గబగబా పేజీలు తిరగవేస్తోంది పొందికగా గుండ్రంగా వున్న అక్షరాల వెంటఆత్రంగా ఆశ్చర్యంగా
పరుగులు తీస్తూన్నకళ్ళకిఏదో రహస్యం పొరలువిప్పుకుంటూ సిగ్గుపడేలా చేస్తోంది.
ఒక స్త్రీచుట్టు అల్లుకున్నఊహలు,చదువుతున్నకోద్ది వేడి నెత్తురు చెంపలమీద జరజరా పాకుతోంది....
ఖరీదైన కారు రోడ్డుమీద గుంతల్ని తప్పించుకోలేనట్లే ”ఇండ్రస్టలిస్ట్” భార్యగా , ఒక డైర్కెక్టర గా వుండి కూడా కిరణ్ పర్సనల్ డైరీని చదువుతూ చలించి పోయింది.
విసురుగా మూసేసి పక్కన పడేసినా, అక్షరాలు వెంటాడు తున్నాయి, "నయనతార" పేరు పదేపదే గుర్తుకొస్తోంది.ఎవరీ "నయన తార"?
పర్సనల్ డైరీని ఇంత నిర్లక్ష్యంగా ఏలా మరచి పోయాడు? అనట్లు ఇది కిరణ్ కారుకదూ.
తన కారు రిపేరులో వుంటే కిరణ్ కారులోవెళుతోంది.కిరణ్ ఢిల్లి వెళ్లాడు ఈ రాత్రికి వస్తాడు, అడగాలా వద్దా? ఏమని అడగాలి?
వేగంగా దూసుకుపోతున్న కారు అద్దంలొ ఎన్నడు లేంది తనని తాను చూసుకుంది "అనిత”నీట్ గా ట్రిమ్ చేసిన అందమైన క్రాఫ్ చెవులకి కనీకనిపించని చిన్న డైమన్డ ఇయర్ రింగ్స్,జీన్స్ కుర్తా
మోడ్ర్న కంఫ్ ర్ట్ డ్రస్.ఈ లుక్స్ కిరణ్కి నచ్చలేదా?
ఆలోచిస్తూనే ఆఫీస్ ఛాంబర్లోకిఅడుగుపెట్టింది్.
అసలు కిరణ్కి జీవితంలోటుఅంటూ ఉందా?
ఆలోచనలు వదలక పోవడంతో ఎన్నో ప్రశ్నలు.
జీవితం అంటే అన్నీ అమర్చిన విస్తరిలాఉండాలనే కోరుకుంటారు అందరు
కొందరినే అది వరిస్తుంది, .”కిరణ్కిఅలాంటిజీవితం వరించింది,వరించిన జీవితం సాఫీగా సాగిపోతొంది.
మహా నగరంలో ”ఇంటర్ నేషనల్ స్కూలు చదువు దగ్గరనూంచి తండ్రిఇచ్చిన ”ఇండస్ట్రీ, మోడ్రన్ లుక్స్ గల భార్య అనిత దాక.
ధనవంతులేఅనిపించుకోదగ్గ జీవితం ." అందరూ ఈర్ష్య పడేంత.మరి ఇప్పుడు ఇంకా ఎంకావాలి?అలా అని నేనుఅనుకుంటున్నానా? తన మనసులో ఏదో వెలితి వుందా అది నేనేనా?
అన్నీ ప్రశ్నలే సమాధానం దొరకటంలేదు.పని మీద ఏకాగ్రతకుదరడంలేదు
మీటింగ్స అన్నీ యధాలాపంగా ముగించీ,తనని డిస్ట్రబ్ చెయ్యదని చెప్పి
ఒంటరిగా కూర్చున్నా ఆలోచనలు వాటంతటవే పరుగులు పెడుతున్నాయి
మళ్ళీ కళ్లముందుకి కిరణ్ డైరీలో అక్షరాలువచ్చీ వెంటాడుతున్నాయి
నన్ను అందరు చాలా అందమైయింది, తెలివైందిఅంటారు
ఇల్లు,పిల్లలు భర్త ... అందర్నిచుట్టూతిప్పుకునే ఓ అందమైన స్కూలు టీచర్ నువ్వు.
కిరణ్ఎన్నిసార్లు అన్నా నవ్వేసి ఊరుకునేది,ఇదంతా నాఒక్కదాని గురించి కాదుగా అంటూ..
కిరణ్ మాటల్ని పట్టించుకోలేదు.లేచిందగ్గరనుంచి మార్నింగవాక్స,లేదా త్రెడ్మిమీల్ మీద నడకలు శరీరంలోఇంచీఎవరూ పెరగ కూడదు,ఇంట్లో ఎక్కడా అనవసరమైన తినుబండారాలు వుండవు.
అందుకే ఎక్కడికి వెళ్ళినా ప్రశంసలవర్షం.తల్లీకూతుళ్ళని అక్కా చెల్లెళ్ళాఅని,
తండ్రీ కొడుకులని అన్నదమ్ములా అని.!వీటన్నింటివెనక ఎంత శ్రమ.
కిరణ్ సహజంగా చాలా అందమైన వాడు,దానికి తోడు ఫిట్నెస్, మీసాలకి రంగు వేసుకోడు సహజంగా వుండాలనుకుంటాడు.అయినా అందరూ మెచ్చుకుంటారు.
బి.టెక్ ఆఖరి సంవత్సరంలో వున్న అబ్బాయి,మెడికల్ లో మాస్టర్స్ చేస్తున్న అమ్మాయి,ఇండస్ట్రీలో చేదోడువాదోడుగా వున్న భార్య,ఇవ్వన్నీ
కాకుండా బొద్దుగా జాకెట్టు అంచుదాక వున్న జడ జడలో మల్లెపూలుపెట్టుకున్న ఆవిడ "నయనతార" కిరణ్ మనసులో తిస్టవేసుకుని
పర్సనల్ డైరీలొ రోజు ఒక భాగం అయిపోయాక..మనసంతా మోద్దుబారిపోయింది.ఆ అక్షరాలు వెంటాడి వెధిస్తూన్నాయి.కిరణ్ డైరీలో అక్షరాలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి
" హాయిగా సాగిపోయే జీవితం అన్ని వి్షయాల్లొతోడుగా వుండే అనిత
ఇన్నీంటి మధ్య చిన్నప్పటి జ్నాపకం. ఎదురింటి మాస్టారి గారి అమ్మాయి పట్టుపరికిణి,పొడుగు జడ ,బంగారు జడకుప్పెలు.మనసులో ముద్రించుకుపోయాయి.
బాపు హీరోయిన్ జడ అంత జడ కాకపోయినా జాకట్టు అంచులదాక వున్న జడ ఆ జడలో మండు వేసవిలొ జాజి మాల. ఆ రూపం చాలాఇస్టం
అనితని అలాగే చూడాలని అనిపించేది చిన్నకోరిక ఎవరైన వింటే నవ్వుతారేమో భార్యని అడగడానికి మోహమాటమేమిటి? మొహమాటం కాదు ఎవరి స్వేచ్ఛ వారిది వేసుకునే డ్రస్ నికూడా నియత్రించడంఇస్టంలేక
అనిత ,కూతురు లాస్య ,కొడుకు భరత్ అందరు నీట్ గా టీమ్ వర్కకర్స్లా కోంచంకూడా పెరగనివ్వని శరీరం కొలతలతో అందరూ మొగవాళ్ళల్లాతిరుగుతూంటే,ఎవరికి తీరిక చిన్న జాజిపూలదండ జడలొపెట్టుకోవడానికి?.మొగాళ్ళలాగ అని నేను అనుకుంటే సరిపోతుందావాళ్ళూ అనుకోవాలిగా.
వాళ్ళకి ఆ ఫిట్నస్ అరోగ్యాని సంబందించింది .కాని నేనే వాళ్ళలొ ఇమడలేక సతమవుతున్నానుఅనుకుంటూ నిట్టూర్చిన రోజులు ఎన్నో.
పూల బోకేలు షాపు దగ్గర డ్రయివ ర్ నిలబడి బోకే కొంటున్నాడు సరిగ్గా అప్పుడేచూసాను ఆమెని కారులొ కూర్చున్న నాకు ఆమె స్ప స్టంగా కనిపిస్తొంది
కొంచంబొద్దుగా ఒత్తుగా వున్న జుత్తు చక్కటి కాట్ న శారి ప్రత్యేకమైన అందంకాకపొయినా మన్సులొ ఆమె రూపం ముద్ర పడి పొయింది..కారు పక్కనేవున్న”స్కూటి తీసుకుని” వెళ్ళి పోయింది
అది చాలా మాములు విషయం ,ఇస్టమైన విషయాలు ఎదురు పడగానే మనసులొ అవి బలంగా ముద్రించుకు పొతాయి, నావిషయంలో అదేజరిగింది.
మనసులో కోరిక బలంగా వుంటే అది అయి తీరుతుంది అంటారు. ఆదే జరిగింది మళ్ళీ . అనుకోకుండా అమే కనిపించింది.పింక కలర్ కాటన్ శారీలో జడలో జాజిమాలతో అలా చూస్తూ వుండిపోయాను. . .
కోంచం పక్కకి జరుగుతారా అడిగింది నావైపు చూసి సభ్యతమరచి పోయి అమేనే చూస్తూ నిలబడీ పోయినప్పుడు,
చెవులకి ముత్యాల జుంకాలు ,మేరూన్ కలర్ కుంకుమ బొట్టు ..గ్రీన్ కలర్ బెంగాల్ కాటన్ శారి.....
అచ్చం”సాగర సంగమమం ” సినిమాలొ జయప్రదలాగ.
అంద మైన కాటన్ చీరలు....జడలో జాజులు కాకపోయినా గూలాబి పువ్వైనా వుండాలి .... కళ్ళకి సన్నని కాటుక,స్ర్తీకి తేచ్చే అదనపు అందాలు,నామన్సుకి నచ్చినట్లుగా కనిపించింది ఆమె
అందుకే ”నయన తారా” అనుకునేవాడ్నిఆ పేరుతోనే రాసుకునేవాడిని
నాడైరీలొ రోజు ఒక ముఖ్యమైన పేజిలాగ మారిపోయింది.అమెకనబడాలని అనుకోవడం
కనబడితే మురిసిపోవడం లాంటి చిన్నచిన్న ఆనందాలు.ఆమె ఎవరో తెలియదు.కాని రోజుకనబడాలని కోరుకునేవాడిని.ఒక రోజు హఠాత్తుగా మార్నింగ్ వాకలోకనిపించింది.
,నాఆనందం అంతా ఇంతాకాదు నలుగురు ఫ్రెండ్స మధ్యలో
నన్ను గుర్తుపట్టినట్లుగా పల్చని చిరునవ్వు.
ఠక్కున పేజీ మూసేనా ..
వద్దు అనుకుంటూనే ,సభ్యతకాదు అనుకుంటూనే డైరీలో విషయాలు తలచుకుంటే ఎక్కడొ ఓడీ పోయిన ఫీలింగ్ అనితని నిలవనివ్వలేదు ...సక్సస్ కి చిరునామా తనజీవితం అన్నివిషాయాల్లొ. గెలుపుపొందడం ఒక మత్తులాంటిది ,అమత్తుని ”కిరణ్” బద్దలు కొట్టాడా? కిరిణ్ మీద అనుమానమా? అలాంటి మాటలు వాడడానికి కూడ మనసు ఇస్టపడం లేదు.
కిరణ్ డైరీ నిండా అమె గురించిన అభిప్ర్రాయాలు. ఏంతటీ ఆత్మీయులైనా, భార్య భర్తలైనా ,ఎన్నివిషయాలు తెలుసుకున్నా ఒక స్పెస్ వుంటుంది...అ స్పేస్ మంచిదా చెడ్దదా?
అది అలోచించే వ్వక్తుల మీద ఆధార పడి వుంటుంది.
కిరణ్ స్పేస్ అదా? దాన్ని అంగీక రీంచాలా,మనసులో మాట అడిగేయాలా? అవును అంటే ...అది భయంకర మైన ఓటమి.....
డైరీలొ అక్షరాలు వెంటాడూతున్నాయి కిరణ్ మనసు అద్దంలొ ప్రతిబింబంలా కనబడుతోంది,కల్మషంలేని,స్వఛ్చమైన అభిప్రాయాలు..
ఇంటికి రాగానే కూతురు లాస్యని అడగడానికి మొహామాట పడి.చాలా క్యాజువల్గా అడిగినట్లు అడిగింది.
,నాకు నిజం అనిపించటంలేదు ..బహుస అతను ఊహీంచుకున్న జీవితమేమో? అలొచించు నాన్న అలా ఇంకరితో వుంటూ మనదగ్గరదాచాల్సినంత అగత్యరం లేదు మన ఇంట్లో అందరం ఫ్రీ గా వుంటాము ,ఆయినా ఒకసారి అలొచించి అమె ఎవరో కనుక్కొ అంది.
అంటె అమనిషిమీద నిఘా వుంచడమా? నన్ను నేను అవమానించు కునట్లే.......తెగని ఆలోచనలతో తనకి తేలియ కుండానే ”కిరణ్”ని గమనించడం మోదలు పెట్టింది అనిత.
అనితలో అంతర్ యుధం మొదలు అయ్యింది అనుకోకుండానే కొన్ని సార్లు కాఫి కేఫేలని వెతికేది,మళ్ళి తనలొ తానే సిగ్గుపడేది ఇది కాదు నా వ్యక్తిత్వం
వెంటాడి నిజం తెలుసుకుని సాధించేది ఏముంది ? మరి నోరు మూసుకోవాలా? ఏమిటి ఈ నోరుమూసుకోవడాలు సాధింపులు? సాధారణ స్ర్తీగా ఎన్నడు అనుకూలేదు..అంటే
మనసు ప్రశ్నించింది...ప్రతీవిషయంలొ స్వేచ్చ కావాలనుకూంటూనే కిరణ్ స్వేచ్చని అంగీకరించటంలేదా? పర్సనల్ ...అన్నీ లాప టప్ దగ్గరనూంచి సెల్ ఫొనె దాక అన్నీ పర్సనల్ గా
వుండాలని సమస్య వస్తే అందరు ఓపన్ గా చర్చీంచుకోవాలన్న ధీమా కబుర్లు చెదిరిపోయాయని దిగులా? దేనినీ అంగీకరించని అనిత మనసు ఆలోచనల వరదలొ కొట్టుకుపోయింది....
ఊహించని విధంగా అనితకి ఎక్సిడెంట్ జరిగి పాదం ఫెక్చర్ అవడంతో అరునెలలు ఇంచుమించుగా ఇంట్లో వుండిపొవల్సి వచ్చింది...అతరువాత అనుకకోకుండా లాస్యకి పెళ్ళి సంబంధంరావడం అందరు కలసి మగపెళ్లివారు రమ్మని మరీ మరీ బలవంతంపెడితే లండన్ వెళ్ళివచ్చిన హడావిడీ , ఆతరువాత పెళ్ళి పనులు.....
లాస్య పెళ్ళి అయ్యాక లండన్ వెళ్ళి పొయింది ...హాడావిడి తగ్గి ఫ్యా క్టరీ వెళ్ళడం మొదలు పెట్టాక ..బ్యుటిషీయన్ ”మేడమ్ " ఈమంత్ అయినా వస్తరా ..అని ఫొన్ చెసినప్పుడు తీరిగ్గా
అద్దంలో చూసుకుంది అనిత, పొడుగ్గా పెరిగిన జుత్తుని, పెరుగుతోందని తెలుస్తున్నా ..కాలు కింద పేట్టలేని పరి స్థితులు..అమ్మయి పెళ్ళి..మెల్లగా సంవత్శరంపాటూ ఒదిలేసి జుత్తు
బుజాలు దాటీ పెరిగింది....
నెక్సట్ వీక్ వస్తానని బ్యుటీషయనికి చెప్పీ . స్నానం చేసి గదిలోకి రాగానే ..మంచంమీద లైట్ కలర్ పింక కలర్ చీర చాలా పాతది ఎప్పుడు కట్టు కోలేదు కాబట్టి కొత్తగానే వుంది
దాని మీద జాజి పూల దండ .అలా చూస్తూవుండిపోయింది ,ఈరోజు కొత్తకాదు ఒక ఆరు నెలలుగా సాగుతోంది సీజనల్ జాజులు కాక పోయినా ,వాస న లేని జజిమాల అయినా మంచంమీద
వుంటోంది....కిరణ్ రే్పటితో ఇంకవీటి అవసరంవుండదు అంది చీరకట్టుకుంటూ..ఏ జాజిపూలతో బోరు కొట్టిందా గదిలొ లైటు తీసేస్తూ అడిగాడు కిరణ్...
రేపు బ్యుటిషియన్కి టయిమ్ ఇచ్చాను...అంటే హైర్ కట్ కూడనా? అవును నాహైర్ స్టయిల్ అదేగా..ఇలాగే బాగుంది వుంచేయకూడదూ ఆచిన్న జడనే సవరిస్తూ.
మనసులో ఎప్పటిదో కసి ...అప్రయత్నంగా బయటికి వచ్చింది అనిత మాటల్లొ ..ఏ మీ నయన తార” మిమ్మల్ని వదిలేసిందా? పడక గదీలొ ఇంత మోనం ఎప్పుడూ అనుభవించలేదు.
అ తరువాత కిరణ్ బయటికి వెళ్ళి పోయాడు..... ఛా ఎందుకు ఇంత తోందర పడ్డాను అడిగి తేలిక అయిపోయాను.ఎలా వున్న జీవితం అలాగేవుంది అదేప్రేమ అదే మనిషి.....
ఏక్కడ చిన్న మార్పు లేదు ..ఓడి పోయాను పూర్తిగా ఇప్పుడు నా మీద ”నయన తార”గెలిచింది....
మోట్ట మోదటి సారిగా ఇన్నేళ్ళ సంసార జీవితంలొ జరిగిన వింత..కిరణ్ అలా వెళ్ళి పోవడం..అనిత కళ్ళల్లో నీరు”.ఏడవడం అంటే ఓడి పొవడమే ” ఓటమిని అసహ్యించుకునే అనిత
కళ్ళలో తడి...........
బ్యూటి పార్లల్ అద్దంలొ చూసుకుంటూన్న అనితలొ ఏదో అశాంతి. మళ్ళి పాత హైర్ కట్ మోన్న పెళ్ళి కోసం కొనుకున్న డాయిమండ డ్రాప్స వున్న ముత్యాల ఇయర్ రింగ్స
చాలా బాగున్నరు మేడమ్ మీరు బ్యుటిషీయన్ పొగడ్త ....హయి యూ అర్ వండ్రఫుల్ ఫ్ర్ండ్స పొగడ్తల పూల గోడుగు.....ఇన్నింటి మధ్య ఒంటరిగా అనిపించింది....
కిరణ్ గెలిచాడన్న కోపం. మళ్ళీ ” నయన తార ” కిరణ్ కి దగ్గర అవుతుందా? అసలు ఎక్కడుంది ఈవిడ? మళ్ళీ అన్వేషణ మొదలా?
కిరణ్ ఫోన్ హలొ అంది ఎక్కడ వున్నవు అడిగాడు.. పార్లల్లొ పని అయిపొయింది ఇంటికి వచ్చేస్తున్నా....
అనిత హైర్ కట్ చేయించు కున్నవా ? అవును అంది అనిత ....ఫొన్ కట్ చేసాడు కిరణ్....
మళ్ళీ అనిత కూడా చెయ్యలేదు..కారులొ కూర్చుంటుంటే ఒక మేసేజ్ వచ్చిందికిరణ్ దగ్గర నుంచి ”నయన తార” నన్ను ఒదిలి ఎప్పటి వెళ్లదు అనితా నువ్వు వెళ్ళిపోయావు...
ఆ మేసెజ్ చూడగానే దుఃఖం వచ్చింది .... ఓడి పోయింది పూర్తిగా ఓడిపోయింది..........
* * * * * *
(ఈ నెల vihanga.com) లొ ప్రచురించిన కధ.....