"కిస్సాకుర్సీకా" మంటలురేపే సింహాసనం
పర్వతాలాంటి మనుషులు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ
ప్రపంచంముందు కూర్చుంటారు
గంభీర స్వరం స్వాగతం పలుకుతుంది
ఎదురుగా కంప్యుటర్ నుదిటి రాతను సరిచేయగల బ్రహ్మదేవుడు!.
ఆనేక ప్రశ్నలు చిన్నతాళం--
ఇన్నింటినీ తట్టుకుని నిలబడ్డానికి చాలా కష్టపడాలి
గతంముందు మోకరిల్లాలి
లోకంలో మన స్థానాన్ని అప్పచెప్పుకోవాలి
”పంచకోటీ మహామణీ” ఊహించనికి జీవితానికి సింహద్వారం !
కోరి ఎంచుకున్న మెట్టు ఎక్కగానే
అశల సీతాకోకచిలుకలు చుట్టూ ఎగురుతూ
భవిష్యత్తు రంగులన్నీ లోలోపలికి ఒంపుతాయి
పలకరింపుల జడివానలో తడిసిముద్దయ్యాక
సింహాసనంలొ కూర్చుని బేలగా మారిపోతూ
కన్నీళ్ళుపెట్టుకుంటూ
మనసు మంటలని ఆర్పుకోవడం అంటే-
సుళ్ళు తిరుగుతున్న ఆశ నిరాశలతో
బీడుభూమి మీద వానచినుకుని అనుభవించడమే..!
చెక్కులు నిదానంగా అడుగులు వేస్తుంటాయి
పరిస్థితులమీద నుంచి, కష్టాలమీద నుంచి
ఆగాధాల మైదానాలమీద నుంచి దాటుకుని
డబ్బు కీరిటాన్ని మోస్తూ
అలఓకగా నేల మీదకాళ్ళు ఆనించి నడవడం !
అందరికి అదృష్టంగా అనిపిస్తుంది.
గెలిచిన ధనాన్ని నెత్తిన పెట్టుకుని
అరికాళ్ళకింద బాధ్యతలు పేర్చుకుంటూ
ధీమగా నడుస్తుంటే అందరి ఆశలు మోస్తున్నట్లే!
నడుస్తున్న వాళ్ళ వెనకాల
మొన్నటికన్నా నిన్నటికన్నా
ఎన్నో తుఫానులు ,ఎన్నో ఇంధ్రధనస్సులు ..
రోజు వస్తూనే వుంటాయి.
!*!
chalaa bagundi renu vachana kavithvam saili u re great in presentation...love j
ReplyDeletewonderful expression Renukaji
ReplyDelete