Wednesday, 25 April 2018

నువ్వు మొలిచే గోడవి

మత్తు మొలిచే గోడ
గోడ పొగలా చుట్టుకున్నపుడు
దూకాలని గోడ మీదపాదం మోపుతావు
రంగురంగు రాళ్ళతొ పాలరాతి మెరుపుతో 
నిన్ను మభ్య పెట్టి తనలోనే దాచేసుకుని
ఆక్కడే లోపలే నిన్ను కుల్చేస్తుంది

అది పర్వతం కాదు
పాలరాతి కొండలు కాదు
కేవలం నువ్వు పెంచుకున్న వ్యసనం 
గోడ రాళ్ళతో పలకలతో కట్టింది కాదు
పొగలా ఊపిరి ఆడనీయంది కాదు
అది పల్చని పోర
రెండు చేతులు చాచి వెళ్లాలనుకుని
ఒక్కసారి తోసావంటే చిరిగి ముక్కలవుతుంది
అలా కాకుండా
విశ్రాంతిగా తల ఆన్చితే
ఊబిలా నిన్ను లాగేస్తుంది

పగలు రాత్రి నీ మనిషిలా పక్కనే వుంటుంది
నిలోపలి భయాలలొకి ప్రవేశించాలని దాని ప్రయత్నం !
దారి మళ్ళించి పిరికిగా మురికిగా చేసి
హింసని కుళ్ళిపోయిన జీవితాన్ని
దాచే యంత్రంగా మార్చాలనుకుంటుంది
తల వొక్కటి బయట పెట్టి చూసేలోగా
నీ తలని ముక్కలుగా చేస్తుంది
నిర్మాణంలోనే గట్టి పడి రాతి గుండెని చేస్తుంది
అందుకే అంటాను !
మత్తుని ఊదే యంత్రం అవ్వాలని
బావిష్యత్తుపాదాలమీద అడుగు పడాలని
సుడి తిరిగి నల్లగా కమ్ముకుని
నీ ఊపిరిని ఆపేలోగా
నీ చేతుల్లో వోఖడ్గం వుండాలని
బలికాకుండా గోడ పాదాన్ని కిందికి దింపి
నువ్వు దూకడానికి గోడలు లేకుండా చేయగలగాలని
అసలు అది నీ జీవితంలో లేదు అనుకుంటే
ప్రతీ అంగుళంలో జీవితం నీది అవుతుంది
నువ్వు మత్తుని చంపిన గోడైతే
నిన్ను దూకలని
ప్రపంచం నీ వైపు రావడానికి ప్రయత్నిస్తుంది
ఇప్పుడు మొదలు పెట్టు
నువ్వు గోడగా మొలవడానికి .....

1 comment:

  1. వామ్మో ఈ రేంజిలో పద్యాలు రాస్తే ఎవ్వలికైనా అర్థమౌతుందా. అసలు ఈ తికమక తవికలు ఎందుకు రాస్తున్నారో ఏమో. ఊపిరి సినిమాలో కార్తి వేసిన బొమ్మలాగా అనిపిస్తుంది.

    ReplyDelete