ఈ సాయం కాలం కొన్ని మబ్బులు
చెట్ల తలలమీదపత్తి పువ్వులా విచ్చుకున్నాయి
చెట్ల తలలమీదపత్తి పువ్వులా విచ్చుకున్నాయి
పార్కు లో తెల్లటి బొమ్మలాంటి పాపా
ఎండ అద్దంలో ఊయల ఊగుతోంది
అద్దం దాటి ఊయల నీడలో చిక్కుంది
కొంత నీడ ఎదురింటి చెట్లకింద
ముందురాకు పచ్చ జంబుఖానా పరిచింది
నిన్నటి హాలోవిన్ బొమ్మలన్నీ గాలికి
ఊగుతున్నాయి
రాత్రి భయపెట్టిన. భూతాలన్నీ లేతఎండలో
రబ్బరు బొమ్మల్లా తేలిపోతున్నాయి
రబ్బరు బొమ్మల్లా తేలిపోతున్నాయి
సందడి లేని రోడ్లన్నీ ఎప్పటి లాగే నిశ్శబ్దాన్ని మోస్తున్నాయి .....