Monday 24 July 2023

       సబ్బు బుడగలు


సిగ్నల్  పడుతుంది
సబ్బు బుడగలు ఎగురుతాయి
గుండ్రంగా ఉన్న బుడగ
గాల్లో తేలుతూ 
బాల్యపు  ముఖాన్ని చేతిలో  పెట్టింది
గమనించావా...

సబ్బు నీళ్లు కలిపి వూదుకునే బుడగ లో
  అల్లరి ముఖం
నోటితో సాగదీసి ఊపిరి  నింపే బుడగ లో
దారం కట్టీ ఎగరేసిన  నవ్వు ముఖం
సైకీలు  మీద అమ్ముకోచ్చే రంగు బుడగలు
కొని ఇవ్వక పొతే  అలిగిన ముఖం
బుడగల  పేలి
చేతిలో చిరిగిన ముక్కలో
 ఏడుపు ముఖం
ముఖలాన్ని కలిసి ఎదిగి
బాల్యన్ని  అరచేతిలో  బంధించి నప్పుడు 

సిగ్నల్ ల్లో నీటి బుడగ
అరచేతిని విప్పి బాల్యం కోసప్పటి లాగి ఎగురవేస్తే
గాల్లో ఒక్క  క్షణం  ఎగిరిన  బుడగ
పసితనాన్ని  తడిమి  తడి చేసి వెళ్ళీ నపుడు
 చిరు నవ్వుల  పరదా లాగి
 ముఖాన్ని అందంగా ఉంచింది
     చూసుకున్నావా...
  
    



No comments:

Post a Comment