Sunday, 9 September 2012
Thursday, 6 September 2012
Tuesday, 14 August 2012
ఆమెకో అక్షర నివాళి
Posted By భూమిక on August 9, 2008
రేణుక అయోల
సాహిత్య లోకంలో
ఆమె పరిచయం
కొద్ది నెలలు కావచ్చు…..
ఆమె పరిచయం
కొద్ది నెలలు కావచ్చు…..
స్నేహ హృదయాన్ని
అందిపుచ్చుకొన్నాను
ఎప్పుడు ఎదురొచ్చినా
నిండుగా నవ్వుల పువ్వులు వెదజల్లే
ఆ ఆత్మీతయను పదిలపరచుకొన్నాను
అందరితోపాటూ కలసీ
తలకోన అడవుల్లోనైనా
భూమిక ఆఫీసులోనైనా
మనతో పాటూ ఎన్నోసార్లు
కలసి నడచిన
ఆమె…
మన మధ్య లేదనుకుంటే
సన్నని కోత
ఆమె మనకు కనిపించకపోయినా
మనతో ఇమిడిన గతం
పదే పదే తలచుకొనేలా చేస్తుంది
స్నేహం విలువ చాలా గొప్పది
అది ఎప్పుడూ గతించదు
మన పరిచయాలు అక్షరాలే
మనమెంత తొందరగా
కలసిపోయి విడిపోయినా
దూరాలు పెంచుకొన్నా
మిగిలిపోయిన జ్ఞాపకాలు
పుస్తకాల మధ్య
పేజీల కొమ్మల చివర్న
సజీవంగా గుర్తుండిపోయే
ఆమెకో అక్షర నివాళి
(భార్గవీరావుగారి స్మృతిలో)
Cక్షర నివాళి”
Wednesday, 23 May 2012
అవిటి నగరంలోకి ఒక ఋతువు
ఏమాత్రపు చిన్న అలికిడైనా చేయకుండానే
బతుకుని కేలండర్ అంకెలుగా మార్చుకొని
తెల్లవారడం ,చీకటి పడడం-
వీటి మధ్యే ఇరుక్కుపోయి,అందులోనేఅటూ ఇటూ దొర్లుతూ
సూర్యాస్తమాల చిరునవ్వులైనా స్వీకరించకుండానే
సాగిపోతున్నప్పుడు,ఒక నిశ్శబ్ద సౌదర్యం
ఋతువుల ఆగమనాన్ని చూపించింది
శితగాలికి దుప్పటి కప్పుకోన్నట్లేవుంది-
వసంతం అడుగులు కనిపించకుండానే
చిరుచెమటలు మెడకిందకి జారాయి
అప్పుడే ఋతు సంగీతం ఒక పక్షిలా నదిలా
నగరంలోకి ప్రవేసించింది
దూరంగా సైకిలు వాడి గంపలో ఆకుదూయని
మల్లేలు గుబాళించాయి
వేపపూత తెల్లగా చెట్టునుంచి వంగీ వునికిని చాటుకుంది
పొగొట్టుకున్న వస్తువు దొరికినట్లుగా
మురిపించిన గతం
రెక్కలు తొడుక్కుని ఆ ఊరికి చేరుకుంది
మండువా లోగిళ్ళూ
నట్టింట్లో ఊయ్యాల బల్ల
వెండిపళ్ళేంలొ మల్లెమొగ్గలు దారంవుండ
మెడదాక దిగని జుత్తుకి మల్లేపూల జడ.
తోటలో కోకిల కూతలకి స్వరంకలిపి
విసిగించి నవ్వుకోన్న రోజులు
విరగ కాసిన వెన్నెల గుబాళించే మల్లేలు
రాత్రి తెల్లగా మెరుస్తూంటే
స్వేచ్ఛా మలయవాయువులు
ఎన్ని మొసుకు రాగలము?
ప్రతీ ఏడాది వసంతం వస్తూనే ఉంది
అప్పుడప్పుడు గతంలా గుర్తుకి తెచ్చుకోవడానికే
అనుకుంటే-
నిరామయమైన జీవితంతో అవిటి వాళ్ళతోనిండిన
నగరంలో మనం ఒకరం....
Friday, 13 April 2012
నాలోనే
ఎప్పుడూ నీకు దొరికిపోతాను
నిన్ను వెతకాలనుకుంటూ
నన్నునేను వెదుకుంటాను
కాలం కరిగిపోతున్నప్పుడు
హఠాత్తుగా గాలివీచి
కిటికీ తెరుచుకొని
మనసుశబ్ధాలు వింటుంటే
భయమేస్తుంది మిత్రమా!
కాలం ఆగిపోవాలనుకోడం
నీకోసం కాలాన్ని దగ్గరగా జరపలనుకోడం
వెర్రితనమా
మరుపు కాలనికి కోలమానం అయితే
నిన్ను మరచి పోవాలని అది శాసిస్తే
నీకొసం పరుగులు తీసే మనసుకి సంకేళ్లు వెయ్యి
నీమనసు గదిలో బంధీ చెయ్యి
ఉరిశిక్ష వేసి మరణాన్ని ప్రసాదించు
నన్ను నామనసుని సమాధి చెయ్యి
అప్పుడు మరచి పోతాను నిన్ను.
నాలో నిన్ను దాచుకుని
వెదకడం మానేస్తాను........
Wednesday, 4 April 2012
Thursday, 29 March 2012
అచ్చం గాంధీగారిలా
నగరం దేహంలోకి పరకాయ ప్రవేశంచేసాక
మాట్లాడుకోవడానికి ఏం మిగులుతుంది?
ట్రాఫిక్ లో ఎర్ర లైటు పడి ఆగగానే
కనిపించే దృశ్యాలు శరీరానికి అంటరానివి
పదమూడేళ్ళ కుర్రవాడు.
పరిగెత్తుకుని వస్తాడు
ఒంటి నిండా గ్రీజు పూసుకొని
అద్దాలు లేని కళ్ళద్దాలు,చేతికర్ర, పంచ
అచ్చం” గాంధీగారి" వేషంలో
చిరునవ్వులు చిందిస్తూ శిలలా నిలబడి పోతాడు.
ఎండ కాస్తూవుంటుంది
వాహనల పొగలు కమ్ముకుంటుంటాయి
అయినా నిశ్శబ్ధంగా నిలబడే వుంటాడు.
నిశ్శబ్ధంలోంచీ గతం గాలిపటంలా ఎగిరి
కళ్ళముందు వాలిపోతుంది.
నూలు వడికిన రాట్నాలు
ఉప్పుసత్యాగ్రహాలు,జలియన్ వాలాబగ్ నెత్తుటి మరకలు
"హే రామ్" అంటూ నేలకొరిగిన జాతిపితా_
అర్ధ రాత్రీ స్వాతంత్రం,చిన్నప్పట్టి పాఠాలు గుర్తుకొస్తాయి.
స్వేఛ కరిగించిన మూసలో రంగుపూసలై
కరిగిపోతున్న సంస్కృతిలో మేరుస్తూ
తెగిన గాలిపటంలా ఏచెట్టుకు వేలాడబడతామో?
కళ్లకి కనిపించేవి మేదడులో ఇంకకముందే
మనకోసం కూడా మనం ఆగని దశ
ఆకుపచ్చని లైటు పడుతుంది
చీమలు చెదిరినట్లు చెదిరిన మనుషులు వాహనాలు
క్షాణాల్లో మాయమైపోయాక-
వాడు ఎప్పటిలాగే చెదిరిన ట్రాఫిక్ తొపాటూ
వెనక్కి వెళ్ళిపోయీ,మళ్ళి పడే ఎర్రలైటు కోసం
చిరునవ్వులు సిద్దం చేసుకుంటాడు
ఎడాది పోడవునా ఎక్కడో అక్కడ
అచ్చం "గాంధీ్గారిలా" నిల్చోవడానికి.
ఏడాది ఒక్కసారే గుర్తుకి తెచ్చుకోనే
కోట్లజనాభాకి వాడి చిరునవ్వుల "సలాం”
ఆ రోజంతా గుచ్చుకునే విషంలో ముంచిన ముల్లు.
-
Subscribe to:
Posts (Atom)





పరిచయము చేసారు. అటువంటి సాహితీ దీక్షా పరులుకు, నివాళి!!!