిషి ఇచ్చే ఆత్మవిశ్వాసం ,అనుబంధం కనిపిస్తుంది
  అక్షరాలూ కవితగా మారుతాయి ,కవిత పాట అవుతుంది ,పాట మనసుకి హాయిని ,ఓదార్పుని తోడుని
   ఇస్తుంది ఆ పాట పెదవుల మీద ఊయల లూగితే  అది అమర గీతమే  అవుతుంది


Honthon Se Chulo Tum
Meraa Git Amar Kar Do
Ban Jaao Mit Mere
Meri Prit Amar Kar Do
Na Umar Ki Simaa Ho
Na Janam Kaa Ho Bandhan
Jab Pyaar Kare Koi
To Dekhe Keval Man

Na_Ii Rit Chalaakar Tum
Ye Rit Amar Kara Do
Honthon Se Chulo Tum
Jag Ne Chhinaa Mujhase
Mujhe Jo Bhi Lagaa Pyaaraa

Sab Jitaa Kiye Mujhase
Main Har Dam Hi Haaraa
Tum Haar Ke Dil Apanaa
Meri Jit Amar Kar Do

Honthon Se Chulo Tum
Aakaash Kaa Suunaapan
Mere Tanahaa Man Men
Paayal Chhanraanivvuakaati తుం

Aajaao Jivan Men
Saansen Dekar Apani
Sangit Amar Kar Do
Honthon Se Chulo Tum

  నా పాటని నీ పెదవుల మీదకి  రానివ్వు
  అది అమర గీతం అవుతుంది
  నా జీవితంలోకి  ప్రేమికురాలిగా వచ్చి చూడు
  నాప్రేమ అమర మవుతుంది

  వయసుకి  సరిహద్దులు లేవు
  జన్మలకి బంధనాలు లేవు
  ఎవరు ప్రేమించినా  మనసుని చూడాల్సిందే
  కోత్త పధ్ధతి నువ్వే మొదలుపెట్టి దానిని చిరస్థాయిగా  చెయ్యి

 ఆకాశమంత  శూన్యం వుంది నా ఒంటరి మనసులో
 కాలి మువ్వల సవ్వడిలా  నాజీవితంలోకి  ప్రవేశించు
 నా సంగీతానికి నీ  ఊపిరినిచ్చి గానాన్ని  అమరం చెయ్యి
 
 ఈ ప్రపంచం నా నుంచి నా  ఇష్టలన్ని  తీసేసుకుంది
 అందరూ గెలుస్తూనే వున్నారు నేనే ప్రతీసారి  ఓడిపోతున్నాను
 నీ హృదయం ముందు నువ్వు  ఓడిపోయి  నా  గెలుపుని అమరం చెయ్యి ......

Sunday, 22 June 2014

జగ్జీత్ సింగ్ మరో గజల్ .... నాకు చాలా ఇస్టమైన వాటిల్లో మరొకటి ... దు:ఖం గా వున్నప్పుడు మనల్ని అబిమానించే వాళ్ళు గమనించకూడదని,కనిపెట్ట కూడదని సర్వవిధాల ప్రయత్నిస్తాము ,చిరునవ్వుని బలవంతంగా పెదవులమీదకి తెచ్చుకుని నవ్వుతూ వుంటాము కాని కన్నీటి పొర దాగదుగా



Tum Itna Jo Muskura Rahe Ho 
Kya Gham Hai Jisko Chhupa Rahe Ho 
Aankhon Mein Nami, Hansi Labon Par 
Kya Haal Hai Kya Dikha Rahe Ho 
Ban Jayenge Zehar Peete Peete
Yeh Ashq Jo Piye Ja Rahe Ho
Jin Zakhmon Ko Waqt Bhar Chala Hai
Tum Kyon Unhe Chhedhe Ja Rahe Ho
Rekhaon Ka Khel Hai Muqaddar
Rekhaon Se Maat Kha Rahe Ho
Tum Itna Jo...

ఎందుకు ఇవాళ ఇంతగా నవ్వుతున్నావు ?
ఏ గాయాని దాచాలని ఇంతగా ప్రయ త్నిస్తున్నావు ,కన్నీటి తడిలో చిరునవ్వు
నిన్ను నిస్సహాయంగా నిలబెట్టింది ,కన్నీళ్ళు దాచుకుంటున్నాని అనుకుంటున్నావు
విషం అయిపోతున్నాయి అవి తాగి తాగి , ,ఏ గాయాన్ని కాలం దాచి పెడుతోందో దానన్నే ఎందుకు
గుర్తు తెచ్చు కుంటున్నవు,అరచేతిలో గీతలే జీవితం అయినప్పుడు వాటితో పోరాటం ఎందుకు ?

ప్రేమించే వాళ్ళ దగ్గరనుంచి ఈ మాత్రపు ఓదార్పు చాలు కదూ అనిపిస్తుంది ఈ గజల్
ఎన్ని సార్లు విన్నా .....
మనసు ,పాట,ప్రకృతి,ఏవి విడి విడి గా వుండవు పాటని ప్రేమించిన వాళ్లకి 
ప్యాసా పాత హిందీ సినిమాలో పాటలు విని ఇష్టపడని వాళ్లు అరుదు 
అందులో ఈ పాట నాకు చాల ఇష్టం ,జీవిత సత్యాన్ని కొంత ,విరక్తిని కొంత 
పోగొట్టుకున్న ప్రేమ కనిపిస్తుంది ఇందులో 

Jane Woh Kaise Log The Lyrics from Pyaasa (Old)

Jane woh kaise log the jinke pyaar ko pyaar mila
Hamne toh jab kaliyan mangi katon kaa har mila

Bichhad gaya har saathi dekar pal do pal kaa saath
Kisko phursat hai jo thame divane kaa hath
Hamko apna saya tak aksar bejar mila
Hamne to jab

Isko hee jina kehte hain toh yun hee jee lenge
Uf naa karenge lab see lenge aansu pee lenge
Gham se abb ghabrana kaisa gham sau bar mila
Hamne to jab

కొందరికి జీవితంలో ఎందుకో ప్రేమకి బదులు ప్రేమే దొరుకుతుంది
కొందరికి పూలుకాదు మొగ్గలు కోరుకున్నా ముళ్ళు దొరుకుతాయి
కొన్ని స్నేహాలు అప్పటికప్పుడు దగ్గర అయ్యి విడిపోతాయి

అప్పుడని పిస్తుంది ఎవరికీ పట్టింది మనలాంటి పిచ్చి వాళ్లకి చేయందించడానికి
ఆఖరికి నీడ కూడా విసుగ్గా అనిపిస్తుంది
ఇదే నిజమైన జీవితం అయితే అలాగే బతికేద్దాం
నిట్టూర్చ కుండా మాటలని కుట్టేసుకుని కన్నీళ్ళు దిగమింగి బతికేద్దాము
ఇంక గాయాలకి దుఃఖాలకి భయమెందుకు అవి వందసార్లు మనవే అయినప్పుడు

అనుకున్నవి జరగనప్పుడు ఒక్కసారైనా ఇలా అనిపించక మానదు,
కనీసం ఈ పాట విన్నప్పుడైన ఈ భావం రాక మానదు అనిపిస్తుంది నాకు.....

జగ్జీత్ సింగ్ మరో గజల్ .... Chithhi na koyi sandesh... Ho... Chithhi na koi sandesh



మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోయిన మన అనుకున్న వాళ్ళు తిరిగి రారని తెలిసినా 
ఏదో వెర్రి ఆశ,దుఖంలో మనుసుతో అనుకునే మాటలు వాటి తాలూకు స్పర్శలు ఇక్కడ 
ఇలా అక్షరాలతో నా భావాలు .....

Chithhi na koyi sandesh... 
Ho... Chithhi na koi sandesh 
Jaane woh kaun sa desh jaha tum chale gaye
Chithhi na koyi sandesh
Jaane woh kaun sa desh jaha tum chale gaye
Chithhi na koyi sandesh
Jaane woh kaun sa desh jaha tum chale gaye
Jaha tum chale gaye
Is dil pe laga ke thhes jaane woh kaun sa desh
Jaha tum chale gaye...

Ek aah bhari hogi hamne na suni hogi
Jaate jaate tumne awaaz to di hogi
Har waqt yehi hai gham, us waqt kaha the hum
Kaha tum chale gaye
Chithhi na koi sandesh jaane woh kaun sa desh
Jaha tum chale gaye jaha tum chale gaye
Is dil pe laga ke thhes jaane woh kaun sa desh
Jaha tum chale gaye...

Har cheez pe ashkon se likha hai tumhaara naam
Ye raste ghar galiyaan tumhe kar na sake salaam
Hai dil mein reh gayi baat, jaldi se chhuda kar haath
Kaha tum chale gaye
Chithhi na koi sandesh jaane woh kaun sa desh
Jaha tum chale gaye jaha tum chale gaye
Is dil pe laga ke thhes jaane woh kaun sa desh
Jahan tum chale gaye...

Ab yaadon ke kaante is dil mein chubhte hain
Na dard thhaherta hai na aanson rukte hain
Tumhe dhhundhh raha hai pyaar, hum kaise karein iqraar
Kaha tum chale gaye
Chithhi na koi sandesh jaane woh kaun sa desh
Jaha tum chale gaye jaha tum chale gaye
Is dil pe laga ke thhes jaane woh kaun sa desh
Jahan tum chale gaye...
Ho kahan tum chale gaye... (3)

నువ్వు వెళ్ళిపోయావు సరే ఓ చిన్న వుత్తరం ఓ చిన్న సందేశం పంపలేకపోయావా
ఏదేశం వెళ్ళిపోయావు ?ఎక్కడికి వెళ్లి పోయావో ఎవరికీ తెలుసు ?
గుండెని గాయం చేసి మరీ వెళ్లి పోయావు ,వెళ్ళేటప్పుడు నీ హృదయం విలపించిందా
నేను వినలేక పోయానా ?

వెళ్తూ వెళ్తూ పిలిచే వుంటావేమో దుఖంలో ఇప్పుడని పిస్తోంది ఆ నిమిషంలో
నేను ఎక్కడ వున్నాని ..

ప్రతీ వస్తువులో నీ జ్జాపకం వెన్నాడుతోంది,కన్నీళ్ళతో నీ పేరు రాస్తున్నాను

ఈ దార్లు ,ఈ సందులు నీకు వీడ్కోలు చెప్పలేక పోతున్నాయి .
తొందరగా చెయ్యి వదిలేసావేమో చెప్పల్సింది ఈ గుండెలో ఇంకా మిగిలిపోయింది

ఇప్పుడు జ్జాపకాల ముళ్ళే మిగిలున్నాయి ఇప్పటికీ గుచ్చు కుంటున్నాయి
ఈ ప్రేమ ఇంకా నిన్ను వెతుకుతోంది ఎలా నిరాకరించను ?

నువ్వు వెళ్ళిపోయావు సరే ఓ చిన్న వుత్తరం ఓ చిన్న సందేశం పంలేకపోయావా
ఏదేశం వెళ్ళిపోయావు ?ఎక్కడికి వెళ్లి పోయావో ఎవరికీ తెలుసు ?

  జగ్జీత్ సింగ్ మరో గజల్ ...

Baat niklegi tu phir dooor talak జాఎగి

  ఈ గజల్ విన్నప్పుడల్లా  మన అనుకునే  ఆత్మీయుడు  లోకం గురించి ,మనుషుల గురించి   చెప్తూ ఓ దారుస్తూనట్లు  వుంటుంది.ఈ గజల్ విన్నప్పుడల్లా  దు:ఖం వస్తుంది

Baat niklegi tu phir dooor talak jaayegi
Log bewajha udaasi ka sabab poochenge
Yeh bhi poochenge ke tum itni pareshaan kyo ho
Ungleyaan uthenge sookhay huwe baaloon ki taraf
Ek nazar dekhenge guzray huwe saaloon ki taraf
Chooreyoon per bhi kaee tanz kiye jaayenge
Kaanptay haathoon pe bhi fikray kassay jaayenge
Log zaalim hain her ek baat ka taana denge
Baatoon baatoo mein mera zikr bhi le aayenge
Un ki baatoon ka zara sa bhi assar mat laina
Werna chehray ke ta'assur se samajh jaayenge
Chahay kuch bhi ho sawalaat na karna un se
Mera baray mein koi baat na karna un se

Baat niklegi tu phir dooor talak jaayegi


    మాట పెదవి దాటితే  చాల దూరం వెళ్లి పోతుంది
   మనుషులు కారణం లేకుండానే నీ ఉదాసీనతకి  అర్ధాలు అడుగుతారు
   ఎందుకంత అసహనంగా ఉన్నవని అడుగుతారు
   చెదిరిన ముంగురులవైపు కూడ వేలెత్తి చూపిస్తారు

    గతించిపోయిన కాలం వైపు కూడా ఓ చూపు వెళ్ళిపోతుంది
    చేతికి వేసుకున్న గాజులు కూడా చర్చలోకి వస్తాయి
    ఒణుకుతున్న  చేతులనికూడా వెక్కిరిస్తారు
    లోకం చాలా కృరమైనది ప్రతీ మాటకి వంకలు పెడుతుంది
     మాటల్లో మాటగా నా పేరు  తీసుకువస్తారు

   అలాంటి మాటలని నువ్వు కొంచం కూడా లెక్క చెయ్యకు
   లేకపోతే నీ ముఖం లో కవళీకలని  పసిగట్టేస్తారు
   ఏమైనా  అయిపోని  వాళ్లని ప్రశ్నలు అడగకు
   నాగురించి వాళ్లతో  ఎలాంటి మాట మాట్లాడకు
   మాట పెదవి దాటితే చాలా దూరం వెళ్ళిపోతుంది.......