కన్యలు కలల దారాలతో కుడుతున్న అల్లికలాగా
కిటికీపక్క గాజులదుకాణం తెరిచింది తురాయిచెట్టు.
ఈకవితలో ఈ రెండు లైన్లు చదివిన దగ్గరనుంచి ,ఎందుకో చాలా జ్జాపకాలు నన్ను చుట్టుముట్టాయి
మేము మలకపేట్ కాలనీ లో ఉన్నప్పుడు సరిగ్గా మా ఇంటికి ఎదురుగా ఈ తురాయి చెట్టు వుండేది చెట్టుకింద ఎర్రటి పూలు రోడ్డంతా పరుచుకునేవి ఇప్పటికీ జ్జాపకం మండుటెండలోచెట్టుకింద మేకలు వాటిని కాపుకాసే తాత ,ఓ బుజ్జి మేకపిల్ల మెళ్ళో కట్టిన గంట చప్పుడు .
.వీటిని అగ్ని పూలు అని కూడా అనేవాళ్ళు, స్కూలునుంచి వస్తూ వస్తూ ఏరుకున్న పూలు మెత్తటి దళసరి రెక్కలపూలు .జడలోతురుముకున్న పూలు ఎర్రటి తురాయి పూలు.
జడలో పెట్టుకోకూడదు అనేవారు అయినా వింటేగా.ఒద్దు అన్న పని చేయడంలో వున్నా అప్పటి ఆనందం ఇప్పుడు రమ్మన్నా రాదు కదా ....