Thursday, 29 March 2012

అచ్చం గాంధీగారిలా



నగరం దేహంలోకి పరకాయ ప్రవేశంచేసాక        
మాట్లాడుకోవడానికి ఏం మిగులుతుంది?
 ట్రాఫిక్ లో ఎర్ర లైటు పడి  ఆగగానే
కనిపించే దృశ్యాలు శరీరానికి అంటరానివి

పదమూడేళ్ళ కుర్రవాడు.
పరిగెత్తుకుని వస్తాడు
ఒంటి నిండా గ్రీజు పూసుకొని
అద్దాలు లేని కళ్ళద్దాలు,చేతికర్ర, పంచ
అచ్చం” గాంధీగారి" వేషంలో
చిరునవ్వులు చిందిస్తూ శిలలా నిలబడి పోతాడు.
ఎండ కాస్తూవుంటుంది
వాహనల పొగలు కమ్ముకుంటుంటాయి
అయినా నిశ్శబ్ధంగా నిలబడే వుంటాడు.
నిశ్శబ్ధంలోంచీ గతం గాలిపటంలా ఎగిరి
కళ్ళముందు వాలిపోతుంది.

నూలు వడికిన రాట్నాలు
ఉప్పుసత్యాగ్రహాలు,జలియన్ వాలాబగ్ నెత్తుటి మరకలు
"హే రామ్" అంటూ నేలకొరిగిన  జాతిపితా_
అర్ధ రాత్రీ స్వాతంత్రం,చిన్నప్పట్టి పాఠాలు గుర్తుకొస్తాయి.

స్వేఛ కరిగించిన మూసలో రంగుపూసలై               
కరిగిపోతున్న సంస్కృతిలో మేరుస్తూ
తెగిన గాలిపటంలా ఏచెట్టుకు వేలాడబడతామో?
కళ్లకి కనిపించేవి మేదడులో ఇంకకముందే
మనకోసం కూడా మనం ఆగని దశ

ఆకుపచ్చని లైటు పడుతుంది
చీమలు చెదిరినట్లు చెదిరిన మనుషులు వాహనాలు
క్షాణాల్లో మాయమైపోయాక-

వాడు ఎప్పటిలాగే చెదిరిన ట్రాఫిక్ తొపాటూ
వెనక్కి వెళ్ళిపోయీ,మళ్ళి పడే ఎర్రలైటు కోసం
చిరునవ్వులు సిద్దం చేసుకుంటాడు
ఎడాది పోడవునా ఎక్కడో అక్కడ
అచ్చం "గాంధీ్గారిలా" నిల్చోవడానికి.

ఏడాది ఒక్కసారే  గుర్తుకి తెచ్చుకోనే
కోట్లజనాభాకి వాడి చిరునవ్వుల "సలాం”
ఆ రోజంతా గుచ్చుకునే  విషంలో ముంచిన ముల్లు.


-






Sunday, 11 March 2012

అలారం


                    

పక్షుల కిలకిలారావాలుమొదలయ్యాయి,కిచకిచమంటు ఒకటే గోల.
”అబ్బా ” అప్పుడే తెల్లవారిందా  అనుకుంటూ బద్ధకంగా పక్కమీద దొర్లాను ఎంత విసుకున్నాలేవక తప్పదు
ఇప్పుడు లేచి పని మొదలుపెట్టక పోతే అన్నీ ఒకదానికి ఒకటి లింకులా అలస్యం అయిపోతాయి.
పక్కకి తిరిగి చూసాను పిల్లలు శ్రీవారు హాయిగా ఆదమరచి నిద్ర పోతున్నారు అదృస్టవంతులు మళ్ళీ జన్మంటూ వుంటే
అసలు ఆడపిల్లగా పుట్టకూడదు.
పొద్దున్నే లేవాలన్న ఉక్రోషంతో రోజు అనుకుంటాను,అయినా లేవక తప్పదు.
మంచం  మీదనుంచి దిగి బ్రష్ మీద పేస్ట్  వేసుకొ్ని తలుపు తీసి వరండాలోకివచ్చాను ఎదురుగా పచ్చని చెట్టు గుబురుగా పచ్చని ఆకులతోచల్లటి గాలి స్పర్స .అంతె  అప్పటి దాక వున్న విసుగు చిరాకు అన్నీ మంత్రం వేసినట్లు మాయం అయిపోయాయి.
తూరుపు రేఖలు మెల్లగా అకాశంలొ పరుచుకుంటు లోకాన్ని నిద్ర లేపు తున్నాయి. ఈ దృశ్యం ఎప్పుడూ అధ్బుతంగా వుంటుంది
రైలు బండి ఆగితే స్టేషనులో జరిగే హడావి్డిలా  చెట్టు మీద వున్న పక్షులన్నీ గోలగోలగా అరుస్తాయి.అటుఇటు ఎగురుతాయి
రివ్వున ఎగిరి వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చి వాలుతాయి.వాటి భాషలో ఎన్ని కబుర్లో !
బ్రష చేసుకుంటూ వాటీని గమనించడం  అలవాటుగా మారింది.
        వెలుతురు పూర్తిగా రాగానే అన్ని ఒక్క సారిగా ఎగిరి పోతాయి.మళ్ళీ  రైలు వెళ్ళాకా నిశ్శబ్దంగా అయిపోయిన ప్లాట్ ఫారంలావుంటుందా చెట్టు.
రోజు చుస్తూన్నాసరె  వాటి దిన చర్య తమాషాగా అనిపిస్తుంది
నిశ్శబ్దంగా అయిపోయిన చెట్టు మొదట్లోంచి సన్నని ’గజ్జెల  చప్పుడుల” పక్షిపిల్లలు  కిచకిచమంటుంటాయి

     వీటి  హడావిడే నాకు అలారం,అవి చేసే గోలకి విసుక్కోవడం అప్పుడే తెల్లవారిందా అనుకోవడం అలవాటుగా మారింది
పక్షి తల్లులు తిండీ గింజలకోసం బయటికి వెళితే  నేను ఇంటి పనికోసం వంటింట్లొకి..
పిల్లలిద్దరు లేచి పాల గ్లాసులతో వరండాలొకి వస్తారు ఆచెట్టుమీద ఎన్నో గూళ్ళు వున్నా ఒక కొమ్మ మీదగూడు మావరండాకిదగ్గరగా వుంటుంది.
అదే వాళ్ళిద్దరికి పెద్ద ఆకర్షణ  అందులోవున్న చిట్టిచిట్టి పక్షిపిల్లలు అమ్మ రాకకోసం నోరు తెరుస్తూ కిచకిచమంటూ ముందుకిజరుగుతూ భయపడుతూ వెనక్కి వెనక్కి జరుగుతున్న  వాటిచూడడం వీళ్లకిసరదా,వాటిని చూస్తూన్నంతసేపు ఎన్నో సందేహాలు
"అమ్మా" అవి కింద పడిపోవా పడిపోతే వాళ్ళ అమ్మకి ఏలా తేలుస్తుంది? గూడు దేనితో కడుతుంది? మెత్తగా వుంటుందా?
అన్నం ఎప్పుడు తెస్తుంది?ఇలాంటి ప్రశ్నలు రోజు వస్తూ వుంటాయి. వాళ్ళకి సమాధానాలు ఇస్తూనే వాళ్ళని తయారు చేస్తాను
ఆ సందేహల మధ్యలోనే టిఫిన్ తినడం అయిపోతుంది పేచీ పెట్టకుండా. అచెట్టు వల్ల నాకు ఎంతో లాభం.
ఆలా ఆ చెట్టు మా దినచర్యలో ఒక భాగం అయిపొయింది.
మేము వుంటున్న ఎపార్టమెంట్ నగరం నడి  బొడ్డులో్వుంది.చుట్టూతా కనుచూపు మేరలో ఖాళీ జగాలేకుండా  పేకమేడల్లా
ఎపార్టమెంట్లు. ఈలాంటీ రెండు ఎపార్టమెంట్ల మధ్య ఈ చెట్టుగల ఇల్లు వుంది ఇల్లు పూర్తీగా శిధిలమైనా  ఆ ఇంటి గోడనానుకొని వున్న చెట్టు దానిచుట్టూవున్న సిమెంటు అరుగు ఆ ఇంటివాళ్ళ జ్ఞాపాకాల సాక్షి నిస్వార్ధంగా మమ్మల్ని తన పచ్చదనంతో పలకరిస్తూవుంటుంది.
పిల్లలు స్కూలునుంచి రాగానే ఆడుకోవడానికి చెమ్చాఅంత స్థలం కూడా లేదు.రోడ్డు మీదవిపరీతమైన ట్రాఫిక్.మళ్ళీ పిల్లలందరికీ
ఆ ఇల్లే అడుకొనే స్థలంగామారింది ఆ చెట్టునీడలో సిమెంటు అరుగుమీద ఆడుకుంటూవుంటారు. ఎంత వద్దన్నా అక్కడికే వేళ్ళేవాళ్ళు.
చెత్త పిచ్చిమెక్కలు వున్నాయి ఎదైన పురుగు కుడుతుందని చెప్పినా వి్నేవాళ్ళుకాదు ఇంక లాభంలేదు వీళ్ళుమన మాటవినరు 
అనుకొని అందరం కలసి ఆస్థలం శుభ్రంచేయించాము.వాళ్ళతోపాటూ మాకు కబుర్లు చెప్పుకోవడానికి ఆ ఇల్లు అలవాటు అయ్యింది.
     ఆ చెట్టుని చూసి నప్పుడల్లా అనిపిస్తుంది ”నాటీంది చిన్నమొక్క”ఈ రోజు ఇంతమందికి నీడ,పచ్చదనం చల్లటిగాలితో పాటుఆ ఇంటి జ్ఞాపకాలు.
అన్నదమ్ముల గొడవల మధ్య ఆ ఇంటి అమ్మకం ఆగిపోయిందంటే బాధ,దాని కోసమే అనుబంధాలు తెంపుకున్నారని చెప్పుకుంటుంటేమనసు వికలం అయిపోతుంది.
ఆన్ని బంధాలకి మూలం ఈ డబ్బేనా?ఎంత కాదు కూడదు అనుకొన్నా ఇది అక్షర సత్యం. ఒక పేగు పంచుకు పుట్టీ ఒకే ఇంట్లో ఆడుకొని పెరిగామాని గుర్తుకి రానివ్వని ఈ డబ్బు ఎంతచెడ్డదికదా?
అందరు వెళ్ళిపోయాక  వరండాలోకి రాగానే చల్లటి గాలితో మళ్ళీపలకరించే  ఈ చెట్టుతో అనుబంధం రోజురోజుకి పెరిగి పోతోంది
ఎపార్టమేంటు కొనేటప్పుడు ఎన్నో  ఊహలు,ఎన్నో ప్లాన్లు వరండా అంతా చిన్నగార్డన్ లా వుంచుకోవాలని అందులో కుర్చివేసుకుని,కూర్చుని కబుర్లుచెప్పుకోవాలని తీరావచ్చాక ఎన్నో సమస్యలు కిందవాళ్ళ వరండాలోకి నీటీ చుక్క కూడా రాలకూడదు,
ఎప్పుడైనా ఊరికివెళితే-.ఊరినుంచి రాగానే వాడిపోయి చచ్చిపోయిన మొక్కలని  చూస్తే ప్రాణం ఉసూరుమనేది.
ఎంతో ఆప్యాయంగా శ్రద్ధగా పెంచుకొని  అవి అలా కళ్ళముందు  నిర్జీవంగా వుంటే చూడలేక.
వారండాలని ఖాళీగా వుంచుకొని ఇంటినిండా ప్లాస్టిక్ మొక్కలతో జీవంలేని వాటితోటే అనందం పంచుకోవడం అలవాటైపోయింది.
           ఖాళి సమయాల్లో ఇలాంటి ఆలొచనలు సాగిపోతునేవుంటాయి  గుమ్మందగరకి వస్తే చాలు  చల్లటిగాలులతోపలకరిస్తుంది.
  కాంక్రీటు నగరంలో మనం ఒక సిమెంటు పలకలా మారిపోతున్నాము..అభిమానాలు ఆత్మీయతలు
పలకరింపులు లేని ఇరుకైన జీవితాలు పచ్చదనాన్నే కోల్పొయాయి .
ఇన్ని అపార్టమెంటులు పుట్టగోడుగుల్లామొలుస్తున్నా కట్టే ప్రతీ అపార్టమెంటుకి ఒక పార్క ,పిల్లలకి ఆటస్ఠలం వుడలన్ననిబంధన వుంటేఎంత బాగుంటుంది. అందమైన బ్రోచర్లకే అంకితమైన  పిల్లల ఆటస్ఠలాలు .తీరాకట్టక వాటి నామరూపలు వుండవు ,నామమాత్రంగా
చిన్నగోడకట్టి  రెండు జారుడు బండలు వేసి బాధ్యత తీరిందని మళ్ళీ అడుగుదామన్నా పత్తాలేని బిల్డర్లు.
అడిగేందు నిలదిసేందుకు ఎవరికి ఓపిక? లోను కట్ అయిపోతుందన్న భయం అనుకొన్న సమయానికే అందచేసాడన్న అనందంతప్పించి ఎమీ మిగలదు.

 పిల్లలు ఇళ్ళలో చదువులు,కంప్యుటర్ గేముల మధ్య బంధీ అయిపొతున్నారు.పెద్దస్కూళ్ళలో తప్పించి స్ఠలందొరకడమే అబ్బురమైనస్కూళ్లల్లో ఆడుకునే స్ఠలాలేక్కడ?
పెద్దవాళ్ళు వాళ్ళచిన్నతనం కబుర్లు,ఆటలు చెబుతుంటే ఆశ్చర్యంగా వింటూ మీరు కొబ్బరిచెట్టు ఎక్కారా? అంతపెద్ద నదిలో ఈతలు కోట్టారా నాన్నా?అని అడగడం సర్వసాధారణమైపోయింది. అందుకే ఈసారి శెలవులకి  నానమ్మగారి ఊరు తీసుకు వెళ్ళాలని పెద్ద ఎత్తునప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఊరు వెళ్ళడానికి ఇంతప్రయత్నమా? ఆశ్చర్యమేమరి ! రైలు టికెట్లు ఆఫీస్ లో శెలవులు వెరసి అన్నీ కుదిరాయి కాబట్టి ప్రయాణం ఖాయం అయ్యింది.
ఎమిటొ ఈచెట్టుని చూస్తుంటే అలోచనలు ఎక్కడనుండి ఎక్కడికో పరుగెడతాయి.
పిల్లలస్కూల్ బస్సు హారన్ వినిపించి తుళ్ళి పడ్డాను ఈ రోజునుంచే శెలవులుమొదలు,అందులొనూ ఇవాళే ప్రయాణం కూడా
గల గలా  మంటూ లోపలివచ్చారు ఇద్దరు  నన్ను వెతుకుంటూ అమ్మా బ్యాగు సద్దావా అంటూ వాళ్లగదిలోకి పరుగులు పెట్టారు
స్కూలు డ్రస్సువిప్పకుండానే.హాడావిడి మొదలు అయ్యింది అనుకుంటూ వాళ్ళ వెనకాలే గదిలోకివెళ్ళాను

       కిటీకి లోంచివెలుతురు పడుతుంటే ఉలికిపడి లేచాను ప్రయాణం బడలిక అనుకుంటాను తెలివిరాలేదు అయినా పక్షుల సందడి  వినిపించనంత మొద్దు నిద్ర పట్టేసిందా? వాచీ వేపు చూస్తే ఏడు గంటలు చూపిస్తోంది.
ఈ వారంరోజుల్లొ వాటిసంగతే మరిచిపోయానా?,ఇంకానయం ఇవాళ ఆదివారం కాబట్టి సరిపో్యింది లేకపోతే ఉరుకుపరుగులు
స్కూలుకి వెళ్లమని పేచీలు ,ఏడుపులు గోలఘోష అనుకుంటూ ఆలోచిస్తూనే బ్రష్ మీదపేస్టు వేసుకుని వరండా తలుపుతెరిచాను ఎదురుగా నేలకూలిన పచ్చని చెట్టు రాలిపోయిన కొమ్మలు ,నాలుగు అడుగులు ఎత్తు లేచిన ఇటుకగోడలు.ఆ స్ఠలంలో ఎపార్టమెంటువచ్చేలావుంది ఆవ్యవహారం చూస్తుంటే .ఎందుకో కళ్ళలో నీళ్ళుతిరిగాయి.ఆత్మీయులని పోగొట్టుకున్న భావన
రేపటినుంచీ సిమెంటు, ధూళి,ఇనుపచువ్వల చప్పుడు,మరో పేకమేడ మొదలు...
     ఇంతలో పిల్లలు కూడాలేచారు ”అమ్మా చెట్టుకొట్టేసారు"ఆత్రంగా అరిచారు..ఇంకా బాల్కనీలోనే నిలబడి చూస్తూన్న చిన్నదాని
మనసునిండాఎన్నో సందేహాలు ” అమ్మా” ఆచెట్టుమీద పక్షులన్నీ ఎమయ్యాయి?  చిన్నచిన్నపిట్టలు ఏవీ ?వాటికి ఎగరడం రాదుగా
 వాళ్ళ అమ్మవచ్చి తీసుకు వెళ్ళిందా చెప్పమ్మా” అంటూ వేధించడంమొదలు పెట్టింది. దానికి ఏం సమాధానం చెప్పాలి?
అవును వాళ్ళ అమ్మవచ్చీ పట్టుకు వెళ్ళింది అన్నాను...

  ఇంతలో మాపెద్ద అమ్మాయి చిన్నదానికి చెబుతోంది మనుషుల్లా వాటికి వాళ్ళ పిల్లలని తీసువెళ్లడంరాదు ,అమ్మ నువ్వు బాధపడతావని అలాచెప్పింది .అంది పెద్ద ఆరిందలా  
     
   ఇన్నాళ్ళకి ఇల్లు అమ్మకంకుదిరింది కాబోలు ఎన్నో ఊహలతో కట్టుకున్న ఇల్లు ముక్కలైపోయింది,అందరికీ వాటాలు వచ్చినా
అందమైన పొదరిల్లు చెదిరిపోయింది ఆచెట్టులాగే  అది కూలిపోగానే పిట్టలన్నీ ఎగిరిపోతాయి...
ఇంకా ఎగరడంరానివి చనిపోయాయా?లేకవచ్చిరాని రెక్కలతో జీవన పోరాటానికి బయలుదేరాయా?
  మనసంతా ఎదో తెలియని చికాకుతో నిండి పోయింది.మూలపడేసిన గడియారం తీసాను అలారం కోసం....


   




.




   
     


          
   





Saturday, 3 March 2012

కోన్ -బనేగా.........


  
కిస్సాకుర్సీకా"  మంటలురేపే సింహాసనం
పర్వతాలాంటి మనుషులు ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతూ
ప్రపంచంముందు కుర్చుంటారు

గంభీర స్వరం స్వాగతంపలుకుతుంది
ఎదురుగా  కంప్యుటర్  నుదిటి రాతను సరిచేయగల బ్రహ్మదేవుడు.
ఆనేక  ప్రశ్నలు చిన్నతాళం
ఇన్నింటీనీ తట్టుకుని నిలబడ్డానికి చాలా కస్టబడాలి
గతంముందు మోకరిల్లాలి
లోకంలో మన స్థానాన్ని అప్పచెప్పుకోవాలి

”పంచకోటీ మహామణీ”  జాబవంతుడీ మెడలొ శమంతకమణీ
కోరి ఎంచుకున్న మెట్టు ఎక్కగానే
ఆశల సీతాకోకచిలుకలు చుట్టూ ఎగురుతూ
బవిష్యత్తు రంగులన్నీ లొలోపలికి ఒంపుతాయి

పలకరింపుల జడీవానలో తడిసిముద్దయ్యాక
ముక్కలుగా విరిగి పోకుండానిలబడ్డం చాలా కస్టం
చెక్కులు నిదానంగా అడుగులు వేస్తుంటాయి
సింహాసనంలొ కూర్చుని బేలగా మారిపోతూ
కన్నీళ్ళు పెట్టుకుంటూ మనసు మంటలని
ఆర్పుకోవడం అంటే-

పరిస్థితులమీదనుంచి,కష్టాలమీదనుంచి
ఆగాధాల మైదానాలమీద నుంచి దాటుకుని
నెత్తిమీద కీర్తి కీరిటాన్నిధరించి
అలఓకగా నేల మీదకాళ్ళు అనించి నడవడం.

అందరికి అదృష్టంగా అనిపిస్తుంది
అరికాళ్ళకింద  ధనాన్ని పేర్చుకుంటూ
ధీమగా నడూస్తుంటే అందరి ఆశలు మోస్తున్నట్లే
నడుస్తున్న వాళ్ళ వెనకాల
మోన్నటికన్నా నిన్నటికన్నా ఎన్నో తుఫానులు
ఎన్నో ఇంధ్రధనస్సులు రోజు వస్తూనేవుంటాయి...... 













Thursday, 1 March 2012

జన్మరహస్యం

కొత్తగా తెలిసిన జన్మరహస్యం
అక్కరలేని బిడ్డను,దొప్పలొ పెట్టి నీళ్ళళో వదిలేయడం?
***
కన్నప్రేమని అనుభవించని రహస్యం
ఆనందమో కోపమో ఎటూతేల్చుకోలేని మనసు
ఆవేదనతో ముఖాన్ని గుర్తుపట్టాలనుకుంటే
వెలుతురు అంటని చీకట్లో
నీళ్ళలొ ముఖబింబం కనిపించదు
వ్యాపించే వెలుతురుతోపాటు నిజం మెలిపెడుతోంది.

ఇ నాళ్ళకి కనిపించిన తల్లి నిజం
నిజాన్ని నీడలామోయ్యాలి
పెంచి పెద్దచేసిన "అమ్మ అబధం"
అనుకోవడానికి ఈ జన్మచాలదు

"సూర్యదేవుడి అనుగ్రహం
తెల్లటి కాంతితో,కుమ్మరివాడు మట్టితో బొమ్మని చెసినట్లుగా
కిరణాల పడవ మీద వచ్చావు-"
              అమ్మ చెబుతుంటే ఎంత గర్వం.

ఆ గర్వం తునాతునకలు అవకుండా
నిల్చోగలనా?
ప్రేమపాశం తెలియని  నిర్ధయురాలైన
తల్లిగర్భమే తనపుట్టుక-నాకే ఒక విస్మయం.!!!

విలువిద్యలో కీర్తి సంపాదించి
దుర్యోధన మహారాజు కుడిభుజంగా,
కీరీటంలో ప్రకాశించే మణిననిపించుకున్నాక
ఒక సంతృప్తి -

కుంతి పుత్రుడనని తేలిన నిజం
లోకాన్నంతా చీకటిమయం చేసేసాయి
నిజం నిర్దయగా ఆలస్యంగా  ప్రవేసించి
ఏం సాధిస్తుంది?
నిజాన్ని తన కడుపులొనే దాచేసి
తన ఒళ్ళోనే చనిపోయిన అమ్మ

రూపులేని నల్లటినదిలో ఈత
తనది అచ్చం కుంతిరూపమట!
***
వెలుతురు సోకని చీకట్లో
నీళ్ళలొ నా ముఖబింబం నాకేమాత్రమూ కనిపించదు.


(ఎస్.ఎల్ భైరప్ప ’ పర్వ’ చదివాక.....)