Wednesday, 3 September 2025
Monday, 24 July 2023
మామకో లేఖ
మామ నీకు మాతో ఉన్న చుట్టరికం తెలుసా
నీ కాంతి అద్దంలో
మా భూమి మెరిసేది
మా విరహంలో
మా దిగులుల్లో
మా పాపాయి కళ్ళల్లో
నీ రూపం నిండు జాబిల్లి అయ్యేది
తల ఎత్తి నిన్ను చూస్తున్నప్పుడు
అనందం మా కళ్లకే తెలుసు
నువ్వు మాగదిల్లో
కిటికీ చువ్వలతో ఆడుకున్నప్పుడు
మావూరి బావిలో తేలినప్పుడు
మా నదుల మీద పడవలా తేలినప్పుడు
కాగితల మీద అక్షరాలుగా
మాచెయ్యి పట్టుకునే వాడివి
రాత్రి రోడ్డు మీద పడుకునే వాళ్ళ కి
చల్లని దుప్పటి అయ్యేవాడివి తెలుసా
మంచి నీళ్లు మురికి కాలువలు
కావేవి వెన్నెలకి అడ్డం అనే వాడివి
ఇంత బంధంతో
ఇంత స్నేహంతో
నీ కోసం నిర్మిచుకున్న వెన్నెల సామ్రాజ్యమిది
మామ ఇప్పుడు నీ ఇంటికి
మేము రావాలనుకుంటే
ప్రయాణించాలి
నిదగ్గరకి రాక ముందే
నీతో ముడి పడ్డ పేజిలని
ఇక్కడే పాతిపెట్టుకోవాలి
మై డియర్ చందమామ
మీ ఇంటికి వచ్చే రోజుకోసం
ఎదురు చూస్తున్నా
మీ చుట్టాలు...
ఈ దుఃఖం చాల్లారేదెలా ?
" ఎక్కడ స్త్రీ పూజింప బడుతుందో "
వల్లేవేసిన చోట
ద్రౌపతీ నగ్నంగా నిలబడింది
భక్తి ముదిరిన చోట
దేవాలయాల మీద నగ్న దేవత అయ్యింది
కామం తలకేక్కిన చోట
నడిచే బస్సులో నగ్నమై చనిపోయింది
ఒంటరి అయినప్పుడు
ఒంటరితనమే తప్పు అయిన్నట్లు
దిశ నగ్నంగా కాలి బూడిద అయ్యింది
కులం మతం వెర్రి తలలతో నాట్యం చేస్తే
కూకి ఆడతనం నగ్నమైయింది
ఎన్ని సార్లు మరె న్ని సార్లు
నడివిధిలో నగ్నంగా నిలబెడతారు
మా బతుకులె ప్పుడు గాయపడిన
నెత్తురోడిన అంగాలేనా
దాచుకోవడానికి ఏమీ లేనంతగా
మమల్ని మీరు ఎన్ని సార్లు అవమానిస్తారు
ఎప్పుడైనా ఉప్పెనలా ఉద్యమించి
మీ చేతులని చీల్చి
చూపులని పేల్చేసీ
మదం ఎక్కిన గుండెల్లో మందుపాతరలు
పెట్టాలన్నంత ఆవేశం చేల్లారేదలా ?
మదం ఎక్కిన గుండెల్లో మందుపాతరలు
పెట్టాలన్నంత ఆవేశం చేల్లారేదలా ?
Subscribe to:
Posts (Atom)



