Friday, 13 April 2012

నాలోనే



నన్ను నేను దాచుకుందామనుకుంటూ
ఎప్పుడూ నీకు దొరికిపోతాను
నిన్ను వెతకాలనుకుంటూ
నన్నునేను వెదుకుంటాను
కాలం కరిగిపోతున్నప్పుడు

హఠాత్తుగా గాలివీచి
కిటికీ తెరుచుకొని
మనసుశబ్ధాలు వింటుంటే
భయమేస్తుంది మిత్రమా!
కాలం ఆగిపోవాలనుకోడం
నీకోసం కాలాన్ని దగ్గరగా జరపలనుకోడం
వెర్రితనమా
మరుపు కాలనికి కోలమానం అయితే
నిన్ను మరచి పోవాలని అది శాసిస్తే
నీకొసం పరుగులు తీసే మనసుకి సంకేళ్లు వెయ్యి
నీమనసు గదిలో బంధీ చెయ్యి
ఉరిశిక్ష వేసి మరణాన్ని ప్రసాదించు
నన్ను నామనసుని సమాధి చెయ్యి

అప్పుడు మరచి పోతాను నిన్ను.                          

నాలో నిన్ను దాచుకుని
వెదకడం మానేస్తాను........